Jan 22, 2009

యోగా

ప్రపంచం మొత్తం భారత్ వైపుకి ఆశ్చర్యపోయి చూసే విషయాల్లో యోగా ఒకటి. మనం యోగ ప్రక్రియ ని ప్రపంచానికి అందజేసి మనం మర్చిపోయ్యాం.
నేను 1-7 దాకా పిడుగురాళ్ల తండా బళ్లో చదువుకున్నా. అంటె ప్రాధమిక పాటశాల అన్నమాట. మాకు యఱ్ఱంశెట్టి సీతారామయ్య అనే ఒక లెక్కల మాష్టారు గారు ఉండేవాళ్లు. ఆయన మాచేత ప్రతీరోజు క్రమం తప్పకుండా యోగా చేయించేవాళ్లు అంటే ఆసనాలు వేయించేవాళ్లు, అఫ్కోర్సు మనకి అత్యంత ఇష్టమైన ఆసనం శవాసనం. పొద్దున్నే 7-8. యోగా అయ్యాక గోధుమ ఉప్మా ఉండేది. కేవలం గోధుమల్ని ఉడకబెట్టి నాలుగు ఉల్లిపాయలేసి పెట్టేవాళ్లు. మేము ఇంట్లోంచి కారప్పొడి పొట్లంకట్టుకుని తీస్కెళ్లేవాళ్లం.
ఏమి రుచి!! ఏంటో!!! బాబా!! కస్సక్!!గతం గతహ్. నేనో పెద్ద బలవంతుణ్ణేంకాదు. అయితే బియ్యం బస్తా ని అవలీలగా ఎత్తెయ్యగలను. రోజుకి 40 కాగుల నీళ్లు తోడి తొట్టి నింపగల్ను. రెండు బక్కెట్ల జోడేస్కుని నీళ్లు తెచ్చిపెట్టగల్ను, లేక ఓ కాగు భుజంమ్మీదా, బక్కేట్టు చేత పట్టుకుని నీళ్లు మొయ్యగల్ను. పెద్ద బుంగేసి చేద లాగ్గల్ను. 20 ఇటుకలు ఇంపబ్బొచ్చెలో పెట్టుకుని నడవగల్ను. చెట్లన్నిటికీ పాదులు చెయ్యగల్ను. బహుసా నాకు ఈ పని తనం, నేర్పూ ఇవన్నీ ఆ యోగా కారణం వల్లనో లేక/మరియూ పల్లెవాసం వల్లనో వచ్చినవే. తర్వాత్తర్వాత డిగ్రీకొచ్చాక గుంటూర్లో, ప్రతీరోజూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి వెళ్లి నాలు రౌండ్లు జాగింగు చేసేవాణ్ణి. డిగ్రీ అయిపోయింది. అన్నీ అటకెక్కేసినయ్. MCA కాలేజికెళ్లటం, సిగరెట్లు అలవాటు కావటం, ఉద్యోగం పోవటం, రావటం, బెంచులు, కుర్చీలు మనిషిని కుదేల్జేసినయ్. కానీ నేనెప్పుడూ నామీన నమ్మకాన్ని కోల్పోలేదు. మద్రాసులో ఉన్నప్పుడు నాకు ఈట్(IT) జనాలకి మాత్రమే వచ్చే కొన్ని అరుదైన కండరాల నొప్పి వచ్చింది. ఆర్థ్రోపాలజీ డాట్టర్ కాడికెళ్లా. రమేష్ ఆయన పేరు, దేవకీ ఆసుపత్రి ఆయన ప్రాక్టీసు. వెళ్లంగనే, ఏటి అన్నాడు, ఇలా భుజం నొప్పి, మెడ పట్టేసింది అన్నా. స్పాజ్మ్యాటిక్ పెయిన్ అన్నాడు. సరే అన్నా. ఏమైనా ఆటలు ఆడతావా అన్నాడు లేదు అని ఇకిలించా. సిగ్గుపడాలయ్యా నవ్వుతావేంటి. ఎంత క్లైంటు స్పెసిఫిక్ ఐనా, ఓ గంట నీకోసం లాగి, ఆటలు ఆడు అన్నాడు. నేనొ బొంగులే అని లైట్గా తీస్కున్నా ముందు. అది తగ్గలా, పైగా పెరిగింది. ఆయుర్వేద మస్సాజ్ కి వెళ్లా. కొంచెంపర్లేదు. ఆ డాట్టర్ కూడ బాసు నువ్వు ఆటలు ఆడక పోతే ఇక అంతే అన్నాడు. ఇక లాబం నేదు బగమంతుడా అని లజ్ కార్నర్ లో ఓ టెన్నీస్ క్లబ్బులోజేరా. దానెంకమ్మ, వారంలో నొప్పి మటుమాయం. తర్వాత సూరిగాడు పుట్టటం, మా నాన్న పరమపదించటం, ఈలోపునే అమెరికా కి మన ఇది(విధి) నెట్టటం చకచకా జరిగిపోయినై. ఇక ఇక్కడ సంసారం ఎట్టినాక, ఆపీస్కి పోవుడు వచ్చుడు, పోవుడు వచ్చుడు. పొట్టాడాట్కాం పెరిగిపోయింది. ఇక లాబంనేదు అని రాందేవ్ మహరాజ్ ది ఒక డీవీడీ కొన్నా, ప్రాణాయామం చెయ్యటం మొదలెట్ట. మళ్లీ అటకెక్కేయించా. ఇక అప్పుడూ ఒకానొన రోజున, GOLDSGYM లో చేరా, ఓ మూడు నెల్లు ఇరగొట్టా. అప్పుడు కడుపులో మంట అని కొన్ని రోజులు, మెడనొప్పి అని కొన్ని రోజులు, కాళ్లు నొప్పులు అని, చలి అని, కార్ తుమ్మిందని ఇలా జిమ్ము వైపు ఎళ్లటం మానేసా. ఆటుపిమ్మటి మన ఇంటి ముఖ్యమంత్రి గారు, ఇక లాభమ్లేదు, నువ్వు జిమ్మైనా మానెయ్యి లేక వెళ్లనన్నా వెళ్లు, అనవసరంగా వానికి డబ్బులు కట్టుట ఏలా అని హుకుం జారీ చేసారు కనుకా, మన జిమ్మీకెళ్లే సరుకూ సరంజమా బూజు దులిపి ఓ 2-3 నెలలు మళ్లీ ఇరగొట్టా. ఇంతలో వచ్చారు యువరాణి వారు. మళ్లీ పులుస్టాపు పెట్టాము. ఇక మళ్లీ మొదలు పెడదాము అని నిర్ణయించి, ముందుగా ఠాడా, డంచిక డంచిక యోగా యోగా యొ యొ యొ యోగా యోగా చేద్దాం ఇంటికాడా అని "సూర్య నమ:స్కారాలు" అని కొట్టాను నువ్వుగొట్టంలో, అంటే యూట్యూబులో.
ఈ వీడియో దొరికింది. అందరి సంతోషమే మన సంతోషం, మీకూ యుప్యయోగ్య పడ్యుతుంద్యేమో అని ఇక్యడ పెడ్యుతున్యా.

4 comments:

  1. బాగుంది. కానీ చిన్నప్పుడు చేసిన మీరే మానేస్తున్నారంటే ఇంక నాబోటి కొత్తోళ్ళ పరిస్ఘితి మరీ దారుణం ఐపోతుంది.

    ReplyDelete
  2. బాగ గుర్తు చెశారు, మా ఆయన YMCA membership కూడా canel చేయించాలి.
    ఇక్కద gym లొ అమెరికన్స్ యొగా నెర్పిస్తుంటే నెర్చుకుంటున్నా నేను, సిగ్గు పడాలొ? ఇప్పటికయిన నెర్చుకుంటున్నందుకు ఆనందపడాలొ? ఎంటొ?

    ReplyDelete
  3. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం.
    ఇప్పుడు కొడుకూ కూతురూ పెట్టిస్తార్లే సూర్యనమస్కారాలు! :)

    ReplyDelete
  4. @మనోహర్ గారు: దారుణం అయిపోనీవాకండీ. యోగా మొదలెట్టండీ.
    @రాణీ గారు: ఏది ఏమైనా, యోగా చేస్తున్నా అని తృప్తి పడండీ.
    @కొత్తపాళీ అన్నగారు: సూర్య నమస్కారాలేంటండీ, అన్నీ పెట్టిస్తున్నారు. నడుములు కొట్టుకుపోతున్నాయ్ :):)

    ReplyDelete