Jul 16, 2011

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు
పరిశోధకుడి వెల్లడి చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని ఆలయాల్లో కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పరిశోధన పండితుడు ఎ.కృష్ణమాచారియర్‌ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని, ఈ విషయంపై తాను 2006లోనే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించానని బుధవారం విలేకరులకు తెలిపారు. తాను ప్రస్తుతం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. శ్రీరంగనాథ ఆలయ విస్తీర్ణం 37 X 27 అడుగులని తెలిపారు. గరుడ ఆలయం, ద్వారానికి 15 అడుగుల దూరంలో ఉందని తాను గుడి మొత్తం పరిశోధించానని ఆయన వివరించారు. తన పరిశోధనలను 18 సంపుటాలుగా 'శ్రీరంగం ఆలయం, ఆభరణాలు' పేరుతో విడుదల చేశానన్నారు.

ఇలాంటి వార్తల ద్వారా మీడియా మాధ్యమాలు ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా? ఇప్పటికే మన చరిత్రని కోల్పోయాం విదేశీ పరిపాలనలో. అరుదైన హైందవ కోవెలలు తునాతునకలు కావించబడి, ఆ స్థానంలో మశీదులు నిర్మింపబడ్డాయి. మన ఎనలేని సందని తురుస్కులు దోచగా, తెల్లవాడు నిల్చోబట్టి బట్టలు కూడా ఊడదీసుకు వెళ్ళిపొయ్యాడు. అడుగుబొడుగు మిగిలున్న మన హైందవ దేవళాలు, చారిత్రక సంపద, దొంగలపాలైంది. గుడి కట్టినప్పుడు, కోటలు కట్టినప్పుడు నవరత్నాలతో శంఖుస్తాపన చేస్తారని కొందరు, విగ్రహప్రతిష్ఠ జరిపేప్పుడు నవధాన్యాలతోపాటు నవరత్నాలతో విగ్రహాన్ని నిలబెడతారని కొందరు మూలమూలలల్లోని ఆలయాలను త్రొవ్వేసారు. పంచలోహ విగ్రహాలను తస్కరించారు. తురుష్కులపై, కిరస్తానీయులపై ఈగైనా వాలనీయని నిరంకుశ ప్రభుత్వం, కిమ్మని కూడా అనలేదు. దేవాలయాలకు దేవాలయాలు పాడుబడిపొయ్యాయి. వాటి సంపద దోచుకోబడ్డది. దేవాలయ భూమి నిరంకుశ ప్రభుత్వపు ఆధీనమైంది. అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్టు, ఈ భూమిని పందేరం చేస్కుంటున్నది ప్రభుత్వం. గుంటూరికి దగ్గర్లోని కొండవీటి కోటలో ఒకనాటి పాలకులు తప సంపదను నిక్షిప్తం చేసారని, ఇప్పటికీ వాటిని తొవ్వాలని ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడులోని అనేక దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు తస్కరించబడ్డాయి. పల్నాటిలోని కోటలు ఏనాడో శిధిలావస్తకు చేరి ఇప్పుడు కేవలం రాళ్ళా దిబ్బల్లా మిగిలాయి.
ఇక ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల వంతు. నిన్న పద్మనాభుని దేవళం. ఇవ్వాళ్ళ శ్రీరంగం.
ఇలాంటివి త్రొవ్వి సంపద ఉందని బయల్పరచి, ఎలాంటి తరంగాలను జనభాహుళ్యానికి అందిస్తున్నారు సదరు పరిశీలకులూ? ప్రభుత్వాలు? వార్తా సంస్థలూ?
బాబులూ, జనాలు, దొంగలూ, దోపిడీదారులూ, రాజకీయ వినాయకులూ, ఇక మీ ఓపిక కనిపించిన ప్రతీ గుడిని తొవ్వుకోడి!! దొరికిన వాడికి దొరికినంత అని చెప్పకనే చెప్తున్నాయి కదా ఈ పరిశీలనలు పరిశోధనలు.

రేపటి తరాలకు ఇప్పటికి *మన చరిత్ర* వెన్నెముక లేకుండా చేస్కున్న ఈ తరాలు, ఇలా చేసి, కనిపించిన ప్రతీదేవళాన్న, అంతిమ దిశకు చేరుకున్న చారిత్రాత్మక కట్టడాలను *నిధి నిక్షేపాల* పేరుతో కూలగొడితే!! మిగిలేది ఏవిటీ?

1 comment:

  1. మన ధర్మానికి ఆలంబన ఆలయాలు . ఈధర్మాన్నిధ్వంశం చేయాలనుకున్న విదేశీదుండగలు బౌతికదాడులు జరిపారు.సంపదలు దోచారు. ఇప్పుడు ప్రభుత్వాలుచేస్తున్నదీ అదే. అయితే ఇకాలోతుగా ఆలోచిస్తే ఈధార్మిక కేంద్రాలను కూలగొడితే తప్ప తమ మతాన్ని పూర్తిగా ఇక్కడ స్తాపించటం కుదరదు అని నిర్నయించుకున్న విదేశీశక్తులు [కలిమతస్తులు] కలిధర్మానుయూయులు అనేకానేక కుయుక్తులతో ఆలయాలు శిథిలంచేయాలనే బృహత్తర యోజనతో ముందుకు సాగుతున్నాయి. అటు సమాచారసాధనాలు,ఇటుప్రభుత్వాలు తమగుప్పెట్లో ఉండేలా చూసుకున్నారుకనుక వారికి ఎదురులేకుండా ఉంది. అయితే ఇక్కడ హిందువులతో ఓచిక్కుంది. భౌతికంగా ఎంత హింసిస్తే అంతగా తిరగబడతారు కనుక ఇలా మానసికంగా నిర్వీర్యులను చేసి వారి మర్యాదాస్థానాలను నిర్మూలిమ్చడమే పనిగా శ్రమిస్తున్నారు. యుగప్రభావం వలన కలిసేనకే ప్రథమవిజయాలు లభిస్తున్నాయి .

    ReplyDelete