ఇవ్వాళ మన సహ బ్లాగరు, యోగి అ.క.అ అష్టావక్ర తన పెన్నులోని ఇంకు మొత్తాన్ని వొంపేస్కుంటున్నా అన్నాడు. అలా వోంపేస్తే పెన్ను రాయదుకదా అన్నా, పాళీ ఇరగ్గొట్టా అన్నాడు, ఇకరాయదుగా అన్నా, ఇకరాయాల్సిన అవసరం లేదు అన్నాడు, చివరాఖరి కాయితం కాక పోయినా ఉన్న రీము కాయతాల్ని మూటగట్టి అటక మీద పెట్టేసా అన్నాడు, ఇక పెన్నుతో పని లేదు అన్నాడు. నాకర్ధంగాలా!! దేనికీ అన్నా? నా బ్లాగుని మూసేస్తున్నా అన్నాడు. సరే ఇదే నీ చివ్వరాకరి నిర్ణయమా బ్లాగుమీన అన్నా. అవునూ అన్నాడు. ఇలా జెప్పాను:
సోదరా!!
హుం!! ఏమి చెప్పనూ? ఇదే నీ నిర్ణయం ఐతే ఇక నువ్వు పొడుగుచేతుల చొక్కాలు వేస్కోవాల్సిన అవసరం లేదు, దేనికంటే మేధావుల్ని ఎదిరించడానికి కండలపైకి ఇక చొక్కా మడుచుకోవాల్సిన పనిలేదు. కళ్లు బైర్లు కమ్మేలా మేధావులు రాసిన ఠావుల కొద్దీ కతల్ని చదవాల్సిన పనిలేదు. ఏమైనా, ఒక నిర్ణయం, ఒకే నిర్ణయం, ఒకే మాట, ఒకే బాట.
ఇక మేధావుల్లారా మీ మీ మేధావితనాన్ని కలుగుల్లోంచి బయటకి తీసి దులుపుకోండి. ఒక వెల్తురు బ్లాగ్లోకంనుండి నిష్క్రమిస్తున్నాడు. మీరిక ఆకాశం మీదకి ఉమ్మేస్స్కోవాల్సిన పనిలేదు, నక్కల్లా ఊళళు పెట్టాల్సిన పనీలేదు మరో ఖడ్గం వచ్చేదాకా. మీ కళ్లని ఇంక చల్లబర్చుకోండి, మగ్గు బీరుతో లేక ఓ చెత్త పోస్టుతో.
అదిగో పొద్దుపొడుస్తున్నాడు సూరీడు మరో కొత్త వెలుగుతో, మరో కొత్త ఖడ్గాన్ని తయ్యార్చేయ్యటంకోసం, మరో కొత్తవెలుగుని నింపడంకోసం
- మే యువర్ బ్లాగ్సోల్ రెస్ట్ ఇన్ పీస్
Jan 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment