Jan 7, 2009

నాన్న జ్ఞాపకాలు - రావిశాస్త్రి - 1

మా నాన్న గారు రిటైరు అయ్యాక సాహిత్యాభిలాషని పెంచుకున్నారు. ఆయన దగ్గర పెద్ద లైబ్రరియే ఉంది. ఆయన చదివిన పుస్తకాలలో మంచి పేరాలని, మంచి చురకల్ని నోటు చేస్కోవటం ఆయనకి అలవాటు. ఈమధ్యకాలంలో నేను ఆ లైబ్రరి లోంచి కొన్ని
పుస్తకాల్ని చదవటం మొదలుపెట్టాను. ముందుగా రాచకొండ విస్వనాధ శాస్తి (రావిశాస్త్రి) గారి "మూడు నవలలు, మూడు కధల బంగారం, సొమ్మలు పోనాయండి, ఇల్లు" చదవటం తో మొదలుపెట్టాను.
మా నాన్నగారు సేకరించుకున్న కొన్ని చురకల్ని ఇక్కడ పెడుతున్నాను.

మబ్బేసినప్పుడు ఆకాశం మెరుస్తది. కాని, ఏ రొండు మెరుపులూ ఒక్కలా ఉండవు. యీరులూ సోరులూ కూడా అంతే. ఒకుళ్ళా ఉంకోడు ఉండడు. మాత్మాగాంది యీరుడే, (కొందరికి.) అల్లూరి సీఅతావరాజూయీరుడే, (ఇంకొందరికి.) అడో రకం యీరుడు. ఈడోరకం యీరుడు. సోరుల్లో కూడా అంతే. సోరుల్లో యెవడి మోడసు ఆడిది. మోడసు అంటే నేరంజేసే పద్దతన్నమాట. గవర్రాజుగాడు పగిలీ బస్సుల్లోనే పరుసులు కొట్టేస్తాడు. అది ఆడి మోడసు. రాందాసుగాడు ఎయ్యింటికైనా రాత్రుళ్ళే సూరికి బొక్కెట్టి కిందకి దిగి సోరీ సేస్తడు. సూరమ్మ సిన్మాఆల్లకాడ స్నాచిగే చేస్ది. ఆండాలమ్మ లండనెల్లినా ముండలకంపెనీయే ఎడద్ది,
పోలీసోణ్నే ఉంచుకుంటది. ఉప్మాకరావుగాడు ఉజ్జోగాలు ఇప్పిస్తాననే డబ్బులు దండుతాడు. పానకాల్రావుగాడు పోర్జరీ సెక్కులే పాసింగు సేయిస్తాడు. ఒకుడుకి ఇత్తడి బిందెలంటేనే మోజు. ఇంకోడికి స్టీలు కారేజీలంటేనే మోజు. మరోడు సిలుక్కోకలంటేనే సెవి
కోసుకుంటాడు. కొంతమంది కత్తి సూపిచ్చి నీ పెన్ను పరుసూ రిస్టోసీ లాక్కుంటారుగానీ నీ వొంటి మీద సేయి ఎయ్యరు.

********
నరులారా, జనులారా, ఇంటరగిసన్ కి పోలిసోడి సేతికి మీరు సిక్కిపోయ్యిన్నాడు మీకు పెసినెంటపిండియ లేడు, పెతానమంతిర్లేడు,
ఎమ్మెల్లేనెంబర్లేడు, జిల్లకలకటేర్లేడు, ఇరుగోళ్ళేడు పొరుగోళ్ళేడు, సుట్టం లేడు స్నేయితుడులేడు, ఒవుడూ మీ సాయానికి లేడు. దేవుడుకూడా లేడు. ఆడు గుళ్ళో ఉండొచ్చు, మసీదులంట ఉండోచ్చు, పాదరీ గుళ్ళంట ఉండొచ్చు. ఎన్నెన్నో సోట్ల దేవుళ్ళాడొచ్చు. అంతేగాని జెనాన్ని పోలీసోడు సితగ్గొట్టి సిత్తరయింసలెట్టి సావబాది సెవులుమూసిన్నాడు దేవుళ్ళేడు. ఉన్నా, పొలిమేరకి ఆడురాడు, ఆ దరిదాపులకి ఆడుజేరడు!

********
జెయిల్ల సత్తరకాయగాడని ఒకడు ఉండీవోడు. ఆడు నా కంటె రొండు మూడేళ్ళు పెద్ద. నేను సిన్మాల యీరోలాగ్గ ఉండె, ఆడు యీరో స్నెయింతుళ్లాగ్గ ఉండీవోడు, ఆడు, బంగారొరే,బంగారం జోలికి ఒప్పుడూ పోవొద్దొరే అనీవోడు. అలాగ్గె రేడోలు, సైకిళ్ళు, టేప్ రికాటర్లు, రిస్టోసీలు, అలాగ్గె అల్లంటి ఒస్తూలు, అన్నింటికి గురుతులు - మార్కులు ఉంటయ్యన్నాడు. ఆట్ని ఆటి ఓనర్లొచ్చి కోర్టుల పోలుస్తరన్నాడు. అంచేత మనం క్యాస్ కొట్టీడం అన్నింటికీ బెస్టు అన్నాడు. అంటే, మనజెనానికి జోబీలు కొడ్డం సాల మంచిదన్నాడు. "జోబీల ఎట్టుకున్న లోట్లకి ఏ ఒక్కడూకూడ లెంబర్లు లోట్ జేసుకోడు, ఎరికా!" అన్నాడు సత్తరకాయగోడు.
*******

3 comments:

  1. బాగుందండి ! మూడు కధల బంగారం - ఈ పుస్తకం కోసం చాలా కష్టపడ్డాను కాని దొరకలేదు.నాకు బాగా నచ్చింది మాత్రం రత్తాలు-రాంబాబు.

    ReplyDelete
  2. @శ్రావ్యా: ఈసారి విశాలాంధ్ర లో ప్రయత్నించు, తప్పకుండ దొరుకుతుంది. అవును, రత్తాలు - రాంబాబు చాలా బాగుంటుంది.
    ధన్యవాద్!!

    ReplyDelete
  3. I tried in విశాలాంధ్ర , Koti but no use :(

    ReplyDelete