Apr 28, 2011

ఆఫీసు కబుర్లు

మా డెవలప్మెంట్ లీడ్ బాబ్ గాడు నా సీటు దగ్గర ఆగి -
"భాస్కర్ ఈ బ్లూబెర్రి పై తింటావా"
"ఏం బెర్రీ? బులుగు బెర్రీయా?"
"ఔను భాస్కర్! బులుగు బెర్రీనే. రెండు ముక్కలే మిగిలాయి. మరింక నీ ఇష్టం"
అంతలో గస్ అగాడు నా సీటు దగ్గర
"బాగుంది బాబ్ పై"
"నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటివి చేస్తుంటుంది. తనకు ఆటిజం ADHD - Attention deficit hyperactivity disorder. తనని తాను బిజీగా ఉంచుకోటం కోసం ఇలా"
"ఇవ్వు నాకూ ఓ ముక్క బాబ్" [నేను]
ఓ కాయితపు సిబ్బిరేకులో పెట్టి ఇచ్చాడు
అందరూ ఎవరి సీట్ల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు.
రుచి చూద్దాం అని నేనూ ఓ ముక్కని నోట్లో వేస్కున్న.
బాగనే ఉంది.
ఆటిజం ఉన్న అతని స్నేహితురాలు నిజీగా ఉంటంకోసం ఇలా వంటలు గట్రాలతో బిజీగా ఉంటున్నది. హ్మ్. ఇంటరెస్టింగ్ అనుకున్నాను.


గస్ అనేవాడికి మొన్న మోకలికి ఏదో చిన్న సర్జరి అయ్యింది. ఈవేళనే వచ్చాడు ఆఫీసుకి పునఃప్రవేశం అన్నమాట. మరి వెళ్ళి పలుకరించాలి కదా? వెళ్ళాను. అడిగాను. ఏవిటి తాతయ్యా ఎలా ఉన్నావూ అని. బాగనే ఉంది అని తతంగం ఎలా జరిగిందీ ఏవిటీ చెప్పకొచ్చాడు. మాటల మధ్యలో నీ లాస్ట్ నేం ఎలా పలకాలీ అన్నాడు. గస్ అంటే వాడు మెహీకన్ అన్నమాట, ఇస్పాన్యుల్. వాళ్ళకి జ=హ అన్నమాట. Jose అంటే హొసె అని. San Jose సాన్ హొసె అని. రామరాహు అనుకుంటున్నాడు పాపం తాతయ్య. కాదయ్యా, మీకులాగా మాకు ఇలా జ ని హ అనటాలు ఉండవు. మా భాష ఇండో యూరోపియన్ భాషలకు మూల భాష అయిన సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది. మకు యాభైఆరు అక్షరాలు ఉన్నాయీ, క్రిస్టల్ క్లియర్ గా ప్రతీ మాటా పల్కుతామూ అని చెప్పకొచ్చాను. రామరాజు అని సుస్పష్టంగా చెప్పాను. మరి మన ఆఫీసులో రాజ్ ఉన్నాడుకదా అతని లాస్ట్ నేం నాకు నోరు నో తిరుగ్స్ అన్నాడు. అతని లాస్ట్ నేం సోమసుందరం అని చెప్పి, తతయ్యా, అతను తమిళ్స్. నేను తెలుగ్స్. మావి పక్క పక్క రాష్ట్రాలు. మాకు యాభైఆరు అచ్చరాలుంటే వాళ్ళకి పట్టుపని ముఫై కూడా లేవు (మొత్తం ముఫై ఒకటి అనుకుంటా). వాళ్ళు మా రాష్ట్రం వస్తే జుట్స్ పీక్స్. మేము వారి రాష్ట్రం వెళ్తే జుట్టు పీక్స్. ఒక్క ముక్క కూడా అర్థం కాదయ్యా అంటే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు. లాస్ట్ నేం పోర్వోత్తరాలు ట్రడిషన్ని బట్టి మారుతుంటాయబ్బా అని చెప్పుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ నేం అనేది మగపిల్లవాడికి స్టాటిక్ అంటే మారదు. కానీ తమిళులకు తండ్రిపేరు లాస్ట్ నేం అవుతుంది నాయనా అని చెప్పాను. అలానే, భారత దేశంలో కులాలను కూడా పేర్లో పెట్టుకుంటారు అని చెప్పకొచ్చాను. ఈ కులాల గొడవేందిరో అన్నాడు పాపం తాతయ్య కదా. తెలియదు కదా. వృత్తుల్ని బట్టి ఏనాడో జరిగిన కేటగొరైజేషన్ అని చెప్పి, అయ్యా, మనుషులు కోతుల జాతికదా. మంకీయింగ్ చేసేసారులే నాయనా అని కూడా చెప్పాను.
కులాలు వర్గీకరణ వాటిపై సరైన అవగాహన లేకుండా వికీలోనో లేక ఏ తెల్ల తొండయ్యో నల్ల నండయ్యో తెలిసీ తెలియకుండా రాసిన సో కాల్డ్ చరిత్రని చదివి మీరు ఇల అటకదా మీరు అలా అట కదా అని కొన్ని రకాల కళ్ళద్దాలతో కొన్నిరకాల ఇజాలను తలకెక్కించుకుని చూస్తారు మాట్లాడతారు చాలా మంది. అలాంటివారు ఇజాలతో మాత్రమే చరిత్రను చూస్తారు. అందుకని చివరికి అతినికి ఇలా చెప్పా చివరికి -
చరిత్రని సాధ్యమైనంత న్యూట్రల్ దృష్టితో చదవాలి. ఏ చరిత్రనైనా. బైయాస్డ్ గా చదివితే చరిత్రలో చదివేవాడి ఇజపు కోణమే కనిపిస్తుంది. ఉదాహరణకు, నిన్న రాత్రి పిబియస్ ఛానల్లో నాజ్సిల యూదు ఊచకోత చూపించాడు. వెర్బ్ మరియూ వెట్జలర్ అనే స్లొవక్ యూదులు నాజ్సిల Auschwitz death camp నుండి ఎలా తప్పించుకున్నారో చూపించాడు. ఆ గాస్ ఛాంబర్స్, వాటిలో చూపిన శవాల గుట్టలు, స్లావెక్ నుండి వచ్చే యూదులను అట్నుండి అటే గాస్ ఛాంబర్లోకి తరలించి మట్టుపెట్టటం ఇట్లాంటివి చూపించాడు. ఐదేళ్ళలో ౫.౬ మిలియన్ అంటే యాభైఆరు లక్షల మంది యూదులను మసిచెసారు నాజ్సీలి.
బయాస్డ్ గా చదివితే జర్మనులను కనీసం స్పృశించను కూడా స్పృశించలేము. వారు చేసిన దమనకాండకు వారితో కనీసం మాట్లాడలేము.  సో, చరిత్రని చూసేప్పుడు యూదుల కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే చరిత్ర చదవగలమా? సానుభూతి వేరే. ఏ ఇజమూ లేకుండా చదవాలి అని చెప్పుకొచ్చాను. ఆ మాటకొస్తే అమెరికన్లు చేసిన దమన కాండని కూడా ఉటంకించాను. ఈవేళ అమెరికన్ జనాభాలెక్కల్లో ఒక్కశాతానికి పడిపొయ్యారు నేటివ్ అమెరికన్స్ అని చెప్పకొచ్చాను. అలానే మా హిందూ జాతి, అధోపాతాళంలోకి నెట్టబడింది. కనీసం యూదు ఊచకోత కనుచూపుమేర చరిత్రలో జరిగింది. లెక్కా పత్రం అంటూ పుటల్లోకి ఎక్కించారు. వెయ్యేళ్ళనాడు మాపై దండెత్తిన ఛంఘీజ్ ఖాన్ సంతతి ఎన్ని తలలను కొట్టేసిందో ఎన్ని ప్రాణాలను బలి తీస్కుందో ఎందరు పొయ్యరో ఎన్ని దోపిడీలు జరిగాయో ఎక్కడా ఏ చరిత్రలోనూ లేదు, లిఖింపబడలేదు, లిఖించేవారే లేరు, లిఖించటానికి పుస్తకాలు లేవు. అంతే కాదయ్యా తాతయ్య ఆతర్వాతి బ్రిటీషువారు ఏమాత్రమూ తక్కువకాదు బాబూ. అని చెప్పకొచ్చాను.

అదన్నమాట.

4 comments:

  1. $భాస్కర్ గారు
    షరా మామూలు ఆయితే తాత మనవడికి చెప్పాలి.. మరిక్కడ అది తిరగబడింది. తరం మరి :). బావున్నాయి మీ తాతయ్య కబుర్లు..ఆ..లేదు..ఇవి మనవడి కబుర్లు ;)

    #బయాస్డ్ గా చదివితే జర్మనులను కనీసం స్పృశించను కూడా స్పృశించలేము. వారు చేసిన దమనకాండకు వారితో కనీసం మాట్లాడలేము. సో, చరిత్రని చూసేప్పుడు యూదుల కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే చరిత్ర చదవగలమా?

    వడ్డించేవాడు మనోడవ్వాలి కానీ.. అన్నచందంలో ఒకవైపు వాపు-మరో వైపే బలుపు అన్నట్లుగా ఈ పశ్చిమదేశ చరిత్రకారులు రాసుకుంటూ వెళ్లారు. గణాంకాలు పెంచుకుంటూ..తమకు అవసరమైనప్పుడల్లా.. పోయారు.

    #..ఒక్కశాతానికి పడిపొయ్యారు నేటివ్ అమెరికన్స్..
    అసలా ఒక్కశాతమైనా ఉన్నారా లేక ఏ ఆఫ్రికాకొ తోసేసారా?

    #వెయ్యేళ్ళనాడు మాపై దండెత్తిన ఛంఘీజ్ ఖాన్ సంతతి ఎన్ని తలలను..
    హ్మ్..లెక్కలు ఉన్నాయిగానీ అన్నీ అరకొరగా!

    ReplyDelete
  2. మాకు యాభైఆరు అచ్చరాలుంటే వాళ్ళకి పట్టుపని ముఫై కూడా ......

    వాళ్ళేం చెప్పుకుంటారో తెలుసా?
    క్ , క ఇలా విడివిడిగా లెక్కేసుకొని నూట ఇరవయ్యో ఎన్నో ఉన్నాయని చెప్పుకుంటారు. ఒకటో క్లాసుపుస్తకంలోనే అలాఉంటుంది. నవ్వాలో , ఏడవాలో తెలీలేదు.
    జ, హ లాంటి ఐదు అక్షరాలు సంస్కృత అక్షరాలు అని విడిగా నేర్పుతారు.

    ReplyDelete
  3. అదన్నమాట.
    ....బాగుందండీ ఈమాట..

    ReplyDelete
  4. రాజేశ్ - లెక్కలున్నాయా? ఉంటే లింకు కొట్టు బాసూ
    మందాకిని గారూ - నమస్తే. మీరన్నదీ నిజమే. ఎవరికైన సొంత భాష గొప్ప, ఒక్క తెలుగోళ్ళకు తప్ప. :)
    మురళి భాయ్ - ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ. :)

    ReplyDelete