Jul 14, 2008

పొగతాగటం మానేస్తే!!!

మానక ముందు
సాయంత్రం అయ్యేసరికి, ఎదోఒక పని మీద ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నించటం
అలా బయటకి వెళ్ళాక సొమాలియా ఆకలి బాధితుడిలా ఎవడో వచ్చి సిగరెట్టులాక్కెల్తాడేమొ అని గట్టి గట్టిగా పీకులు పీకటం. తర్వాత, దెగ్గర్లో ఉన్న డంకింగుడోనట్స్ కో దేనికో దానికి వెళ్ళి, మూతి కడుక్కుని, మింటు వేసుకుని, కాఫీ కొట్టి అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరిగి, ఇంక వాసన రావటం లేదు అని నిర్ణయించుకున్నాక, కారులో కూర్చొని అద్దాలు అన్ని పైకి లాగి వాసన వేస్తోందేమో మళ్ళి పరీక్ష్మిచి, నోట్టో ఒక విగ్లీసో మట్టో మషానమో వేసుకుని, దున్నపోతు నెమఱేసినట్టు నములుకుంటూ ఇంటికి చేరటం.
అలా ఇంటికి డేక్కుంటూ వెళ్ళాక, ఇంకా వాసన వస్తుందేమో అనే భయం తో, కళత్రం దెగ్గరకి పోకుండా, నంగి నంగిగా మాట్లాడుతూ, సాధ్యమైనంతవరకూ గాలిని లోపలకి పీలుస్తూ, సాధ్యమైనంత తొందరగా సింకు దెగ్గరకి వెళ్ళే ప్రయత్నం చెయ్యటం, దానికి మల్లి ఒక కవరింగు, అబ్బా కంట్లో ఎదో పడింది, చేతికి ఆయిలు అంటింది, ఇలా...

మానేసినాక
ఇప్పుడు అవేమీ అక్కర్లేదు. ఒకవేళ ఒంటరిగా బయటకి వెళ్ళినా ఇంట్లోకి ధైర్యంగా, వంట గదిలోకి అంతకన్నా ధైర్యం గా వెళ్ళిపోయి, అవసరం లేకున్నా, ఏమిజేస్తున్నావ్, అని అడిగి..అలా కొంచెంసేపు కటింగు ఇవ్వొచ్చు. లేక, ఇంటోనే రాజా లా కూర్చొని, ఒక వింతైన లుక్కుతో( కళత్రమా!! నన్ను చూడు, దమ్ము కొట్టటం మానేసా నాయాల్ది) ఒక విచిత్రమైన నవ్వుతో అలా.. అర్ధంకాకపొయినా టీవీ సీరియల్ చూస్తూ కూర్చోవచ్చు.

మానక ముందు
(ఎప్పుడూ - ఇది వస్తూనే ఉంటుంది, అందుకే ఎప్పుడైనా అని రాయటమ్లేదు) దగ్గినప్పుడు కళత్రం "ఆ దమ్ముకొట్టటం మానొచ్చుకదా" అంటే, "అబ్బే!! ఇది దమ్ము కొట్టటం వల్ల వచ్చిన దగ్గుకాదు..ఇది వేరేది (అదేంటో తెలియక పొడి పొడి గా, ఎక్కువసేపు లాగకుండా)..తగ్గిపోతుంది..అబ్బే..ఖొరపోఇంది...అంతే..జందూబాం ఇవ్వు రాసుకుంటే పోతుంది..చూడు..పోఇందే..ఇట్స్ గాన్"

మానేసినాక
దగ్గు సామాన్యంగా రాదు, వచ్చినా ఇదేంటి మానేసా కదా అని ఒక విజయ గర్వంతో ఒక లుక్కు పడేసి, "ఏమోయ్!! ఆ జందూ బాం ఇలా పడేయ్" అని పోజు కొట్టొచ్చు..

ఇలా చాలా లాభాలు ఉన్నాయి..
ఇంటికి వచ్చినవాళ్ళతో కళత్రం ముందు, లేక వినపడేలా..గురూ నేను దమ్ముకొట్టటం మానేసా తెలుసా..3 నెలలు ఐంది.. మాది పల్నాడు తెలుసుగా మాట, లక్ష్మక్కా మాట..ఒక్క సారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే.. మల్లి ఇంతవరకూ ముట్టుకోలేదు...దానెవ్వా!! నీకు ఇంకోవిషయంజెప్పనా.. నాకు సిగరెట్టు పొగే పడటమ్లేదు ఇప్పుడు...

....

8 comments:

  1. ఏమండీ భాస్కర్ గారు,మీరెంతొకవేళ మానేస్తే మాత్రం ???
    మా ఆవిడ చదివితే ఇంకేమన్నా ఉందా?? ఆపల్నాడు కుర్రాడిని చూసన్నా..... తెచ్చుకో అంటే??

    ReplyDelete
  2. hi,
    regular gaa chuse dammukotte mahanubhavula ellallo unde situations ,meeru chala baga rasaru. it's really nice....if possible write more.

    ReplyDelete
  3. very funny nice thought keep rocking

    http://srushti-myownworld.blogspot.com

    ReplyDelete
  4. భాస్కర్ గారు,
    మాదీ పల్నాడే నండి! కానీ నేను ఒక్క సారి చెప్తే 100 సార్లు చెపినట్టే అని నా ఉత్తమార్థం అర్థం చేసుకోట్లేదు. ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా చెప్పినా ఉహూ..లాభం లేదు. ఇంతకీ మీరెలా మానేసారో చెప్పండి? లేక మానేయకుండానే ఊరికే బ్లాగడానికిలా రాశారా?

    ReplyDelete
  5. సిగరెట్ మానెయ్యడం చాల ఈజీ, నేను చాలా సార్లు మానేశాను :P

    (c) Bapu

    ReplyDelete
  6. చెప్పాకదా!!'మాది పలునాడు' అని...మనేసా అంటే మానేసా..అంతే..ఏదైనా అంతే. మా ఇంట్లో అందరూ అంతే.. ఒక సారి నో అంటే..ఖేల్ ఖతం దుకాణ్ బంద్.
    ఎలా మానేసా అంటే? ఇంజను స్టక్ ఐతే ఆగిపోతుంది కదా ఠకా మని.. అలా.. దాన్నే ఆంగ్లమున "కోల్డ్ టుర్కీ" అందురు..
    :)

    ReplyDelete
  7. Ha ha ha .. good for you!
    RSG .. that quote was originally attributed to Mark Twain.

    ReplyDelete
  8. నేను మద్యపానాన్ని మానటానికి చేసిన ప్రయత్నాలను గురించి రెండు మూడు సార్లు(కౌన్సిలింగు కార్యక్రమంలో) నా అనుభవాల్ని పంచుకోవటం జరిగింది.
    అవే విషయాల్ని ఎక్కడైనా రాయమని మిత్రులిచ్చిన సలహాతో నాటపా మొదలు పెట్టా. వరుసక్రమం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అయినా కొన్ని ముఖ్యాంశాలను రాసాను.
    మీ టపా చూసిన తర్వాత కొత్త వుత్సాహం వచ్చింది
    తరువాతి టపాలో వివరిస్తాను.
    ధన్యవాదాలు

    ReplyDelete