Apr 23, 2010
అతిరుద్ర యజ్ఞం
నాలుగు రకాల రుద్ర పారాయణలు ఉన్నాయట.
రుద్రం
ఏకాదశ రుద్రం
మహా రుద్రం
అతి రుద్రం
కృష్ణయజుర్వేదం లో 4.5 వ అధ్యాయం నమకం, 4.7 వ అధ్యాయం చమకం, ఈ రెంటినీ కలిపి శ్రీ రుద్రప్రశ్న,శతరుద్రీయం, లేక రుద్రధ్యాయం అని కూడా అంటారు.
ఒకసారి నమక,చమకాలను పారాయణ చేయటాన్ని రుద్ర పారాయణ అంటారు.
ఏకాదశ రుద్రం అంటే 11 సార్లు నమకం, ఒక్కో నమకం తో చమకంలోని ఒక్కో అనువాకం చదవటాన్ని ఏకాదశ రుద్రం అంటారు. అంటే పదకుండు సార్లు నమకం, ఒక సారి చమకం మొత్తంమ్మీద.
ఇక మహారుద్రం - 121 ఎకాదశ రుద్రాలను మహా రుద్రం అంటారు. అంతే 11 * 121 = 1331 సార్లు రుద్ర నమకం, 121 సార్లు చకమం చదివినట్టన్నమాట.
ఇక అతి రుద్రం అంటే 11 మహా రుద్రాలను అతి రుద్రం అంటారన్నమాట. అనగా 14641 సార్లు నమకం, 1331 సార్లు చమకం చెయ్యటమన్నమాట.
న్యూయార్క్ రాష్ట్రంలోని రాచెస్టర్ అనే ఊళ్ళో శ్రీ రాజరాజేశ్వరీ పీఠం వారు ఈ ఏడాది జూలై 1 నుండి జూలై 10 వరకూ కుంభాభిషేకం నిర్వహించనున్నారు. కుంభాభిషేకం సందర్భంగా అతిరుద్ర యజ్ఞం చేయనున్నారు. మీలో ఎవరైనా పాల్గొన దలచిన పీఠం వారిని సంప్రదించి వివరాలు కనుక్కుని పాల్గొనవచ్చును
పీఠం వివరాలు -
www.srividya.org
6980/6970 East River Road,
Rush(Rochester), New York, 14543 •USA
Telephone: 1-585-533-1970
Subscribe to:
Post Comments (Atom)
subhakaramaina samkalpam paalgonnavaaramdariki sakala subhaalu praaptistayi
ReplyDeleteవర గుణ భాగ్య మెట్లొదవె? భాస్కర రామ మహీశ మీకు? నీ
ReplyDeleteధర సు జనాళి వర్ధిలగ దారిని చూపుచు; ధన్య జీవివై
కరుణ రసామృతమ్ము నిడి కమ్మగ నందరి మంచి కోరుచున్
పరువును పెంచినట్టి కుల వర్ధన! సద్గుణ వృద్ధ రాజమా!
మాష్టారూ - నలుగురికీ తెలియాలనే ఇక్కడ పెట్టానండి.
ReplyDeleteచింతా రామకృష్ణారావు గారూ - నమస్తే!! ధన్యవాదాలండీ. నలుగురికీ మంచి మన మంచి, ఆ నలుగురిలో మనమూ ఒకరమే కదా!!
>>సద్గుణ వృద్ధ రాజమా! :):)
మీ పద్యానికి నేనూ ఓ పద్యంతో సమాధానం చెపుదామని అనుకున్నా కానీ, నా తెలుగు అంతంత మాత్రమే.
ధన్యవాదాలు