Mar 31, 2010

మిషిగన్ లో సూర్యాస్తమయం - జ్ఞాపకాల దొంతర

అన్నగారు కొత్తపాళి గారు, మిషిగన్ లో సూర్యాస్తమయాలు బాగుంటాయన్నారు.
వెంటనే నా జ్ఞాపకాలను ఓ సారి గిలక్కొట్టా. ఇది పైకి వచ్చింది.
అది మార్చ్ మాసాంతం. నేను స్థానిక ఫార్మింగుటన్ కొండల్లో ఉన్నా ఆకాలంలో. మా స్నేహితులు కొందరు నన్ను సూట్టానికి షికారుగా వచ్చి, పదహే, అలా వెళ్దాం అన్నారు. యాడికీ అన్నా. కెసీనోకి వెళ్దామా అన్నాడు మా నెల్లూరి పెద్దారెడ్డి. డీట్రాయిట్ సరే వాకే అన్నా. బువ్వ గివ్వా కానించి, బయల్దేరాం. బాచిబాబాయ్ నీకాడ ఐడీ ఏంలేదుగా పాసుపోర్టు తెచ్చుకో అని ముందుగానే సెప్పాడు మా నెల్లూరి పెద్దారెడ్డు. అన్నీ జోబిల్లో కుక్కుని బయల్దేరాం.
సమయం పది కావొస్తోంది.
పెద్దారెడ్డి కార్లో ముందు ప్యాసింజర్ సీట్లో కూకున్నా. ఉన్నట్టుండి మావాడు బాచిబాబాయ్ సూడు అని మూన్రూఫ్ తెరిసాడు.
ఆయాల పున్నమి అనుకుంటా.
ఓహ్! మ్యాన్....
సంద్రుణ్ణి అంత దగ్గరగా నా జివితంలో, నిజ జీవితంలో హెప్డూ చూళ్ళా!! అదో రకమైన రంగు, ఎరుపు గోధుమ కలిపినట్టుగా ఉందా ఆ రంగు, ఏమో అనుకుంటా. కారు ఆ సిమ్మెంటు రోడ్డుమీద సర్రున వెళ్తుంటే రోడ్డు కొసాన ఉన్నట్టున్నాడు. కొంచెంసేపు మూన్ రూఫ్ నుండి కొంచెంసేపు ఎదుటద్దంలోంచి, దోబూచులాడుతూ వెంటాడాడా వేళ సన్దమామ, సాన్ద్. అప్పుడనిపించింది, భవకవులు ఎందుకంతలా సన్దమాఁవంటే పడిసచ్చిపోతారో అని.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటే ఏంటో అర్ధం అయ్యిందా పూట!! ఆ పసిమివెన్నలరాజు రాక కోసం నిజమే మరి ఎదురుచూడరా వేచి చూడరా ఎవరైనా అనిపించింది.
చల్లని రాజా ఓ చందమామా
నీ కధలన్ని తెలిసాయి ఓ చందమామా నా చందమామా అని కన్నెపిల్లలు చంద్రునితో ఎందుకు ప్రియుణ్ణి పోలుస్తారో అర్ధం అయ్యిందా రోజు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ చాలదు.....

ఆల్బని డిట్రాయిట్ రెండూ ఒకే స్కేల్ పై ఉన్నా, నిడుచందమామ అంత దగ్గరగ కనిపించలా ఎప్పుడూ ఆల్బనీలో..ఏంటో మరి ఆ మాయ.

2 comments:

  1. అసలు మిషిగన్లో ఆకాశమే చాలా వెరైటీగా ఉంటుంది. :)
    ఓ మిషిగన్ పున్నమి చంద్రుడు ఇక్కడ ..

    ReplyDelete
  2. అన్నగారూ
    మీరందించిన లింకునందలి చిత్రము చక్కగాయున్నది. ఇంకెంచెం మంచి కటకమునుపయోగించి చిత్రీకరించియుండిన యెడల, మరింత బాగుండునేమో అనిపించినదని తెలెయజేయుచుంటిని.

    ReplyDelete