Jan 6, 2009

గేంజేస్తున్నవ్?

ఏం సిన్నోడా, గేంజేస్తున్నవ్?
అన్నా!! మంచిగున్నవానే?? ఏంలే అన్నా? వంకర దీస్తున్న!!
గేందీ? వంకర? గెట్ల దీస్తున్నవ్?
చెయ్యి బెట్తి సాపు జేసిన
మరి?
వంకరబోలే
ఇంకేమ్జేసినవ్
కట్టెలమీన కాల్చి సుత్తిపెట్టి కొట్టిన,
వరెవా!! మరి పోయిందానే
పోలే, కత్తిబెట్టి కాల్చినా,
మంచిగజేసినవ్, పోయిందా?
పోలే, ఊచబెట్టి కట్టేసినా,
ఊచబెట్టి కట్టేస్తే పోయుంటది!!
లే అన్నా!! పోలే, తాడుకట్టి ఏళ్లాడేసినా,
గిప్పుడు సాపైఉండాల్నే?
లే!! పోలే, ఛీ దీన్తల్లి, ఏంజెయ్యాల్నో సంఝైతల్లే
దేని వంకర దీశ్తున్నవ్ బిడ్డా?
కుక్క తోక
......

13 comments:

  1. హహ్హా! మంచిగ జెప్పినవ్ అన్న!! కుక్క తోక వంకరే!

    ReplyDelete
  2. బాగుంది!
    పనిలేని మంగలి-తల గొరుగుడు గుర్తొచ్చింది :)

    ReplyDelete
  3. అందరికీ నమ:స్తే, ఆనందించండి.

    ReplyDelete
  4. సుత్తి,కత్తి,ఊచ,తాడు - అరె సిన్నోడా, కుక్కనెందుకు సావగొట్తున్నావురా? నన్నడిగింటె సెప్తుంటి గదరా - ఏమి జేసిన వంకర పోదని. అపుడెప్పుడో నీలాంటివాడెవడో, వంకర పోగడ్దమని, కుక్క తోక పట్కోని గోదారి ఈదిండంట. ఆ మాట ఈయాల్దక సెప్పుకుంటనే వుండారు అందరు.

    ReplyDelete
  5. @లతాజీ: గీముచ్చటి తెల్సుకోఆల్సినోళ్లు తెల్సుకుంటే మంచిగుంటుండె.

    గేమ్జేస్తం, కుక్క తోక కత మళ్లీ మళ్లి జెప్పుకుంటం, నవ్వుకుంటం. కుక్కని సావగొట్టుడు దేనికంటే, దాని తోక వంకరైంది, గందుకు. గదేంజేస్తది, దాని జెనమ, పుట్టిన సంది, పొయ్యేదాంక గట్లనే ఉందాయే తోక, కానీ, మనిసి బుద్దే - సమఝైతల్లే. గదీ కత ఈ దినం. ఛల్, నేబోయి ఇంక తొంగుంట మస్తుగ నిద్రొస్తల్లే మరి...

    ReplyDelete
  6. ఈ కత్తి మొద్దు బారినది.
    ఈ కత్తి కి సాన పెట్టినా తెగదు.
    కత్తి అన్నా భయం లెదు ఎవరికి.
    కత్తి సుత్తి ప్రపంచం మార్చ లెవు.
    కందకులెని దురద కత్తి కి ఎందుకు?
    కత్తి ని దించండి.
    కత్తి పట్టుకొకు, కలం పట్టు.

    ReplyDelete
  7. @s: మీ వ్యాఖ్య చాలా లోతుగా, ఆలోచించతగ్గదిగా, అస్థిత్వం అస్థిరమైపోతున్నప్పుడు నిశ్చలత్వం కోసం ఆలోచింపజేసేదిలా ఉంది

    ReplyDelete
  8. తమ్మీ కుక్క్ తోక వంకర దియ్యలేవ్.. అది దాని జెనమ లచ్చనం.. పుడల్తోనీ బోని లచ్చనం.. కుక్కలకు వంకర తోకలే గాదు తమ్మీ ఇంగా శానా లచ్చనాలున్నయి. కుక్క మొరుగుతది. ఎంత మొరిగినా దాని ఒంటి మీద పిడుదులు కొన్ని అంటిపెట్టుకుని ఉంటయ్. గిట్లా సుత్తులు ఊచలుబట్టి నీ వక్త్ ఎందుకు బర్బాద్‌జేస్కుంటవ్? మంచిపంజెయ్ తమ్మీ... కుక్కల్నట్లా దేసమ్మీద్దిరగనీ.. మున్సిపాల్టోళ్ళు జూస్కుంటరు.. సంఝైతందా?

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. నాయుడు గారు!! బాగా చెప్పారు. మున్సిపాలిటీ తనపని తానుజేసుకుపోతుంది. ఔన్నిజమే!! కాదు, పచ్చి నిజం.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete