Nov 14, 2008

ఏంటీ ఈ గందరగోళం?

ఒకళ్లమీద ఇంకొకళ్లు ఇలా బురద జల్లుకోవడం ఎంతవరకూ భావ్యం?
నా ఉద్దేశంలో బ్లాగటం:
1.నా బ్లాగు - నా ఇష్టం, నా బ్లాగుగికి నేనే వై.యస్.ఆర్, నా బ్లాగుకి నేనే మహరాజ్. కాదని ఎవడూంటాడు. ఐతే - బ్లాగు శరీరం లాంటిది. నా శరీరం నాఇష్టమని బట్టలిప్పుకుని తిరిగితే జనాలు రాళ్లేస్తారు.
2. సెన్సిటివిటి - నా బ్లాగు నా ఇష్టం అని కొన్ని సున్నితమైన విషయాల మీద రాయడం అవివేకం. నేనేమి సంఘ సంస్కర్తని కాను. నేనూ సోర్దజీవినే.
3. మన సమాజమ్లో ప్రతీది ఓ దారంతో అల్లబడి ఉంటుంది - మన సంబంధాలు, కులాలు, మతాలు, మనస్సులు, ఆలోచనా విధానాలు - టెంపర్మెంట్లు, ఎదురుతిరిగే తత్వం అన్నీ - తెగిందాకా లాక్కోవటం దేనికి?
4. నీతులు గోతులు అనవసరం. ప్రతీవోడు సదువుకున్నోడే. ప్రతీవోడూ ఆలోచిస్తాడు. నేను కొత్తగా మన సరిత్ర ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నా చరిత్రతోనే తెల్లారుతోందిగాబట్టి.
5. నా కాల్లో ఉన్న ముల్లు తీస్కోనీయండి ముందు, పక్కనోడి కాల్లో ముల్లులు తర్వాత దింపొచ్చు.
6. రాసేవోనికి సదివేవోడు తక్కువ ఏమాత్రంకాదు. నేను రాసింది ఇంకోడుచదువున్నాడు అంటే వానిది పెద్ద మనసు అని. అంతే కాని నాయ్యాల, నేను కోడిపియ్య తొక్కా, వాశ్సనజూసిపో అంటే, కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది.
7. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమ్మన్నా.
సివరాకరిగా
8. ఎదవగోల ఆపేస్తా (ద్దాం)

18 comments:

  1. point 6) - sebbAshO - ee haa.. :)..maLLI ee haa...:)...maLLI maLLI ee hA...:)

    ReplyDelete
  2. నా బ్లాగ్ నా ఇష్టం, నాన్నా ;)

    ReplyDelete
  3. నాన్నారూ, కుమ్మేహేరు నాన్నారూ. ఆరో పాయింటు కుమ్మేహేరండి బాబూ...

    ReplyDelete
  4. బాగా చెప్పారు.మీరన్నట్లు చదివేవారు రాసేవారికేమీ తక్కువకాదు. విద్యావంతులం , రాసే విషయాల పై కూడా విజ్ఞత అవసరం.ఎంత మీ బ్లాగుకు మీరే supreme అయినా మన రాత అందరికీ అమోదయోగ్యంగా ఉండాలి! ఒక సిరా చుక్క లక్షలాది మంది ప్రజలను ఆలోచింపచేస్తుంది అంటారు కదా.ఎంత రాసామన్నది కాదు ,ఎంత మందిని అలరించిందో ముఖ్యం.మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి.

    ReplyDelete
  5. "మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి"

    మిగిల్నోళ్లనొదిలేసినా, కనీసం మన్రాత మనకన్నా ఉపయోగపడాలి :-)

    ReplyDelete
  6. superooooo soooperu

    debbadipoyindanteee

    ReplyDelete
  7. భాస్కర్ రామరాజు గారు.... ఇరగ తీసారు. సూపర్. "నేను కోడిపియ్య తొక్కా, వాశ్సనజూసిపో అంటే, కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది ".

    ReplyDelete
  8. ఈ ఆరో పాయింటు కి ఇంక వేరేదానికి లింక్ ఎమన్నా ఉందా? ఉంటే చెప్పండి !! అందరి దాన్నే నొక్కి మరీ చెప్పారు

    ReplyDelete
  9. Really a good post... Well written, Very timely attempt. Keep it up!

    ReplyDelete
  10. @శరత్ - Thanks Sir
    @సుత్తి నరేష్ కుమార్ - నా ఈ పోష్టుకి ప్రేరణ మీ పోష్టుల్లోని కొన్ని వ్యాఖ్యలే. Thanks for your comment.
    @విజయమోహన్:>>ఒక సిరా చుక్క లక్షలాది మంది ప్రజలను ఆలోచింపచేస్తుంది అంటారు కదా.ఎంత రాసామన్నది కాదు ,ఎంత మందిని అలరించిందో ముఖ్యం.మన రాత కొంతలో కొంతయినా నలుగురికీ ఉపయోగపడాలి. Well Said. Thank You.
    @అబ్రకదబ్ర - >>మిగిల్నోళ్లనొదిలేసినా, కనీసం మన్రాత మనకన్నా ఉపయోగపడాలి :-).
    బాగా చెప్పావు పల్నాటి సోదరా
    @rama : Thanks
    @మాష్టారు: ధన్యవాద్
    @లచ్చిమి: దెబ్బడి-పోయింది. అదేకదా నా బాధ, పోయిందే అని.:):)
    @చైతన్య - చైతన్యవంతంగా ఉన్నావోయ్.
    @vj: లింకా? సరే విను - కోడిపియ్య - ఒక పి.పూ.పో (పిచ్చి.బూతు.పోష్టు). కాకిరెట్ట - అనోనిమస్ వ్యాఖ్య. సరే - ప్రిసైజ్గా పిచ్చి పిచ్చి పోష్టులు బరికేసి, సదువుకోపో నయ్యాలా అంటే అనోనిముస్ వొచ్చి దూలడాట్కోడాటిన్ తీర్చిపోతాడు అని.
    @అన్నగారు: Thanks
    @అరుణ పప్పు: మీ "అరుణం" చూసాను. బాగుంది. ధనస్సు - Sagittarius వాళ్లు(ళ్లం) కొంచెం different గా అలోచిస్తా(మే)రేమో??? Thanks for your comment.

    ReplyDelete
  11. @సుత్తి నరేష్ కుమార్: మీ బ్లాగ్పోష్టులు చాలా బాగున్నాయ్. I mean, Quality wise. సెటైర్ లా కాకుండా విడిగా - స్ట్రైట్గా చదివినా - U are managing the depth. Thanks

    ReplyDelete
  12. రామ రాజు గారూ... మీరు 100 % కాదు కాదు 200% కరెక్ట్. ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో నాకు తెలియదు కాని... ఒక సారి ఒకరు బాపు గారిని : సార్ చాలా కథలకి సీరియల్స్ కి బొమ్మలు వేస్తారు కదా ఎంతిస్తారేమిటి అని అడిగితె .. నాకు డబ్బులు ఇచ్చేది బొమ్మలు వేసినందుకు కాదు నాయనా ఆ సుత్తి కథలు సీరియల్స్ చదివినందుకు అని జవాబిచ్చారట. నా లెక్కన మీ బ్లాగులకి మీరు మహారాజులు సుమన్లు కాదు.. ఓపికగా చదివి, అంతే ఒపికిగా కామెంటులు రాసే మేమే మహారాజ పోషకులం.

    ReplyDelete