Apr 1, 2010

టెస్టింగ్ - నాకు తెలిసినంతలో ఓ పరిచయం

ఇవ్వాళ్ళ రేపట్లో చాలామంది, ఉత్తినే, ఏంపెద్ద క్నాలడ్జీ లేకుండా ఐ.టీలోకి రావాల్నంటే, బెస్టు *టెస్టింగ్* అనుకుంటుంటారు.
ఆ ఏముంది, టెస్టింగ్ ఈజీనేగా అంటుంటారు.
ఏముందీ రిగ్రెషన్ టెస్టింగ్ చెయ్యటమేగా అంటుంటారు.

నా ఈ చిన్న ప్రయత్నం, టెస్టింగ్ గురించి నిజానిజాలు తెలియజెప్పటమే. నాకు తెలిసిన రెండు ముక్కలు పంచుకునే ప్రయత్నం.
ఇదొక సిరీస్ గా రాద్దామని నా ప్రయత్నం.

ముందుగా - అసలు టెస్టింగ్ అంటే ఏంటీ?
క్వాలిటీ అంటే ఏంటీ?
క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటీ?
క్వాలిటీ ఎస్స్యూరెన్స్ అంటే ఏంటీ?

క్వాలిటీ కంట్రోల్ కీ క్వాలిటీ ఎస్స్యూరెన్స్ కీ సంబంధం ఉందా?

క్వాలిటీ ప్రాసెస్ ఎప్పుడు మొదలౌతుంది?
టెస్ట్ సైకిల్ ఏంటీ?
టెస్ట్ ప్రాసెస్ ఏంటీ?
టెస్ట్ పాయింట్ ఎనాలిసిస్ అంటే ఏంటీ?
వి మరియూ వి అంటే ఏంటి?
వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తాం?
వేలిడేషన్ ఎప్పుడు చెస్తాం?
దేనిపై వెరిఫికేషన్ వర్తింప చేస్తాం?
దేనిపై వేలిడెషన్ వర్తింపచెస్తాం?
అన్నిటికన్నా ఒక టెస్టర్ కి ఉండాల్సిన లచ్చనాలేంటీ?
యాట
యాట
యాట

ఒక్కో టపాలో ఒక్కో సంగతి.

ముందుగా -
టెస్టింగ్ అనేది తెలుసుకునే ముందు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోవాలి.
గతంలో, అనగా తెల్లోడు కంప్యూటర్ ని కనిపెట్టి బజ్జీకొట్టాక, పాతికేళ్ళ తర్వాత మన దేశంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చిన కొత్తల్లో పుస్తకాల్లో చదివిన సంగతి -
లైఫ్ సైకిల్ అంటే -

[మూలం - వికీపీడియ http://en.wikipedia.org/wiki/File:SDLC-Maintenance-Highlighted.png]

మొదలుపెట్టుట
ప్లాన్ చేయుట
డిజైన్ చేయుట
పరీక్షించుట
విడుదల చేయుట
మేయిన్టెనెన్స్ చేయుట
[మొత్తంగా ఇదే కాదు. ఇందులో ఇంకా చాలా ఫేజ్లు ఉండచ్చు, ఉన్నాయి కూడా. ఇది కేవలం బ్రీఫ్గా మాత్రమేసుమా]
అనే లాంటి అడుగులన్నిటినీ కలిపితే వచ్చేదే లైఫ్ సైకిల్.

వాటర్ఫాల్ మోడల్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చదువుకున్నాం.
దీని ప్రకారం నీళ్ళు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలా పై తెలిపిన అడుగులని ఊహించుకోవటం అన్నమాట.
అంటే
ఇదిగో ఇలా -

[మూలం: http://en.wikipedia.org/wiki/File:SDLC-Maintenance-Highlighted.png]
తర్వాత్తర్వాత పెద్దలు కుర్చుని అబ్బాయి ఇది కేవలం కొన్ని రకాల ప్రాజెక్టులకి మాత్రమే బాగుంటుంది అని సమాలోచన చేసి ఐటెరేటివ్ మాడల్ అని ఇంకొక విధానంతో ముందుకొచ్చారు. ఇంకొందరు పెద్దలు స్పైరల్ మాడల్ అనే ఒకదాన్ని లిఖించారు. కొందరు ఫౌన్టైన్ మాడల్ ముందుకి తెస్తే మరికొందరు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ విధానాన్ని వినిపించారు.

ఐతే ఇవన్నీ పాత చింతకాయ విధానాలు.
ఇవ్వాళ్ళా రేపట్లో ప్రఖ్యాతి చెందిన కొన్ని కొత్త పోకడలు ఇవి -
వి విధానం
డబ్ల్యూ విధానం
ఎజైల్ విధానం

మిగతా తర్వాతి టపాలో!!!

8 comments:

 1. నా బ్లాగుని వాటర్ టౌన్ అనే ఊరి నుండి ఎవరో చూస్తున్నారు. ఆల్బనీ నుండి ఇంకా పైకి వెళ్తే వాటర్ టౌన్ వస్తుంది.
  సమచ్చరానికి ఆరునెలలు అక్కడిజనాలు హైబర్నేట్ అవుతారు. కారణం అక్కడ సాలుకి సరాసరి 200 inches లేక అంతకన్నా ఎక్కువ

  ReplyDelete
 2. నువ్వు చేసేపని సరైనదా?
  నువ్వు సరైన పని చెస్తున్నవా?
  ఎంత తేడానో కదా!!

  ReplyDelete
 3. బాగుంది బాగుంది మేము కూడా కొద్దిగా క్నాలడ్జీ పెంచుకుంటాం కానీయండి !

  ReplyDelete
 4. అవును ఆ వికీ పీడియా వోడూ డెవెలప్మెంట్ ను ఇంప్లిమెంటేషన్ లో కలిపేసాడా? వారిని. బాగుందండి. జనాలు టెస్టింగ్ అంటే అప్లికేషన్ ను అలా ఇలా నొక్కేసి చెప్పేస్తే ఐపోతుంది అనుకుంటారు. దాని వెనుక వున్న డేటా, ఆ కథ తెలియదు. ఇంకా వాటర్ఫాల్ పద్దతి వాడుతున్నారా??

  ReplyDelete
 5. వీ.వెం. గణేశ్ - వస్తున్నాయొస్తున్నాయ్ మిగతా టపాలు.
  శ్రావ్యా - :) ఈ మాత్రం ప్రోత్సాహం ఇస్తే చాలు, ఇరగ్స్ తిసేస్తా
  భావన - హ్మ్!!
  డెవలప్మెంట్ = డిజైన్ ఇంప్లిమెంటేషన్ (ఇన్ అదర్ వర్డ్స్, ఓ రకంగాజెప్పాలంటే)

  ReplyDelete
 6. Bhaskar garu, nice article andi. waiting for the remaining article.

  ReplyDelete
 7. it s good to analyze in telugu information in testing tools
  .

  Thank u to the creator of this web owner.

  ReplyDelete