Jan 20, 2011

400 వ టపా

హ్మ్! బ్లాగు ప్రయాణంలో మరో మైలు రాయి. ౪౦౦వ టపా.
ఇన్ని రాయగలిగానా అనిపిస్తుంది ఒక్కోసరి. వెనక్కితిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే ఉంది నా ప్రయాణం.
యాభైయ్యో టపాకే రివ్యూ రాసేసాను., ఏంటీ యాభైకే రివ్యూఆ? అని http://ramakantharao.blogspot.com/2008/11/blog-post_07.html
అందులో
"సరే!! మంచోడివే!! నీకు నచ్చిన పోష్టు ఏది?"
"యో!! నేను తొక్కిన కోడిపియ్య కూడా కమ్మటోసన, తెల్సా. నేను రాసిన ప్రతీ అచ్చరం నాకు నచ్చిందే."

పల్లెటూరి హాస్యం రాసాను. ఎంతైనా మూలాలు అవే కదా.
అలా సాగుతూ సాగుతూ, అటు తిరిగి ఇటు తిరేప్పటికే నూరోటపాకొచ్చేసా. గసి అనే టపాతో వందకొట్టా http://ramakantharao.blogspot.com/2009/01/blog-post_19.html
"వారానికోసారి జొన్న రొట్టెలు చెసేది మా అమ్మ. వేడి వేడి జొన్న రొట్టెలు, ఉల్లిపాయకారం, వెన్న. అదీ కాంబినేషన్ అంటే. అలానే, గోంగూర పప్పు, వేడి వేడి అన్నం, వెన్న." అని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా.
ఎన్నో ఒడుదుడుకులమధ్య,  ధైర్యంగా నిల్చుని, మరో మజిలీ చేరాను మూడొందలో టపాతో. సూరిగాడి బడిబాగోతం http://ramakantharao.blogspot.com/2009/09/200.html
"ఠావులు తెచ్చుకుని, పెద్ద సూత్తో [కొందరు టంకంతో], టయందారం పెట్టి కుట్టుకునేవాళ్ళం. భలే ఉండేయి ఆ నోటుబొక్కులు. సిరిగిపొయ్యేవి కావు. కొన్నికొన్ని సార్లు ఠావులు సింపి సగం నోటుబొక్కులు కుట్టుకునేవాళ్ళం. ఎలా, రెండుమూడు ఠావుల తీస్కుని మద్దన దారంపెట్టి సింపేసి కుట్టుకునే వాళ్ళం" అని చిన్ననాటి నోటుబొక్కులు ఎలా కుట్టుకుందీ జ్ఞప్తికి తెచ్చుకున్న.
ఇక 2010, ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్ళు. ఒక్కోచిక్కుముడిని విప్పుతూ తోచినప్పుడల్లా బ్లాగుతూ వచ్చా. ఇదిగో నాలుగు వందలో టపాకి చేరుకున్నా.
ఏవిటేవిటో రాసాను. ఇది బ్లాగులో పెట్టాలి అనిపించినదల్లా టపాకట్టాను. ఏంటిబాబూ ఫోటో తీస్తున్నావూ దీన్నీ బ్లాగులో పెడతావా అనే స్థితికి వచ్చాను.
ఈ మధ్య కాలంలో నా బ్లాగుపై హిట్ల సంఖ్య గణణీయంగా పడిపోయింది. వ్యాఖ్యలు సరేసరి. కారణాలు అనేకం. కానీ, టపాల పరంగా, నేను చెప్పదల్చుకున్నది నిక్కచ్చిగా చెప్పాను.
ఎన్నో రాయాలని ఉంది. ఇంకా ఎన్నో చేయాలని ఉంది. సమయం కుదరటంలేదు. కానీ, చేయదల్చుకున్నది రాయదల్చుకున్నది రాసి తీరతాననే అనుకుంటున్నా

సాధారణంగా బ్లాగుల్లో ఓ ఈక్వేషన్ ఉంటుంది
దాని కథా కమామీషు -
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్

పై ఈక్వేషన్ ప్రకారం గత ఏడాదిగా నేను సరిగ్గా స్పందించలేకపొయ్యా వ్యాఖ్యలకు. కారణాలు అనేకం. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. దాంతో, బ్లాగుల్లో కామెంట్లు పెట్టలేక పోవటం ఒక కారణం. దీనివల్ల నా బ్లాగుని రెగ్యులర్ గా చదివేవాళ్ళని దూరం చేస్కున్నా.

ఐతే, ఏంపర్లేదు. అన్నిటికన్నా ముఖ్యం తృప్తి. నా రాతలు నాకు సంతృప్తిగా ఉన్నాయి. కొందరు అజ్ఞాతంగా చదువుతూ ఎప్పటికప్పుడు వారి విలువైన సలహలు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి, ఐ ఏపీస్

ఎందరో మితృలయ్యారు ఈ ప్రయాణంలో. కొత్తపాళీ అన్నగారు సొంత అన్నలా అనిపించారు. సుబ్రహ్మణ్య చైతన సొంత తమ్ముడైయ్యాడు. ఆర్.కె తమ్ముడైయ్యాడు. మాష్టారు దుర్గేశ్వర రావు గారు పలు సందర్భాల్లో అండగా నిల్చారు ఓ గురువులా. వారి సహాయ స్నేహ తత్పరతను ఎన్నటికీ మర్చిపోలేను. మాగంటి వంశీ, భారారె, శ్రావ్య, నేస్తం గారు, లలితమ్మ, భావన గారు, తెరెసా గారు, సుజాత గారు, సునీత గారు, తమ్ముడు హరేకృష్ణ, తృష్ణ గారు, సోదరుడు వేణు శ్రీకాంత్, ఉమా శంకర్, చైతన్య, చిలమకూరు విజయ మోహన్, మందాకిని గారు, పరిమళం గారు, రాణి గారు, మధురవాణి గారు, పప్పు యార్, దేవరపల్లి రాజేంద్రకుమార్ ఇలా అందరూ నన్ను ఎంతో ఆదరించారు. వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్కుంటున్నా. భరద్వాజ్, జీడిపప్పు, కొండముది సాయి కిరణ్, శశాంక్ లాంటి మితృలు పరిచయం అవ్వటం ఓ అదృష్టంగా భావిస్తా. మరో ముఖ్యమైన వ్యక్తి - నెమలికన్ను మురళి. నా ప్రతీ టపాకి తప్పక కామెంటు రాసేవారు. ఆయనకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. మరెందరో బ్లాగు మితృలు, స్నేహితులు, హితులు, బంధువులు.
నాకు నచ్చిన బ్లాగుల్లో భాస్కర్ బ్లాగు ఒకటి అని మాగంటి వంశీ అనటం చాలా ఆనందం వేసింది.
ముఖ్యంగా కూడలి, జల్లెడ, హారం, మాలిక - వీరు కనిపించకుండా నా బ్లాగుకి ఎంతో ప్రచారం కలిపించారు. పై సంకలనుల పెద్దలందరికీ ధన్యవాదాలు.

28 comments:

  1. 400 is big ...congrats,

    @

    సాధారణంగా బ్లాగుల్లో ఓ ఈక్వేషన్ ఉంటుంది
    దాని కథా కమామీషు -
    యు రీడ్ మై బ్లాగ్
    ఐ రీడ్ యువర్ బ్లాగ్
    యు కామెంట్
    ఐ కామెంట్
    యు నో రిప్లై
    ఐ నో కామెంట్
    యు నో రీడ్ మైన్
    ఐ నో రీడ్ యువర్స్
    ఖేల్ ఖతం
    దుకాణ్ బంద్

    ----------------------------------


    ఇది మ౦చి స౦ప్రదాయమేనా అ౦డి?

    ReplyDelete
  2. ఇది మంచి సాంప్రదాయమేనా?
    ఏమో. ఎవరికి నచ్చింది వారు అనుసరిస్తారు.
    నేను పైన చెప్పింది పోకడ గురించి. మంచా చెడా అనేదానికి పై టపాలో తావులేదు, నేను చెప్పలేను కూడా.

    ReplyDelete
  3. 400 ఆ!! పెద్ద మైలురాయి సోదరా...
    నాలాటి తాబేలు ఎప్పటికి చేరుకోవాలో :-)
    హృదయపూర్వక అభినందనలు :-)

    ReplyDelete
  4. ఈమధ్య నేను ఇటువైపు రాలేకపోడానికి కారణం ఐయీ లో మీ బ్లాగ్ ఓపెన్ చేస్తే వందల కొద్దీ పేజీలు రావడం.. చాలా చాలా ఇబ్బంది పడ్డాను.. ఇప్పుడే 'విహారిణి' మార్చానండీ.. తొలి ప్రయత్నం చేస్తున్నా.. మీ బ్లాగ్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. కాసేపు నేనూ నా బ్లాగ్ జ్ఞాపకాల్లోకి వెళ్లి వచ్చేశాను..

    ReplyDelete
  5. అబ్బో చాలా...చాలా వందలు రాసేసారు. అది అందరితోటి అయ్యేది కాదులెండి. చాలా వందల అభినందనలు.

    ReplyDelete
  6. సోదరా! అభినందనలు.మీకన్నా ఓ శతకం ముందున్నా ఐదు వందలు దాటేసా :)

    ReplyDelete
  7. కంగ్రాట్స్.. మీ బ్లాగుకి నేను కూడా (గత 10 నెలలుగా) రెగ్యులర్ రీడర్.. మీ సూరిగాడి విశేషాలూ, మీ నల భీమ పాకాలూ, పల్నాటి వీరుల చరిత్రా, కరెంట్ ఎఫైర్స్ మీద మీ వ్యంగ్య టపాలూ.. నాకు చాలా నచ్చుతాయి.. సాధారణం గా కవితలూ అవీ ఎక్కువ చదవక పోయినా.. మీరు రాస్తే తప్పక చదువుతూ ఉంటాను.

    ఇక నా ఫేవరేట్ పోస్టులు : కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్వ్యూల కథ :)), సూరి గాడి సిత్రకళా, సూరిగాడి బడి గోల, ఇంకా.. పల్నాటికి ప్రత్యేక రాష్ట్ర హోదా.. :)

    ReplyDelete
  8. మిత్రులే ఏమిటండోయ్... బంధువులం అనుకుంటా :)
    Warm Regards

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. 400!!! అభినందనలండీ....త్వరలోనే పంచ శతం పూర్తిచేసుకోవాలని కోరుకుంటున్నా!

    ReplyDelete
  11. అన్నయ్యా,అందుకోండి అభినందనలు..
    Way to go!

    ReplyDelete
  12. మౌళి, ఆర్కె, వేణు, జయ, మధురవాణి, రాణీ గారు, సాయి, మందాకిని, సునీత గారు, ప్రబంధ్‌చౌదరి గారు, శ్రావ్య, భరద్వాజ, పరిమళం గారు, హరే -
    ధన్యవాదాలు
    మురళి భాయ్- :) అప్పుడప్పుడూ ఈ బ్లాగరు గాడు విసిగిస్తుంటాడు, నిజమే. ధన్యవాదాలు.
    చిలమకూరు విజయ మోహన్ భయ్యా - కుమ్మావుగా. నే గమనించలా. ఐదువందల్ - కెవ్వు కేక.
    కృష్ణప్రియ గారూ - ధన్యవాదాలండీ.
    కొండముది సాయి కిరన్ - :) ఔను సోదరా. బంధువులం.

    ReplyDelete
  13. కాస్త ఇబ్బందిపెట్టేశారు .దిగ్విజయోస్తు

    ReplyDelete
  14. 400 పోస్టులు మామూలు విషయం ఏమీ కాదు,కొన్ని సొల్లులోకి పోయినా దానికి తూకానికి మిగాతా వాటిలో బరువు సరిపోద్ది కాబట్టి వాసి కీ ఢోకా లేదు,కాకపోతే ఒక్కోసారి బద్ధకించేస్తుంటారులే జనాలు కామెంటుపెట్టడానికి.ఏది ఏమయినా మనకి సంతృప్తిగా ఉందా లేదా అన్నదే ముఖ్యం అనుకో కానీ చదువరుల చప్పట్లు కూడ మరికొంత ఉత్సాహాన్నిస్తాయిలే మరి.

    అందుకో శుభాభినందనలు ఇలాగే మెల్లిగానో వేగంగానో దూసుకుపోయి 500 కూడా పూర్తి చేసేస్తే సంతోషం.శుభం

    ReplyDelete
  15. Congrats. Came a long way huh!!
    As far as I read and noticed, you have never compromised on your presentation(style) or the content of material(substance), for the sake of either political correctness or for fake tone of civility.
    I regard this as the "Authenticity", which is what this blog is known for I think.

    Now..as to your observation of "పరస్పర వీపులు గోక్కోవడం" you can rest assured that my comment here doesn't fall in to that category, as I don't have blog, nor do I intend to have one in future. So, my comment is authentic too :-)

    ReplyDelete
  16. Kumar- thats a great complement. Thank you very much

    ReplyDelete
  17. Congrats Bhaskar.

    A number is just a number and what matters is the matter.

    Keep going.All the best..

    ReplyDelete
  18. మాష్టారూ - ధన్యవాదాలు
    పప్పూయార్ - పెద్దల ఆశీస్సులు సోదరా.
    ఉమాశంకర్ - ధన్యవాదాలు సోదరా
    అమర్ - ఎలా ఉన్నావ్ బ్రదర్.

    ReplyDelete