Jan 16, 2009

సూరిగాడికి నేన్జెప్పే కతలు - 1

ఈ మద్దెన, మా ఆవిడ సూరిగాడిని నిద్రబుచ్చే బాధ్యతని మళ్లీ స్వీకరించింది. ఆ బాధ్యతని నేను నిర్వహించేప్పట్లో మావాడు ఓ వారం ఓ కధ చెప్పమని అడిగితే ఇంకోవారం ఇంకోటి.
అట్టాంటి వాటిల్లో ఆదికి బాగా నచ్చిన కధ ఇది.
దీనిపేరు "ఓ సొరచేప కధ"
అనగానా ఓ పేద్ద సముద్రం ఒడ్డున ఓ చిన్న ఊరుండేది. ఆ ఊరికి దెగ్గర్లో, ఆ సముద్రంలో ఓ పెద్ద సొరచేప, Its a Big Black Shark with shiny white teeth. అది డేంజెరస్ షార్క్. ఓ రోజు అప్పారావు సుబ్బారావు ఓ చిన్న పడవమీద సముద్రంలో వెళ్తుంటే షార్క్ చూసింది. ఝుం.... ఝుం.... ఝుం.... అని మర పడవ వెళ్తూంటే, ఝున్.... ఝున్.... ఝున్.... అని ఆ షార్క్ పడవ వైపు వస్తోంది. ఝుం...ఝుం...ఝుం... పడవ ఝున్...ఝున్...ఝున్...షార్కు. ఝుం..ఝుం..ఝుం..పడవ, ఝున్..ఝున్..ఝున్..షార్కు. ఝున్.ఝున్.ఝున్.పడవ, ఝున్.ఝున్.ఝున్.షార్కు. ఝుంఝుంఝుం పడవ, షార్కు పడవని ఠకా మని కొట్టేసింది. పపం అప్పారావు సుబ్బారావి నీళ్లల్లో చెల్లాచెదురుగా పడిపొయ్యారు. దీన్ని ఒడ్దునుండి ఓ పోలీసు చూసాడు. ఫేద్ద పోలీసు, చలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఆ పోలీసు. వెంటానే ఊళ్లో వాళ్లందరకీ చెప్పాడు వెళ్లి. షార్కు ఉంది నీళ్లల్లో అటు వెళ్లకండి అని. అది ఎండా కాలం, అందరూ నీళ్లల్లో ఆడుకోటానికి ఇష్టంగా ఉంటే పోలీసు ఇలా చెప్పేసరికి ఎవ్వరు ఆయన్ని నమ్మలా. పైగా అందరూ అతన్ని అరిచారు. ఏమీ పనిలేదా నీకు, మేమూ హాయిగా నీళ్లల్లో ఆడుకుంటుంటె షార్కు అది ఇదీ అని మమ్మల్ని భయపెడతావు అని. అప్పుడు పాపం పోలీసు, ఐతే ఐంది, వీళ్లెవ్వరూ నమ్మక పోయిన నేను వీళ్లందర్నీ రక్షించి తీరతాను అని, ఒడ్డేమ్మటి ఓ పెద్ద వాచ్టవర్ కట్టుకుని, ఓ పెద్ద గంట పెట్టుకుని, స్పాట్ స్కోప్ తీస్కుని గన్ రెడీగా పెట్టుకుని షార్క్ వస్తుందే అని చూస్తున్నాడు. ఇంతలో ఓ నల్లని ఆకారం ఒడ్డువైపుకి వస్తోంది. పోలీస్ వెంటనే గంటకొట్టి అదిగో షార్క్ వస్తోంది, వచ్చేస్తోంది అని అరిచుకుంటు నీళ్లదెగ్గరకి వెళ్లి అందర్నీ బయటకి రప్పించి చూడబోతే అది షార్క్ కాదు. ఎదో పెద్ద చేప. అందరు జనాలు పాపం పోలీసిని అరిచారు. ఛీ ఛీ అన్నారు. పోలీసు సిగ్గుతో ఇంతికి వేళుండే సరికి మిస్సెస్స్ పోలీసు పరిగెత్తుతూ అతనికి ఎదురొచ్చింది. ఏంటి అని అడిగాడు పోలీసు, మన పిల్లలు, వాళ్ల స్నేహితులతో సముద్రంలోకి వెళ్లారు, నువ్వేమో షార్కు అది ఇదీ అంటున్నావు. ఇప్పుడేలా అని ఏడవటం మొదలెట్టింది. పోలీసు వెంటనే ఓ పెద్ద బోటేస్కుని సముద్రంలోకి వెళ్లాడు. ఇంతలో ఆ పిల్లలు అందరూ అక్కడి ఓ చిన్న ఐలాండ్ వైపు వెళ్తుంటే షార్క్ చూసింది. ఝుం.... ఝుం.... ఝుం.... అని మర పడవలు వెళ్తూంటే, ఝున్.... ఝున్.... ఝున్.... అని ఆ షార్క్ వాళ్ల వైపు వస్తోంది. ఝుం...ఝుం...ఝుం... పడవలు ఝున్...ఝున్...ఝున్...షార్కు. ఝుం..ఝుం..ఝుం..పడవలు, ఝున్..ఝున్..ఝున్..షార్కు. ఝున్.ఝున్.ఝున్.పడవలు, ఝున్.ఝున్.ఝున్.షార్కు. ఝుంఝుంఝుం పడవలు, షార్కు పడవని ఠకా మని కొట్టేసింది ఆ పడవల్ని. పిల్లలందరూ నీళ్లల్లో పడిపొయ్యారు. అంతలో ఒక పిల్లాడు ఆ ఐలాండ్ కి చేరుకుని ఆ పోలీస్కి రేడియోలో "పోలీస్ అంకుల్!! పోలీస్ అంకుల్, మీపిల్లలు, మేమూ అందరం ఇక్కడ ఐలాండ్ దెగ్గర ఉన్నాం, మమ్మల్ని షార్కు తంతున్నదీ, రండి, హెల్ప్ హెల్ప్" అని చెప్పేసరికి పోలీస్ వెంటనే వచ్చి ఆ షార్క్ తో, హేయ్, ఎవ్వడ్రా నువ్వు, నిన్ను ఇట్టా పెట్టి గుద్దుతా అనేసరికి పాపం ఆ షార్కు భయపడి పోలీస్ బాబాయ్ నన్నేమీ చేయొద్దు మాది ఈ ఊరుకాదు, నెను మారు వెళ్లిపోతా, మా ఊళ్లో చేపలమ్మునుని బతుకుతా, నన్ను వదిలేయ్, ప్లీజ్ అంది. పోలీస్ సరే వెళ్లిపో, ఇక మా ఊళ్లో మళ్లీ ఎప్పుడైనా కనబడితే తంతా అన్నాడు. అది వెళ్లిపోయింది. అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి చేరుకున్నారు.

అదీ కధ.
ఎక్కడో విన్నట్టు ఉందా?
దీన్నే జాస్ - JAWS సినిమాలా తీసారు!!! :):):)

ఇంకోసారి ఇంకో కత చెప్తా. అప్పటిదాకా "నిద్దుర పోరా సూరిగా"

9 comments:

 1. మొత్తానికి సూరిగాడు కింగ్ సైజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు :)

  ReplyDelete
 2. యోగి గారి కామెంటే నాదీనూ!
  ఈ సారి పెద్ద పాము కథ(అనకొండ) చెప్పరా ప్లీజ్!

  ReplyDelete
 3. నువ్వు చెప్పావ్ సూరిగాడిన్నాడు,అక్కడికి అయ్యిందా??ఇట్టాటి కధలు మీబాబూకొడుకులు చెప్పుకుని పడుకుంటే చాలా అని?ఇక్కడ సూరిగాడికొక అన్నున్నాడు,మరి ఆడినొద్దా??
  మరియాదగా ఆడియొ పెట్టు,ఈలుంటే ఈ డియో కూడా................

  ReplyDelete
 4. ఇట్టాంటి పనికిరాని సొల్లు సెప్పే సూరిగాడ్ని సెడగొట్టేత్తన్నావ్.రేప్పొద్దున్న ఆడూ నీకు ఇదే సొల్లు సెప్పి తిరగ్గొట్టెయగల్డో ఎర్రిమొగమా.సొల్లు కతలు ఆపి పనికొచ్చేదేదన్నా సెప్పాడికి,లైపులో పైకొత్తాడు లేకపొతే నీలాగే సొల్లు సెప్పుకుంటూ గడిపేత్తాడు..సముజైందా(సరదాగా)..

  ReplyDelete
 5. కథ బాగాలేదండి భాస్కర్ గారు. కథలో రాజు లేడు, రాణి లేదు. హీరో, హీరోయిన్లు, దయ్యాలు, రాక్షసులు కూడా లేరు. కనీసం నీతి కథ కూడా కాదు. పాపం సూరిగాడు. :))))

  ReplyDelete
 6. @యోగి, సుజాత గారు: వాడి వయసుకి షార్క్ అంటే ఓ పెద్ద కధా వస్తువు. వాడికి షార్క్ అంటే మాహా పిచ్చి. వాడికి షార్క్ వెయ్యటంకూడా వచ్చు. కాబట్టి పొద్దస్తమానం షార్క్ ఏమంటుంది ఇదేగోల, షార్క్ పుస్తకం తీసి ఇక చదువ్ అంటాడు. ఎన్ని రకాల షార్కులు ఉన్నాయి, హ్యామర్హెడ్ షార్క్, వైట్ టిప్ రీఫ్ షార్క్, స్యాండ్ టైగర్ షార్క్, నువ్వో షార్క్ బొమ్మ చూపించు వెంటనే చెప్తాడు అదేమి షార్కో. బహమస్ షార్క్, కరీబియన్ షార్క్ ఏంటేంటో చెప్తాడు.
  @రాజే అన్నా: రేపు రిలీజు జేస్తా షార్క్ కధ పాడ్కాస్ట్
  @పప్పు యార్: అలాక్కానిద్దాం, ఆయ్, అట్టానే అన్నానాకాదేటి. అట్టనే!!:):)
  @వోయ్ నాగ్: పతీ కతలో నీతిని సూడగూడదు సిన్నా, మరీ కతకి హీరో సెప్పించుకున్నోడే, ఇలను సొరసేప, హీరోవిన్ను ఇకా రాలేదు సిన్నా, మేకప్పు కుదర్లేదని వలిగి పోయింది. ఈతూలికి హీరోవిన్ లేకండానే లాగింసేసాం.

  ReplyDelete
 7. పాడ్కాస్ట్ - ఇద్దరి ది పెట్టండి అంటె మీరు చెబుతుంటే మీ బాబు అడిగే ప్రశ్నలు కూడా :)

  ReplyDelete
 8. @నేస్తం: Thank you!!
  @శ్రావ్యా: Sure. I will do that.

  ReplyDelete