Jan 21, 2009

So Called యూత్

వయస్సులో ఓ అబ్బాయి ఓ అమ్మాయిని కోరుకోవటం, అమ్మాయి అబ్బాయి సాంగత్యం కావాలనుకోవటం, సృష్టి సహజం. అలా వయసు వేడిలో, వాళ్లు కలవటం, కూడ ఏదో పెద్ద విషయం ఏమాత్రమూ కాదు. మన దేశంలో పైకి ఇది మహాపాపం ఐనా పల్లెల దెగ్గర్నుండి మహా నగరాల్దాకా, గడ్డివాముల చాటునుండి, లాల్బాఘ్ పార్కుల్లో చెట్ల చీకటిమాటుల్లో యుగ యుగాలుగా నడుస్తున్న తంతే.
మన తాత ముత్తాతల సమయంలో కూడ జరిగిందిలా. మన నాన్నల సమయంలో కూడ జరిగిందిల. కానీ ఇప్పుడు కొత్తగా నరుక్కోడాలు, యాసిడ్ పోస్కోటలు ఏంటో అర్ధం కావట్లా.

ఇది మరీ దారుణం, అమ్మాయిని ఆకర్షించాడు, ఆ అమ్మాయి వాని స్టైలుకి పడిపోయింది. వాడు ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు, శారీరకంగా అనుభవించాడు. సరే బానే ఉంది. తప్పో వొప్పో, తర్వాత, ఆ అమ్మాయిని అడవికి తీస్కెళ్లి మత్తు మందిచ్చి మాన భంగం చేసి, దాన్ని వీడియో తీసి, నెట్లో పెట్టి!! ఇదేందిది?

ఎవరి తప్పు కన్నా మన So called youth కి సిగ్గుగా లేదా ఇలా చెయ్యటానికి? నేనూ ఆ వయస్సులో, కాలేజి ఎగ్గొట్టి సిన్మాల్జూసా, మందు తాగా, సిగరెట్లు కాల్చా, ఐతే ఉన్మాదిని కాలా. దేనికి? నా కుటుంబ నేపధ్యం అయుండొచ్చు లేక సమాజం అంటే భయం అయుండొచ్చు లేక నా పరిధులు నాకు తెలియటమూ అయుండొచ్చు ఏమైనా, నేనుజేసేది తప్పా ఒప్పా అని నాకు తెల్సు. ఆ వయసులో చాలా తప్పులు తెలిసి చేసేవే, దేనికంటే అది తప్పు చెయ్యకూ అంటారు పెద్దలు కాబట్టి. అది వయసు ఇచ్చే అహం. వద్దు అన్నది చేసి తీరాలి అనే ఓ అసహనం. ఐతే అదే కుఱ్ఱాణ్ణి మింగేస్తే - ఉన్మాదం అవుతుంది. చివరికి ఎంకౌంటర్ కి దారితీస్తుంది.
ఐతే, ఏఏ కారణాలు ఓ కుర్రాణ్ణి ఉన్మాదిని చెస్తాయి? నా దృష్టిలో
1. తల్లి తండ్రుల పెంపకం
2. తల్లి తండ్రుల అతి గారాబం
3. తల్లి తండ్రుల లంచగొండితనం
4. కుర్రాడి సామాజిక ఆర్ధిక పరీస్తితులు
ఫ్లర్టింగులు, పబ్బులు, చిత్తకార్తె కుక్కలు ఇవన్నీ పెద్ద తరగతులకి మెడళ్లు. కానీ, దిగువతరగతుల నుండి ఇప్పుడిప్పుడే ఎగువతరగతులకి నెట్టబడుతున్న జనాలకి ఇవన్నీ కొత్తగా కనిపించి, ఉన్మాదుల్లా తయ్యరు చేస్తున్నాయి.
దేనికంటె, నేను ఆ అమ్మాయి నాకు పడుతుంది అని 25000 ఖర్చుబెట్టా. పళ్లేదు, నా డబ్బు నాకిచ్చేయ్ అని అడిగా ఇవ్వలేదు, యాసిడ్ పోసా. ఎంతవరకూ ప్రాక్టికల్ గా ఉంది ఇది? అస్సలు వాడికి 25000 ఎక్కడవి? వాడి తల్లితండ్రులకు తెలియకుండా ఎలా వచ్చినై? సరే స్నేహితులు దెగ్గర నుండి లాక్కున్నాడు, వాళ్ల తల్లి తండ్రులకు అనుమానం రాదా? చివరికి ఏమయ్యాడు, చచ్చి శవం అయ్యాడు, కనీసం శవ యాత్రకి చిల్లరేసారా? అదీలేదు, రాళ్లు చెప్పులు ఏసారు.
5. సినిమాల ప్రభావం
తేజా లాంటి దర్శకుల్ని కాలాపాని లాంటి జైల్లో పెట్టాలి.
6. అతి సమాచారం. యూత్ నెట్ కి వెళ్లి గూగుల్లో జాబులు వెత్తుకుంటున్నారంటె మా సూరిగాడు కూడా నమ్మడు.
7. మొబైల్ ఫోనులు. MMSలు. (ఇవి అవసరమా?)
ఒకడు బస్సులో పోతూ, ఓ సీటు దెగ్గర నుంచొని, కూర్చున్న అమ్మాయిని ఎదని, గాలికి రెపరెపలాడుతున్న పైటలోంచి ఫోనుద్వారా వీడియో తీసి నెట్లో పెట్టాడు. వాని స్నేహితులు వానికి మందుపార్టి ఇచ్చారు వాడేదో నోబెల్ ప్రైజు కొట్టినట్టు.
8. Weak Law and Enforcement.
9. దేశకాలమాన పరీస్థితులు
10.స్నేహితులు
11.కళాశాలలో పరీస్థితులు
12.నేర ప్రవృత్తి
13.మానసిక వొత్తిళ్లు
14.పీర్ ప్రెషర్స్
ఎన్నొ కారణాలు ....
పరిష్కారం: తల్లితండ్రులు పిల్లల్ల్తో స్నేహితుల్లా మెలిగి, వాళ్లని సరైన మార్గంలో పెట్టగలగాలి. అంతేకాని, యాసిడ్ పోస్తే, "కన్నా, నువ్వు కాబట్టి చెయ్యగలిగావ్, మన ఎమ్మెల్యే కి జెప్పి నిన్ను కేసు నుండి బయటకేపిస్తా" అనే తత్వం అగ్గికి ఆజ్యంపోసినట్టవుతుంది. ఇదొక సామాజిక బాధ్యత.
ఇలాంటి సంఘటనలు జరిగినాక, మీలో ఎంతమంది India కి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు?

23 comments:

 1. >> ఇలాంటి సంఘటనలు జరిగినాక, మీలో ఎంతమంది India కి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు?

  ఏం, ఇండియా ఏమన్నా ఇరాక్ అయిపోయిందా ఉన్నట్లుండి? ఆ మాటకొస్తే నెలకో భారతీయుడిని చంపుతున్నారు అమెరికాలో. మరి ఆ సంఘటనలు భయం కలిగించటంలేదా? ఇదంతా చెరువు మీద అలిగి ఏదో మానేసిపోయిన చందంగా ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా దేశానికెలాంటి నష్టమూలేదు.

  ReplyDelete
 2. లండన్లో జ్యోతిర్మయిని చంపినవాడికి అప్పుడే శిక్ష పడింది. అటువంటిది ఇక్కడ ఊహించగలమా? బెయిల్ మీద విడిపించుకుపోవటాలు, జైల్లో రాజభోగాలు అనుభవించటాలు, మంత్రిగారి మనవణ్నని అసలు విచారణే తప్పించుకోవటాలు..! కోర్టుకెళ్లడం కన్నా, కాటికెళ్లడమే నయమనిపిస్తుంది. ‘ఇండియాకు ఎందరు తిరిగివెళ్లాలనుకుంటున్నారు..’ అన్న నిర్వేదం వెనుక నేరవిచారణ ఆలస్యం కావటం, దశాబ్దాల క్రితం రూపొందిన భారతీయ శిక్షాస్మృతి, అందులోని లొసుగులు.. జనాభాకు తగిన నిష్పత్తిలో పోలీసులు, న్యాయవాదులు, న్యాయస్థానాలు, కారాగారాలు లేకపోవడం... ఎన్నో కారణాలున్నాయి. బ్లాగాగ్ని చెప్పినట్టు నేరాలు జరుగుతున్నాయని ఇక్కణ్నుండి అమెరికా, అక్కణ్నుంచి మరోచోటికి.. ఇలా పారిపోలేం, అవసరమైనప్పుడు ఆయా ప్రదేశాలకు వెళ్లకుండానూ ఉండలేం. చెయ్యవల్సినదేమంటే నేరప్రవృత్తి, అతివాద, ఉన్మాద ధోరణులు పెచ్చుమీరకుండా మన పిల్లలను సౌభ్రాతృత్వపు ఛాయల్లో పెంచుకోవడం!

  ReplyDelete
 3. బ్లాగాగ్ని భాయి: కన్న కూతుర్ని చంపేసినోడు బెయిల్ మీద కళ్లముందే తిరుగుతుంటే, న్యాయం జరక్క కన్న హృదయాలు సలసలా మరుగుతుంటే ఆది సహించే, కూతురి వీడియోలు ఎంతమంది చూసారో, చూస్తున్నారో, ఎక్కడెక్కడికి వెళ్లిందో, ఆ క్షోభ కన్నాఓ తుపాకి గుండుతో చావటం బెటర్.
  >>ఎవరు దేశానికి వచ్చినా రాకపోయినా నష్టమూలేదు.
  బాగా చెప్పావు.
  ఇక్కడ నేనేదో దేశద్రోహిని. మిగతవాళ్లు సంఘసంస్కర్తలు.
  రాసిన దాన్ని సరిగ్గా అర్ధంచేస్కుని వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.
  అస్సలు సమస్యని వదిలేసి "దేశానికేమీ నష్టాంలేదు" అనేది ఎంతవరకు అర్ధవంతంగా ఉంది?
  నేను అమెరికా అంటే ఓ అనేమి భావించను. నేను దేశ దేశాలు తిరిగాను.
  ఇరాక్ కీ మన పరీస్థితికీ ఏంటి సంబంధం? అమెరికా యుధం ముందుదాకా కనీసం ఇరాక్ వాళ్లు తమ చరిత్రని కాపాడుకున్నారు. మన చరిత్రేది? తెల్లోడు దోచుకోగా మిగిలింది ఈ రోజున నల్లోళ్లు (ఆంటే మనమే) దోచుకుంటున్నాం. ఇరాకీయుల్ని చూసైనా నేర్చుకోవచ్చు అది.
  @అరుణ పప్పు గారు: మీరు చెప్పింది 100 శాతం నిజం.

  వెనక్కి రావటమా వద్దా అనేది ఇక్కడ చర్చాంశం ఏమాత్రం కాదు. కేవలం అతిశయోక్తి మాత్రమే, అది సమస్య తీవ్రతని తెలియజేసేందుకే.

  ReplyDelete
 4. ఇలాంటి సంఘటనలు జరిగినాక, మీలో ఎంతమంది India కి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు? ... ఇది మాట వరసకు అన్నదే అని నేను బావిస్తున్నాను. ఎందుకంటే.. కొంత మంది మనకి గాని మనం వేరే వారికి గాని నమస్కారం పెట్టినప్పుడు వారు కాని మనం కాని సరదాకి పదివేల నమస్కారాలు బాబూ అని అంటాము కాని పెట్టేది ఒక్కటే. ఇదీ అంతే. ఇక పొతే... మీ టపా, విశ్లేషణ బావున్నది. కాకపొతే నేను అనుకోవడం ఏమిటంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రోజుల్లో నేరాలు takkuva , నిరక్షరాస్యులలోనే నేర స్వభావం తక్కువ అని. ఈ మద్య నీరాలు, ఘోరాలు, హత్యలు, కబ్జాలు, కమిషన్లు, లంచాలు, -- ఒక్కసారి పరికించి చూడండి ... ఎక్కువ శాతం చదువుకొన్న నా కొడుకుల ప్రమేయమే ఉంది. NTR చెప్పినట్లు సినిమాల వలన మంచిగా మారడం, చెడుగా మారడం అనేది చాలా తక్కువ (ఒకప్పుడు). మరి ఇప్పుడు... అన్నీనూ..అంతానూ. ఇప్పుడున్న చట్టాలు సరిపోవు. ENCOUNTERS ఒక్కటే సరి అయిన మార్గమనిపిస్తుంది.

  ReplyDelete
 5. చాలా కడుపురగిలి రాసినట్టుంది.భాస్కర్ ఈ ఆవేదన అందరినీ దహించివేస్తుంది కానీ వెళ్ళగక్కలేక మింగలేక సతమతమౌతున్నారు అసంఖ్యాకులు.
  పాతికేళ్ళ క్రితం మనిషిని కత్తితో పొడిస్తే ఎలా ఉంటుంది,కళ్ళముందు మనిషి గిలగిలలాడి చస్తుంటే ఎలా ఉంటుంది అన్న కుతూహలం కొద్దీ గుంటూరు,బెజవాడల్లో కొన్ని హత్యలు జరిగాయంటే నమ్మగలరా?
  అందరికీ స్కాములుగురించి చెప్పే పత్రికలూ టీవీఛానళ్ళూ పీకలదాకా స్కాముల్లో కూరుకుపోయున్నాయి.ఇది ఉమ్మడిగా పరిష్కారాలు వెతకాల్సిన ఆపద,అందరిదీ

  ReplyDelete
 6. భాస్కర రామరాజు గారు.. రియల్లీ తల్లిదండ్రులు మీ పోస్ట్ చదివితే కొంతవరకైనా పెంపకంలో స్పష్టత రావడం ఖాయం. పిల్లల తప్పులకు పిల్లలనే బాధ్యులుగా చేయడం మానేసి ఎందుకు వారలా తయారవుతున్నారో ఎట్ లీస్ట్ కొద్దిపాటి దృష్టి సారించకపోతే ఎలా? సమస్యని చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @కృష్ణారావ్ గారు: వెనక్కి రావటమా వద్దా అనేది ఇక్కడ చర్చాంశం ఏమాత్రం కాదు. కేవలం అతిశయోక్తి మాత్రమే, అది సమస్య తీవ్రతని తెలియజేసేందుకే.
  >>ఇప్పుడున్న చట్టాలు సరిపోవు
  అసలు అదొకటి ఏడిస్తేనే కదా ముందు, సరిపోవో లేవో తర్వాత. సదువురాని జనాలకి కష్టపట్టం ఓ ముద్ద తెచ్చుకోడం, మింగి, పడుకోడం మాత్రమే తెలుసు. ఎండుకంటే ఆళ్లకి రెక్కాడితేగాని డొక్కాడదు కాబట్టి. సదువుకున్నోడికే మిడిమిడిజ్యానం, దాంతో మానసికంగా అవకతవకలు, ఎచ్చుతగ్గులు. మా బాబాయి ఒకాయన అంటుండేవాడు, ఇన్ఫీరియారిటి కి సుపీరియారిటీకీ మద్దెన పడమాకా దెబ్బైపోతావ్ అని. అదే బ్యాచ్చీ ఇది
  Thanks for the comment.
  @రాజే అన్న: నిజమా? కేవలం ఎలా ఉంటుందో చూద్దాం అని మర్డర్లు చేసారా?
  మీరన్నట్టు ఈవ్వాల్టి మీడియా పీకల్లోతు కూరుకుపోయింది. అది చాలా శాతం వాటి స్వయంకృతమే.

  ReplyDelete
 8. శ్రీధర్ గారు: నమస్తే. అవును గురుగారు. మనం ఎటునుండి ఎటుపోతున్నామో మనకే అర్ధంకాని పరీస్థితి చాలా దారుణమైంది. ఈ యూత్ని మన సమాజం ఎందుకంత ట్రాప్ లో పడేస్తున్నదో అర్ధం కావట్లా. వాళ్లని ట్రాప్లోకి మళ్లీ మళ్లీ దేనికి నెడుతున్నాము అనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్నే

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. @యోగా-నందా- నువ్వు ఇస్మార్టోయ్. ఇట్టే పట్టేసావ్ :):)

  ReplyDelete
 12. so called youth.. http://telugu.greatandhra.com/sangathulu/20-01-2009/mu_21.php

  ReplyDelete
 13. భాస్కర్ అన్నాయ్.

  ఇరాక్ కి, మనకీ ఎలాంటి సంబంధమూ లేదు. మన పరిస్థితి అంత చండాలంగా లేదు అని చెప్పడానికి మాత్రమే ఆ పేరు వాడా. ఇది కూడా కేవలం ఒక అతిశయోక్తి మాత్రమే :)

  >> ఇక్కడ నేనేదో దేశద్రోహిని. మిగతవాళ్లు సంఘసంస్కర్తలు.
  ఎందుకన్నాయ్ అనవసరంగా భుజాలు తడుముకుంటావ్? నేన్నిన్నుద్దేశించేమీ అన్లేదిక్కడ.

  నువ్వు చర్చించిన విషయమ్మీదగానీ చెప్పిన పరిష్కారమ్మీద గానీ ఎటువంటి అభిప్రాయబేధమూ లేదు నాకు. కానీ అవన్నీ ఇక్కడ వుండి చెయ్యాల్సిన పన్లు గదా! అది మర్చిపొయ్యి చివర్లో 'ఎవరన్నా వెళ్దామనుకుంటున్నారా ' అంటే కొంచెం ఆంటీ క్లైమాక్స్ లాగా అనిపించిందంతే.

  ReplyDelete
 14. భాస్కర్ గారు,

  తిరిగి ఇండియా ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు అని అడగడంలో ఒక నిర్వేదం గోచరించిన మాట వాస్తవం! ఆ మాటకొస్తే ప్రపంచంలో "ఇది క్షేమంగా ఉండే స్థలం" అని ఎక్కడైనా ఒక్క చోటుందా? ఇదివరలో ఇజ్రాయెల్, పాలస్థీనా, ఇరాక్ వంటి దేశాల్లో వీధుల్లో జరికే సైనిక చర్యలు వగైరాలు చూసి 'శాంతియుతమైన దేసమంటే నాదే" అనుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి ఆశలేవీ లేవు.

  ఇకపోతే..
  కొంతమంది తాము స్వయంగా సాధించేది ఏమీ లేకపోయినా, ఇతర్ల మీద, వారి అభిప్రాయల మీద విసుర్లు విసరడం, ఒక పెద్ద మేథావి తనంగా భావిస్తారనుకుంటాను.ఐ పిటీ దెమ్! సో కాల్డ్ యూత్!

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. సుజాత గారు,
  మనమిద్దరం ఒకరికొకరం అపరిచితులం. జీవితంలో నేనేదైనా సాధించానో/లేదో మీకు తెలియదు, మీ సాధింపుల విషయం నాకు తెలియదు. పైగా అది ఈటపాకి సంబంధించని విషయం, పూర్తిగా వ్యక్తిగతం కాబట్టి ఆ ప్రసక్తి వదిలేద్దాం. ఇహ అసలు విషయానికొస్తే, కొన్ని సంఘటనలని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఇండియాకి తిరిగి రావచ్చు/రాకూడదు అనుకునేవాళ్ళ(ఎవరైనా వుంటే)గురించి ఆ వ్యాఖ్య. అది మీకెందుకు గుచ్చుకుందో కాస్త వివరిస్తారా? జాలి విషయం అంటారా, పైసా ఖర్చులేని పని కాబట్టి ఎవరైనా, ఎంతమంది మీదైనా పడవచ్చు ఏమంటారు?

  ReplyDelete
 17. బ్లాగాగ్ని గారు
  మీ వ్యాఖ్య నాకు గుచ్చుకోనూ లేదు, నేను దానికి రిప్లై ఇవ్వనూ లేదు. నాకు మీలాగానే మొదట కోపం వచ్చింది. మీ వ్యాఖ్యకు సమాధానాలు ఎలా ఉంటాయో చూడాలని ఆగాను. తర్వాత నెమ్మదిగా ఆలోచించి, భాస్కర్ గారి నిర్వేదాన్ని అర్థం చేసుకున్నాను. ఆ మాటకొస్తే, తిరిగి రాకూడదు అనుకుంటే నేను అక్కడినుంచి తిరిగొచ్చేదాన్నే కాదు మరి! మీరు అనవసరంగా నా పైన కోపగిస్తున్నారు బాబూ!

  ReplyDelete
 18. @బ్లాగాగ్ని: నేను భుజాలు తడుముకున్నట్టు నాకనిపించాలిగా. నాకేమి అలా అనిపించలేదు. మీకు అలా దేనికి అనిపించిందో కాస్త వివరించ గలరు.
  మీరు సరిగ్గా గమినించారో లేదో, లేక సరిగ్గా అర్ధం చేస్కున్నారో లేదో, అలాంటివి స్టేట్మెంట్లు కాదు. కేవలం సమస్య తీవ్రతని కొలిచేవి మాత్రమే. దానిగురించి పెద్ద వాదులాట అనవసరం. బోంగు భుజాలు చేతులు గీక్కోవాల్సిన అవసరం లేదు. మీరేమి సాధించినా మీ మనుగడకోసమే. నేనేమి సాధించినా నా పొట్టకోసమే. ఇక్కడ ఎవ్వడూ ఓ దేశాన్ని ఉద్ధరించేవాడు లేడు.
  సుజాత గారు: >> తిరిగి ఇండియా ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు అని అడగడంలో ఒక నిర్వేదం గోచరించిన మాట వాస్తవం!
  బాగా చెప్పారు.
  ఏదీ సురక్షితమైన ప్రదేశాంకాదు. ఔను. నిజమే. మనల్ని మనమే "పడమటి గాలి" తో మార్చేసుకుంటున్నాం అని నా బాధ. అస్సలు ఇక్కడ సమస్య వెన్నక్కి రావటమా లేదా అని కాదు. మనం మన బాధ్యతల్ని లేక మన సంస్కృతినీ దేని బొందపెడుతున్నాం అని.
  Thanks for the comment.

  ReplyDelete
 19. యోగి: ప్రతీ వ్యాఖ్యా నిన్నే అనుకోవద్దు.

  ReplyDelete
 20. అసలు విషయం వదిలేసి కొసరు వాక్యం గురించి కొట్టేసుకుంటున్నాం :-) మన సమస్యలక్కారణం ఈ ధోరణేనేమో?

  ReplyDelete
 21. అబ్రకదబ్ర: లేటుగా అయినా లేటెస్టుగా చెప్పారు :):)

  ReplyDelete
 22. @అగ్ని - బ్లాగాగ్ని - అగ్గిపెట్టె ఉందా (సరదాగా వాడాను ఇలా, ఇబ్బందైతే చెప్పు - తొలగిస్తా):
  నేను దేనికి భుజాలు గోక్కోవాలి? నేను తప్పుచేస్తే, దొంగతనం చేస్తే, దోచుకుంటే, నేనే పైన పన్లు చెస్తే, ఓ పిల్లని రేప్ చేసి తప్పించుకుని అమెరి"కాకి" పారిపోయి వస్తే అవును భుజాలు తడుముకోవాలీ లేక గోక్కోవాలి. నాకు తెలిసి నామీద ఎలాంటీ చట్టబధమైన లేక న్యాయబధమైనా అరోపణాలూ లేవూ. నీకేమైనా తెలిస్తే చెప్పు. అప్పుడు నావే కాదు మా ఊరి భుజాలు మొత్తం తడతా వెళ్లి.

  ReplyDelete
 23. పెద్దలు, పిల్లలు కూడా ఆలోచించవలసిన విషయం....
  ఇంత కంటే ఎక్కువ చెప్పేపాటి ఙ్జానం నాకు లేదండి...
  చిత్తగించవలెను.....

  ReplyDelete