ఓ మంచు కురిసిన రోజున నాకు తెల్సినాయన కనపడితే, ఏందండీ బతుకు ఈ మంచులో, ఈ చలిలో దేనెమ్మ జీవితం అన్నా మాటల మధ్యలో. ఆయన తప్పదు గురుగారు, పిల్లలకోసం అని అన్నాడు. అవును నిజమే, పిల్లలకోసమే. ఎంత? ఎందుకు? నిజంగనేనా? అవసరమా? మనం నిజంగా ఇవ్వాల్సింది ఏంటి?
ఓ సర్కారీ బంట్రోతు లోపలికిపోవాలంటె చెయ్యి చాపుతాడు.
ఓ యమ్మార్వో సంతకం చెయ్యాలంటే చెయ్యి చాపుతాడు.
ఓ రాజకీయనాయకుడు ఓ ఫైలు కదపాలి అంటే నాకేంటి అని అడుగుతాడు.
దేనికియ్యా ఆంటే నా ముందుతరాలకి కూడబెడుతున్నా అంటాడు.
ఇది ఎంతవరకూ సమంజసం. ఇలా ఆస్థి ని ముందుతరాలవాడికి ఉత్తిపుణ్యంగా ఇస్తే ఓ గుడిముందు కూర్చొని అడుక్కునే వానికి, ముందుతరాలవారికి ఏంటి తేడా?
ఎంత సంపాయిస్తే సరిపోతుంది ముందుతరాలావాళ్లకి?
ఎన్నితరాలకి సరిపోను సంపాయించాలి?
ఓ తరం, కొడుక్కి ఇచ్చావు. సరిపోయిందా?
వాడు నపుంసకుడు, పిల్లలు పుట్టలా. ఏమిజేస్తావ్?
వాణ్ణి ఓ తెల్ల అమ్మాయి లెపుకుపోయింది. ఏమిజేస్తావు?
వాడో తాగుబోతు, గుర్రాలాడతాడు. మొత్తం పందెంకాసాడు, ఉన్నదంతా దొబ్బింది. ఏమిజేస్తావ్?
ఎంతమంది మూర్ఖుల్ని తయ్యారుజెయ్యాలనుకుంటున్నావ్ నీ ఆస్థితో? ఎంతమంది సోమరిపోతుల్ని తయ్యారు జెయ్యాలి నీ లంచగొండి డబ్బుతో?
నా ఉద్దేశంలో ఇది కేవలం మన misconception. మరి ఇది మన దేశంలోనే ఉందో లేక అన్నీ దేశల్లో ఉందో తెలియదు. నా ముందు తరాలకి నేను సంపాయించి ఇచ్చేదేంది? అర్ధంలేని కధ. నేనెందుకివ్వాలి? అనేది ఓ ప్రశ్న ఐతే, లేనిదాన్ని తెచ్చి ఇవ్వటం అనేది అర్ధరహితం అనిపిస్తుంది నాకు.
నా దృష్టిలో ఇవ్వాల్సింది జ్ఞానం. చదువుకునేలా చెయ్యాలి. నాలుగు పురుషార్ధాల్లో/స్త్రీఅర్ధాల్లో, మనం ఇవ్వగలిగింది, ఇప్పించ గలిగిందీ "ధర్మ" మాత్రమే. అర్ధ, కామ, మోక్షాలు ఎవడికి వాడు సోధించి సాధించుకోవాల్సిందే.
Jan 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో కూడా వారసులకు ఆస్తి అందజేయాలంటే ఆస్థి విలువలో 30 శాతం డబ్బు ప్రభుత్వానికివ్వాలి అన్న రూల్ పెడితే బాగుంటుంది.
ReplyDeleteoops!! అపుడు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగళా పదివేల రూపాయలు అని పత్రాలు సృష్టిస్తాము!
హ్మ్...ఏమో మరి ముందు తరాలకి ఆస్తి కూడ బెట్టి ఇయ్యాలి అన్న ఈ తపన ఎప్పటికైనా తగ్గుతుందా అనేది ప్రశ్నార్ధకమే. కడుపు మాడ్చుకుని, సరైన గుడ్డైనా కట్టుకోకుండా ఆస్తిని ఇస్తే అది లాకుని అమ్మా నాన్నలని వీధిలోకి తోసేస్తున్న ప్రబుద్ధులని చూసైనా మనం మారటం లేదు. బాగా చెప్పరండీ
ReplyDeleteమనదేశంలో అవినీతికి ఇదే ప్రధాన కారణం! పిల్లలు ఎదిగే వరకూ, వారి సొంత సంపాదన వారికేర్పడే వరకు వారికి చేయూత నివ్వాల్సిందే! వాళ్లకోసం ఆస్థులు కూడబెట్టడం ఏమిటి? పోనీ ఆ ఆస్థులు తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఆప్యాయత, రక్షణ ఇస్తాయా అంటే అదీ లేదు.లేని దాన్ని తెచ్చి ఎందుకివ్వాలి అనేది విలువైన ప్రశ్న భాస్కర్ గారు! ఈ టపా మీద అందరూ స్పందించాలి.
ReplyDeleteఆస్థి దక్కాక తల్లిదండ్రుల్ని వీధిలోకి పంపే పిల్లలు బోలెడు మంది తెలుసు. (కోటీశ్వరులైన మా మేనమాలిద్దరూ అదే పని చేసారు)
జీడిపప్పు గారు..:))!
నేను ఎప్పుడూ ఆలోచించే విషయం.. ఐన పిల్లలకి చేపలని ఇవ్వాలని తాపత్రయ పాడడం కన్నా, చేపలు పట్టడం నేర్పడం మంచిదని ఎప్పటికి గుర్తిస్తారో.. ఎప్పటిలాగే మంచి టపా..
ReplyDeleteఈ విషయంలో నా తండ్రి స్పూర్తి నాకు.నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి లంచం ఇవ్వాల్సొస్తే ఇవ్వనని తెగేసి చెప్పారు.మా అన్నయ్య గ్యారంటీ ఉంటానన్నా కూడా నో అన్నారు.వీడ్ని నేను నమ్మను ఈ లంచం ఇచ్చి సంపాదించిన ఉద్యోగంతో వీడు మరిన్ని లంచాలు తీసుకుని మమ్మల్ని పోషించడానికి కూడా లంచం అడిగితే?అది ఆయన ప్రశ్న.అప్పటికి నా దగ్గర సమాధానం లేదు.
ReplyDeleteకానీ నేను మరెప్పుడూ ఆయన్ని ఉద్యోగం గురించి గానీ చదువయ్యాకా ఒక్క పైసా కాని అడగలేదు.చనిపోయే కొన్నాళ్ళ ముందు మాత్రం ఆయనే చెప్పారు నాతో స్వయంగా నీ వృద్ధికి బహుశా ఆ రోజు నేను ఆ వుద్యోగానికి లంచం ఇవ్వకపోడమే కారణమేమో అని?కావచ్చునేమో కానీ నేనా విషయం ఎప్పుడూ అలోచించలేదు,మీరు నాకిచ్చిన దేహము,విజ్ఞానము.బ్రహ్మోపదేశము చాలు అని చెప్పా.అప్పుడు చూశా ఆయన కళ్ళల్లో వెలుగు నిజంగా...(ఇదే విషయాన్ని గురించి వివరంగా ఇంకో పోస్ట్ రాస్తున్నా నా అనుభవం శీర్షికన కొద్ది రోజుల్లో)...
ఇది మనభావన కాదండి.మన వేదలు ఉపనిషత్తులు ,పురాణాలు అన్ని స్పష్టంగా వివరిస్తున్నాయి.ఎవరికి ఎవరూ ఏమీకారు. సాధించవలసినది ధర్మాన్ని.పోగుచేసుకోవలసినది పుణ్యాన్ని అని.అసలు రేపటి గురించి ఆలో చించేవాడు బ్రాహ్మణుడేకాదు అనే సూక్తి కూడా వున్నది.ఎవరితోనూ ఏబంధము లేకుండా సన్యాసాస్రమమో,వానప్రస్తమో స్వీకరించటము చివరి ధర్మము.వీటివల్ల నిమద్దత గలిగిననాడు ఎవరి కర్మాను సారం వారికి రావలసినది వస్తుందని సామాన్యుడు కూడా వేదార్ధాన్ని నమ్మిన ఆరోజులలో ఈతపన లేదు.కలి ప్రభావము వలన మాయక లోనై ఇప్పుడే మానవజాతి తనది కానిదానికోసము తపనపడి తాను దు:ఖపడుతూ ఇతరులను దు:ఖానికి గురిచేస్తున్నది.మూలము వదిలాక కారణమేమిటని ఎన్నిసార్లు అనుకున్నా మరలా దు:ఖమే తప్ప శాంతి లేదు. మూలము వైపు చూస్తే అక్కడకనపడుతుంది మానవును కర్తవ్యమేమిటో,ఎంతవరకో.
ReplyDeleteWelcomed!!
ReplyDeleteచాలా బాగా చెప్పారు. నేను కొన్ని రొజులుగా టపాలు చూడట్లేదు. ఈ టపా మాత్రం చాలా ఆలోచనలు రేకెత్తించింది. ఇలాంటి అర్దవంతమైన టపాలు ఆశిస్తున్నాం.
ReplyDeleteనేనెందుకివ్వాలి? అనేది ఓ ప్రశ్న ఐతే, లేనిదాన్ని తెచ్చి ఇవ్వటం అనేది అర్ధరహితం అనిపిస్తుంది నాకు.
ReplyDeleteనా దృష్టిలో ఇవ్వాల్సింది జ్ఞానం. చదువుకునేలా చెయ్యాలి. నాలుగు పురుషార్ధాల్లో/స్త్రీఅర్ధాల్లో, మనం ఇవ్వగలిగింది, ఇప్పించ గలిగిందీ "ధర్మ" మాత్రమే. అర్ధ, కామ, మోక్షాలు ఎవడికి వాడు సోధించి సాధించుకోవాల్సిందే. ----everybody should confess like this way
అవును రాజు గారూ! మీరన్న మాటలు చాలా వరకు నిజమే.కాని, తర్వాత తరాల వాళ్ళకి అంటారు కాని, మనసులో చాలా తక్కువ మందికి ఆ భావన గట్టిగా ఉంటది....అసలు విషయం ఎక్కడలేని ధనమంతా మూటగట్టుకుని పరపతి పెంచుకుందామని....
ReplyDeleteమీ ప్రశ్న మంచిదేనండి, కాని మీ పోస్టు లంచం తీసికొనే వారిని, వారి వారసులకు ఇచే ఆస్తులని మాత్రమే ఉద్దేశించినది కదా . కానీ అదంతా ఒక చెయిన్ ప్రాసెస్. ఏ పది మంది లంచం వద్దనుకొన్నా కుదిరే పని కాదు.అలాగని ఉద్యోగాలు అనదరూ వదలలేరు.
ReplyDeleteలంచం ఇచ్చేవారు మాత్రమే పెద్ద మొత్తం గా మారడం ప్రారంభించాలి .మనం రెడీ గా ఉన్నామా? అవును లంచం ఇస్తే పని చేస్తాము అన్నారు, ఆ పని లేకుండా బ్రతకలేమా అని మాత్రం మనం ఆలోచించము ... మన పిల్లల కోసం సంపాదించడం లో మనం బిజీ కదా. ఇలా లంచం ఇచ్చి పని చేయించుకొని పిల్లలకి మాత్రం ఏమి నేర్పిస్తున్నాము ?
అవినీతి ఇచ్చే వారిలో ఉందా, తీసికొనే వారిలో ఉందా ?