Apr 5, 2010

గీతాంజలి

ఇవ్వాళ్ళ మనసేంబాగోలేక, వాతావరణంలో మార్పు కోసం, నా డీవీడీలను దులుపుతుంటే ఏం సినిమా చూద్దామా అని, నా చేయి గీతాంజలి డీవీడీని పట్టుకుని వదల్లా. హ్మ్!! డీవీడీ ప్లేయర్లో పెట్టాను........
కళ్ళముందు, ఆ సినిమాని మంగా థియేటర్ లో, మొట్టమొదటిసారి చూసిన జ్ఞాపకం గిర్రున తిరిగింది.
ఆతర్వాత, గీతాంజలిని థియేటర్లో ఎన్నిసార్లు చూసానో, జ్ఞాపకంలేదు. ఓ పాతికసార్లు చూసుంటానేమో.
నేను అత్యంత ఎక్కువసార్లు థియేటర్లో చూసిన సినిమాలు -
మొదటిది - గ్యాంగ్ లీడర్
రెండు - ఘరానామొగుడు
మూడు - గీతాంజలి
నాలుగు - జ.వీ.అ.సు
ఏముందీ ఈ సినిమాలో? అందమైన లోకేషన్స్, కమ్మని సంగీతం, గిరిజ, పాటలు ఆమనీ పాడవే హాయిగా..అంతకన్నా ఏంకావాలి సినిమాకి.
ఆశుపత్రిలో గీతాంజలి వాళ్ళ మామ్మకి ఇవాళ్ళ దేవదాసుని చూసాం అని చెప్తూ
ఆమనీ పాడవే హాయిగా అని పాడుతూ తల ఇటు తిప్పినపుడు, అక్కడ నాగార్జునని చూసి, చేతిలోని పూలగుత్తిని మొఖంమీద పెట్టుకుని అతనివైపు చూస్తుంది. ఎంత అత్భుతంగా చూపించాడా దర్శకుడు. అప్పుడు నాగ్ వచ్చి గీతాంజలి బుగ్గపై ముద్దుపెట్టుకుంటాడు. అప్పుడు గీతాంజలని దగ్గరగా చూపిస్తాడు. ఓహ్!! హ్మ్!!
ఇదంతా ఓ ఎత్తైతే, ఈ సినిమా పబ్లిసిటి ఒక ఎత్తు.
నాదగ్గర మా సీనియర్ ఇచ్చిన ఓ కెమిస్ట్రీ రికార్డ్ బుక్ ఉండేడి. దాంట్లో, పై అట్టలోపల, ఎడంచేతివైపు, గీతాంజలి చిన్న బొమ్మ, నాగార్జున గిరిజని వళ్ళోపెట్టుకుని ఉండేది. వెనక అట్టలోపల ఇంకో ఫోటో. ఇవి న్యూస్ పేపర్లో సేకరించినవో లేక ఈనాడు ఆదివారంలోవో.

జుట్టుకి కొబ్బరినూనె పూసి, తర్వాత, చేతులు ఓ సారి తడిపి జుట్టుకలోకి ఓ సారి ఆ తడివేళ్ళని పోనిచ్చి ఎనక్కిదువ్వి ఏంటో పిచ్చి. ఎంత క్రేజో ఆ స్టైల్.

మీకు తెలుసా గీతాంజలిగా వేసిన గిరిజ, అసలు పేరు గిరిజ షట్టర్. ఆమె భారత/కకేసీన్ సంతతి. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీక్కాంత్ కి బంధువని అప్పట్లో అన్నారు. గిరిజ బ్లాగ్ రాస్తుంది. ఆమె బ్లాగ్ ఇదిగో - http://undercutandflourish.blogspot.com/

6 comments:

 1. Interesting సోదరా.. గీతాంజలి గారి బ్లాగ్ వివరాలు అందించినంుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 2. Wow..ఆమె ఇప్పుడు రిపోర్టర్ గా పనిచేస్తుందన్న మాట. ఫోటో చూస్తే ఆమె లాగా కనిపించడం లేదు. బహుశా చాలా రోజులవడం వల్ల కాబోలు

  ReplyDelete
 3. గీతాంజలి పాటలు సుపరో సుపర్
  ఫోటోగ్రఫి కేక
  ఇవన్ని సరే కాని అన్నాయ్.. ఏంటి గిరిజ అని బోల్డ్ లెటర్స్ లో రాసావు ఆ ;)

  ReplyDelete
 4. నాగార్జున హాస్పిటల్ నుంచి.. సడన్ గా ఇంటికి వచ్చేసి..
  తల్లి ఆశ్చర్యంగా చూస్తుంటే.. "ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా" అని అన్నప్పుడు.. ఆ తల్లి పాత్ర వేసినావిడ నటన నాకు ఎన్ని సార్లు చూసిన కంట తడిపెట్టిస్తుంది.
  అంతే కాదు అలాంటి సబ్జెక్ట్ ని అంత అందంగా తీయడం మణిరత్నం కే సాధ్యం..

  ReplyDelete
 5. కేక
  భలే రాసారు అన్నా

  ReplyDelete
 6. అవును బలే మంచి సినిమా. నేన ఒక పాతిక సార్లు చూసేసి తెగ కలలు కనేసా(జబ్బులు రావాలని కాదండోయ్).

  ReplyDelete