Nov 6, 2008

పాలిథిన్ బ్యాగ్/క్యారీ బ్యాగ్

ఎప్పటినుంచో రాద్దాం అనుకున్న పోష్టు ఇది.
నేను అమెరికాలో గమనించిన మంచి విషయాలల్లో ఇదీ ఒకటి.వాల్మార్ట్కెళ్లాం అనుకోండి. లోపలకి అడుగుబెట్టంగనే డబ్బాలు పెట్టి ఉంటాయ్ "Please Return Your Plastic Bags Here" అని.

మనం!!! ఈ క్యారీ బ్యాగుల్ని విసిరి, కాలవల్లో పడేసి, నానా రకాలుగా హింసిస్తున్నాం మన నేలతల్లిని.

ఎవడుకనిపెట్టాడోగాని, ఇవిలేకుండా మన జీవితం నడవదా అన్నట్టు ఉంది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్తుంటే బొల్లారం టర్నింగు దగ్గర పెద్ద డంపుయార్డ్, అక్కడనుంచి ఈ సంచులు గాలికి ఎగిరి బళ్లు నడిపేవాళ్ల మొహాల మీద పడటం, యాక్సిడెంట్లు కావటం. ఎన్నోజూసా. ప్రాణాలు పోయినోళ్లుకూడా ఉన్నారు. అలా గాలికి వదిలెయ్యడం మన సాంప్రదాయమా? ప్రభుత్వం చెప్పిందా? మీ టీచెరుజెప్పాడా? ఎవుడుజెప్పాడు అలా ఇస్సిర్నూకమనీ? ఒక్కసారి ఆలోచిద్దాం?

ఒకానొక రోజున గుడ్డ సంచులు, జనపనార సంచులుఉండేవి. ఇప్పుడు అంతా ఫ్యాషన్. ఆ సంచులు తీస్కెళ్లాలి అంటే నామోషి.

ప్రభుత్వం వీటిని బ్యాన్ చెయ్యాలి!! ప్రభుత్వమా వీటిని తీస్కొచ్చింది? కాదే? మనమే!!! ఎవుడో డబ్బున్నోడు తెచ్చాడు, అమ్ముకున్నాడు, ఆ సంచులు అలా, విశాఖ నుంచి గాలికి ఎగురుకుంటూ గుంటూర్ కి వచ్చి అక్కడనుంచి యన్.హెచ్ 5 మిదగుండా హైదరాబాద్ చేరి..హైదరబాదువి అలా చెన్నై చేరి ఇదీ మన సంగతి.

హైదరబాద్ లాంటి మహానగరమ్లో రోజుకి సరాసరి ఎన్ని ఇలాంటి సంచులు ఖర్చు అవుతాయి? కనీసం ఒక్క కేంద్రం ఐనా ఉందా మనకి ఇలా ఇట్టాంటి సంచుల్ని సేకరించేది? ఓ డబ్బా పడేసి, బాబులూ మీ సంచుల్ని ఇక్కడ దీంట్లో దొబ్బండి అని పెట్టటానికి కోట్లు ఖర్చేమీ కాదుగా?


నేను ఈ రోజునుంచి ఈ సంచుల్ని వాడను, అధవా వాడినా వాల్మార్ట్ లాంటి కేంద్రాలల్లో ఉన్న డబ్బాల్లో పడేస్తా. మీరు అలానే చేయండి. దయచేసి.

9 comments:

  1. గ్రోసరీకి మేము మా కావ్వాస్‌ గుడ్డ సంచుల్నే తీసుకెళ్తున్నాం ఈ మధ్య. సంచికి 5సెంట్లు క్రెడిట్‌ ఇస్తున్నారు కూడా. 'కాస్ట్ కో' లాగా అసలు సంచుల్లేని పద్దతి ప్రవేశపెడితే గొడవుండదు.

    ReplyDelete
  2. అనంతపురం జిల్లా మా తాడిపత్రిలో సమర్థవంతంగా ప్లాస్టిక్ కవర్లపై నిషేధాన్ని అమలుపరుస్తున్నారు.అమ్మినవారిపై, కొనితీసుకెళ్ళేవారిపై కేసులు పెట్టడం వలన ఈ పని సాధ్యమయింది.దేశమంతా అమలు జరిగితే బాగుండు.

    ReplyDelete
  3. చాలా మంచి విషయం గురించి చెప్పారండీ. మా ఇంటి దగ్గర కూడా ఈమధ్య ఒక కొత్త సూపర్ మార్కెట్ లో కారీ బాగులు ఇవ్వము, మీ సంచులు మీరే తెచ్చుకోండి, అంటున్నారు... దాని వల్ల సంచులు తీసుకెళ్ళేవాళ్ళ సంఖ్య కాస్త పెరిగింది. నామటుకు నాకు హాండ్ బాగ్ లో ఒక మాములు గుడ్డ సంచీ పెట్టుకునే అలవాటు. దానివల్ల కొంతైనా ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది కదా... మన బ్లాగుల్లోనే చదివాను, ప్లాస్టిక్ సంచుల్ని తిని, చాలా పశువులు చనిపోతున్నాయి అని... కాబట్టి ఎవడో కలెక్షను బాక్సులు పెట్టలేదని వెతికేకన్న, స్వచ్ఛందంగా మనమే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దామా?

    ReplyDelete
  4. రామరాజు,చిలమకూరు విజయమోహన్,విరజాజి,teresa
    గార్లకు అభినందనలు మరియు ధన్యవాదములు.మీలాంటి వారి తెగ తెగ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
    చిలమకూరు విజయమోహన్ గారు మీ తాడిపత్రి వివరాలు మరిన్ని తెలుసుకోవాలని ఉంది.
    అప్పుడప్పుడు ఈ బ్లాగుమీద ఒక లుక్కెయ్యండి
    http://pichukalu.blogspot.com/

    ReplyDelete
  5. Very very good. Excellent. Unfortunately in India, there is no such system.

    Spreading awareness is the only solution.

    ReplyDelete
  6. @teresa: నేను ప్రతీ వారం బిజేస్ కి వెల్త. నో సంచుల వ్యపారం. తోపుడు బండి లో ఏస్కోడం, కార్లో నెట్టుకోడం ఇంటిదెగ్గర దింపుకోటం.
    సంచికి 5 సెంట్లు క్రెడిట్ ఇస్తున్నారా??గుడ్.
    @vijayamOhan: Good to know that Brother.
    @విరజాజి: మీది హ్యాండ్ బ్యాగా లేక చిన్నసైజు ట్రావెల్ బ్యాగా?? Just kidding. అలానే ప్రయత్నం చేద్దాం.
    @రాజేంద్ర అన్నాయ్: >>మీలాంటి వారి తెగ తెగ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
    అర్ధంకలా. చూస్తా మీ పిచికల్ని ఈపూట.
    @sujata గారు: >> Spreading awareness is the only solution.
    Well said. I have started doing that. Thanks

    ReplyDelete
  7. పది సంవత్సరాల క్రితం బొంబాయిలో ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధించారు, మరి అమలు పరిచారు కూడా. ప్లాస్టిక్ సంచి ఇచ్చినవారు(రూ 500) తీసుకొన్నవారు(రూ ౩౦౦) ఇద్దరు జరిమానా చెల్లించాల్సిందే. వర్షాకాలం బొంబాయి సంగతి చాలమందికి తెలిసే ఉంటుంది, వర్షానికి తోడు ఈ ప్లాస్టిక్ సంచులు మురుగు వ్యవస్థ పీక నోక్కేస్తుంటాయి.

    ReplyDelete
  8. అన్నట్టు ఇదినా 50th/యభయ్యో పోష్టు.

    ReplyDelete
  9. may your tribe increase అని,
    యాభయి నా అభినందనలు

    ReplyDelete