Dec 26, 2008

కప్పలు

నిన్న ఎదో ప్రోగ్రాములో కప్పలు వెయ్యటం చూపిస్తున్నాడు. అది ఏమి ప్రోగ్రాము? దానిగురించి సవివరంగా రాస్తా ఇంకో పోష్టులో.
ముందు దీని సంగతి చూద్దాం.
హా!! కప్పలు!!!
మీకు కప్పలు వెయ్యటం అంటె తెలుసా? నిశ్చలనంగా ఉన్న నీళ్లలో, బల్లపరుపుగా ఉన్న రాయినో లెక ఓ పెంకునో తీస్కుని ఏటవాలుగా విసిరితే అది నీళ్ల మీద కప్పలా తెప్పలేస్కుంటూ కొంతదూరం వెళ్తుంది. కప్ప గెంతినట్టు వెళ్లటం వల్ల దాన్ని కప్పాట అనే వాళ్లం. మజా వచ్చేది తస్సదియ్య. నీళ్లు కనిపిస్తే చాలు, ఏస్కో రాళ్లు. పందాలు ఆటికి, ఎవుడిదెక్కువ తెప్పలు అని. రాయి విసరటం ఒక న్యాగ్గా ఒక పధతి, ఆ రాయిని ఎన్నుకోవడం ఇంకో విధానం. చిన్నప్పుడు జేబులోనో బడి సంచిలోనో నాలుగైదు రాళ్లు ఉండేవి. వాటిని బెచ్చాలు అంటాం. కప్పాటకి వేసే రాళ్లుకూడా అలానే గుండ్రంగా, కొంచెం పల్చగా ఉండేలా ఎతుక్కునేవాళ్లం.

మనసు కేరింతలు కొడుతున్నది.
ఉంటా

Note : తెప్పలు - గెంతులు

ఈ పోష్టు రాస్తుంటే మనసులో ఇంకో ఆలోచన కలిగింది. దాన్ని ఇక్కడ పెట్టా. ఆశీర్వదించండీ, మీరూ ఓ చెయ్యి వెయ్యండి, కాలు గూడా వేయొచ్చు!!
http://veedhiaata.blogspot.com/

4 comments:

  1. రమరాజు గారూ,

    మేము యిదే ఆటని కప్పగంతులు పేరుతో ఆడేవాళ్ళం. మా ఊరిబడి ముందే ఒక చెరువు ఉంది. దానిలో ఆడేవాళ్ళం. మేము ఈ ఆటలో ఎక్కువగా పెంకులను(అదేనండి వరపెంకు) వాడేవాళ్ళం.

    ReplyDelete
  2. ఈ ఆట ఆడని వారు అసలు ఉండరేమో!

    ReplyDelete
  3. భాస్కర్ గారు, మీరు చెప్పిన టపా చూసాను, వ్యాఖ్య రాసాను చూడండి. మీరు నా టపాలో చెప్పినట్టు చదువుల మీద టపా రాయండి మంచి చర్చకు దారి తీస్తుందేమో చూద్దాం. నా టపాలో చెప్పిన విషయాలు చర్చించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కనీసం మీరు రాసినపుడయినా సరైన స్పందన వస్తే మేలు.
    snehamolakatalla.wordpress.com

    ReplyDelete
  4. @శెఖర్ గారు: ఈత్స్ ఫున్, ఇస్ నొత్ ఇత్?
    @యోగి: తమ్ముడు, ఇది ఆడానివాడు వచ్చే జన్మలో కప్పై పుడతాడు.:):)
    @ స్నేహ గారు: చూసాను అండి. మొన్ననే మీకు ప్రతివ్యాఖ్య పెడదాం అనుకున్నా. కాని సమయాభావం వల్ల పెట్టలేక పొయ్యా. మన బ్లాగులోకంలో మీరు ఇలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను వీలుచూస్కుని తప్పక రాస్తా. మీకు చెప్తా. ఈలోపల నా బ్లాగు చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.

    ReplyDelete