Sep 5, 2013

తల్లీతండ్రీ తర్వాత గురువే అన్న సంస్కృతి మనది

తల్లీతండ్రీ తర్వాత గురువే అన్న సంస్కృతి మనది. తల్లీతండ్రులు దేవుళ్ళు అని అంతటితో ఆగలేదు, గురువుకూడా దేవుడితో సమానం అన్నారు. గురువుకి అంతటి గొప్ప స్థానాన్ని ఇవ్వగలిగిన, ఇచ్చిన సంస్కృతులు ఇతరదేశాలలో ఉన్నాయోలేదో  మరి నాకైతే తెలియదు. గురువుకి శుశ్రూష చేసి గురువు చల్లని చూపులద్వారా  తృప్తిపొందిన రోజులు ఈకాలంలో లేకపోయినా, ఒక మంచి ఉపాధ్యాయుడు బజారులో వస్తుంటే ఊరి అరుగుల మీద కూర్చున్న చిన్నా పెద్దా  అందరూ  లేని నిలబడి గౌరవమివ్వటం నాకింకా గుర్తుంది. అసలు పల్లెల్లో  ఆనాడు చదువుకున్న, జ్ఞానాన్ని మూటగట్టుకుని మోసిన, లుగురికీ మంచిని పంచి, విప్లవాత్మక ఆలోచనలను చేసినవారెవరయ్యా అంటే  ఉపాధ్యాయుడే అని చెప్పకతప్పదు.
గురుపూజా  దినోత్సవంసంర్భంగా ఆకాలంలో మా పాఠశాలలో పావలాకి ఒక టికెట్ అమ్మేవారు. దానిమీద డా॥ సర్వేపల్లి గారి బొమ్మ ముద్రించి ఉండేడి. అలా  వచ్చిన డబ్బుని ఏంచేసేవారోమరి నాకైతే  గుర్తులేదు కానీ, మంచిపనికే వాడేవాళ్ళనుకుంటాను. ఎంత బీదరికంలో  ఉండావాళ్ళో  పాధ్యాయులానాడు. తొంభైలదాకా స్కూల్ అసిస్టెంట్ అయినా  స్వర్గీయ మా నాన్నగారికి వెయ్యి వచ్చేదనుకుంటా  జీతం. మారుమూల గ్రామాలకు ట్రాన్సఫర్లు అవి ఇవీ, ఎన్ని కష్టాలో. అన్ని కష్టాల్లోనూ తమ బాధ్యతలను తాము నిర్వర్తించేవాడే  ఉపాధ్యాయుడంటే. కానీ! కాలం మారుతున్నదన్న నెపంతో ప్రైవేటు పాఠశాలలమత్తులో ఉపాధ్యాయవృత్తి కేవలం  ఓ వృత్తిలా మిగిలిపోయింది ఈనాడు. ఉపాధ్యాయులకూ విద్యార్థులకూ  మధ్య ఉండాలసిన బంధం ఏర్పడాల్సిన అనుబంధం బ్రొకెన్ అయ్యింది అని నాకనిపిస్తున్నది.
అటు ఉపాధ్యాయులూ  అంతే  ఉన్నారు ఇటు విద్యార్థులూ  అంతే  తయ్యారౌతున్నారు.
ఏవైనా, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడిగా  ఒక ఉపాధ్యాయకుటుంబం నుండి వచ్చినవాడిగా ఉపాధ్యాయులంటే  ఎంతో గౌరవం ఉన్నవాడిగా, ఈవేళ్ళటి పరీస్థితిని చూసి బాధపడకుండా ఉండలేకపోతున్నాను.

యావత్ ఉపాధ్యాయులందరికీ *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*

No comments:

Post a Comment