Jan 6, 2009

నా.స్టా.నా.సె

ఇదేందిది అనుకుంటున్నారా?
నా.స్టా.నా.సె = నో స్టాప్ నో సెన్స్ - అమెరికన్ స్టైల్లో. నాన్ స్టాప్ నాన్ సెన్స్ బ్రిట్ స్టైల్లో.

నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు, మా ప్రధానోపాధ్యాయుడు మాకో కధ చెప్పారు. అది - మర్యాదరామన్న కధ (అనుకుంటా). ఓ సారి ఓ బడాయి బంటి మర్యాదరామన్న ఉండే రాజ్యానికి వచ్చి, అక్కడి జనాలకి ఓ సవాలు విసురుతాడు. అదేంటంటే "మీలో ఎవ్వరైనా నాకు విసుగు వచ్చేలా కధ చెప్పలేరు" అని. చెప్పగలిగితే ఏదో బహుమానం, చెప్పలేకపోతే ఓ సమచ్చరం దాసీలా పనిచెయ్యటం. చాలా మంది ప్రయత్నించి అతన్ని విసిగెత్తించలేక దాసీలైపోతే, ఇక మన రామన్న ముందుకొచ్చి అతనికో కధ చెప్పటం ప్రారంభిస్తాడు.
ఇదీ ఆ కధ
ఓ ఊళ్లో ఓ పెద్ద వ్యాపారికి ఓ పెద్ద గిడ్డంగి ఉండేది. అతను దాంట్లో అతని వ్యాపారనిమిత్తం ధాన్యపు బస్తాలని నిల్వజేస్కునేవాడు. ఆ గిడ్డంగి ఆవరణలో చాలా చెట్లు ఉండేవి. ఒకానొక చెట్టుపైన జిమ్మిరి అని ఓ పిచ్చుక ఉండేది. ఒకానొక రోజున అస్సలు ఈ పెద్ద గిడ్డంగి ఏంటి? దాంట్లో ఏమి ఉంది అనే కుతూహలంతో జిమ్మిరి గిడ్డంగి గవాక్షంలోంచి లోపలికి వెళ్లింది. అక్కడి బస్తాలనిజూసి, అయ్యబాబోయ్ ఎన్ని బస్తాలు ఇక్కడ అనుకుని అందుబాటులో ఉన్న బస్తా దెగ్గరకి వెళ్లి ముక్కుతో పొడిచి చూస్తే అవి బియ్యం. ఆనందంతో ఎగిరి గంతేసింది జిమ్మిరి. ఇక ఒక్కో బియ్యం గింజ నోట పెట్టుకుని బయటకి వచ్చి తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం....

మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
...
..
.
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.

ఇంతలో ఆ బడాయి బంటికి విసుగురావటం మొదలయ్యింది. ఏంది రామన్నా ఇలా ఎంతసేపు?
చెప్తున్నా, వస్తున్నా వినండి అని మళ్లీ ఎత్తుకున్నాడు రామన్న
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
....
...
..
.

బడాయి బంటి విసుగుచెంది చేతులెత్తేసి అయ్యా నన్ను క్షమించండి అని మొరపెట్టుకుంటే, బందీలుగా పట్టుకున్న మా వాళ్లని వదిలెయ్యమని చెప్తాడు రామన్న, బడాయి బంటి అందరికీ చెఱ విముక్తి చేసి అక్కడనుండి నిష్క్రమిస్తాడు.
అదీకధ.


ఇట్టాంటి కధల్లో మేము చిన్నప్పుడు చెప్పుకున్న కధలు కొన్ని గుర్తొచ్చినయి. వాటిల్లో ఇదోటి:
ఓ అవ్వ బావి గట్టుమీద కూర్చుని చినిగిపోయిన తన సంచిని ఓ సూదితో కుడుతున్నది. ఇంతలో చెయ్యిజారి సూది బావిలో పడింది. ఎలా వస్తుంది సూది బయటకి?
"ఏందీ"
"ఏందీ అంటె వస్తుందా"
"కాదు"
"కాదు అంటె వస్తుందా"
"లేదు"
"లేదూ అంటే వస్తుందా"
".."
".. అంటే వస్తుందా"
"తీస్తే వస్తుంది"
"తీస్తే వస్తుందీ అంటే వస్తుందా"
.
..
...
....

5 comments:

 1. the story u told is adapted in a movie called bhajantrilu directed by m.s. narayana, ofcourse it is a flop. If u get chance view the comedy bit relating to this story. anyhow the story is superb.

  ReplyDelete
 2. మా అమ్మాయికి రోజూ రెండు కథలు చెప్పనిదే నిద్ర పోదు. చెప్పాక మనల్ని తన గదిలో ఉండనివ్వదిక."పొండి, నేను బజ్జోవాలి" అంటూ! రోజూ రెండంటే ఎక్కడినుంచి తీసుకురాను. అప్పుడప్పుడు ఈ సూది కథ చెప్తాను. అందుకని "అనగనగా ఒక వూళ్ళో ఒక ముసలమ్మ ఉంది" అని మొదలెట్టగానే అది ఇతర కథైనా సరే, "ముసలమ్మా? అంటే ఇది సూది కథేగా? నాన్నోయ్, నాన్నోయ్" అని కేకలు పెడుతూ పారిపోతుంది.

  మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఈ కథ. కాకపోతే అందులో ముసలమ్మ బావి(నేలబావి అయి ఉంటుంది) మీద నులకమంచం వేసుకుని దానిమీద కూచుని కుడుతుంటే సూది బావిలో పడిపోయిందని చెప్పేది అమ్మ!

  ఈ సూది కథంటే మా ఇంట్లో పిల్లలందరికీ దడ!

  మర్యాద రామన్న కథ సరే,అన్ని సార్లు పిచ్చుక చేసిన పని గురించి రాయడానికి మీకు విసుగెలా వెయ్యలేదా అని ఆశ్చర్యంగా ఉంది.

  ReplyDelete
 3. మర్యాదరామన్న కూడా ఈకాలం పిల్లలకు విసుగు తెప్పించే కథలు చెప్పలేడు.

  భారతం ,రామాయణం ఎప్పుడో వినేసారు/చూసేసారు bకథ లో చేయాలట .మాఇంట్లో కుడా రోజు కనీసం ఒక కథ చెప్పాలి.కొన్నిసార్లు కథ చెప్పలేక అరిసి పడుకో పెట్టవలసి వస్తుంది.పాపం వాళ్ళు ఏమడుగుతున్నారు మానులా మనిక్యాలా .....కేవలం కథలు .మనం చెప్పలేక పోతున్నాము.అమ్మమ్మ నాయనమ్మలు దగ్గర ఉంటే చేప్తారునుకొంది .కాని మనదగ్గరుమ్దరు కదా !

  మా పిల్లలు నాకు కొన్ని objects ఇస్తారు.వాటిని వుపయోగించి కథ చెప్పాలి.నేను statrt చేసి వాల్లను కొనసాగించమని చెప్తాను.అలా మల్లి నా టర్న్ వస్తుంది.మా ఆవిడా సాక్షి పేపర్ లో కథ చదివి దానికి కొన్ని మార్పులు చేసి చెప్తుంది.

  ReplyDelete
 4. మర్యాద రామన్న కథ బాగుంది.
  సుజాత,:) కాపీ పేస్టు.

  ReplyDelete
 5. @తేజా : బహుకాల దర్శనం. ఎలా ఉంది చెన్నై.
  @సుజాత గారు: ఈ రోజుల్లో పిల్లలకి వెరైటీ కావాలి అండీ. :):)
  ఎలా రాసాను అన్ని సార్లు? Ctrl+c, Ctrl+v
  @అరుణాంక్: నిజమే, మావాడు నాచేత అవధానం, సమస్యాపూరణం చేయిస్తాడు. సూర్య (వాడి మీదే) మీద కధ చెప్పు, అనఘ మీద కధ చెప్పు, లేకపోతే ఆ గోడ మీద కధ చెప్పు అని.
  @సిరిసిరిమువ్వ గారూ: ధన్యవాదాలు

  ReplyDelete