Apr 20, 2010

బాలసుబ్రహ్మణ్యం కంట నీరు

ఈపూట ఈనాడు-టీవీ వారి పాడుతా తీయగాలో ఓ పిల్లకాయ ఈ క్రిందిపాట పాడాడు.


ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..రాగమొకటి లేక తెగిన తీగవంటిదే

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూతరగిలింది ఈ రాలుపూతా
విధిరాతచేతా
నా స్వర్ణసీతా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ ! కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాటచేదైన ఒక తీపి పాటా
చెలిలేని పాటా
ఒక చేదుపాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పాట రాసిది వేటూరి గారు
సగీతం రాజన్-నాగేంద్ర

ఇవ్వాల్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజన్ గారు వచ్చారు. ఆయన్తో బాలసుబ్రహ్మణ్యం, కళ్ళు ఒత్తుకుంటూ, ఇలా అన్నారు "ఈ పాట వింటే నాకు దఃఖం ఆగదు, ఇలాంటి పాటలు నాతో పాడించినందుకు కన్నీటీతో మీకు పాదాభివందనం చేస్తున్నా".

ఇదే కార్యక్రమంలో ఒక పిల్లకాయ ఈ పాట పాడుతున్నాడు
నీలి మేఘమాలవో నీలాల తారవో
ఈ పాటని శ్రీ ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు పాడారు. ఇది హిందీలో కీ।శే॥ రఫీ గారు పాడారు.
చౌదవీం కా చాఁద్ హొ, యా ఆఫతాబ్ హొ
జొ భీ హొ తుమ్ ఖుదా కి కసమ్, లాజవాబ్ హొ

ఏంపాటలు గురూ!! రాజన్ నాగేంద్ర గార్లకు ఓ సారి జైహో

7 comments:

  1. nice...........intakumundu vinna anta ekkaledu...marala vinna nice one...........

    ReplyDelete
  2. సూపర్
    అన్నా యూ ట్యూబు లింక్ కూడా దొరుకుతుందా ఆ ఎపిసోడేది

    ReplyDelete
  3. తెలుగు సినీసంగీతంలో ముఖ్యంగా ఘంటసాల అనంతరం వెలువడ్డ గొప్ప తెలుగుసినిమాపాటల్లో ఇది ఒకటి.కాకుంటే యధావిధిగా రాజన్-నాగేంద్ర తాము అప్పటికే కన్నడంలో వాడేసిన బాణీనే మనకిచ్చారు అదొక్కటే కాస్త బాధ.

    ReplyDelete
  4. SPB said that they made a few changes to the tune in Kannada. He also sang the pallavi of the Kannada song. Ours is more pleasant than that.

    ReplyDelete
  5. చాలా మంచి పాట సోదరా :-) రాజన్ నాగేంద్ర లకు జై...

    ReplyDelete
  6. ఆ ఫోగ్రామ్ కి నేను పని చేసాను, ఎస్.పి. గారు ఒక విషయం వివరించారు అందులో...! తను మొదట కన్నడలో ఈ మెలోడియస్ పాటలు రాజన్-నాగేంద్ర గారి సంగీత దర్శకత్వం లో పాడాను..తెలుగులో అటువంటి పాటలు పాడించేవారు .లేరు ! అలాగే తెలుగులో అవి పాడి తనకు కొన్ని మెలోడీస్ పాటలున్నాయి అని తలుచుకునే అవకాశం కావాలి అన్న ఉద్దేశం తో అవే ట్యూన్స్ మల్లి తెలుగులో రాజెన్ నాగేంద్రలను బతిమాలి పాడించుకున్నారట..బాలు గారే ఆ విషయం అక్కడ చెప్పారు..ఈ మాటలు ప్రసారం కాలేదేమో ..బహుశ ఎడిటింగ్ లో కట్ చేసి ఉండచ్చు లెగ్త్ ఎక్కువ ఉందేమోని..!

    ReplyDelete
  7. వినయ్ - ధన్యవాదాలు.
    హరే - లేదు తమ్మీ. బహుశా యూట్యూబ్ లో దొరకొచ్చేమో. నాకు తగిల్తే ఇక్కడ పెడతాలే.
    రాజే - అన్నగారూ. నమస్తే. అలా అయినా, తెలుగుదనం ఉందా సంగీతంలో. పాటకి సంగీతానికి ఒకదానికొకటి చక్కగా కుదిరాయి. ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ అన్నమాట
    మాధురి - ఔను. నేను కేవలం కొన్ని మాటలు మాత్రమే రాసాను. నేను ఆడియో కాప్చెర్ చేసా కానీ నా యంపిత్రీ డిడియల్ ఫైల్ అయింది కన్వర్ట్ చేయటంలో.
    వేణూ బ్రదర్ - జై జై
    కమల్ - నా బ్లాగ్ టపా చదివినందుకు ధన్యవాదాలు.
    మీరా కార్యక్రమంలో పనిచేసారా? వావ్. చాలా చక్కటి విషయాలు తెలియజేసారు. తెరవెనుక సంగతులు తరచుగా మీ బ్లాగ్ ద్వారా పంచుకుంటుండండి బ్రదర్.
    >>అలాగే తెలుగులో అవి పాడి తనకు కొన్ని మెలోడీస్ పాటలున్నాయి అని తలుచుకునే అవకాశం కావాలి అన్న ఉద్దేశం తో అవే ట్యూన్స్ మల్లి తెలుగులో రాజెన్ నాగేంద్రలను బతిమాలి పాడించుకున్నారట
    నిజమే అనిపిస్తుంది కదూ. పంతులమ్మ చిత్రంలోని దాదాపు అన్నీ పాటాలు కన్నడంలో కూడా ఉన్నాయి. సిరిమల్లె నీవే అనేపాట తెలుగులో ఎంత పాప్యులర్ అయ్యిందో కన్నడంలోకూడా అంతే పాప్యులర్ అయ్యింది.

    ReplyDelete