మీకు వైనాట అంటే తెల్సా?
ఈ మధ్య మా సూరిగాడు వైనాట ఆడదాం అని గోల. ఏందిరా అంటే, సోఫా దెగ్గర మనం నుంచోనుంటే, వాడు సోఫా మీదకి ఎక్కి, చెయ్యిని వైన్ లా పట్టుకుని దూకుతాడు. నాకు ముందు వైన్ అంటే అర్ధంకాలా. మరి మనం తెలుగు మీడియం కదా. అంత క్నాలడ్జీ లేదు. ఇంతకీ వైన్ అంటే "ఊడ" అని అర్ధంట. ఠకా మని తెర్చుకున్నాయి నాకు కళ్లు. సరే అని అలా సోఫా దెగ్గర నుంచుంటే వీడు, ఆహా ఓహో అని కేరింతలు కొడుతూ చెయ్యిపట్టుకుని దూకుతూ ఊగిపోయ్యాడు.
కోతికొమ్మచ్చి ఆట గుర్తొచ్చింది నాకు. ఏమిజేస్తాం, అమెరికాలో బతుకు వైనాటకమూ అని. ఐనా ఇండియాలో మటుకు చెట్లెక్కడ ఉన్నాయి ఆడటానికి, ముఖ్యంగా మఱ్ఱిచెట్లు ఆ చెట్టు ఊడలు. మనోళ్లు కరెంటు తీగలకి చెట్లు తగులుతున్నాయ్ అని చెట్లు కొట్టేయటం ఎన్నోసార్లు చూసా.
హా!! మనల్ని మనం మర్చిపోయి భ్రమలో బతకడమే అభివృద్ధి.
Jan 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
vine అంటే తీగ, ఊడ కాదు. పుత్రుడు ప్రస్తుతం టార్జాన్ ఫేజులో ఉన్నట్టున్నాడు. కిమీకట్కార్లని జాగ్రత్త చేసుకోండి! :)
ReplyDeleteఅన్నగారు:కిమీకాట్కర్ ఏమోగానీ పిల్ల మాత్రం, తన అన్న ఘనకార్యాలని తీవ్రంగా గమనిస్తోంది.
ReplyDeletefor us no problem yaar we still have that vines ...
ReplyDelete