మొన్నీమధ్య ఏకస్థలబహుళసముదాయంలో ఓ దేశీ పిల్లాడు, సూరిగాడికన్నా ఓ ఏడాది పెద్దవాడు, పిల్లలతో ఆడుతూ ఓ బూతుకూత అలవోకగా కూసినాడు. వెనువెంటనే కొందరు పిల్లలు ఆ పిల్లాడి తల్లికి ఆ విషయాన్ని మోసుకెళ్ళినారు. సదరు తల్లిగారు ఇలా వాక్రుచ్చినారు"ఓహ్! అవునా! తప్పుకదూ! కానీ, కావలని అన్నాడా లేక ఊతపదంలా అన్నాడా? ఓహ్! ఊతపదంలా అన్నాడా! అయితే తేలిగ్గా తీసుకుని వెళ్ళి ఆడుకోండి పోండి".
అదే పిల్లాడు మరోరోజు ఇంకో పెద్ద కార్యక్రమంలో కలిసినప్పుడు ఇంకాస్త ముదిరిపోయి అబ్బాయిలంతా ఓ గదిలో ఆడుకోవాలన్నట్టుగా అబ్బాయిలందర్నీ ఓ గదిలోచి చేర్చి లోపల గడియబెట్టి ఆట్టం మొదలెట్టినారు. ఆడపిల్లలంతాజేరి ఆగదిలోకి వెళ్ళబోతే తలుపు తీయడు, తీసి నెట్టేస్తూ మళ్ళీ బూతికూత కూయనే కూసినాడు. ఈసారి వాడి సహవాసగాడు కూడా అదే పదం వాడట్టంతో ఆడపిల్లలంతా సదరు సహవాసగాడి తల్లికి చెప్పినారు.
సదరు పిల్లవాడి తల్లిగారు ఉత్తరభారతీయ వనితగారు ఇలా వాక్రుచ్చినారు "వాళ్ళు మగపిల్లలు. ఏవైనా అంటారు. ఆడపిల్లలు ఎందుకు అక్కడికి వెళ్ళినట్టూ?"
ఆశ్చర్యపోయాను. అవాక్కయ్యాను. బూతుపదం ఊతపదంగా మారటాన్ని ఆపని తల్లితండ్రులు కూడా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంలో ఉంటూ ఆడపిల్ల మగపిల్ల అని తేడా చూపించే తల్లితండ్రులు కూడా ఉన్నారు.
నా పక్కన కూర్చునే ఓ తెల్లవాడితో ఈ విషయం చర్చకుతెస్తే, వాడు వాడి పిల్లలు స్టుపిడ్ అనే పదాన్ని కూడా వాడటానికి వీలులేదంటూ చెప్పుకొచ్చాడు.
బూతుమాటని మాట్టాడకూడదని పిల్లవాణ్ణి సరిచేయాల్సిన అవసరం లేదా?
Subscribe to:
Post Comments (Atom)
parents should take care of their children
ReplyDeletehi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai