నాకు సంగీతజ్ఞానం బొత్తిగా లేదు. ఐనా సంగీతం వింటూనే ఉంటా.
నేను పాడను. పాడితే జనాలు పారిపోతారు.
గూగుల్లో అక్కడ ఇక్కడా గెలుకుతున్నప్పుడు, ఏమైనా లంకెలు లింకులు తగిల్తే నా బ్లాగులో పెడుతూంటా, మీరూ విని ఆనందించండేం
రఘువంశ సుధ - యం.యస్. గోపాల కృష్ణన్ గారి వాయిలీనం పై వినండి ఇక్కడ:
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/M.S._Gopalakrishnan/02-Raghuvamsa.mp3
కృష్ణా నీ బేగనే బారో - షేక్ చిన్న మౌలానా సాహిబ్ గారి నాదస్వరం నుండి ఇక్కడ వినండి:
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/Sheik_Chinna_Moulana_Sahib/04%20Krishna%20Nee%20Begane%20Baro%20-%20Yamunakalyani%20-%20Misra%20Chapu%20-%20Purandaradasar.wma
బ్లాగ్లోకంలో ఈ కృతి కోసం వెతికితే ఈ తీగ దొరికింది:
పద్మ గారి మోహనరాగాలు బ్లాగులో కృష్ణా నీ బేగనే బారో.
డోలాయాం చల డోలాయాం
ఇది ఎవ్వరైనా విని తీరాలి
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/Sheik_Chinna_Moulana_Sahib/07Dolayam%20-%20Kamas%20-%20Tisra%20Ekam%20-%20Annamacharya.wma
బ్లాగ్లోకంలో ఈ కృతి కోసం వెతికితే ఈ తీగ దొరికింది:
మల్లంపల్లి శ్యాంప్రసాద్ గారి బ్లాగులోంచి :
రాగం: ఖమాస్
తాళం: తిశ్ర జాతి ఆది తాళం
శ్రీ అన్నమాచార్య విరచిత డోలాయాం చల డోలాయాం హర డోలాయాం
....మిగతాది శ్యాంప్రసాద్ గారి బ్లాగులోనే చూడండి.
పైపాటల్ని మీకు డౌన్లోడ్ చేస్కునే ఓపిక/సమయం లేకపోతే ఇక్కడ వినండి.
గీతం లోంచి మీకు కావాల్సిన సంగీతాన్ని దింపుకోండి. ఉదాహరణకి - వాయులీనం డోలు జోడి కోసం ఇక్కడ నొక్కండి.
Jan 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
భాస్కర్ గారు,
ReplyDeleteమంచి పసందైన లింకులు! థాంక్స్!
"డోలాయాంచల" ఎమ్మెస్ గొంతులో విన్నాక చచ్చిపోయినా పర్లేదు.
సుజాత గారు:
ReplyDeleteస్పదించినందుకు ధన్యవాదాలు.
డోలాయాం చల డోలాయాం షేక్ చిన్న మౌలానా గారి నాదస్వర రసాన్ని శృతిలయలు అనే సినిమాలో మన కాశీనాధుని విశ్వనాధ్ గారు బాగా ఉపయోగించుకున్నారు. ఆమాటకొస్తే ఆయన తెరమీద మన కర్ణాటక సంగీతాన్ని సందార్భానుసారం వాడినంతగా ఇంకెవ్వరూ తాకను కూడా తాకలేక పొయ్యారు.
సినిమా ప్రసక్తి ఇక్కడ దేనికంటే, పైన పాటలు కొన్ని సినిమాల్లో చాలా విరివిగా వాడినవే.
డోలాయాం సప్తపది లో ఉన్నదనుకుంటున్నానండీ ..
ReplyDeleteరెండింటిలోనూ ఉందా?
ఆమాటకొస్తే ఆయన తెరమీద మన కర్ణాటక సంగీతాన్ని సందార్భానుసారం వాడినంతగా ఇంకెవ్వరూ తాకను కూడా తాకలేక పొయ్యారు.:
శ్రుతిలయలు లో రాజశేఖర్, జయలలిత రైలు లో ఉన్నపుడు,
శంఖరాభరణం లో శొమయాజులు, మంజు భార్గవి రైలు దిగేటప్పుడు: ఎంతనేర్చినా, ఎంతజూచినా
అసలు కొన్ని కీర్తనలు, కృతులు సినిమాల్లో విన్నాకే బయట బాగా నచ్చుతాయి. బ్రోచేవారెవరురా.....
ReplyDeleteఎంత నేర్చినా....
రఘువంశ సుధాంబుధి..ఇలాగ!
వూకదంపుడు గారు,
సోమయాజులు మంజుభార్గవి తో కలిసి రైలు దిగేప్పుడు సాక్షి రంగా రావు హేళనగా చూశాక అతడి మనసులో కలిగిన భావాన్ని అలా ఎంత నేర్చినా ట్యూను లా వినిపించడం చాలా బాగుంటుంది.
ఎందరో మహానుభావులు ఆఫ్ ఇండియా, అందరికీ వందనములు ఆఫ్ ఇండియా - శ్రీ గొల్లపూడి మారుతీ రావ్ - ఛాలెంజ్ చిత్రం నుండి.
ReplyDelete