"సెగెట్రి నేంజెప్పిన పనేంజేసావ్?"
"అయ్యిందయ్యా! ఆ పక్కోడి బ్లాగుమీద, ఆడిమీద బుఱద జల్లా!! ఇంకోడిమీద జల్లమన్నారుగా, అవకాశాం కోసం జూస్తన్నా"
"సర్లేవో ఎదవనూసెన్సు!! పొద్దస్తమానం బురదజల్లుడేనా!! మడిసన్నాక కూసింత కళాపోశనుండాల!! తిని తొంగుంటె మడిసికి గొడ్డుకీ తేడా ఏటుంటది"
అంబా!! అంబా!!!
"ఏటి సెగెట్రి!! ఏటా అరుపులు!!!"
"మన కొట్టంకాడి గొడ్లు అరుస్తున్నాయయ్యా" (మనసులో!! సచ్చినాడా మాకు నీకు పోలికేట్రా అని అనుకుంటున్నాయ్)
"సర్లేవో!! సూడూ!! సూరీడు ఎర్రగా లేడూ? ఆకాశంలో మర్డరు జరిగినట్టులేదూ? ఆ పెత్తెచ్చనారాయణుడి సేవ జేస్కోనీ కూసింత సేపు"
"లేదయ్యా!! నాకు మామూలుగానే కనిపిత్తన్నాడూ"
"సెగెట్రీ, సినెమా కతల్జెప్పకు బురదజల్లించెయ్గల్ను!! సరిగ్గ జూసి చెప్పు"
"అవునయ్యా!! మీరు కిళ్ళీ తిని ఆకాశంమ్మీదకి ఉమ్మేశారు, అది మీ (నీ) మొహం మీద పడి పెపంచం ఎర్రగ కనిపిస్తుందయ్యా"
"హా$%!$%@$%^%"
నా పాడ్కాస్ట్ లో ఇప్పుడు ఇది లభ్యం. ఇక్కడ నొక్కండి వినాలనుకుంటే.
Jan 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
This comment has been removed by the author.
ReplyDeleteహ హ హ :-)
ReplyDeleteమరీ మనోల్ల క్రియేటివిటీ దిగంతాలు దాటి పోతుంది!
ReplyDeleteహహ్హహ్హా.... నవ్వలేక చస్తున్నా.
ReplyDelete"సెగెట్రీ, సినెమా కతల్జెప్పకు బురదజల్లించెయ్గల్ను!! సరిగ్గ జూసి చెప్పు" అనగానే ఫక్కుమని నవ్వా.. మా ఆయన నన్ను పిచ్చిదానిలా చూశాడోసారి.
క్రియేటివిటీ దిగంతాలు దాటడం మంచిదేగా మూర్ఖత్వం దిగంతాలు దాటితేనే భరిస్తున్నామాయె :)
మీరిచ్చిన కలాపోసన inspiration తో, ఆ సెగెట్రి మహానుభవుడు తన ప్రియురాలి తో ఇలా అన్నాడు :"ఆ చందమామ చూశావా ప్రియా! పూర్తిగా తినేసి కాస్త మిగిల్చిన అప్పడం ముక్క లా ఎలా వుందో". అది విని మల్లిక్ ఒక కార్టూన్ వేశాడు.
ReplyDelete:)
ReplyDeleteఅల్లో అల్లో అల్లో!! ఈడ, ఏటి, ఈడ కమెంటెట్టిన అందరికీ ఓ కొబ్బరి బోండం. కావాల్సినోళ్లకి దాంట్లో ఇంకేదో!!
ReplyDeleteHave a Nice day.