నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం
జనవరి 14 - జంధ్యాల పుట్టినరోజు.
నాకు నచ్చిన జంధ్యాల గారి సినిమాలు -
ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట,రెండుజెళ్ళ సీత, మూడు ముళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనంద భైరవి,రావు - గోపాలరావు
పుత్తడి బొమ్మ, బాబాయ్ అబ్బాయ్, శ్రీవారి శోభనం నరేష్, మొగుడు పెళ్ళాలు, రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయి,పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్ళంట, చిన్ని కృష్ణుడు,వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ, హై హై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, బావా బావా పన్నీరు, ష్ గప్‌చుప్
ఆయన మాటాల రచయితగా నాకు నచ్చిన సినిమాలు -
సిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, సీతాకోకచిలుక, సాగర సంగమం, విజేత, స్వయంకృషి, అంతిమ తీర్పు, స్వాతి కిరణం, - ఈ సినిమాల్లోని డయలాగులు ఎంత లోతుగా షార్ప్గా ఉంటయో.
ఈ సినిమాలాన్నీ గిర్రున తిరుగుతున్నాయి నా మనసులో.
ఈరోజు ఓ సప్తపదో లేక ఓ శుభోదయమో డీవీడీ వేస్కుని ఆయనకి జేజేలు పలకాలి.
పుత్తడి బొమ్మ DVD ఎక్కడైన దొరికితే చెప్పండి కొనుక్కుంటా.
ఆయన సినిమాల్లోంచి , ఆయన మాటలు రాసిన సినిమాల్లోంచి నాకు నచ్చిన డైలాగుల్ని ఓ టపా సిరీస్లా రాద్దాం అనుకుంటున్నా తొందర్లో.
Jan 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
మాస్టారు. జంధ్యాల గారి గురించి మంచి విషయాలు చెప్పారు.
ReplyDeleteజయమ్ము నిశ్చయమ్మురా ఐతే ఒక లక్ష సార్లు చూసాము ఇప్పటికి :). మీరు పుత్తడి బొమ్మ కోసం చూస్తున్నట్టు, మేము కూడా "ప్రేమా జిందాబాద్" కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాము.
ReplyDeleteశ్రీవారికి ప్రేమ లేఖ చూసినప్పుడు థియేటర్ లో దొర్లి దొర్లి నవ్విన గుర్తు:-)
ReplyDeleteనేనుకూడా ఆయనకి పంకానే, ఒక్క విషయంలో తప్ప. నత్తి వాళ్ళ మీద, చెవిటి వాళ్ళ మీద ఆయన సృష్టించిన హాస్యం నాకు నచ్చదు. చిన్నప్పుడు తెలిసీతెలియని రోజుల్లో ఆ మాటలు ఇమిటేట్ చేస్తూ ఆడుకునేవాళ్ళం. అది తప్పని తెలిసే వయసొచ్చాక మానేశామనుకోండి. చంద్రునికో మచ్చలా ఆ ఒక్క విషయం వదిలేస్తే ఇంకే రకంగా చూసినా గురువుగారు కేక.
ReplyDeleteజంధ్యాల అనే వ్యక్తి లేకపోతే తెలుగు సినిమా హాస్యం కేవలం రాజబాబు, అల్లు రామలింగయ్యల వెకిలి హాస్యాలకు బలైపోయేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మధ్య తరగతి తెలుగు కుటుంబాల్లోని ప్రతి పాత్రా మనం జంధ్యాయల సినిమాల్లో చూడొచ్చు. కొన్ని సార్లు మనమెరగని వింత పాత్రలను కూడా "అసహజం" అనుకోకుండా ఒప్పేసుకోగలం. ఆనంద భైరవి సినిమాలో శ్రీలక్ష్మి సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఖయ్యిమని ఒక విజిలేస్తుంది...చూడండి! ఆ పాత్ర నిజజీవితంలో ఎక్కడా కనపడే ఛాన్స్ లేదు, అయినా మనకు నచ్చుతుంది.
ReplyDeleteశ్రీవారికి ప్రేమ లేఖ క్లైమాక్స్ లో శ్రీలక్ష్మి "ఇప్పుడు పెళ్ళి ఉందా లేదా, నేను పట్టుచీర మార్చుకోవాలా వద్దా" అనే డైలాగు ఇప్పటికీ ప్రతి తెలుగు పెళ్ళి లోనూ సరదాగా ఒక్కసారైనా వినపడే మాట.
రెండు రెళ్ళు ఆరు నవలను మించిన హాస్యం అందిస్తుంది. తికమక రావు పాత్ర, తాతగారి పాత్ర..భలే నవ్విస్తాయి.
హాస్యబ్రహ్మ
ReplyDeleteజంధ్యాల గారు నవ్వులనే టానిక్కులతో ఆంధ్రుల ఆరోగ్యాలను కాపాదుతున్న భిషగ్వరుడు. వారి శ్రీవారికి ప్రేమలేఖ చూస్తూ వినుకొండ అరుణా హాల్ లో పొర్లిగింతలు పెట్టినవ్విన సన్నివేశం నాకెప్పుడూ గుర్తే.