Apr 22, 2010

ఈ కధ చూడండి. భలే రంజుగాయుండును

ఓనాటి కాలంలో, మడిసి, ఓ *త్తో గునపమో లేక ఓ ఆయుధమో పట్టుకుని వేటాడి ఆ జంతువు నుండి ప్రొటీన్ని పొందేవాడు. టెక్నాలజీ పెరిగింది. రోజులు మారాయి. జంతువుల్ని వేటాడ్డం కన్నా, పెంచి పెద్దజేసి, వాటికి బాగా పుష్టి రాంగనే ఏసేసి అమ్మేస్తే అదో పెద్ద వ్యాపారం అవుతుందని నిరూపించాడు. ఇవ్వాళ్ళా రేపట్లో ఏ సీజన్లో ఐనా మామిడి పళ్ళు దొరికినట్టే, ఏ సీజన్లోనైనా మాంసం దొరుకుతుంది. అంటే, డిశెంబరు లాంటి గడ్డకట్టే చలిలోకూడా మాంసం దొరుకుతుంది.
ఇవ్వాళ్ళ పావుకిలో స్టీక్ తయ్యారుచేయటానికి వాడే గ్రాసం నలభైమందికి ఒకపూట పొట్టనింపుతుందని మీకు తెలుసా? ఆరోజుల్లో ఇలా బజారుకెళ్ళి అలా ఓ నాలుగు కిల్లోల ఆవు, రెండుకిలోల పంది తెచ్చేసేవాళ్ళు కాదుగా. ఆటికోసం ఎళ్ళాల వేటాడాల సంపాల అప్పుడు ఎత్తుకొచ్చుకోవాల. ఆవేళ సహజ సిద్ధంగా పెరిగే జంతువులను వేటాడితే ఇవేళ వాటిని పెంచి వధించటం చేస్తున్నారు, ఐతే, ఈ పెంచటం వల్ల, జరిగే నష్టాలు సానా ఉన్నాయంట.
కత ఏందంటే - డెవలప్డ్ దేశాలు, డెవలపింగ్ దేశాలతో ఎలా ఆటలాడతాయో ఓ మచ్చుకి ఉదాహరణ -
అమెరికా లాంటి దేశల్లో, మాంసం ఓ శాతం లోపల్లోపలే ఆవుల్ని పందుల్ని పెంచుకుని వధించి పొందితే, ఇంకొంత శాతం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి దిగ్స్ మతుల్స్ చేసుకుంటారట.
బ్రసిల్ అనగా బ్రెజిల్ లాంటి దేశాల్లో, ఇలాంటి ఎగుమతులు చెసే కంపెనీలు మహా లాభాలు గడించేస్తున్నాయట. ఈ ఎగుమతులకోసం వీళ్ళు ఎంచుకునే జీవాలకి మాంచి కండ పుష్టి రావటంకోసం మాంచి దాణా తయ్యారుజేసి మేపుతున్నారట. ఇంతవరకూ బానే ఉంది. ఈ దాణాల్లో మిల్లెట్స్ అంటే చిన్న ఇత్తనాల రకాలు, ఒకరకమైన కాయధాన్యాలు ఎక్కువగా వాడాతారు. ఉదాహరణకి పిల్లిపెసర జొన్న సజ్జ లాంటివి. ఐతే ఇంకో లెక్కల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మిల్లెట్స్ అనేవి పేదవాడికి ప్రొటీన్ని అందించే ముఖ్యమైన మూలాలు. ఓ వైపు పేదోడికి ఆడి పిల్లలకి మాల్న్యూట్రీషన్ అనగా సరైన పౌష్టికాహారం అందకపోతుంటే, ఇంకోవైపు వాళ్ళ నోటిదగ్గరి చీప్ ప్రొటీన్ ని ఇలా పశువలకేసి లాభాలు గడిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రిల్డ్ స్టీకులు చేస్కుని పక్కన సక్కటి సుక్కతో నోట్టో దాచ్చా సుక్కతో ఆనందడోలికల్లో ఇహారాలు సేస్తున్నారు.

దీనిగురించి చాలా డీప్ గా రాయాలి. అప్పుడప్పుడు కొంత రాస్తుంటా....
తమ్ముడు సత్యంతో నిన్న మాట్లాడుతుంటే ఇయ్యాల్టి గ్లోబల్ వార్మింగ్ కి అభివృద్ధి చెందిన దేశాలే కారణం అన్నాడు. నిజమే. ఎలా? పై తెల్పిన కధలు కొన్ని మన వాతావరణనాన్ని ఏమన్నా ఎపెక్టు చెస్తున్నాయా అని అలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంద్దెచ్చా.

ఈరోజు ఎర్త్ డే. భూమి దినం.
నిజంగానే దినం పెడుతున్నాం మనం.
కాదని అనగలవా నేస్తం.
చెట్టు చేమల్ని నరికేసాం.
పుట్టా పిట్టల్ని దులిపేసాం.
అభివృద్ధి పేరున సిమెంటుని భోంచేస్తున్నాం.
దిక్కు తెలీయని పయనంలో పరులుదీస్తున్నాం.
వేడివేడి అని ఏసీలు ఆన్ చేస్తున్నాం.
వేడి ఎందుకు పెరుగుతుందో ఆలోచింపకున్నాం.
ఒక్కరుండే దగ్గర వెయ్యిమందిమి ఉంటున్నాం.
స్టేటసు కోసం వనరుల్ని ఖర్చుచేస్తున్నాం.
భూమితల్లి గుండెని పీకేసి మనమే దినం పెడుతున్నాం.

7 comments:

  1. అభివృద్ధి పేరుతొ మన బాధ్యతా మరిచిపోతునాం

    ReplyDelete
  2. భాస్కర్ గారు. మాంసం ఇండియాలో కూడా మనం అనుకున్నంత చీప్ కాదు. 2005లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామంలో కిలో తెల్ల పంది మాంసం 180 రూపాయలు.

    ReplyDelete
  3. సెరషాల షర్మ గారూ
    మనం అనుకున్నంత షీపు కాదా? మనం హెప్డు అనుకున్నాం? ఎంత అనుకున్నాం? కొంషెం షెప్తారా?

    ReplyDelete
  4. మనుషులు గ్రాసం (గడ్డి) తినలేరు కదా :). మనిషి పశువుల్ని పెంచడం కూడా కొత్త కాదు, మనిషి వ్యవసాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి పశువుల్ని/కోళ్ళని పెంచుకోవడం మొదలు పెట్టాడు. మాంసాహారానికి వేటాడాల్సిన పని లేదు, ఎప్పడు కావాలంటే అప్పుడు కోసుకు తినవచ్చు.
    సరే విషయానికొస్తే, మాంసాహారం/శాఖాహారం లో ఉండే ధర/పోషక పదార్ధాలు పోలిస్తే -- ఒక పౌండు (lb) మాంసం ఖరీదు రెండు డాలర్లు అందులో 151 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి, ఒక పౌండు కందిపప్పు ధర ఒకటిన్నర డాలర్లు, అందులో 100 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి, రేషియో దాదాపు గా సరి పోతాయి. ఒక వేళ మాంసానికి పెట్టె ఆహారం అంత ఎక్కువ అయితే దాని ధర $40 ఉండాలి. మాంసం పేద దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం వల్ల అది అమెరికన్స్ కి చవక కాదు, మాంసాన్ని అమెరికా ఎగుమతి చేస్తుంది (http://www.usmef.org/TradeLibrary/Statistics.asp), అది వీళ్ళు పారిశ్రామిక పద్ధతిలో చవకగా చేయగలుగుతున్నారు . మనకు కూడా చవక గా దొరికితే మన వాళ్ళు మాంసాన్ని కుమ్మేస్తారు. మీడియా కలలు అమ్మినట్లే భయాన్ని కూడా అమ్ముతుంది, నివు చదివిన/చుసిన విషయం అలాంటిది అయి ఉంటుంది.
    వీళ్ళు మాంసం తినడం వల్ల, లేక వీళ్ళ పనుల వల్ల మన భారతం/ప్రపంచం లో అడవులు దెబ్బ తినలేదు, అజ్ఞానం తో మనం జనాభాను పెంచుకొని బాధపడుతున్నాము.

    ReplyDelete
  5. ఇది ఒకసారి చూడండి రాపాలా గారు
    http://swechakosam.blogspot.com/
    పశువుల్ని పెంచటం కొత్త కాదు కానీ అది పశువుల ఉత్పత్తులకోసమే ఎక్కువగా చేసేవారు. పశువధ చాలా తక్కువ.
    రెండు - భారతదేశంలో మచ్చుకి, మాంసం రోజువారీ భోజనం కాదు. అది కేవలం పండక్కో పబ్బానికో మాత్రమే. కేవలం విలాసానికే.
    అమెరికాలాంటి దేశాల్లో రోజువారీ భోజనం అది.

    ReplyDelete
  6. ప్రొటీన్ అనేది ఎంతకావాలి?
    ప్రొటీన్ మీద ఓ పోస్టు రాస్తా వివరాలు సేకరించి. అప్పటివరకూ నా బ్లాగుని సదుతూనే ఉండాండి రాపాలా గారూ

    ReplyDelete
  7. USAలో కొందరు పెంపుడు కుక్కలకి కూడా రోజూ నాన్-వెజ్ పెడతారని విన్నాను. డాగ్ ఫుడ్ కంపెనీలు అందులో నాన్-వెజ్ కలిపే తయారు చేస్తాయని USAలో ఉంటున్న నా ఫ్రెండ్ చెప్పాడు.

    ReplyDelete