Apr 29, 2010

కాపీ మానేసా

ఔను. నిజం. లేవంగనే బెడ్దు కాపీ తాగే అలవాటుంది కదా. మానేసా. ఆపీస్కెళ్ళంగనే కాపీ తాగే అలవాటుంది కదా. మానేసా. పొద్దున పాలు తాగుతున్నా, సిన్నపిల్లాళ్ళా.
ఆపీస్ కి రాంగనే కాకన్డా, పదికి, ఇదిగో ఈ కిన్ద సూపిచ్చిన వాటిల్లోంచి ఏదోకటి తాగుతున్నా



ఇలా కూడా సేస్కోవచ్చు -

నల భీమ పాకం http://nalabhima.blogspot.com/2010/04/blog-post_29.html

15 comments:

  1. ఎందుకు భయ్యా సడన్ గా ఇలా మానేసింది? నాగ్గూడా ఆఫీస్ కి వెళ్ళగానే కాఫీ పడకపోతే ఏదోరకంగా వుంటది.

    ReplyDelete
  2. rojuki 2 sarlu coffiee rendu sarlu tea leka pote office ki vellinatle kudu...

    maaku absent vestaru....

    ReplyDelete
  3. మొత్తానికి మానేసారన్న మాట (ఎన్నోసారి ? ఎప్పడిదాక ?:) j/k)

    ReplyDelete
  4. నాది శ్రావ్య ప్రశ్నే.... ఎన్నో సారి? ఎన్నాళ్ళదాకా???
    (ఓసోస్ చూసేము, చేసేము లెండీ ఇలాంటివి చాలానే... ఇది మనసులో మాట) :-)

    ReplyDelete
  5. Bigelow లొ Moroccan mint ఫ్లేవర్ టీ వుంటుంది.. అది ట్రయ్ చెయ్యండి... పొద్దున్నే లేవగానే తాగితే చాలా ఉత్సాహంగా వుంటుంది..

    ReplyDelete
  6. నాకు చాలా ఇష్టం. కానీ నేనూ మానేశా.! 5,6 సంవత్సరాల నుండి. ఇష్టమైనది వదలడంలోనే ఉంది తృప్తి. పాలు మాత్రమే తాగుతాను. అదీ రోజుకొక్కసారి మాత్రమే. నేనంటే నాదారి వేరు లెండి ( పురోహితుడిని కనుక ).

    కానీ మిగతా వారి విషయంలో మరీ అంత నియమం అవసరంలేదనుకుంటాను నేను. కాక పోతే ఏ అలవాటైనా మనల్ని నియంత్రించే స్థితిలో కాక, మనం దానిని నియంత్రించే స్థితిలో ఉంచుకోవాలి. అందుకోసం అప్పుడప్పుడు ఓ నెలరోజులు దాన్ని త్యాగం చేసి మన మనో బలాన్ని పెంచుకుంటుండాలి.

    ఇంతకీ పూర్తిగా మానేశారా? కొన్ని రోజుల పాటా? :)

    ReplyDelete
  7. good for you.
    I stopped morning coffee long ago, but have been unable to give it up totally - I end up drinking 3-4 cups in a week on an average :(

    ReplyDelete
  8. పొద్దున్నే కాఫీ తాగకపోతే తొందరగా ముసలోళ్ళైపొతారంట :P

    ReplyDelete
  9. "కాపీ మళ్ళీ మొదలెట్టా" అనే పోస్టు కోసం ఎదురుచూస్తూ... :)

    నేను చాలా ట్రై చేసానండీ, నా వల్ల కాలేదు..అయితే రోజుకి ఐదారు కప్పులనుండి రెండు కప్పులకి విజయవంతంగా తగ్గించేసా.పూర్తిగా మానేసినప్పుడు తలనొప్పి రూపంలో నా బ్రెయిన్ "కెఫీన్ కెఫీన్" అని తెగ కలవరించింది.తప్పనిసరై దానిక్కావలసిన కెఫీన్ ని దానికి పడేస్తున్నా రోజుకి రెండుసార్లు. :)

    All the best...

    ReplyDelete
  10. డల్లాస్ నాగ్ -
    పర్ ఏ ఛేంజ్. ఊర్కనే. ఎలా ఉంటుందో చూద్దాం అని. ఎక్కువ కాపీ మంచిది కాదంటున్నారు కదా. అందుకు.
    ఇంతక ముందు, పొద్దునపొద్దున్నే ఓ కాపీ పడాల. టిపినీ అయ్యాక ఓ సారు ఆపీస్కెళ్ళినాక ఓ సారి మూడింటికి ఓ సారు, సాయంత్రం ఇంటికి బోంగనే ఓ సారి, బువ్వ లేటు గట్రా ఐతే ఏడింటికో సారి.
    తర్వాత్తర్వాత పొద్దున్నే లేవంగనే అయ్యాక ఆపీస్కెళ్ళినాక.
    టిపినీ అయ్యాక వే ప్రొటీన్ తాగటం మొదలెట్టా. మరి ఎస్సర్సైజులు సేత్తన్నాం గదా.
    ఈ మద్దన, పొద్దున్నే, ఆపీస్కెళ్ళాక మధ్యానం సాయంత్రం ఇంటికి జేరినాక అయ్యింది.
    తర్వాతర్వాత
    ఆపీస్కెళ్ళాక, మధ్యానం, ఇంటికెళ్ళినాక అయ్యింది
    ఇహ ఇప్పుడు
    మధ్యానం మూడింటప్పుడు మాత్రమే.
    అంటే రోజుకో కప్పు.
    ఫణి - హ్మ్!! ఆరోజుల్లో!! సేంటైంలో మెసేజీలు పొద్దున్నే ఆపీస్కెళ్ళంగనే నీ ఎబ్బ రారా బాబూ కాపీ అని. మధ్యానం మూడవటంతోటే మెసేజీలు పద పద అని. అయ్యాక సాయంత్రం నాలుగున్నర ఐదుకి. ఈ సారి బయటకెళ్ళి రోడ్డెమ్మట కాకా హోటేలులో యస్.పి చాయ
    శ్రావ్యా -
    ఎన్నోసారి?? హ్మ్!! ఇంతవరకూ హెప్డూ మానెయ్యలేదు కాపీ. ఇదికూడా బద్దకంతో మానేసింది. నాకు బుర్రు కాపీ అంటే పెద్ద ఇష్టం లేదు. పిల్ట్రీ ఏస్కుంటా ఇంట్లో. అదేస్కోవాలంటే బద్దకం. అందుకే అసలు వెయ్యట్లా.
    ఎప్పడిదాకా? సెప్పలేను అద్దెచ్చా. ఏమో మళ్ళీ గుబుల్స్ పుట్టొచ్చు.
    భావన గారూ -
    మీ మనసులో మాటకి నా సమాధానం - మాది పల్నాడు, లచ్చిమక్కా మాట, ఓ సారి సెప్తే ఇక అంతే శిలాశాసనం. లాభం లెదు మీకు సెరిత్ర సెప్పాల్సిందే. ఇది సదవండో సారి పొగతాగటం మానేస్తే!!!

    ReplyDelete
  11. మంచుపల్లకీ -
    న్లభీమ లో ఓ పోస్టేసా చూడండి మింట్ చాయ ఎలా సేస్కోవాలో.
    ఔను పొద్దున పొద్దున్నే గోరెచ్చటి నీళ్ళలో నిమ్మ దబ్బ తేనే ఏస్కుని పొట్టనిండా తాగితే వారోగ్గెం.
    రాజశేఖరుని శర్మ గారూ -
    కాపీలు తాగటం తగ్గిస్తే మంచిదేనండీ, మరియూ ముఖ్యంగా పందార తగ్గించండి. మీ వయసులో ఇన్ని జాగ్రత్తలు అవసరంలేదు కానీ వృత్తిపరంగా, కాపీలు ఎక్కువతాగే అవకాసం ఉన్నందున చెప్తున్నా.
    "కాక పోతే ఏ అలవాటైనా మనల్ని నియంత్రించే స్థితిలో కాక, మనం దానిని నియంత్రించే స్థితిలో ఉంచుకోవాలి. అందుకోసం అప్పుడప్పుడు ఓ నెలరోజులు దాన్ని త్యాగం చేసి మన మనో బలాన్ని పెంచుకుంటుండాలి."
    చాలా చక్కగా చెప్పారు. ఈ మాటలు నేటి తరాలకి చాలా అవసరం.
    కొత్తపాళీ అన్నగారు -
    :):) మళ్ళీ పిల్ట్రీ వేస్తే ఆ వాసన లాగేస్తుంది వెనక్కి. ఇది తగ్గిద్దాం అనే ప్రయత్నంలో మొదటడుగు లాంటిదన్నమాట.
    ఉమాశంకర్ -
    బహుకాల దర్శనం సోదరా. కుశలమేనా?
    పైన చెప్పిన చాయిలు ప్రయత్నించి చూడు సోదరా. బాగున్నాయి.

    ReplyDelete
  12. ఆ పెట్టెల్లో సంచులను వేడి నీళ్ళలో ముంచుకుని త్రాగితే, ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది అన్నారు, నిజమేనా?

    ReplyDelete
  13. బావుంది
    కాఫీ మానేసారా సంతోషకరమైన విషయం
    గ్రీన్ టీ కి ఐస్ తీ కి తేడా ఏంటి ఒకటేనా ?

    ReplyDelete
  14. శుభం !! మళ్ళీ మొదలెట్టా అనే టపా రాకూడదని కోరకుంటూ :-)

    ReplyDelete
  15. పానీపూరీ ఏక్దోతీన్ - అవును. అందుకేగా కాపీ మానేసీ సన్చులెమ్మట పడింది.
    హరే -గ్రీన్ టీకీ ఐస్ టీకీ తేడా ఏంటీ? ఏంలేదు. వేడినీళ్ళు చన్నీళ్ళు అంతే తేడా
    వేణూ భాయ్ - :):) మనం పలునాటి బిడ్డలం!!

    ReplyDelete