ఈ రోజు నుండి కేంద్రం ఓ బృహత్తర చట్టాన్ని అమలు చేయబోతోంది.
అది, నిర్బంధ ఉచిత విద్య.
ఒకటి నుండి పదిదాక అనుకుంటా. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయని డా॥ మన్మోహన్ సింగ్ అన్నారు.
దీనికి కొన్నివేల కోట్లు ఖర్చు పెట్టబోతోందని సెలవిచ్చారు.
అలాచెప్పు అన్నాను, అది వేరే సంగతి, పాపం ఆయనకి వినపళ్ళా.
ఇంకోవార్త
పాతబస్తీలో కర్ఫ్యూ సడలించారట.
పాలు లీటరు వంద
కూరలు పావుకిలో పాతిక
గత కొన్ని రోజులుగా కర్ప్యూ వల్ల కొందరిళ్ళలో అనగా రోజువారీ కూలీల గుడిశెల్లో పిల్లులు పొయ్యిలోంచి కదలటంలేదట. అటు కూలీలేక, ఇటు ఇంట్లో బియ్యం గట్రా లేక పేదోడి బతుకు కర్ఫ్యూ అయిందని వార్త.
ఇంకోవార్త
భూగర్భ జలం విలవిల -
రాష్ట్రంలో భూగర్భ జలాల పరీస్థితి ఆందోళనకరంగా మారిందట. పరిమితికి మించి నీటివాడకం జరుగుతోందని ఈనాడు వాత్రా పుత్రిక రాసుకొచ్చింది.
దీనిగురించి ఎవరన్నా సలహా ఇవ్వాల్సొస్తే ఏం ఇస్తారూ? ఎలా నీటిని వ్యర్ధం చేయకుండా వాడుకోవాలని మీ ఉద్దేశం?
నా దృష్టిలో -
వ్యవాసాయ ఉత్పత్తులకి, నిత్యావసరాలకీ గ్రే వాటర్ ని వాడితే మంచిది అని.
బోర్లేసి, సర్రున నీళ్ళు లాగుతున్నారీరోజున అటు అపార్టుమెంట్ల వాళ్ళూ ఇటు రైతులు కూడా...అది తగ్గించి, నిత్యావసరాలకి అతి శులభంగా నీటిని రీసైకిల్ ఎలా చేసుకోవచ్చో ఇంజనీరింగు విద్యార్ధులు ఆలోచించాలని నా కోరిక.
Subscribe to:
Post Comments (Atom)
I think it is not a compulsory education but Right To Education.
ReplyDeleteమంచి విషయాల పై రాసారండి.
ReplyDeleteనిర్భంధ విద్య మీద నేను కొంచెం ఆశావహంగా ఉన్నాను.
ఎందుకంటే దీనికి అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం అడుక్కుండె చిన్నపిల్లల్ని వెంటనే అరెస్టు చేసి ఆశ్రమాలకు పంపే రూలు పెట్టింది. పిల్లల్ని రోడ్డు మీద అడుక్కుంటూ చూస్తె గుండె కల్లుక్కు మంటుంది. ఈ అడుక్కునే పిల్లల మీద వ్యాపారం చేసేవాళ్ళన్నా తగ్గుతారేమో.
ఆలోచించ వలసిన విషయాలు సోదరా.. నీటి వినియోగం లో ప్రతిఒక్కరు చైతన్యవంతులమై జాగరూకతతో వ్యవహరించాలి. రీసైకిలింగ్ కూడా ఆలోచించవలసిన విషయం. నిర్భంద విధ్య మంచే చేస్తుందని ఆశపడదాం చూద్దాం ఎలా నిర్వహిస్తారో ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మంచి ప్రయత్నం.
ReplyDeleteపిల్లలకు ఏం తెలుసు పాపం చదువు కావాలా అంటే ఖచ్చితంగా వద్దనే అంటారు. కాని పెద్దయిన తరువాత భాదపడతారు. నిర్బంధ విద్య ఖచ్చితంగా అవసరమే.
ReplyDelete