నేను చూసిన మొట్టమొదటి సంస్కృత సినిమా - శ్రీ ఆది శంకరాచార్య.
1983 లో ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ. జి.వి. అయ్యర్ నిర్మించి, దర్శకత్వం వహించి, స్క్రీన్ప్లే కూడా అందించారు.
ఈ చిత్ర స్క్రిప్టు ని తెలుగులోకి అనువదించాలి అని నా సంకల్పం.
ముందుగా ఈ చిత్రంపై నా సమీక్షని ఇక్కడ చదవండి.
http://vedasamhitam.blogspot.com/2009/01/blog-post_28.html
Jan 31, 2009
Jan 28, 2009
ముందుతరాలకి "ఆస్థులు - సంపాదన"
ఓ మంచు కురిసిన రోజున నాకు తెల్సినాయన కనపడితే, ఏందండీ బతుకు ఈ మంచులో, ఈ చలిలో దేనెమ్మ జీవితం అన్నా మాటల మధ్యలో. ఆయన తప్పదు గురుగారు, పిల్లలకోసం అని అన్నాడు. అవును నిజమే, పిల్లలకోసమే. ఎంత? ఎందుకు? నిజంగనేనా? అవసరమా? మనం నిజంగా ఇవ్వాల్సింది ఏంటి?
ఓ సర్కారీ బంట్రోతు లోపలికిపోవాలంటె చెయ్యి చాపుతాడు.
ఓ యమ్మార్వో సంతకం చెయ్యాలంటే చెయ్యి చాపుతాడు.
ఓ రాజకీయనాయకుడు ఓ ఫైలు కదపాలి అంటే నాకేంటి అని అడుగుతాడు.
దేనికియ్యా ఆంటే నా ముందుతరాలకి కూడబెడుతున్నా అంటాడు.
ఇది ఎంతవరకూ సమంజసం. ఇలా ఆస్థి ని ముందుతరాలవాడికి ఉత్తిపుణ్యంగా ఇస్తే ఓ గుడిముందు కూర్చొని అడుక్కునే వానికి, ముందుతరాలవారికి ఏంటి తేడా?
ఎంత సంపాయిస్తే సరిపోతుంది ముందుతరాలావాళ్లకి?
ఎన్నితరాలకి సరిపోను సంపాయించాలి?
ఓ తరం, కొడుక్కి ఇచ్చావు. సరిపోయిందా?
వాడు నపుంసకుడు, పిల్లలు పుట్టలా. ఏమిజేస్తావ్?
వాణ్ణి ఓ తెల్ల అమ్మాయి లెపుకుపోయింది. ఏమిజేస్తావు?
వాడో తాగుబోతు, గుర్రాలాడతాడు. మొత్తం పందెంకాసాడు, ఉన్నదంతా దొబ్బింది. ఏమిజేస్తావ్?
ఎంతమంది మూర్ఖుల్ని తయ్యారుజెయ్యాలనుకుంటున్నావ్ నీ ఆస్థితో? ఎంతమంది సోమరిపోతుల్ని తయ్యారు జెయ్యాలి నీ లంచగొండి డబ్బుతో?
నా ఉద్దేశంలో ఇది కేవలం మన misconception. మరి ఇది మన దేశంలోనే ఉందో లేక అన్నీ దేశల్లో ఉందో తెలియదు. నా ముందు తరాలకి నేను సంపాయించి ఇచ్చేదేంది? అర్ధంలేని కధ. నేనెందుకివ్వాలి? అనేది ఓ ప్రశ్న ఐతే, లేనిదాన్ని తెచ్చి ఇవ్వటం అనేది అర్ధరహితం అనిపిస్తుంది నాకు.
నా దృష్టిలో ఇవ్వాల్సింది జ్ఞానం. చదువుకునేలా చెయ్యాలి. నాలుగు పురుషార్ధాల్లో/స్త్రీఅర్ధాల్లో, మనం ఇవ్వగలిగింది, ఇప్పించ గలిగిందీ "ధర్మ" మాత్రమే. అర్ధ, కామ, మోక్షాలు ఎవడికి వాడు సోధించి సాధించుకోవాల్సిందే.

Jan 27, 2009
రఘువంశ సుధ
నాకు సంగీతజ్ఞానం బొత్తిగా లేదు. ఐనా సంగీతం వింటూనే ఉంటా.
నేను పాడను. పాడితే జనాలు పారిపోతారు.
గూగుల్లో అక్కడ ఇక్కడా గెలుకుతున్నప్పుడు, ఏమైనా లంకెలు లింకులు తగిల్తే నా బ్లాగులో పెడుతూంటా, మీరూ విని ఆనందించండేం
రఘువంశ సుధ - యం.యస్. గోపాల కృష్ణన్ గారి వాయిలీనం పై వినండి ఇక్కడ:
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/M.S._Gopalakrishnan/02-Raghuvamsa.mp3
కృష్ణా నీ బేగనే బారో - షేక్ చిన్న మౌలానా సాహిబ్ గారి నాదస్వరం నుండి ఇక్కడ వినండి:
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/Sheik_Chinna_Moulana_Sahib/04%20Krishna%20Nee%20Begane%20Baro%20-%20Yamunakalyani%20-%20Misra%20Chapu%20-%20Purandaradasar.wma
బ్లాగ్లోకంలో ఈ కృతి కోసం వెతికితే ఈ తీగ దొరికింది:
పద్మ గారి మోహనరాగాలు బ్లాగులో కృష్ణా నీ బేగనే బారో.
డోలాయాం చల డోలాయాం
ఇది ఎవ్వరైనా విని తీరాలి
http://carnatic.geetham.net/dl.php?file=music/Carnatic_Instrumental/Sheik_Chinna_Moulana_Sahib/07Dolayam%20-%20Kamas%20-%20Tisra%20Ekam%20-%20Annamacharya.wma

మల్లంపల్లి శ్యాంప్రసాద్ గారి బ్లాగులోంచి :
రాగం: ఖమాస్
తాళం: తిశ్ర జాతి ఆది తాళం
శ్రీ అన్నమాచార్య విరచిత డోలాయాం చల డోలాయాం హర డోలాయాం
....మిగతాది శ్యాంప్రసాద్ గారి బ్లాగులోనే చూడండి.
పైపాటల్ని మీకు డౌన్లోడ్ చేస్కునే ఓపిక/సమయం లేకపోతే ఇక్కడ వినండి.
గీతం లోంచి మీకు కావాల్సిన సంగీతాన్ని దింపుకోండి. ఉదాహరణకి - వాయులీనం డోలు జోడి కోసం ఇక్కడ నొక్కండి.

Jan 26, 2009
Jan 24, 2009
నా జీవితంలో దేవుడు
నాకు జీవితంలో ఎప్పుడూ అహా ఇది భగవంతుని లీల అని అనిపించే అద్భుతాలు ఏమీ జరగలేదు. నేను పెద్ద పూజలు పున:స్కారాలు చేసే మనిషిని కాదు. నేను ఇప్పటికీ గుడికి వెళ్లినా నాకి ఇది కావాలి అని కోరుకోను.
మా నాన్న గారు చాలా కాలం నాస్థికుడు. ఆయన జంధ్యం కూడా వేస్కునే వారు కాదు. మా అమ్మ మాత్రం సనాతన ధర్మాలని కాపాడుకుంటూ, మడికట్టుకోవటం, పూజా పున:స్కారాలు చెయ్యటం, ప్రతీ రోజూ మహానైవేద్యాలు పెట్టటం అవీ చేస్తుండేది. తర్వాత తర్వాత నేనూ నెమ్మదిగా నమ:స్కారం పెట్టుకోవటం ప్రారంభించా. 1996 లో మా నాన్న ఆలోచనా విధానంలో కొంచెం మార్పు రావటం మొదలైంది, అదేనాలోనూ మార్పుకి శ్రీకారం చుట్టింది. 1996 లో మా నాన్న వైతీశ్వరన్ కోయిల్ కి వెళ్లొచ్చారు, ఆ గుడిని చూడాగానే మా నాన్నకి ఆయన ధృక్పదంలో అలజడి కలిగి వెంటనే జంధ్యం ధరించి స్నానం గట్రా చేసి వెళ్లి వైతీశ్వరన్ దర్శనం చేస్కున్నారు. అప్పటినుంది కొన్ని కారణాల వల్ల కొన్ని సంఘటనల వల్లా మా నాన్నకీ నాకూ అలవాటైయింది దేవుడు భక్తి. ఆయన నెమ్మదిగా షిర్డీ సాయిబాబా వైపుకి మళ్లారు. చాలా సార్లు షిర్డీ కి కూడా వెళ్లొచారు.
1999 లో మా నాన్నకి గుండె పెరిగి ఆశ్పత్రికి వెళ్లాం. డాక్టరు పరీక్షలు చేసి, మీ బంధువులందర్నీ పిల్చుకోండి అని చెప్పాడు. మా నాన్న షిర్డీ సాయి నమ్ముకున్నారు, మా అమ్మ కనపడిన దేవుళ్లకీ మొక్కుకుంది. మానాన్న క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే శ్రీశైలం వస్తా అనుకున్నా. పదిరోజుల్లో మా నాన్న తేరుకుని ఇంటికి వచ్చేసారు. నేను నాన్న ఇంటికి చేరుకున్న రాత్రికి రాత్రే శ్రీశైలం వేళ్లి తలనీలాలు ఇచ్చేసి, శ్రీశైలనాధుని గర్భ గుడిలో ఆ యన పక్కనే కూర్చుని అభిషేకం చేస్కుని వచ్చా. నా మొట్టమొదటిసారి శ్రీశైల ప్రయాణం, ఆ శివలింగం పక్కనే కూర్చొని మొట్టమొదటి సారి తాకినప్పటి ఆ అనుభూతి, తృప్తి, ఆనందం, రోమాంచ మళ్లీ నాకె ఎన్ని సార్లు శ్రీశైలం వెళ్లినా కలగలా, మరెక్కడికి వెళ్లినా కలగలా.
తర్వాత్తర్వాత 2005 లో మా నాన్నగారు మమ్మల్నందర్నీ ఆశ్చర్యంగా శోకంలోకి నెట్టేసి ఆ శివంలో కలిసిపొయ్యారు.
నాకు అంతా శూన్యం అయిపోయింది. అప్పుడూ, మొట్టమొదట మానాన్నకి ఎంతో ఇష్టమైన పొందుగుల లో ఆయన అస్తికలు నిమజ్జనం చేసాం. కొందరు ప్రయాగలో చెయ్యండీ అని కొందరు కాశీలో చెయ్యండీ అని సలహాలు ఇచ్చారు. నేనాలోచించి, ప్రయాగ త్రివేణీ సంగమంలోనూ, కాసీలోనూ కలుపుతా అని బయలుదేరా. నాకు ట్రైన్లో ఒకతను పరిచయం అయ్యారు. చక్కటి భాష, స్థిరమైన దృష్టి, మాటా మాటా కలిసింది. అతనిది చీరాలే. ప్రయాగ లో ఇద్దరం కలిసే లాడ్జీ తీస్కున్నాం. అక్కడి అస్సిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్, ఆయన క్లాస్మేటే అట, ఫోన్ చేస్తే వెంటనే ఒక యస్.ఐ ని పంపించారు ఇతని దోస్తు. మమ్మల్ని త్రివేణీ సంగమం దెగ్గరకి సునాయాసంగా తీకెళ్లి అక్కడి మోసగాళ్ల చేతిలో పడకుండ అన్నీ కార్యక్రమాలు దెగ్గరఊంది చేయించి పంపించాడు ఆ పోలీసు ఆఫీసరు. వెంటనే కాశీకి వెళ్లాం ఇద్దరం. అక్కడకూడా కలిసే గది తీస్కున్నాం. అతను కార్యక్రమాలు చేకుని నిష్క్రమించారు. ఆయన అవాయా అనే కమ్మ్యూనికేషన్స్ కంపెనీకి వైస్ప్రెసిడేంటు. నేను మూడు రాత్రులు ఉందాం అని నిర్ణయించుకుని ఉండి, ఆ శంభూనాధుని దర్శనం చేస్కుని, కాసీలోని అన్నీ గుళ్లూ గోపురాలూ చూస్కొని, సంకట హనుమాన్ని కొల్చుకుని, రుదృడ్ని కూడా దర్శించుకుని బయల్దేరా. కానీ నాకు అంత తృప్తి అనిపించలా. శ్రీశైలం అంత ప్రశాంతంగా ఏదీలేదు అనిపించింది.
మా నాన్న నిష్క్రమణాశూన్యం నుండి నెమ్మదిగా నిలదొక్కుకుని, మళ్లీ నన్ను నేను జీవనశ్రవంతిలోకి తెచ్చుకుని, పొట్టచేతబట్టుకుని అమెరికాకి వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించి, ఇదిగో ఇలా ఉన్నా. ఈ ప్రయాణంలో మా నాన్న నావెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడనే భావన. మా అమ్మ, కొడుకు వృధిలోకి రావాలీ అనే సంకల్పం. మా ఆయన జీవితపు ఉఛస్థితికి వెళ్లాలి అనే నా భార్య సంకల్పం అన్నీ మిళితమై ఉన్నాయి.
మా పాప పుట్టుక మాత్రం నాకు కొంచెం దైవలీలేనా అనిపించింది. దేనికంటే
అక్టోబరు 6 ప్రసవం కావొచ్చని డాక్టర్లు ఇచ్చిన తారీఖు. సెప్టెంబరులో మన సహ బ్లాగరు, మాష్టారు దుర్గేశ్వర గారు ఓ రోజున ఛాట్లో కలిసి, మీరు ఇరవైఒక్క రోజులు రుద్రం చెయ్యండీ మంచిదీ అని చెప్పారు. విఘ్నం కలుగకుండా చేయ్యండీ అన్నారు. మరి ఇలా అక్టోబరు 6 న డెలివరీ కదా అన్నా. అప్పటికి ఇరవైఒక్క రోజులు కావు మాష్టారూ అన్నా. పర్లేదు, ఆ సమయం వచ్చినప్పుడు నాకు చెప్పండీ మీపేరు మీద నేను చేస్తా అన్నారు ఆయన. మొదలు పెట్టాను చెయ్యటం. ఈ లోపల సెప్టెంబరు 29, శరన్నవరాత్రులు మొదలయ్యాయి. నిండు నెలలతో సాయంత్రం 6 కల్లా వంటా వార్పూ సిద్ధం చేస్కుని, ప్రసాదం తయ్యారు చేస్కొని, పిల్లాడికి స్నానం గట్రా చేయించి, వాడికి ఏదోకటి తింటానికి మూట కట్టుకుని తయ్యరుగా ఉండేది శ్రీమతి, నేను పని నుండి వచ్చి స్నానం గట్రా చేస్కుని గుడికెళ్లే వాళ్లం. నవరాత్రులు మొత్తం ప్రతీరోజూ అమ్మవారి అలంకారం, మరియూ శ్రీ లలితా సహస్రనామ పారాయణార్చన జరుగుతాయ్ అని ముందే ప్రకటించారు గుడివాళ్లు.
ప్రతీ రోజు వేళ్లాం. తను కష్టపడి కూర్చొని మొత్తం పారాయణ చేసింది, తీర్ధ ప్రసాదాలు తీస్కుని కానీ ఇంటికి చేరుకునే వాళ్లంకాదు. ప్రతీరోజు జనాలు అడిగేవారు ఇంకా కాలేదా అని. తలా ఒకలా చెప్పేవారు ఇక ఈరోజు అవుతుందిలే, 3 న అవుతుంది అని నాకనిపిస్తుంది అని ఒకావిడ అంటె, 5 న అవుతుంది అని ఇంకొకళ్లు ఇలా. మొత్తానికి, రోజుల్లెక్క ప్రకారం నా రుద్ర పారాయణ అక్టోబరు 8 కి అయిపోయింది. అలానే దేవీ నవరాత్రులు తిధుల ప్రకారంకాకుండా రోజుల ప్రకారం, సెప్టెంబరు 29 నుండి తొమ్మిదిరోజులు కలిపితే అక్టోబరు 8 కి అయిపొయ్యాయి. అక్తోబరు 8 న కూడా గుడికి వెళ్లాము. అందరూ ఆశ్చర్య పోవటం ఇంకా కాలేదా అని. మొత్తానికి అక్టోబరు తొమ్మిదిన, అంటే విజయ దశమినాడు, శ్రవణా నక్షత్రం రోజున పాప పుట్టి మమ్మల్నందర్నీ ఆనందంలో ముంచేసింది.
ఇది ఆ అమ్మవారి లీలేనా? ఏమో అలా రాసిపెట్టి ఉందేమో....
శుభం

Jan 23, 2009
యోగి - నిష్క్రమణం
ఇవ్వాళ మన సహ బ్లాగరు, యోగి అ.క.అ అష్టావక్ర తన పెన్నులోని ఇంకు మొత్తాన్ని వొంపేస్కుంటున్నా అన్నాడు. అలా వోంపేస్తే పెన్ను రాయదుకదా అన్నా, పాళీ ఇరగ్గొట్టా అన్నాడు, ఇకరాయదుగా అన్నా, ఇకరాయాల్సిన అవసరం లేదు అన్నాడు, చివరాఖరి కాయితం కాక పోయినా ఉన్న రీము కాయతాల్ని మూటగట్టి అటక మీద పెట్టేసా అన్నాడు, ఇక పెన్నుతో పని లేదు అన్నాడు. నాకర్ధంగాలా!! దేనికీ అన్నా? నా బ్లాగుని మూసేస్తున్నా అన్నాడు. సరే ఇదే నీ చివ్వరాకరి నిర్ణయమా బ్లాగుమీన అన్నా. అవునూ అన్నాడు. ఇలా జెప్పాను:
సోదరా!!
హుం!! ఏమి చెప్పనూ? ఇదే నీ నిర్ణయం ఐతే ఇక నువ్వు పొడుగుచేతుల చొక్కాలు వేస్కోవాల్సిన అవసరం లేదు, దేనికంటే మేధావుల్ని ఎదిరించడానికి కండలపైకి ఇక చొక్కా మడుచుకోవాల్సిన పనిలేదు. కళ్లు బైర్లు కమ్మేలా మేధావులు రాసిన ఠావుల కొద్దీ కతల్ని చదవాల్సిన పనిలేదు. ఏమైనా, ఒక నిర్ణయం, ఒకే నిర్ణయం, ఒకే మాట, ఒకే బాట.
ఇక మేధావుల్లారా మీ మీ మేధావితనాన్ని కలుగుల్లోంచి బయటకి తీసి దులుపుకోండి. ఒక వెల్తురు బ్లాగ్లోకంనుండి నిష్క్రమిస్తున్నాడు. మీరిక ఆకాశం మీదకి ఉమ్మేస్స్కోవాల్సిన పనిలేదు, నక్కల్లా ఊళళు పెట్టాల్సిన పనీలేదు మరో ఖడ్గం వచ్చేదాకా. మీ కళ్లని ఇంక చల్లబర్చుకోండి, మగ్గు బీరుతో లేక ఓ చెత్త పోస్టుతో.
అదిగో పొద్దుపొడుస్తున్నాడు సూరీడు మరో కొత్త వెలుగుతో, మరో కొత్త ఖడ్గాన్ని తయ్యార్చేయ్యటంకోసం, మరో కొత్తవెలుగుని నింపడంకోసం
- మే యువర్ బ్లాగ్సోల్ రెస్ట్ ఇన్ పీస్

Jan 22, 2009
యోగా
ప్రపంచం మొత్తం భారత్ వైపుకి ఆశ్చర్యపోయి చూసే విషయాల్లో యోగా ఒకటి. మనం యోగ ప్రక్రియ ని ప్రపంచానికి అందజేసి మనం మర్చిపోయ్యాం.
నేను 1-7 దాకా పిడుగురాళ్ల తండా బళ్లో చదువుకున్నా. అంటె ప్రాధమిక పాటశాల అన్నమాట. మాకు యఱ్ఱంశెట్టి సీతారామయ్య అనే ఒక లెక్కల మాష్టారు గారు ఉండేవాళ్లు. ఆయన మాచేత ప్రతీరోజు క్రమం తప్పకుండా యోగా చేయించేవాళ్లు అంటే ఆసనాలు వేయించేవాళ్లు, అఫ్కోర్సు మనకి అత్యంత ఇష్టమైన ఆసనం శవాసనం. పొద్దున్నే 7-8. యోగా అయ్యాక గోధుమ ఉప్మా ఉండేది. కేవలం గోధుమల్ని ఉడకబెట్టి నాలుగు ఉల్లిపాయలేసి పెట్టేవాళ్లు. మేము ఇంట్లోంచి కారప్పొడి పొట్లంకట్టుకుని తీస్కెళ్లేవాళ్లం.
ఏమి రుచి!! ఏంటో!!! బాబా!! కస్సక్!!గతం గతహ్. నేనో పెద్ద బలవంతుణ్ణేంకాదు. అయితే బియ్యం బస్తా ని అవలీలగా ఎత్తెయ్యగలను. రోజుకి 40 కాగుల నీళ్లు తోడి తొట్టి నింపగల్ను. రెండు బక్కెట్ల జోడేస్కుని నీళ్లు తెచ్చిపెట్టగల్ను, లేక ఓ కాగు భుజంమ్మీదా, బక్కేట్టు చేత పట్టుకుని నీళ్లు మొయ్యగల్ను. పెద్ద బుంగేసి చేద లాగ్గల్ను. 20 ఇటుకలు ఇంపబ్బొచ్చెలో పెట్టుకుని నడవగల్ను. చెట్లన్నిటికీ పాదులు చెయ్యగల్ను. బహుసా నాకు ఈ పని తనం, నేర్పూ ఇవన్నీ ఆ యోగా కారణం వల్లనో లేక/మరియూ పల్లెవాసం వల్లనో వచ్చినవే. తర్వాత్తర్వాత డిగ్రీకొచ్చాక గుంటూర్లో, ప్రతీరోజూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి వెళ్లి నాలు రౌండ్లు జాగింగు చేసేవాణ్ణి. డిగ్రీ అయిపోయింది. అన్నీ అటకెక్కేసినయ్. MCA కాలేజికెళ్లటం, సిగరెట్లు అలవాటు కావటం, ఉద్యోగం పోవటం, రావటం, బెంచులు, కుర్చీలు మనిషిని కుదేల్జేసినయ్. కానీ నేనెప్పుడూ నామీన నమ్మకాన్ని కోల్పోలేదు. మద్రాసులో ఉన్నప్పుడు నాకు ఈట్(IT) జనాలకి మాత్రమే వచ్చే కొన్ని అరుదైన కండరాల నొప్పి వచ్చింది. ఆర్థ్రోపాలజీ డాట్టర్ కాడికెళ్లా. రమేష్ ఆయన పేరు, దేవకీ ఆసుపత్రి ఆయన ప్రాక్టీసు. వెళ్లంగనే, ఏటి అన్నాడు, ఇలా భుజం నొప్పి, మెడ పట్టేసింది అన్నా. స్పాజ్మ్యాటిక్ పెయిన్ అన్నాడు. సరే అన్నా. ఏమైనా ఆటలు ఆడతావా అన్నాడు లేదు అని ఇకిలించా. సిగ్గుపడాలయ్యా నవ్వుతావేంటి. ఎంత క్లైంటు స్పెసిఫిక్ ఐనా, ఓ గంట నీకోసం లాగి, ఆటలు ఆడు అన్నాడు. నేనొ బొంగులే అని లైట్గా తీస్కున్నా ముందు. అది తగ్గలా, పైగా పెరిగింది. ఆయుర్వేద మస్సాజ్ కి వెళ్లా. కొంచెంపర్లేదు. ఆ డాట్టర్ కూడ బాసు నువ్వు ఆటలు ఆడక పోతే ఇక అంతే అన్నాడు. ఇక లాబం నేదు బగమంతుడా అని లజ్ కార్నర్ లో ఓ టెన్నీస్ క్లబ్బులోజేరా. దానెంకమ్మ, వారంలో నొప్పి మటుమాయం. తర్వాత సూరిగాడు పుట్టటం, మా నాన్న పరమపదించటం, ఈలోపునే అమెరికా కి మన ఇది(విధి) నెట్టటం చకచకా జరిగిపోయినై. ఇక ఇక్కడ సంసారం ఎట్టినాక, ఆపీస్కి పోవుడు వచ్చుడు, పోవుడు వచ్చుడు. పొట్టాడాట్కాం పెరిగిపోయింది. ఇక లాబంనేదు అని రాందేవ్ మహరాజ్ ది ఒక డీవీడీ కొన్నా, ప్రాణాయామం చెయ్యటం మొదలెట్ట. మళ్లీ అటకెక్కేయించా. ఇక అప్పుడూ ఒకానొన రోజున, GOLDSGYM లో చేరా, ఓ మూడు నెల్లు ఇరగొట్టా. అప్పుడు కడుపులో మంట అని కొన్ని రోజులు, మెడనొప్పి అని కొన్ని రోజులు, కాళ్లు నొప్పులు అని, చలి అని, కార్ తుమ్మిందని ఇలా జిమ్ము వైపు ఎళ్లటం మానేసా. ఆటుపిమ్మటి మన ఇంటి ముఖ్యమంత్రి గారు, ఇక లాభమ్లేదు, నువ్వు జిమ్మైనా మానెయ్యి లేక వెళ్లనన్నా వెళ్లు, అనవసరంగా వానికి డబ్బులు కట్టుట ఏలా అని హుకుం జారీ చేసారు కనుకా, మన జిమ్మీకెళ్లే సరుకూ సరంజమా బూజు దులిపి ఓ 2-3 నెలలు మళ్లీ ఇరగొట్టా. ఇంతలో వచ్చారు యువరాణి వారు. మళ్లీ పులుస్టాపు పెట్టాము. ఇక మళ్లీ మొదలు పెడదాము అని నిర్ణయించి, ముందుగా ఠాడా, డంచిక డంచిక యోగా యోగా యొ యొ యొ యోగా యోగా చేద్దాం ఇంటికాడా అని "సూర్య నమ:స్కారాలు" అని కొట్టాను నువ్వుగొట్టంలో, అంటే యూట్యూబులో.
ఈ వీడియో దొరికింది. అందరి సంతోషమే మన సంతోషం, మీకూ యుప్యయోగ్య పడ్యుతుంద్యేమో అని ఇక్యడ పెడ్యుతున్యా.

Jan 21, 2009
So Called యూత్
వయస్సులో ఓ అబ్బాయి ఓ అమ్మాయిని కోరుకోవటం, అమ్మాయి అబ్బాయి సాంగత్యం కావాలనుకోవటం, సృష్టి సహజం. అలా వయసు వేడిలో, వాళ్లు కలవటం, కూడ ఏదో పెద్ద విషయం ఏమాత్రమూ కాదు. మన దేశంలో పైకి ఇది మహాపాపం ఐనా పల్లెల దెగ్గర్నుండి మహా నగరాల్దాకా, గడ్డివాముల చాటునుండి, లాల్బాఘ్ పార్కుల్లో చెట్ల చీకటిమాటుల్లో యుగ యుగాలుగా నడుస్తున్న తంతే.
మన తాత ముత్తాతల సమయంలో కూడ జరిగిందిలా. మన నాన్నల సమయంలో కూడ జరిగిందిల. కానీ ఇప్పుడు కొత్తగా నరుక్కోడాలు, యాసిడ్ పోస్కోటలు ఏంటో అర్ధం కావట్లా.
ఇది మరీ దారుణం, అమ్మాయిని ఆకర్షించాడు, ఆ అమ్మాయి వాని స్టైలుకి పడిపోయింది. వాడు ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు, శారీరకంగా అనుభవించాడు. సరే బానే ఉంది. తప్పో వొప్పో, తర్వాత, ఆ అమ్మాయిని అడవికి తీస్కెళ్లి మత్తు మందిచ్చి మాన భంగం చేసి, దాన్ని వీడియో తీసి, నెట్లో పెట్టి!! ఇదేందిది?
ఎవరి తప్పు కన్నా మన So called youth కి సిగ్గుగా లేదా ఇలా చెయ్యటానికి? నేనూ ఆ వయస్సులో, కాలేజి ఎగ్గొట్టి సిన్మాల్జూసా, మందు తాగా, సిగరెట్లు కాల్చా, ఐతే ఉన్మాదిని కాలా. దేనికి? నా కుటుంబ నేపధ్యం అయుండొచ్చు లేక సమాజం అంటే భయం అయుండొచ్చు లేక నా పరిధులు నాకు తెలియటమూ అయుండొచ్చు ఏమైనా, నేనుజేసేది తప్పా ఒప్పా అని నాకు తెల్సు. ఆ వయసులో చాలా తప్పులు తెలిసి చేసేవే, దేనికంటే అది తప్పు చెయ్యకూ అంటారు పెద్దలు కాబట్టి. అది వయసు ఇచ్చే అహం. వద్దు అన్నది చేసి తీరాలి అనే ఓ అసహనం. ఐతే అదే కుఱ్ఱాణ్ణి మింగేస్తే - ఉన్మాదం అవుతుంది. చివరికి ఎంకౌంటర్ కి దారితీస్తుంది.
ఐతే, ఏఏ కారణాలు ఓ కుర్రాణ్ణి ఉన్మాదిని చెస్తాయి? నా దృష్టిలో
1. తల్లి తండ్రుల పెంపకం
2. తల్లి తండ్రుల అతి గారాబం
3. తల్లి తండ్రుల లంచగొండితనం
4. కుర్రాడి సామాజిక ఆర్ధిక పరీస్తితులు
ఫ్లర్టింగులు, పబ్బులు, చిత్తకార్తె కుక్కలు ఇవన్నీ పెద్ద తరగతులకి మెడళ్లు. కానీ, దిగువతరగతుల నుండి ఇప్పుడిప్పుడే ఎగువతరగతులకి నెట్టబడుతున్న జనాలకి ఇవన్నీ కొత్తగా కనిపించి, ఉన్మాదుల్లా తయ్యరు చేస్తున్నాయి.
దేనికంటె, నేను ఆ అమ్మాయి నాకు పడుతుంది అని 25000 ఖర్చుబెట్టా. పళ్లేదు, నా డబ్బు నాకిచ్చేయ్ అని అడిగా ఇవ్వలేదు, యాసిడ్ పోసా. ఎంతవరకూ ప్రాక్టికల్ గా ఉంది ఇది? అస్సలు వాడికి 25000 ఎక్కడవి? వాడి తల్లితండ్రులకు తెలియకుండా ఎలా వచ్చినై? సరే స్నేహితులు దెగ్గర నుండి లాక్కున్నాడు, వాళ్ల తల్లి తండ్రులకు అనుమానం రాదా? చివరికి ఏమయ్యాడు, చచ్చి శవం అయ్యాడు, కనీసం శవ యాత్రకి చిల్లరేసారా? అదీలేదు, రాళ్లు చెప్పులు ఏసారు.
5. సినిమాల ప్రభావం
తేజా లాంటి దర్శకుల్ని కాలాపాని లాంటి జైల్లో పెట్టాలి.
6. అతి సమాచారం. యూత్ నెట్ కి వెళ్లి గూగుల్లో జాబులు వెత్తుకుంటున్నారంటె మా సూరిగాడు కూడా నమ్మడు.
7. మొబైల్ ఫోనులు. MMSలు. (ఇవి అవసరమా?)
ఒకడు బస్సులో పోతూ, ఓ సీటు దెగ్గర నుంచొని, కూర్చున్న అమ్మాయిని ఎదని, గాలికి రెపరెపలాడుతున్న పైటలోంచి ఫోనుద్వారా వీడియో తీసి నెట్లో పెట్టాడు. వాని స్నేహితులు వానికి మందుపార్టి ఇచ్చారు వాడేదో నోబెల్ ప్రైజు కొట్టినట్టు.
8. Weak Law and Enforcement.
9. దేశకాలమాన పరీస్థితులు
10.స్నేహితులు
11.కళాశాలలో పరీస్థితులు
12.నేర ప్రవృత్తి
13.మానసిక వొత్తిళ్లు
14.పీర్ ప్రెషర్స్
ఎన్నొ కారణాలు ....
పరిష్కారం: తల్లితండ్రులు పిల్లల్ల్తో స్నేహితుల్లా మెలిగి, వాళ్లని సరైన మార్గంలో పెట్టగలగాలి. అంతేకాని, యాసిడ్ పోస్తే, "కన్నా, నువ్వు కాబట్టి చెయ్యగలిగావ్, మన ఎమ్మెల్యే కి జెప్పి నిన్ను కేసు నుండి బయటకేపిస్తా" అనే తత్వం అగ్గికి ఆజ్యంపోసినట్టవుతుంది. ఇదొక సామాజిక బాధ్యత.
ఇలాంటి సంఘటనలు జరిగినాక, మీలో ఎంతమంది India కి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు?

Jan 19, 2009
గసి - నా నూరో పోస్టు
బ్లాగ్ ప్రయాణంలో ఓ మైలు రాయి. ఇదినా నూరో పోస్టు. బ్లాగు రాస్తున్నా అంటె, ఇంట్లో ఇల్లాలి సహకారమ్లేకుండ ఎలా కుదురుతుంది? కాబట్టి ముందుగా నా ఇల్లాలికి నా కృతజ్ఞతలు. సూరిగాడికి చాక్లేట్లు, పిల్లకి కొత్త డ్రస్సులు. నా బ్లాగు చదివి, వ్యాఖ్యలతో నన్ను ఉత్సాహపరుస్తున్న అందరికీ నా నమస్కారాలు.
ఈ మద్దెన మా ఆవిడ సూరిగాడికి గసి పెడుతుంటే మావాడు అదేదో పచ్చడి అని లాగిస్తున్నాడు. ముచ్చటేసింది వాడు గసి తింటుంటే.
నాకు గసి అంటే మహా ఇష్టం. మీకు తెలుసా గసి అంటే? వెన్నని కాసి నెయ్యి చేసినప్పుడు, ఆ గిన్నెలో అడుగున మిగిలేదే గసి. వెంటనే నాకు మా ఊరు, ఆ ఊరు, ఆ గేదెలు, ఆకుపచ్చని చేలు, ఆ పేడ, ఆ పాలు... .. . గుర్తుకొచ్చినై.
మేము మోర్జంపాడులో ఉండే కాలంలో, పాలు అనే పదార్ధానికి నిజమైన అర్ధం తెలిసింది నాకు. అంతరుచి, అంత చిక్కటి పాలు ఎక్కాడాజూళ్లా నేను. మా అమ్మ పాలు కాసి తోడేసి, పెరుగు వేస్కునేప్పుడు, ఆ గడ్డ పెరుగు పైన మీగడని తీసేసి దాచేది. అలా ఓ వారం మొత్తం సేకరించిన మీగడని ఓ గిన్నెలో పోసి ఇక కవ్వంతో చిలికేది. ఠాడా!! వెన్న, అంత ములాయం, మహారుచికరమైన వెన్న, ఎక్కడ దొరుకుతుంది? అలా చిలికేప్పుడు, కొంచెం పెట్టమ్మా అంటే, చూపుడువేలుతో కొంచెంతీసి, చేతిని బోర్లిస్తే మణికట్టుపై కొంత రాసేది. అలా దేనికి, అరచేతిలోనే రాయొచ్చుకదా? ఇప్పటికీ అది ప్రశ్నే నాకు. తర్వాత్తర్వత, సుమీత్ మిక్సీ వచ్చింది. దాంట్లో వెయ్యటం మొదలైంది. దేనికో సరిగ్గా వచ్చేది కాదు దాంట్లో. ఇక, పెద్ద బూష్టు సీసాలో మీగడేసి మూతపెట్టి ఊపీ ఊపీ తీసేది కొన్ని రోజులు వెన్నని. మొత్తానికి ఎప్పుడు వెన్న తీసినా, రెండుచేతులు పట్టేంత పెద్ద బంతిలా వచ్చేది వెన్న. ఇక దాన్ని కరగబెట్టి ఓ డబ్బాలో పోసాక గసి... నాకు మాడిన అన్నం చెక్కమీద గసి పూసుకుని లాగించటం అంటే మహా సరదా. వేడి వేడి అన్నంలో గసి, కొత్త పండుమిరపకాయల కారం ఏసుకుతింటే!!! వేడి వేడి అన్నంలో పండుమిరపకాయల కారం,వెన్న!!!! మా అమ్మ ఈ ఇంట్లో చేస్కున్న నెయ్యితో మైసూర్పాక్ చేసేది. ఏమి టేష్టు అది. అఫ్కోర్స్ ఒక్కోసారి మైసూర్పాక్ చెయ్యబోతే అది మైసూర్ రాక్ ఐన సందర్భాలు కూడా ఉన్నాయిఅనుకోండి.
అలానే, వారానికోసారి జొన్న రొట్టెలు చెసేది మా అమ్మ. వేడి వేడి జొన్న రొట్టెలు, ఉల్లిపాయకారం, వెన్న. అదీ కాంబినేషన్ అంటే. అలానే, గోంగూర పప్పు, వేడి వేడి అన్నం, వెన్న.
మరి వెన్న తీసాక మిగిలిన మజ్జిగతో ఏంజేస్తారు అని ఎవరైనా అడిగితే, కిస్సుక్కున నవ్వి, "మజ్జిగపులుసు" పెట్టుకుంటారు అంజెప్పాలి :)
ఇవన్నీ మన ముందరి తరాలకి లేవు. వాళ్లకి కనీసం చెప్పినా అర్ధం కావు. అమెరికాలో ఆ పాసిబిలిటీ ఉందేమో, ఓ 10ఎకరాలు కొనుక్కుని ఓ చేలో ఇల్లు కట్టేస్కోవచ్చు. నాఉద్దేశం ఆ జాగా ఇక్కడ ఉంది అని. మనకి భూమి తగ్గిపోతోంది. రియల్ భూతం అంతా మింగేస్తోంది. పల్లెల్లో పాడి తగ్గిపోతున్నదని కూడా విన్నా. ఇవ్వాళ్టి రోజున ఎద్దులు కనుమరుగౌతున్నాయి. వ్యవసాయం మొత్తం ట్రాక్టర్లతోనే జరిగిపోతోంది.
January 19th, Monday, Martin Luther King Jr. Day

Jan 16, 2009
సూరిగాడికి నేన్జెప్పే కతలు - 1
ఈ మద్దెన, మా ఆవిడ సూరిగాడిని నిద్రబుచ్చే బాధ్యతని మళ్లీ స్వీకరించింది. ఆ బాధ్యతని నేను నిర్వహించేప్పట్లో మావాడు ఓ వారం ఓ కధ చెప్పమని అడిగితే ఇంకోవారం ఇంకోటి.
అట్టాంటి వాటిల్లో ఆదికి బాగా నచ్చిన కధ ఇది.
దీనిపేరు "ఓ సొరచేప కధ"
అనగానా ఓ పేద్ద సముద్రం ఒడ్డున ఓ చిన్న ఊరుండేది. ఆ ఊరికి దెగ్గర్లో, ఆ సముద్రంలో ఓ పెద్ద సొరచేప, Its a Big Black Shark with shiny white teeth. అది డేంజెరస్ షార్క్. ఓ రోజు అప్పారావు సుబ్బారావు ఓ చిన్న పడవమీద సముద్రంలో వెళ్తుంటే షార్క్ చూసింది. ఝుం.... ఝుం.... ఝుం.... అని మర పడవ వెళ్తూంటే, ఝున్.... ఝున్.... ఝున్.... అని ఆ షార్క్ పడవ వైపు వస్తోంది. ఝుం...ఝుం...ఝుం... పడవ ఝున్...ఝున్...ఝున్...షార్కు. ఝుం..ఝుం..ఝుం..పడవ, ఝున్..ఝున్..ఝున్..షార్కు. ఝున్.ఝున్.ఝున్.పడవ, ఝున్.ఝున్.ఝున్.షార్కు. ఝుంఝుంఝుం పడవ, షార్కు పడవని ఠకా మని కొట్టేసింది. పపం అప్పారావు సుబ్బారావి నీళ్లల్లో చెల్లాచెదురుగా పడిపొయ్యారు. దీన్ని ఒడ్దునుండి ఓ పోలీసు చూసాడు. ఫేద్ద పోలీసు, చలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఆ పోలీసు. వెంటానే ఊళ్లో వాళ్లందరకీ చెప్పాడు వెళ్లి. షార్కు ఉంది నీళ్లల్లో అటు వెళ్లకండి అని. అది ఎండా కాలం, అందరూ నీళ్లల్లో ఆడుకోటానికి ఇష్టంగా ఉంటే పోలీసు ఇలా చెప్పేసరికి ఎవ్వరు ఆయన్ని నమ్మలా. పైగా అందరూ అతన్ని అరిచారు. ఏమీ పనిలేదా నీకు, మేమూ హాయిగా నీళ్లల్లో ఆడుకుంటుంటె షార్కు అది ఇదీ అని మమ్మల్ని భయపెడతావు అని. అప్పుడు పాపం పోలీసు, ఐతే ఐంది, వీళ్లెవ్వరూ నమ్మక పోయిన నేను వీళ్లందర్నీ రక్షించి తీరతాను అని, ఒడ్డేమ్మటి ఓ పెద్ద వాచ్టవర్ కట్టుకుని, ఓ పెద్ద గంట పెట్టుకుని, స్పాట్ స్కోప్ తీస్కుని గన్ రెడీగా పెట్టుకుని షార్క్ వస్తుందే అని చూస్తున్నాడు. ఇంతలో ఓ నల్లని ఆకారం ఒడ్డువైపుకి వస్తోంది. పోలీస్ వెంటనే గంటకొట్టి అదిగో షార్క్ వస్తోంది, వచ్చేస్తోంది అని అరిచుకుంటు నీళ్లదెగ్గరకి వెళ్లి అందర్నీ బయటకి రప్పించి చూడబోతే అది షార్క్ కాదు. ఎదో పెద్ద చేప. అందరు జనాలు పాపం పోలీసిని అరిచారు. ఛీ ఛీ అన్నారు. పోలీసు సిగ్గుతో ఇంతికి వేళుండే సరికి మిస్సెస్స్ పోలీసు పరిగెత్తుతూ అతనికి ఎదురొచ్చింది. ఏంటి అని అడిగాడు పోలీసు, మన పిల్లలు, వాళ్ల స్నేహితులతో సముద్రంలోకి వెళ్లారు, నువ్వేమో షార్కు అది ఇదీ అంటున్నావు. ఇప్పుడేలా అని ఏడవటం మొదలెట్టింది. పోలీసు వెంటనే ఓ పెద్ద బోటేస్కుని సముద్రంలోకి వెళ్లాడు. ఇంతలో ఆ పిల్లలు అందరూ అక్కడి ఓ చిన్న ఐలాండ్ వైపు వెళ్తుంటే షార్క్ చూసింది. ఝుం.... ఝుం.... ఝుం.... అని మర పడవలు వెళ్తూంటే, ఝున్.... ఝున్.... ఝున్.... అని ఆ షార్క్ వాళ్ల వైపు వస్తోంది. ఝుం...ఝుం...ఝుం... పడవలు ఝున్...ఝున్...ఝున్...షార్కు. ఝుం..ఝుం..ఝుం..పడవలు, ఝున్..ఝున్..ఝున్..షార్కు. ఝున్.ఝున్.ఝున్.పడవలు, ఝున్.ఝున్.ఝున్.షార్కు. ఝుంఝుంఝుం పడవలు, షార్కు పడవని ఠకా మని కొట్టేసింది ఆ పడవల్ని. పిల్లలందరూ నీళ్లల్లో పడిపొయ్యారు. అంతలో ఒక పిల్లాడు ఆ ఐలాండ్ కి చేరుకుని ఆ పోలీస్కి రేడియోలో "పోలీస్ అంకుల్!! పోలీస్ అంకుల్, మీపిల్లలు, మేమూ అందరం ఇక్కడ ఐలాండ్ దెగ్గర ఉన్నాం, మమ్మల్ని షార్కు తంతున్నదీ, రండి, హెల్ప్ హెల్ప్" అని చెప్పేసరికి పోలీస్ వెంటనే వచ్చి ఆ షార్క్ తో, హేయ్, ఎవ్వడ్రా నువ్వు, నిన్ను ఇట్టా పెట్టి గుద్దుతా అనేసరికి పాపం ఆ షార్కు భయపడి పోలీస్ బాబాయ్ నన్నేమీ చేయొద్దు మాది ఈ ఊరుకాదు, నెను మారు వెళ్లిపోతా, మా ఊళ్లో చేపలమ్మునుని బతుకుతా, నన్ను వదిలేయ్, ప్లీజ్ అంది. పోలీస్ సరే వెళ్లిపో, ఇక మా ఊళ్లో మళ్లీ ఎప్పుడైనా కనబడితే తంతా అన్నాడు. అది వెళ్లిపోయింది. అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి చేరుకున్నారు.
అదీ కధ.
ఎక్కడో విన్నట్టు ఉందా?
దీన్నే జాస్ - JAWS సినిమాలా తీసారు!!! :):):)
ఇంకోసారి ఇంకో కత చెప్తా. అప్పటిదాకా "నిద్దుర పోరా సూరిగా"

Jan 15, 2009
ఎమ్బీయస్ ప్రసాద్ గారి పోస్టులు
నేను గ్రేటాంధ్రాలో ఎమ్బీయస్ ప్రసాద్ గారి పోస్టులు ఒక్కటికూడా విడిచిపెట్టకుండా చదువుతుంటా. నాకు ఆయన్న రచనా శైలి, రచనలోని లోతు, ఆయన ఛణుకులు బాగా నచ్చుతాయి. ఇవ్వాల్టి గ్రేటాంధ్రాలో ఆయనవి మూడు పోస్టులు : ఒకటి - సత్యం గొడవ వల్ల యై.యస్ కు లాభమా నష్టమా? , రెండు - జంధ్యాల పేరు మీద హాస్యం, మూడు - సత్యంను కేంద్రం ఆదుకోవాలా? వద్దా? మీరు చదివి ఆనందించండి.
Jan 14, 2009
జంధ్యాల
నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం
జనవరి 14 - జంధ్యాల పుట్టినరోజు.
నాకు నచ్చిన జంధ్యాల గారి సినిమాలు -
ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట,రెండుజెళ్ళ సీత, మూడు ముళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనంద భైరవి,రావు - గోపాలరావు
పుత్తడి బొమ్మ, బాబాయ్ అబ్బాయ్, శ్రీవారి శోభనం నరేష్, మొగుడు పెళ్ళాలు, రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయి,పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్ళంట, చిన్ని కృష్ణుడు,వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ, హై హై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, బావా బావా పన్నీరు, ష్ గప్‌చుప్
ఆయన మాటాల రచయితగా నాకు నచ్చిన సినిమాలు -
సిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, సీతాకోకచిలుక, సాగర సంగమం, విజేత, స్వయంకృషి, అంతిమ తీర్పు, స్వాతి కిరణం, - ఈ సినిమాల్లోని డయలాగులు ఎంత లోతుగా షార్ప్గా ఉంటయో.
ఈ సినిమాలాన్నీ గిర్రున తిరుగుతున్నాయి నా మనసులో.
ఈరోజు ఓ సప్తపదో లేక ఓ శుభోదయమో డీవీడీ వేస్కుని ఆయనకి జేజేలు పలకాలి.
పుత్తడి బొమ్మ DVD ఎక్కడైన దొరికితే చెప్పండి కొనుక్కుంటా.
ఆయన సినిమాల్లోంచి , ఆయన మాటలు రాసిన సినిమాల్లోంచి నాకు నచ్చిన డైలాగుల్ని ఓ టపా సిరీస్లా రాద్దాం అనుకుంటున్నా తొందర్లో.

Jan 13, 2009
ఇంటింటా సంక్రాంతి
అమెరికాలో జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ.
భోగి మంటలు,రంగవల్లులు,రధం ముగ్గులు,గొబ్బిళ్ల పాటలు, మంగళ స్నానాలు,మామిడాకు తోరణాలు,గంగిరెద్దు మేళాలు,
హరిదాసు కీర్తనలు,నిండు ధాన్యం తో గాదెలు, నోరేరె గారెలు, డబ్బాల్నిండా నేతి అరిసెలు, కోడి పందాలు పోయిన రాజ్యాలు
-ఈసంక్రాంతి మీ ఇంట నవ్వుల సంక్రాంతి కావాలని ఆశిస్తూ
మీ అందరకీ మా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట సంక్రాంతిలక్ష్మి "ధన లక్ష్మి" గా అవతరించాలని కోరుకుంటూ,
భాస్కర్, హరి, సూర్య, అనఘ

Jan 12, 2009
వైనాట
మీకు వైనాట అంటే తెల్సా?
ఈ మధ్య మా సూరిగాడు వైనాట ఆడదాం అని గోల. ఏందిరా అంటే, సోఫా దెగ్గర మనం నుంచోనుంటే, వాడు సోఫా మీదకి ఎక్కి, చెయ్యిని వైన్ లా పట్టుకుని దూకుతాడు. నాకు ముందు వైన్ అంటే అర్ధంకాలా. మరి మనం తెలుగు మీడియం కదా. అంత క్నాలడ్జీ లేదు. ఇంతకీ వైన్ అంటే "ఊడ" అని అర్ధంట. ఠకా మని తెర్చుకున్నాయి నాకు కళ్లు. సరే అని అలా సోఫా దెగ్గర నుంచుంటే వీడు, ఆహా ఓహో అని కేరింతలు కొడుతూ చెయ్యిపట్టుకుని దూకుతూ ఊగిపోయ్యాడు.
కోతికొమ్మచ్చి ఆట గుర్తొచ్చింది నాకు. ఏమిజేస్తాం, అమెరికాలో బతుకు వైనాటకమూ అని. ఐనా ఇండియాలో మటుకు చెట్లెక్కడ ఉన్నాయి ఆడటానికి, ముఖ్యంగా మఱ్ఱిచెట్లు ఆ చెట్టు ఊడలు. మనోళ్లు కరెంటు తీగలకి చెట్లు తగులుతున్నాయ్ అని చెట్లు కొట్టేయటం ఎన్నోసార్లు చూసా.
హా!! మనల్ని మనం మర్చిపోయి భ్రమలో బతకడమే అభివృద్ధి.

Jan 11, 2009
Jan 10, 2009
బిల్బోర్డ్స్
పోస్టెరస్ ని అలా గెలికుతుంటే ఈ బిల్బోర్డ్స్ లింకు తగిలింది.ఆస్వాదించండి మీరుకూడా.
నాకు నచ్చినవి ఇవి -
నాకు నచ్చినవి ఇవి -
Jan 9, 2009
సరదాగా నవ్వుకోటానికి
గచ్చు గిచ్చు బావి గట్టుమీద ఆడుకుంతున్నారు, ఇంతలో గచ్చు బావిలోపడ్డాడు. ఇక మిగిలింది ఎవరూ?
గిచ్చు. తర్వాతేంజరుగుతుందో మీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.:)
ఓ కాకొచ్చి కాకినాడ అనే బోర్డుమీద వాలింది. ఆ కాకి కా మీద,కి మీద, డ మీద రెట్టేసింది. ఇంకదేనిమీద వేస్తుంది.
ఇట్టాంటివి మీకింకేమైనా తెలిస్తే చెప్పండేం!!

Jan 8, 2009
ఆకాశం - సెగెట్రి
"సెగెట్రి నేంజెప్పిన పనేంజేసావ్?"
"అయ్యిందయ్యా! ఆ పక్కోడి బ్లాగుమీద, ఆడిమీద బుఱద జల్లా!! ఇంకోడిమీద జల్లమన్నారుగా, అవకాశాం కోసం జూస్తన్నా"
"సర్లేవో ఎదవనూసెన్సు!! పొద్దస్తమానం బురదజల్లుడేనా!! మడిసన్నాక కూసింత కళాపోశనుండాల!! తిని తొంగుంటె మడిసికి గొడ్డుకీ తేడా ఏటుంటది"
అంబా!! అంబా!!!
"ఏటి సెగెట్రి!! ఏటా అరుపులు!!!"
"మన కొట్టంకాడి గొడ్లు అరుస్తున్నాయయ్యా" (మనసులో!! సచ్చినాడా మాకు నీకు పోలికేట్రా అని అనుకుంటున్నాయ్)
"సర్లేవో!! సూడూ!! సూరీడు ఎర్రగా లేడూ? ఆకాశంలో మర్డరు జరిగినట్టులేదూ? ఆ పెత్తెచ్చనారాయణుడి సేవ జేస్కోనీ కూసింత సేపు"
"లేదయ్యా!! నాకు మామూలుగానే కనిపిత్తన్నాడూ"
"సెగెట్రీ, సినెమా కతల్జెప్పకు బురదజల్లించెయ్గల్ను!! సరిగ్గ జూసి చెప్పు"
"అవునయ్యా!! మీరు కిళ్ళీ తిని ఆకాశంమ్మీదకి ఉమ్మేశారు, అది మీ (నీ) మొహం మీద పడి పెపంచం ఎర్రగ కనిపిస్తుందయ్యా"
"హా$%!$%@$%^%"
నా పాడ్కాస్ట్ లో ఇప్పుడు ఇది లభ్యం. ఇక్కడ నొక్కండి వినాలనుకుంటే.

Jan 7, 2009
నాన్న జ్ఞాపకాలు - రావిశాస్త్రి - 1
మా నాన్న గారు రిటైరు అయ్యాక సాహిత్యాభిలాషని పెంచుకున్నారు. ఆయన దగ్గర పెద్ద లైబ్రరియే ఉంది. ఆయన చదివిన పుస్తకాలలో మంచి పేరాలని, మంచి చురకల్ని నోటు చేస్కోవటం ఆయనకి అలవాటు. ఈమధ్యకాలంలో నేను ఆ లైబ్రరి లోంచి కొన్ని
పుస్తకాల్ని చదవటం మొదలుపెట్టాను. ముందుగా రాచకొండ విస్వనాధ శాస్తి (రావిశాస్త్రి) గారి "మూడు నవలలు, మూడు కధల బంగారం, సొమ్మలు పోనాయండి, ఇల్లు" చదవటం తో మొదలుపెట్టాను.
మా నాన్నగారు సేకరించుకున్న కొన్ని చురకల్ని ఇక్కడ పెడుతున్నాను.
మబ్బేసినప్పుడు ఆకాశం మెరుస్తది. కాని, ఏ రొండు మెరుపులూ ఒక్కలా ఉండవు. యీరులూ సోరులూ కూడా అంతే. ఒకుళ్ళా ఉంకోడు ఉండడు. మాత్మాగాంది యీరుడే, (కొందరికి.) అల్లూరి సీఅతావరాజూయీరుడే, (ఇంకొందరికి.) అడో రకం యీరుడు. ఈడోరకం యీరుడు. సోరుల్లో కూడా అంతే. సోరుల్లో యెవడి మోడసు ఆడిది. మోడసు అంటే నేరంజేసే పద్దతన్నమాట. గవర్రాజుగాడు పగిలీ బస్సుల్లోనే పరుసులు కొట్టేస్తాడు. అది ఆడి మోడసు. రాందాసుగాడు ఎయ్యింటికైనా రాత్రుళ్ళే సూరికి బొక్కెట్టి కిందకి దిగి సోరీ సేస్తడు. సూరమ్మ సిన్మాఆల్లకాడ స్నాచిగే చేస్ది. ఆండాలమ్మ లండనెల్లినా ముండలకంపెనీయే ఎడద్ది,
పోలీసోణ్నే ఉంచుకుంటది. ఉప్మాకరావుగాడు ఉజ్జోగాలు ఇప్పిస్తాననే డబ్బులు దండుతాడు. పానకాల్రావుగాడు పోర్జరీ సెక్కులే పాసింగు సేయిస్తాడు. ఒకుడుకి ఇత్తడి బిందెలంటేనే మోజు. ఇంకోడికి స్టీలు కారేజీలంటేనే మోజు. మరోడు సిలుక్కోకలంటేనే సెవి
కోసుకుంటాడు. కొంతమంది కత్తి సూపిచ్చి నీ పెన్ను పరుసూ రిస్టోసీ లాక్కుంటారుగానీ నీ వొంటి మీద సేయి ఎయ్యరు.
********
నరులారా, జనులారా, ఇంటరగిసన్ కి పోలిసోడి సేతికి మీరు సిక్కిపోయ్యిన్నాడు మీకు పెసినెంటపిండియ లేడు, పెతానమంతిర్లేడు,
ఎమ్మెల్లేనెంబర్లేడు, జిల్లకలకటేర్లేడు, ఇరుగోళ్ళేడు పొరుగోళ్ళేడు, సుట్టం లేడు స్నేయితుడులేడు, ఒవుడూ మీ సాయానికి లేడు. దేవుడుకూడా లేడు. ఆడు గుళ్ళో ఉండొచ్చు, మసీదులంట ఉండోచ్చు, పాదరీ గుళ్ళంట ఉండొచ్చు. ఎన్నెన్నో సోట్ల దేవుళ్ళాడొచ్చు. అంతేగాని జెనాన్ని పోలీసోడు సితగ్గొట్టి సిత్తరయింసలెట్టి సావబాది సెవులుమూసిన్నాడు దేవుళ్ళేడు. ఉన్నా, పొలిమేరకి ఆడురాడు, ఆ దరిదాపులకి ఆడుజేరడు!
********
జెయిల్ల సత్తరకాయగాడని ఒకడు ఉండీవోడు. ఆడు నా కంటె రొండు మూడేళ్ళు పెద్ద. నేను సిన్మాల యీరోలాగ్గ ఉండె, ఆడు యీరో స్నెయింతుళ్లాగ్గ ఉండీవోడు, ఆడు, బంగారొరే,బంగారం జోలికి ఒప్పుడూ పోవొద్దొరే అనీవోడు. అలాగ్గె రేడోలు, సైకిళ్ళు, టేప్ రికాటర్లు, రిస్టోసీలు, అలాగ్గె అల్లంటి ఒస్తూలు, అన్నింటికి గురుతులు - మార్కులు ఉంటయ్యన్నాడు. ఆట్ని ఆటి ఓనర్లొచ్చి కోర్టుల పోలుస్తరన్నాడు. అంచేత మనం క్యాస్ కొట్టీడం అన్నింటికీ బెస్టు అన్నాడు. అంటే, మనజెనానికి జోబీలు కొడ్డం సాల మంచిదన్నాడు. "జోబీల ఎట్టుకున్న లోట్లకి ఏ ఒక్కడూకూడ లెంబర్లు లోట్ జేసుకోడు, ఎరికా!" అన్నాడు సత్తరకాయగోడు.
*******

Jan 6, 2009
గేంజేస్తున్నవ్?
ఏం సిన్నోడా, గేంజేస్తున్నవ్?
అన్నా!! మంచిగున్నవానే?? ఏంలే అన్నా? వంకర దీస్తున్న!!
గేందీ? వంకర? గెట్ల దీస్తున్నవ్?
చెయ్యి బెట్తి సాపు జేసిన
మరి?
వంకరబోలే
ఇంకేమ్జేసినవ్
కట్టెలమీన కాల్చి సుత్తిపెట్టి కొట్టిన,
వరెవా!! మరి పోయిందానే
పోలే, కత్తిబెట్టి కాల్చినా,
మంచిగజేసినవ్, పోయిందా?
పోలే, ఊచబెట్టి కట్టేసినా,
ఊచబెట్టి కట్టేస్తే పోయుంటది!!
లే అన్నా!! పోలే, తాడుకట్టి ఏళ్లాడేసినా,
గిప్పుడు సాపైఉండాల్నే?
లే!! పోలే, ఛీ దీన్తల్లి, ఏంజెయ్యాల్నో సంఝైతల్లే
దేని వంకర దీశ్తున్నవ్ బిడ్డా?
కుక్క తోక
......

నా.స్టా.నా.సె
ఇదేందిది అనుకుంటున్నారా?
నా.స్టా.నా.సె = నో స్టాప్ నో సెన్స్ - అమెరికన్ స్టైల్లో. నాన్ స్టాప్ నాన్ సెన్స్ బ్రిట్ స్టైల్లో.
నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు, మా ప్రధానోపాధ్యాయుడు మాకో కధ చెప్పారు. అది - మర్యాదరామన్న కధ (అనుకుంటా). ఓ సారి ఓ బడాయి బంటి మర్యాదరామన్న ఉండే రాజ్యానికి వచ్చి, అక్కడి జనాలకి ఓ సవాలు విసురుతాడు. అదేంటంటే "మీలో ఎవ్వరైనా నాకు విసుగు వచ్చేలా కధ చెప్పలేరు" అని. చెప్పగలిగితే ఏదో బహుమానం, చెప్పలేకపోతే ఓ సమచ్చరం దాసీలా పనిచెయ్యటం. చాలా మంది ప్రయత్నించి అతన్ని విసిగెత్తించలేక దాసీలైపోతే, ఇక మన రామన్న ముందుకొచ్చి అతనికో కధ చెప్పటం ప్రారంభిస్తాడు.
ఇదీ ఆ కధ
ఓ ఊళ్లో ఓ పెద్ద వ్యాపారికి ఓ పెద్ద గిడ్డంగి ఉండేది. అతను దాంట్లో అతని వ్యాపారనిమిత్తం ధాన్యపు బస్తాలని నిల్వజేస్కునేవాడు. ఆ గిడ్డంగి ఆవరణలో చాలా చెట్లు ఉండేవి. ఒకానొక చెట్టుపైన జిమ్మిరి అని ఓ పిచ్చుక ఉండేది. ఒకానొక రోజున అస్సలు ఈ పెద్ద గిడ్డంగి ఏంటి? దాంట్లో ఏమి ఉంది అనే కుతూహలంతో జిమ్మిరి గిడ్డంగి గవాక్షంలోంచి లోపలికి వెళ్లింది. అక్కడి బస్తాలనిజూసి, అయ్యబాబోయ్ ఎన్ని బస్తాలు ఇక్కడ అనుకుని అందుబాటులో ఉన్న బస్తా దెగ్గరకి వెళ్లి ముక్కుతో పొడిచి చూస్తే అవి బియ్యం. ఆనందంతో ఎగిరి గంతేసింది జిమ్మిరి. ఇక ఒక్కో బియ్యం గింజ నోట పెట్టుకుని బయటకి వచ్చి తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం. మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం....
మళ్లీ లోపలకి వెళ్లటం, ఓ గింజ నోట పెట్టుకుని రావటం, తినటం.
...
..
.

ఇంతలో ఆ బడాయి బంటికి విసుగురావటం మొదలయ్యింది. ఏంది రామన్నా ఇలా ఎంతసేపు?
చెప్తున్నా, వస్తున్నా వినండి అని మళ్లీ ఎత్తుకున్నాడు రామన్న

....
...
..
.
బడాయి బంటి విసుగుచెంది చేతులెత్తేసి అయ్యా నన్ను క్షమించండి అని మొరపెట్టుకుంటే, బందీలుగా పట్టుకున్న మా వాళ్లని వదిలెయ్యమని చెప్తాడు రామన్న, బడాయి బంటి అందరికీ చెఱ విముక్తి చేసి అక్కడనుండి నిష్క్రమిస్తాడు.
అదీకధ.
ఇట్టాంటి కధల్లో మేము చిన్నప్పుడు చెప్పుకున్న కధలు కొన్ని గుర్తొచ్చినయి. వాటిల్లో ఇదోటి:
ఓ అవ్వ బావి గట్టుమీద కూర్చుని చినిగిపోయిన తన సంచిని ఓ సూదితో కుడుతున్నది. ఇంతలో చెయ్యిజారి సూది బావిలో పడింది. ఎలా వస్తుంది సూది బయటకి?
"ఏందీ"
"ఏందీ అంటె వస్తుందా"
"కాదు"
"కాదు అంటె వస్తుందా"
"లేదు"
"లేదూ అంటే వస్తుందా"
".."
".. అంటే వస్తుందా"
"తీస్తే వస్తుంది"
"తీస్తే వస్తుందీ అంటే వస్తుందా"

Jan 5, 2009
చిక్కుడుకాయ
నేను ఇంతకముందు చిక్కుడుకాయ కూర మీద ఓ పోష్టు రాసా. దానికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు.
సరే ఇప్పుడు దీనిగురించి దేనికి రాయాల్సొచ్చింది? ఈ రోజు మా ఇంట్లో చికుడుకాయకూర. మొన్న దేశీ కొట్టుకి వెళ్లినప్పుడు, ఆడు కొంచెం మంచి చిక్కుళ్లు తెచ్చాడు. కూర మామూలుగా హడావిడి పడుకుంటూ, దొరికిన కొద్ది సమయంలో మా ఆవిడ పాపం చేసింది. సూరిగాడు, తినరా అంటే, తొక్కరాకూడాదు, ఇత్తురాకూడాదు ఇలా పేచీలు పెట్టాడు. తను పిల్లని నాకిచ్చి, తాను భోజనం చేసి, పిల్లని మళ్లీ తను తీస్కుంటే, నా వంతు వచ్చింది ఇక భోజనానికి. దేనికో చాలా రోజుల తర్వాత కాస్త రుచిగా తగిలింది చిక్కుడు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే - చిక్కుడుకాయల్తో పల్లెల్లో బడుగు బతుకులు ఎంతలా ముడిపడి ఉంటాయి అని. మేము పిడుగురాళ్లలో పదమూడూ సమచ్చరాలు ఉన్నాం. మా ఇల్లు చాలా పెద్దది. పది సెంట్లలో ఉండేది. ముందు చాలా స్థలం. దాంట్లో మంచి నల్లరేగడిని ట్రాక్టర్లతో తోలించాడు మానాన్న. గన్నేరు, తినే ఉసిరి, దానిమ్మ, కొబ్బరి, చామంతి, జాజి, బూడిద గుమ్మడి, నిమ్మ, అమృతపాణి అరటి, బంతి, పొట్ల, దోండ, కాకర, బీర, బోండుమల్లి (అంటే పెద్ద మల్లెలు) లతో పాటు చిక్కుడు పాదు కూడా ఉండేది మా ఇంట్లో. ఆ నల్లరేగడి మహత్యమో మా అమ్మ చేతి మహత్యమో, చిక్కుడు గంపలు గంపలు కాసేది. అలాంటి ఇలాంటి చిక్కుడు కాదు. నల్లని ఇత్తనం. పెద్ద గోలీ అంత ఉండేది ఒక్కో ఇత్తనం, జానెడు పొడుగు ఉండేది ఆ చిక్కుడు. గంపలకేసి, పిడుగురాళ్ల కూరగాయల మార్కెట్టుకి పంపించే వాళ్లం, పిల్లి సత్యానందం అని మార్కెట్టు కాంట్రాక్టరు, ఎట్టా కాస్తాయి అమ్మగారు ఇన్నిన్ని అనేవాడు. చిక్కుడులో చాలా బలం ఉంటుంది. చిక్కుడు సీజన్లో మాకు అత్యంత ఇష్టమైన కూర అదే. రోజు మార్చి రోజు తిన్నా విసుగొచ్చేది కాదు. మేము కూరగాయలు కొనుక్కుని ఎరగం.
తర్వాత మోర్జంపాడుకి వెళ్లాల్సి వచ్చింది. పిడుగురాళ్ల కొంచెం పెద్ద టౌనైతే, మోర్జంపాడు కొంచెం పెద్ద పల్లెటూరు. అక్కడా ఇంట్లోని ఓ రెండడుగుల జాగాలో మా అమ్మ, చిక్కుడు గట్రా వేసింది. అక్కడ కూడా విరగ్గాసేది ఆ చెట్టు. అప్పటికి మా అన్నయ్య పెద్ద చదువులకి రావటం, మా నాన్న టీచరుగా పెద్ద జీతగాడు కాకపోవటంతో, మా ఇంట్లో ఎక్కువగా రెండు మూడు కూరల్తోనే వెళ్లబుచ్చేది మా అమ్మ. రోజు మార్చి రోజు చిక్కుడు. అదికూడా ఇంతలా దిట్టంగా ఉండె చిక్కుడు. నేను చిక్కుడుకాయ కూరతినే విధానం భలేగా ఉండేది. పైన తొక్కని కూరన్నంలో తినేసి ఇత్తనాలని పక్కైపెట్టి, పెరుగులో తినే వాడిని. పాపం మానాన్న తన కూరలోని ఇత్తనాలు నాకు ఇచ్చేవాడు. గడ్డపెరుగు, వేడి అన్నం, పైన చిక్కుడు ఇత్తనాలు. అంతకన్నా ఏమికావాలి ఎవ్వనికైనా?

Jan 4, 2009
రసిక
నా కలెక్షను లోంచి కొంత రసాన్ని ఇక్కడా ఉంచుతున్నా. నా ఈ రసాంమృతాన్నీ మీరూ ఆస్వాదించండి. మీకు నా కలెక్షను నచ్చితే ఓ కామెంటు వదలండి. నచ్చకపోతే దేనికి నచ్చలేదో చెప్పండి.
Jan 3, 2009
నలభీమ
నా నలభీమ బ్లాగు ఇక పాడ్కాస్ట్ రూపం సంతరించుకోబోతున్నది. దానికోసం mp3 పబ్లిషింగుకి వీలైన పోస్టెరస్ లో ఒక బ్లాగుని నిర్మించా, ఇక్కడ నొక్కండి. మామూలు సంగతులకోసం నిర్మించిన పాడ్కాస్ట్లని ఇక్కడ పెట్టాను.
తొందర్లో అసలు పాడ్కాస్ట్ అంటే ఏంటి? దేనికి? ఎలా? ఎందుకు? అనే విషయాలపై ఓ పోస్టు మీముందుకి తీస్కొస్తా.

Subscribe to:
Posts (Atom)