Dec 6, 2011

లాంగ్ డ్రైవ్స్ - నా అనుభవాలు

ఆల్బెనీలో ఉన్నప్పుడు ప్రతీ రెండో మూడో నెలలకోమారు జెర్సి వెళ్ళొచ్చేవాళ్ళం. అక్కడ్నుండి జెర్సి 135 మైళ్ళ దూరం. 135 మైళ్ళు రెండున్నర గంటలు లేక మూడు గంటలు పట్టేది. పెద్ద డ్రైవ్ చేసినట్టు ఉండేది కాదు. కానీ ఒకసారి మాత్రం సిన్మా కనిపించింది.
అది అగస్టు, 2007. ఆల్బెనీ నుండి షికాగో వెళ్దాం అని అనుకున్నాం. డ్రైవ్ చేయాలంటే కష్టమే కదా అని విమానావకాసాలు చూసాం. ఆల్బెనీ నుండి షికాగోకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఐతే చాలా ఖరీదు. వేరే మార్గం? నెవార్క్ నుండిగానీ లేక జె.యఫ్.కె నుండిగానీ బుక్ చేస్కుంటే తగ్గుతుందని జె.యఫ్.కె నుండి చేసాను. సాయంత్రం ఏడుకి ఫ్లైట్. మధ్యానం బయల్దేరాం ఆల్బెనీ నుండి. I-87 మీద అలా న్యూయార్క్ వైపు వెళ్తే, జి.యస్.పి వస్తుంది. దానిమీద మరికొంత దూరం వెళ్తే I-95 వస్తుంది. దానిమీద కొంతవెళ్ళి జె.యఫ్.కె కి వెళ్ళాలి. I-95 దాకా బాగనే వెళ్ళాం. I-95 మీద చుక్కలు కనిపించాయి. మొత్తానికి జె.యఫ్.కె కివెళ్ళేప్పటికి ఆరు. ఏడుకి ఫ్లైట్. బ్యాగేజ్ గట్రా చెకిన్ చేసి కూర్చున్నాం. ఇంతలో ఎనౌన్స్మెంట్. ఫ్లైట్ బ్యాడ్ వెదర్ కారణంగా గంట డిలే అని. సరే అని ఏదో మింగి కూర్చున్నాం ముగ్గురం. అప్పటికి పిల్ల ఇంకా పుట్టలేదు. ఎనిమిదైంది. మళ్ళీ ఎనౌన్స్మెంట్. మరో గంట లేట్ అని. తొమ్మిదైంది. మరో గంట లేట్ అని చెప్పారు. అలా పదకుండైంది. ఇక లాభంలేదని వెళ్ళి అడిగితే థండర్‌స్ట్రాం వల్ల మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని చావుకబురు చల్లగా పదకుండింటికి చెప్పారు. సరే ఐతే మరి మా లగేజీ మాకిస్తే వెళ్ళిపోతాం అని చెప్తే...ఒక్కొకరి లగేజి దింపి ఇచ్చేప్పటికి పన్నెండున్నర. లగేజి తీస్కుని పార్కింగ దగ్గరకి వెళ్ళి కారు వెత్తుక్కుని బయట పడేప్పటికి ఒంటిగంట అయ్యింది తెల్లవారుఝామున. మా స్నేహితునికి కాల్ చేసా వాళ్ళింటికి వెళ్దాం అని. అతను ఫోన్ ఎత్తలేదు. పిల్లాడు కార్లో పడుకున్నాడు. తను కునకు తీయకుండా నాకు నిద్రరాకుండా ఉండేందుకు ఏదోకటి మాట్టాడుతోంది. ఒంటిగంటకి రోడ్డెక్కితే, మా I-87 పట్టుకునేందుకు చుక్కలు కనిపించాయి, ఒక రాంగ్ ఎక్జిట్ తీస్కోడంతో. అష్టకష్టాలు పడి మొత్తానికి I-87 పట్టుకున్నాం. రెండైంది అప్పటికి టయం తెల్లవారు ఝామున. ఒకవైపు తనకి నిద్ర వస్తున్నా ఆపుకుంటూ నాకు నిద్ర రాకుండా ఉంటంకోసం ఏదో మాట్లాడుతోంది. అట్టకాదని నిద్రపొమ్మని చెప్పి, ఓ సర్వీస్ ఏరియాలో ఆగి కాఫీ తీస్కుని ఒక తొక్కుడు తొక్కా పెడల్ని. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఏదివిలో విరిసిన పారిజాతమో దగ్గరనుండి ఇద్దరు భామల కౌగిలిలో స్వామీ వరకు పాడుకుంటూ డ్రైవ్ చెసాను. అయ్యక కె అంటే కిషోర్ పాటలు పెట్టి కుమ్మా౨ను. ఇంటికి రెండు గంటల్లో చేరుకున్నాం. అంటే నాలుగింటికి దిగాం ఆల్బెనీలో.
నేర్చుకున్న నీతి - అంత కష్టపడాల్సిన పనిల్యా. ఎదోక హోటెల్లో ఆగవచ్చు. ఐతే, అది ఆగేంత డిస్టెన్సూ కాదు. ఆగకుండా వెళ్ళేంత ఇదీ కాదు. నీతి పెద్దగా ఏం లేదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్. డూ ఇట్. అంతే. మనో ధైర్యం కావాలి. అదొక పాఠం అనుకోవచ్చు, బట్ ఎట్ హై రిస్క్.

తర్వాతి లాంగెస్ట్ డ్రైవ్ - ఆల్బెనీ టు షికాగో.
౨౦౧౦ జనవరిలో పిల్లా జెల్లాలను భారతావనికి పంపించాను. కేన్సాసులో ఉద్యోగం దొరికింది. మార్చి మొదటివారంలో జాయనింగు. ఇల్లుగిల్లూ ఖాళీజేసి మార్చి రెండున రోడ్డెక్కా. చివరిసారిగా ఆల్బెనీలోని దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండవెట్టుకుని పొద్దున పదిన్నరకి రోడ్డెక్కా. I-90 వెస్ట్. ఆల్ ది వే షికాగోకి తీస్కెళ్తుంది. ఈసారి కొంచెం తెలివిగా గార్మిన్ నువి కొని కారుకి తగిలించా. ఇంకోతేడా ఏంటంటే, కారు మారింది. ౨౦౦౯ ఆగస్టులో నా నిస్సాన్ ఆల్టిమాని ట్రేడ్-ఇన్ చేసి హాన్డా సిఆర్-వి ఈఎక్స్-ఎల్ తీస్కున్నా. వావ్!! వాటే డ్రైవ్. హాన్డా నన్ను ఎక్కడా నిరాశపరచలేదు. ఫోర్ వీల్ డ్రైవ్. అత్భుతంగా ఉంది. అలా అలా సాగిపోయింది ఐ నైంటి మీద. వెళ్తూ వెళ్తూ సాయంత్రానికి కొలంబస్ ఒహాయో దాటి టొలెడో దాకా వచ్చాను. పది అయ్యింది. రాత్రిళ్ళు అందునా మార్చిలో, కొంత సహనానికి పరీక్షే. ఓ ఎక్జిట్లో ఆపి, గాస్ కొట్టించుకుని, ఆ చలికి, నిద్ర రాకుండా ఉండేందుకు ఏంచేయ్యాలా పొద్దుణ్ణించి ఆగిన చోటల్లా కాఫీలు తాగీ తాగీ నోరంతా కంపైందిగా అనుకుంటూ లోనకి వెళ్ళి చూస్తే, ఏదో స్మూతీ కనిపించింది. ప్రయత్నిద్దాం అని తీస్కున్నా. ఒక్క సిప్పు, వళ్ళంతా కొత్త ఉత్సాహం ఉరకలేసింది, చలిలో చల్లటి జివ్వు అన్నమాట.
మొట్టమొదటి హెచ్చరిక -
మళ్ళీ రోడ్డెక్కి, తొక్కటం మొదలెట్టా. పోలీస్ బాబాయ్ లైటేసాడు. దీనెమ్మ జీవితం అనుకున్నా. వచ్చి లైటేసి లోనకి చూసాడు. ముందు పాసింజరు సీటులో నెత్వర్క్ కేబుల్స్ అవి ఇవి వెనక అంతా ఏవో సామాను టివి గట్రా లతో నిండిపోయి ఉన్నదిగా.
ఏట్రా మాయ్యా!! యాడికీ
షికాగో ఎల్తన్నా
ఏందియ్యన్నీ?
రిలొకేట్ అవుతున్నగా. ఎసన్షియల్స్ అట్టుకెల్తన్నా
నీ డ్రైవర్స్ ఇలాగివ్వు
ఇదిగో

పదినిమిషాలు పోయినాకొచ్చాడు.
అబ్బీ! డెభై లైను మీద ఎనభై ఒకటి ఎల్తన్నావ్. తప్పుకదూ?
పొద్దుననంగా బయల్దేరా బాబాయ్. గమనించలేదు. కావాలని వెళ్ళింది కాదులే
సరే! నీకింత వరకూ ఓక్క టిక్కెట్టు కూడా లేదు కాబట్టీ, ఇదిగో ఈ నోటెడ్ వార్నింగు. పుచ్చుకో
ఇవ్వు
దీన్ని ఏంజేస్తా?
ఏమో
ఏమో కాదు మాయ్యా!! ప్రిజ్జీకి అంటించుకొని రోజూ సూస్చా ఉండు. ఇంక పో!

అలా బయటపడి, మొత్తానికి షికాగో పన్నెండున్నరకి సేరుకున్నా. లాస్ట్ గంట బోరు కొట్టింది. కానీ!! విసుగు అనిపించలేదు.
850 మైళ్ళు. దాదాపు పదమూడు గంటలు, మధ్యలో నాల్గు బ్రేకులు.

షికాగో ఎళ్ళినాక మూడోరోజుకో కాన్సాసుకి చెరాను. షికాగో నుండి కేన్సాసుకి పలు దార్లు. ఒకటి, షికాగో - డిమొయిన్స్ - కేన్సాస్ I-80W తర్వాత I-35S ఎంది గంటల డ్రైవ్. రెండోది I-55S నుండి I-72W కొంత దూరం వెళ్ళినాక ఇది US 36 W లో కలుస్తుంది, ఆనక ఇది I-35S లో కలుస్తుంది. నా జిపియస్ రెండో దారెంబటి ఎళ్ళరా సిన్నా అన్నది.  I-55S మీద కొంత ట్రాఫిక్ ఎక్కువున్నా, వెళ్ళేకొద్దీ తగ్గింది. బ్లూమింగుటన్ను నార్మల్ దాటినాక బాగా తగ్గిపోయింది. స్ప్రింగుఫీల్డు దగ్గరకొచ్చేప్పటికి కొంత పెరిగినా,  I-72W కలిసేప్పటికి అసలు ట్రాఫిక్కు ఉండదు. ఇక హాన్నిబాల్ దగ్గర  అనుకుంటా I-72W US 36 W విడిపోతుంది. ఇక తర్వాతంతా కంట్రీ సైడ్ ప్రయాణం  I-35S దాకా. అస్సలు ట్రాఫిక్ ఉండదు. ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుంది ఈ మార్గం. ఆవేళ్టి నా ప్రయాణం ఎక్కడా తలనొప్పి అనిపించలా. సాఫీగా సాగింది. వింతగా అనిపించింది. ఈశాన్యానికీ మధ్య పశ్చిమానికి ఎంత తేడానో అనుకునేంత తేడా కనిపించింది. ఊర్ల పేర్లు విచిత్రంగా అనిపించింది. హానిబాల్, క్విన్చి, కామెరూన్, చిల్లికొతె ఇలా మిసోరీ రాష్ట్రంలోని ఊళ్ళ పేర్లు.
పోయినేడు ఈఏడు కలిపి దాదాపు  ఆరుఏడు సార్లు వెళ్ళొచాను షికాగో.
మొన్న థాంగ్స్ విగివింగుకి కూడా వెళ్ళొచ్చాను.
ఐతే!! ఈసారి ఓ అనుభవం.
వెళ్ళేప్పుడు చిల్లకొతె దాటినాక అనుకుంటా. కాప్ ఆపా౨డు. అబ్బాయ్, అరవై ఐడు లైను మీద డెభై ఆరు ఎల్తన్నావ్. ఎందుకలాగా అన్నాడు. అయ్యా ఇంటెన్షన్ల్ కాదు. పేద్ద గమనించలేదు అన్నాను.
ప్రత్యేకించి ఈ కాలంలో, సంధ్యవేళ ఇంత స్పీడ్ మంచిది కాదు. ఇది జింకల మేటింగు సీజన్. అవి గుద్దుతాయ్ వచ్చి. వెళ్ళాల్సిన దానికన్నా పన్నెండు మైళ్ళు ఎక్కువ ఎల్తన్నాక్ కాబట్టి ఇదిగో టిక్కెట్టు అని నూటాపది డాలర్లకు టిక్కేటు సింపి ఇచ్చాడు. అయ్యా! నాకింతవరకూ ఏలాంటి చరిత్రా లేదు అన్నాను కన్సిడర్ చేస్తాడేమో అని. అహా!! తెల్లోడు, ఎదవ, పట్టించుకోలా.
ఇదిగో ఇప్పుడే చెక్కు పంపించి వస్తన్నా.


నేనిచ్చే సలహా -
కీప్ లెఫ్ట్, పాస్ రైట్. ముందరున్న వాటిని పాస్ చేస్కుంటా వెళ్తే బోర్ కొట్టదు. అంతేగాక అలసట ఉండదు.
క్రూజ్ పెట్టుకోద్దు. మజా ఉండదు.
పాస్ చెసేప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు. కాప్ ఆపినా, పాస్ చేస్తున్నావు కాబట్టి ఎళ్ళినావని చెప్పుకోచ్చు

4 comments:

 1. పోలీస్ హెచ్చరిక బాగుంది...

  మొదట నోటెడ్ వార్నింగు ఇస్తే పట్టిచ్చుకోలేదని ఏకంగా టికెట్ ఇచ్చేసాడన్నమాట....

  ReplyDelete
 2. chicago to kansas.konnaalhlhoo maemoo ilaanae ealaesaam. ippuDanTae gpsla helptoe. avilaeni roejulloe map latoe oohinchanDi elaa unTundoe. renDu rakaaloo choosaamu. kaanee jinkalu mee ooridaggarae kanapaDDaayi.New york daggara.

  ReplyDelete
 3. ఔనండీ సునీత గారూ
  జిపీయస్ లేకపోతే కష్టం. జీపీయస్ లేని రోజుల్లోనే నేను కష్టాలు పడ్డది, న్యూయార్కులో. ప్రింట్ ఔట్లు చూస్తూ నడపాలి. లేక పక్కన ప్రాంటర్స్ కావాలి. కోపం వస్తుంతుంటుంది. అరుపులు కేకలు. ఇంతలో ఎనకమాల పిల్లకాయల గొడవ. కోపం పెరుగుతుంటుంది.....
  న్యూయార్కులో అంటే అప్ స్టేట్ వెళ్ళేప్పుడు దుప్పులు గట్రా ఎక్కువే. ఎందుకంటే ఎడిరొండాక్ పార్క్స్ కదా...వన్యమృగాలు బాగా ఎక్కువ.

  ReplyDelete
 4. మాధవి గారూ
  ఇస్తాడండీ!! ఏంచేస్తాం? ఈమధ్య మిజోరీ స్టేటులో, ప్రత్యేకించి ఈ హైవే మీద ఎక్కువైయ్యాయట, పోలీసులు టిక్కెట్లు ఇవ్వటం. మిజోరీ రాష్ట్ర ఖజానాని పెంచాలని కంకణం కట్టుకున్నారునుకుంటాను

  ReplyDelete