Oct 29, 2009

తీర్ధం తీస్కుంటే జరఁమొస్తుందా?

అయ్యా
కార్తీక మాసం!! మొన్నటి సోమవరం, గుడికెళ్ళాం నాయనా. సోమవార పూజ గట్రా అయ్యాక నాయనా, దండవెట్టుకుని, తీర్ధం పుచ్చుకుని ఇంటికిచేరా నాయనా. ఛిల్స్ మొదలైయ్యాయి మహాప్రభో. వణికిపొయ్యా.
ఏంటీ? ఏమైంది?
చలి
జరంగా ఉందా
ఉన్నట్టుగా ఉంది
ఏదీ సూణ్ణీ? చల్లగానే ఉందే వళ్ళు
ఏమో లోపల్లోపల ఉన్నట్టుంది
దరమామీట్రీ పెట్టుకుని సూస్కో
తొంభైతొమ్మిది
పడుకో పాలుతాగి
టైలినాల్ ఇవ్వు ఏస్కుని పడుకుంటా

అయ్యింది. పొద్దున్నే మళ్ళీ దరమామీట్రీ నోట్లోఎట్టుకుని సూస్కుంటే నూట్రెండు. కళ్ళు బైర్లు కమ్మినై. ఎంటనే డాకటేరుకాడికి పరిగెత్తా.
ఏట్రా సిన్నా
జొరం
ఏదీ సూణ్ణీ
సూడు
ఏంపర్లేదు, దీన్నే ఇన్ఫ్లుఎన్జా అంటారు. ఆడా ఈడా తిరగమాక. ఈ బిళ్ళలేస్కో.
అట్టాగే.

ఇక ఇంటికాడా,
అవును. సానా మంది చెప్పారు. గుళ్ళో తీర్ధం పుచ్చుకుంటే విరోచనాలు అయినోళ్ళు ఉన్నారు, ఇలా జరాలొచ్చినోళ్ళూ ఉన్నారు, స్టమక్ అప్సెట్ ఐనోళ్ళూ ఉన్నారూ అని.

బెదరూ!! కాబట్టి జాగరత్త.

17 comments:

  1. mineral water to cheyamani cheppu guru teertham..

    ReplyDelete
  2. ఇంతకీ జ్వరం తగ్గిందాండీ? తగ్గ బట్టే కదా టపా రాసింది..అంటారా :)

    ReplyDelete
  3. First of all sorry bro. Flu really sucks. Hope you are feeling better now. ఈ సమయం లో పిల్లల్తో చాలా కష్టం కదా పాపం.

    ఇక పోతే తీర్ధం వలన అయి ఉండదు, నాకు తెలిసినంత వరకూ ఫ్లూ వైరస్ ఒంట్లో కి వచ్చాక ఒకటి రెండు రోజలు స్టేజ్ సెట్ చేసుకుని అప్పుడు మొదలు పెడుతుంది ఆట. సో గుడికి వెళ్ళిన ముందు రెండు రోజులలో మీ ఆఫీస్ లోనో, దారిలోనో, మాల్ లోనో ఎవడైన నీ మొహం మీద తుమ్మాడేమో గుర్తు చేసుకో.. ఆడ్ని సూ జేద్దాం, లైఫ్ సెటిల్ ఐపోద్ది :-)

    ReplyDelete
  4. ఏంటండీ , నాన్నగారు జ్వరమొచ్చిందా ! పాపం మీ ఆవిడ .
    పిల్లలూ, ఇల్లు ,వంటా ఇవన్నీ ఒక్కరే చూసుకోవటం ఎంతకష్టం . మాంచి పవర్ ఫుల్ల్ మందులేసుకొని , త్వరగా కోలుకోండి. పాపం ఆవిడొక్కరే ఎలా వేగుతున్నారో ఏంటో!

    ReplyDelete
  5. అయ్యో......ఇప్పుడెలా వున్నారు?

    ReplyDelete
  6. అయ్యో పాపం .. పుణ్యానికి పోతే .. అంటే ఇదే కాబోలు. నిజమే, కొన్ని మన ఆచారాలకీ, ఇప్పుడు మనం బతుకుతున్న మహమ్మారి పరిస్థితులకీ చుక్కెదురు!

    ReplyDelete
  7. :):)
    మనం కాబట్టి తట్టుకుని, కోలుకుని, పనికొచ్చాం. అదే ఇంకోళ్ళింకోకళ్ళైతే? తట్టుకోగలరా? లేచి నిలవగరా?
    శశాంక్ - అట్టానే ఉంది చూడాబోతే. నేను మరీ అంత సెన్సిటివ్ కాదు. కానీ ఒక్కోసారి చెప్పలేం. నే చెప్పిన విషయం మరీ అంత కొట్టిపడేసేది కాదు.
    తృష్ణ - అదేదో సామెత.
    పండగనాడు కూడా పాతమొగుడేనా అని. దాన్ని మారిస్తే, బాలేన్రోజుకూడా ఆపీస్ నుండి కాలా? ముప్ఫైనాలుగు కాల్స్ వచ్చాయ్. బెమ్మదేవుడు ఇక తరిమాడు, పోరాబాబు ఆపీస్కి పొయ్యి ఆళ్ళగోలేందో సూసిరా అని. వచ్చామే అనుకో, దొరికిన పది నిమిషాల్లో ఓ పోస్టురాసేసి అవ్వతలెయ్యాలా? బుద్ధి, పుటకల్నాటిది. రాసేసాం!!
    వేణు శ్రీకాంత్ - నువ్వు చెప్పిందీ నిజమే సోదరా. అక్కడ వచ్చింది కాకపోయి ఉండచ్చు, వచ్చినా వచ్చిఉండిండుండిండొచ్చండయ్యా!
    కూసింత కట్టమేనండండండిండయ్యా, కానీ మనం పల్నాటి సరుకు కదా, కొరుకుడుపళ్ళా దానికి. ఠకా మని లేచి కూర్చున్నాం [స్వగతం - తగ్గినాక :):)]
    సునీత గారూ - :)
    మురళి - ఏటిసేత్తాం కలికాలం
    లలిత - పాపం తను. నిజమే. పిల్లలు నామీదకి దూకటానికి రావటం, తను వాళ్ళను పక్కకు తీస్కెళ్ళటం. కాపీలు, జ్యూసులు, మంచీళ్లు మాటిమాటికి వేడిజేసి, సూపులు, బార్లీ నీళ్ళు, దొరికిని రెండు సెకండ్లలో ఇంటర్నెట్లో ఎతికిపట్టి అల్లం కషాయం జెయ్యటాలు మధ్యమధ్యలో కాళ్ళొత్తటాలు, పిల్లల్ని పడుకోబెట్టటం వంట తంటా...తనకొస్తే, జాగ్రత్త హా, అవసరమొస్తే కాల్ చెయ్యి అనేసి ఆపీస్కి చెక్కేసే మొఖాలు నాలాంటోళ్ళవి.
    కొత్తపాళీ అన్నగారు - అలానే ఉంది చూడబోతే.

    ReplyDelete
  8. శృజన గారు - ధన్యవాదాలు. తగ్గింది.

    ReplyDelete
  9. తీర్థం తీసుకుంటే, వాంతులూ, విరోచనాలా? ఇదేదో "బెండు అప్పారావు R.M.P." వ్యవహారంలా ఉందే! :)

    ReplyDelete
  10. @ నాగ ప్రసాద్:
    మొత్తానికి బెండు అప్పారావు చూసారన్నమాట (:-?

    అన్నాయ్! నిజంగా నిన్ను మెచ్చుకోవాలి, ఫ్లూ వచ్చినా కూడా, కచేరికి వెళుతున్నావు అంటే!!

    ReplyDelete
  11. అయ్యో ఇప్పుడు ఎలా ఉంది :(

    ReplyDelete
  12. పోయినోరం నాదీ ఇదే సీన్ అన్నాయ్. కార్తీకమాసం మొదలవ్వటంతోనే కనిపించి దేవుడికి సీజన్ మొదటి అర్జీ మనదే అయ్యేలా ప్లాన్ చేస్కుని వెళ్ళా. ఉదయం నుంచి ఘాట్‌లలో, విశ్వనాథమందిరంలో, అన్నపూర్ణగుళ్లో ఆడేఈడ పెత్తనాలు చేసి సాయంత్రం మణికర్ణిక అక్కడినించి రూంకి. సీన్ కట్‌చేస్తే తర్వాత మూడురోజులు డయేరియా.

    ReplyDelete
  13. ఏవిటో తీర్థం తీర్థం అంటున్నారమ్మా? ఇవ్వమంటారామ్మా?

    ReplyDelete
  14. @ చైతన్య: అవును మరి..మందిరాల్లో అమ్మవార్లనే చూసావో...ఇంకెవరిని చూసావో... :)
    ( "ఛా.., కళ్ళు దించుకుపోతాయ్"....అంటావా?)

    ReplyDelete
  15. తీర్ధాలు మానేసి యుగాలయ్యాయి నాయనా!! ఇంకేంది ఇచ్చేది, పుచ్చుకునేదీ? ఇంకా ఏమైనా పుచ్చుకుంటే నీపెళ్ళికే

    ReplyDelete