Apr 12, 2010

చిక్కుముళ్ళు

ఏంటీ ఈ చిక్కుముళ్ళు
ఒకటి విప్పితే ఇంకోటి బిగుస్తోంది
ఒకదారాన్ని లాగితే కనిపించనిచోట చిక్కులు పడిపోతోంది
ఒకదారాన్ని లాగితే అది కనిపించనిచోట చిక్కు వేస్తోంది
ఈ ముళ్ళు తీయటానికి ఎంత నేర్పరితనం కావాలో అర్ధమవ్వటంలేదు
ఈ ముళ్ళకు ముళ్ళులేవు కానీ
చేతులు తెగుతున్నాయ్
ముళ్ళు లేకుండా
ముళ్ళు దిగకుండా
కోతకు గురౌతున్నాయి వేళ్ళు
రక్తం స్రవిస్తోంది.......................మనసులో!!!

3 comments:

  1. ఏంటండీ వైరాగ్యం? మీ ఆవిడ వూళ్ళో లేరనా? వెళ్ళినావిడ తిరిగొచ్చారనా? :P

    ReplyDelete
  2. హరే కిట్న - నీ తస్సరవల!!
    రాణి గారు- మీరు భలేవారండీ, నా కాళ్ళు లాగుతున్నారు, పొరపాటున మావిడై (దోసై లాగా) సూసిందంటే, ఈపు ఇమాణం మోతే.

    ReplyDelete