May 10, 2011

పాప్ అప్ పుస్తకాలు

ఎప్పుడు గ్రంథాలయానికి వెళ్ళినా నాన్నా పాప్ అప్ పుస్తకాలు నాన్నా తీస్కుందాం నాన్నా అంటుంటాడు సూర్య. వద్దులేరా నాన్నా చెల్లి లాగేసి చింపేస్తే కష్టం కదా అని వారిస్తుంటాను. నిన్నటి వారాంతం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు, పద నాన్నా ప్లీజ్ అన్నాడు. సరేరా పదా అని పాప్ అప్ పుస్తకాల గదికి వెళ్ళాం.
అక్కడి లైబ్రేరియన్
"ఏం కావాలయ్యా"
"పాప్ అప్ పుస్తకాలు కావాల"
"తప్పకుండా. మావద్ద ఓ యాభై దాకా ఉన్నాయి పాప్ అప్ పుస్తకాలు"
"ఓహో ఏవిటీ మీ పాలసీ"
"ఇక్కడ కూర్చుని చక్కగా చూస్కుని తిరిగి ఇచ్చేసి వెళ్ళటమే పాలసి"
"ఓహ్ అలాగా"
సూరిగాడితో
"అరేయ్ ఇంటికి ఇవవ్వరుట, ఇక్కడే చూసి ఇచ్చేయాలట సరేనా"
ఆమెతో "హ్మ్ బాగుంది ఐతే ఏవేం పుస్తకాలున్నాయో చూపండి"
ఆమె పుస్తకాల గదికి దారితీసింది, వెనకాతలే మేమూ వెళ్ళాం
పాప్ అప్ పుస్తకాలు ఒక నిర్బంధ గదిలో ఉన్నాయి. తాళం తీసి లోపలకి ఆహ్వానించింది. ఒక అల్మరా మొత్తం అవే.
మనవాడి కళ్ళు మరి దేవుళ్ళాడే కళ్ళు కదా [సెర్చింగ్ ఐస్] వెనువెంటనే ఓ రెండు పుస్తకాలను ఇట్టే పట్టేసాడు. డైనోసరస్ పాప్ అప్ పుస్తకం, మరియూ అండర్ వాటర్ పాప్ అప్ పుస్తకం.
అన్న రెచ్చిపోతే చెల్లి వెనకడుగు వేస్తాయ్? నెవ్వర్
తింకబెల్ తింకబెల్ అన్నది. లైబ్రేరియన్ వెంటనే ఏదో ప్రిన్సెస్ పాప్ అప్ పుస్తకం ఇచ్చింది.
ఏమాటకామాట, పాప్ అప్ పుస్తకాలు తయ్యారు చేయటం అంత సుళువు కాదు. ఎంతో కళాత్మకత ఓర్పు అవసరం. వాడివద్ద రెండు మూడు పుస్తకాలు ఇంతక ముందే ఉన్నా ఇప్పుడు చూసినవి మాత్రం అత్భుతమైనవిలా తోచాయి
వాడి రెండు పుస్తకాలు కేరింతలు కొడుతూ చూసాడు. అయ్యాక ఇచ్చేసి పిల్లలపుస్తకాల గదివైపుకి నడిచాం అందరం
కొన్ని ఫోటోలు ఇవిగో

7 comments:

  1. భలే ఉన్నాయండి. ఈ టపా మా అమ్మాయి చూడకుండా జాగ్రత్త పడాలి !!

    ReplyDelete
  2. ఏంటీ ఇలాంటివి పుస్తకాలు కూడా ఉన్నాయా , నేను ఇంతవరకు గ్రీటింగ్స్ మాత్రమే అనుకుంటున్నాను . ఆ గ్రీటింగ్స్ రేటే పేలిపోతుంది ఇక పుస్తకం ఎంత ఉండొచ్చో ;(

    ReplyDelete
  3. శ్రావ్యగారూ, మరీ ఇంతలా కాదు గానీ ఇలాంటిదే నా చిన్నప్పుడు నాన్న ఓ పుస్తకం కొన్నారు. ఇల్లు బొమ్మ, bear, jungle అన్నీ ఇలానే పాప్ అప్ అవుతాయి. పుస్తకం పేరు గుర్తులేదు కానీ మా ఇంట్లో ఇంకా అమ్మ దాచిపెట్టింది. పాప కోసం వెతకమని ఈ మధ్యనే గుర్తు చేసాను. కానీ అప్పుడే ఎనభైయ్యో వందో ఉండేది. ఇప్పుడు బాగా పెరిగి ఉంటాయి రేట్లు.

    ReplyDelete
  4. తృష్ణ గారు ఐతే చాల రోజుల నుంచే ఉన్నాయా ఈ పుస్తకాలు, నేను గ్రీటింగ్స్ మాత్రమే చూసాను అవి సూపర్ గా ఉంటాయి కదా . మీరు మరీ మంచి అమ్మాయి లా ఉన్నారు , మీ చిన్నప్పటి పుస్తకం ఇంకా ఉందా ? అదే మా ఇంట్లో ఐతే దాని ఆనవాలు కూడా ఉండేది కాదు :)

    ReplyDelete
  5. భాస్కర్ గారు,
    నమస్కారములు. నేను స్వర్గస్తులయిన,మీ తండ్రి గారు అయిన రమాకాంత రావు మాస్టారి గారి శిష్యుడ్ని.
    నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహానుభావుల్లో రమాకాంత రావు మాస్టారు కూడా ఒకరు.
    నేను ఒక బ్లాగు మొదలుపెట్టాను. దయచేసి మీరు దర్శించి మీ అమూల్యమయిన అభిప్రాయం తెలియజేయవలిసిందిగా ప్రార్ధన.
    http://indrasenagangasani.blogspot.com/

    ReplyDelete
  6. ఇంద్రసేనా గంగసాని గారూ
    నమస్తే
    మా నాన్న గారి శిష్యులా మీరు. హ్మ్! ఆనందంగా ఉంది. ఏ ఊళ్ళో? ఏ సమ్వత్సరం? ఆ వివరాలు కూడా ఇవ్వండి.
    మీ బ్లాగ్ తప్పకుండా చూస్తాను.

    ReplyDelete