Jan 3, 2011

తర్వాత ఎవరూ?

కొన్ని తరాలుగా కొందరిమధ్యన వైరం.
వైరం ఎలా ఐనా పుట్టుందవచ్చు. తప్పు రెండువైపులా ఉండుండవచ్చు. మొదలుపెట్టినవాడిదే తప్పు అయి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఎవరు మొదలెట్టినా, ఒక తరం బాంబు దాడుల్లో మసి అయ్యింది. రెండో తరం వారిలో ఆ కక్షలు చిన్నతనంలోనే మొగ్గలు తొడిగాయి. ఏర్లీ టీన్స్ లోనే ఇంట్లో ఇలాంటి సంఘటనలు జఱుగుతుంటే, కళ్ళముందే తనవాళ్ళను కక్షలు బలితీస్కుంటుంటే వెన్ను చూపనివ్వలేదు ఆ సీమ. ఆ మాటకొస్తే ఆ సీమలోనే కాదు, ఎక్కడైనా అంతేనేమో. ఏఊళ్ళోనైనా అంతేనేమో. నవ్వుతాలుకి అరేయ్ సూర్యా నాన్న నన్ను కొట్టాడ్రా అని సూరిగాడి అమ్మ అంటే, మా సూరిగాడు నన్ను కొట్టటానికి కొచ్చిన సందర్భాలు అనేకం. ఇది పిల్లల్లో కుటుంబపట్ల తల్లి తండ్రుల పట్ల ఉండే ప్రొటెక్టివ్ నేచర్‌కి కేవలం ఉదాహరణ. ఏమాత్రం ఫ్యాక్షన్ అనే మాటకి, అనే ఓ ప్రక్రియకీ కనీసం దరిదాపుల్లోలేని కుటుంబాల్లోనే ఇలా ఉంటే, చుట్టూ వేల కళ్ళలో, నిప్పులు కక్కే కళ్ళు, నిన్ను నీ కుంటుంబాన్ని మసి చేస్తాం అనే కళ్ళు, నిన్ను రక్షించుకుంటాం అనే కళ్ళూ, తర్వాత నువ్వే అనే కళ్ళ మధ్యన పెరిగే ఓ ప్రాణికి, కళ్ళముందే కుటుంబాలకు కుటుంబాలే మసి ఐపోతుంటే, నెత్తురు వేడెక్కక ఏమౌతుందీ? ఇది రెండువైపులా జరిగిందే. తప్పెవరిదీ అనేకన్నా, దీన్ని మోసేవాళ్ళ స్వార్థాన్ని చూడలేకపోతున్నాం, చూపలేకపోతున్నారు ఎవరైనా. బలైయ్యేవాళ్ళు పావులు మాత్రమే అని నా అభిప్రాయం. మరో తరం బలైయ్యింది. *తలకు తల, చావుకి చావు* అనే నెంబర్లాటా కోసమో, బావ కళ్ళలో ఆనందంకోసమో లేక కొందరు సినీ నిర్మాతల జేబులు నింపటంకోసమే, లేక రాజకీయ (వి)నాయకుల పబ్బం కోసమే.
ఫ్యాక్షన్ హత్యలకు కుటుంబ/ఊరి తగాదాలు ఒక కారణం ఐతే, రాజకీయ స్వార్థం బలమైన కారణం అని నా అభిప్రాయం. దానికి ఉదాహరణలు కోకల్లు. పరిటాల రవి తె.దె.పా ఐతే, మద్దెలచెఱువు సూరి కాంగ్రేస్ అయితీరతాడు. ఒకవేళ పరిటాల కాంగ్రేస్ అయిఉంటే, సూరి తె.దె.పా కి చెంది ఉండేవాడు.
ఒకరికి కావాల్సింది ఈక్వేషన్స్ బా౨లెన్స్(తలకి తల, ప్రాణానికి ప్రాణం) కావటం, మరొకరికి కావాల్సింది దాన్ని అడ్డంపెట్టుకుని గెలవటం.

వార్తాపత్రికలకు కొంత కాలం పండగ మళ్ళీ. తమతమ కథనాలను ప్రచురిస్తాయి. తమ బైయాస్డ్ వార్తలను వెళ్ళకక్కుతాయి. ఇదిగో ఇలా -
"అప్పట్లో 9వ తరగతి చదువుతున్న సూరి చదువు స్వస్తి చెప్పి ఫ్యాక్షన్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు."

తొమ్మిదో తరగతి చదివేవాడు ఐతే గితే ఫ్యాక్షన్/గొడవల్లోకి అడుగెడతాడు. తొమ్మిదో తరగతి చదివే కుఱ్ఱాడికి ఎంత వయసు ఉంటుంది? రాజకీయాల్లోకి అడుగు పెట్టటవేవిటీ?
అనే ఓ ప్రశ్న సదరు జర్నలిస్టుకి రాదు. రాలేదు. కారణాలు అనేకం.
పై రాతలు చదివే నాబోటిగాళ్ళకు మాత్రం ఇలా అనిపించటంలోనూ తప్పులేదు
సినిమాలు చూసీ చూసీ ఫ్యాక్షన్ కి రాజకీయాలకీ తేడా తెలియకుండా పోతోంది మన వార్తాహరులకు. కుటుంబ గొడవలు ఊరి తగాదాలు వేరే రాజకీయాలు వేరే అనే కనీస పరిజ్ఞానం లేకపోవటం సోచనీయం.


ఇహ, ఇప్పుడేవిటీ? మద్దెలచెఱువు సూరికి ఒక కొడుకు.
ఆ పిల్లాడు రేపేంచాస్తాడో చూడాలని ఉంది.
ఈ మారణ కాండలో తర్వాత ఎవరో?

31 comments:

  1. ప్చ్! అన్నీ ప్రశ్నలే... సమాధానాలెక్కడ?

    ReplyDelete
  2. నిజమండీ....కారణాలు ఏమైనా సరే..నిత్యం కక్ష్యలు కార్పణ్యాలతో, ఎవడు ఎక్కడ చంపుతాడో తెలియకుండా, కంటి మీద కునుకు లేకుండా, 40 నిండకుండా పోతున్నారు. ఏం బతుకులో అనిపిస్తున్నాది. ఈ ఊరి, కుటుంబ తగాదాలకైనా అంతు లేదా? నిజమే మన కుటుంబంలో ఎవరికైనా హాని చేస్తే మనం ఊరుకోము...కానీ దీనికి పరిష్కారమేమిటి? ఎన్ని తరాలు నాశనం అవ్వాలి?

    అంతు లేని కథలు...అంతు చిక్కని వ్యధలు!

    మీకొచ్చిన డౌటే నాకూ వచ్చింది. నిన్న వార్త్లు చూసి 13 యేళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించాడా అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీ పోస్ట్ చదివాక అర్థమయింది...వార్తాహరులు నిజంగా వార్త-హరులే అని.

    ఈ ముఠా తగాదాలకు, ఊరి తగాదాలకి ఊరి జనం ఎలా అవస్థలు పడుతున్నారో "దిరిసెన పుష్పాలు" బ్లాగులో శిరీష రాసారు. వీలైతే చదవండి.

    http://dirisena-diresenapushpaalu.blogspot.com/2010/11/blog-post_18.html

    http://dirisena-diresenapushpaalu.blogspot.com/2010/11/2.html

    ReplyDelete
  3. గీతాచార్య-
    ధన్యవాదాలు
    అ.సౌమ్య-
    మంచి లింకు అందించారు. ధన్యవాదాలు
    రాజే సోదరా
    ధన్యవాదాలు

    ReplyDelete
  4. కాని రాజు గాజు గారు ఇక్కడ బ్లాగుల్లో చాలా మంది సూరి చచ్చాడని .. పోయాడని ఎదో కామెడి గా రాస్తున్నారు అలాంటి వాళ్ళకు ఒక్కటే చేప్తున్నాను ఎదుటి వాడు ముఖం మీద ఉమ్మేసిన సిగ్గు లేకుండా తుడుచుకొని పోయేవాళ్ళు ప్రతి రోజు భయపడి బిక్కు బిక్కు మంటు బ్రతికే వాళ్ళకన్న సూరి రవి హీరొలని నా అభిప్రాయం.

    ReplyDelete
  5. హీరోలు అనేకన్నా, వాళ్ళు చేయాల్సింది చేసారు అనుకోవచ్చు. తండ్రిని చంపినోణ్ణి చంపాల అనే మోటో, చంపామా లేదా అనేది పాయింటు.
    కామెడి వెత్తుక్కునే వారికి ప్రతీదీ కామెడీనే. నీళ్ళు కాళ్ళ దాంకా వచ్చినప్పుడు తెలుస్తుంది.
    మా వైపు దాదాపు ఈ కక్షలు కార్పణ్యాలు తగ్గినై. కొన్ని కొన్ని జనరేషన్స్ ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది కోర్టు చుట్టూ తిరిగి లాయర్లకు ఫీజు కట్టటానికి. ఈ కేసులు ఒక కొలిక్కి రావు. వాయిదాలమీద వాయిదాలు. సాక్షులు రారు, జరం వచ్చిందంటాడు ఒకడు, ఊళ్ళో లేనంటాడు ఒకడు. ఇలా. ఇక ఆటి చుట్టూ తిరగలేక తగాదాలే తగ్గిపొయ్యాయి. కానీ రాజకీయాల మనుగడకోసం రాజకీయ హత్యలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఎలక్షను వచ్చందంటే ఎవడోకడు చావాల్సిందే. ఆ చచ్చినోడు, చచ్చేప్పుడు సామాన్య మానవుడు. చచ్చినాక, ఏదోక పార్టీ జెండా కింద తెల్తుందా శవం.

    ReplyDelete
  6. కారణాలు ఏమైనా సరే..నిత్యం కక్ష్యలు కార్పణ్యాలతో, ఎవడు ఎక్కడ చంపుతాడో తెలియకుండా, కంటి మీద కునుకు లేకుండా, 40 నిండకుండా పోతున్నారు. ఏం బతుకులో అనిపిస్తున్నాది.
    ------------------
    సౌమ్య ఎవడు తిట్టినా కొట్టినా చివరికి పెళ్ళాం చేయి పట్టి లాగినా సిగ్గు సరం లేకుండా ... పిరికితనం తో మనకెందుకులే అనుకునే వాళ్ళ కంటె ఈ బ్రతుకులు ఎంతో నయం ... బిక్కు బిక్కు మంటు నిండ నూరేళ బ్రతికేకన్నా ధైర్యంతో 40 ఎళ్ళు బ్రతకడం నయం

    ReplyDelete
  7. రాజు గారు
    బయట పంపు సేట్టు కాడ గొడవలను చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కు ఈ గొడవలు ఎం తెలుస్తాయ్ అండి ... కన్న వాళ్ళను బందవులను కళ్ళ ముందే నరికితే ఆ దుఖం లోంచి వచ్చె కోపం పగ వీళ్ళకేం తెలుస్తాయ్ .... నీతులు చెప్పమంటె మాత్రం అందరు బాగా చెప్తారు మీరన్నట్టు నీళ్ళు కాళ్ళ దాంకా వచ్చినప్పుడు తెలుస్తుంది సంగతెటో

    ReplyDelete
  8. >>చేసుకున్న పాపం ... అవ్వాల్సిందే అనే మాటలు వింటుంటె
    ఇలాంటి అభిప్రాయాలకు రావటానికి మూలకారణం మీడియా. తర్వాత, కులాభిమానం.

    ReplyDelete
  9. తలకు తల, చావుకి చావు

    బాగా చెప్పారు రాజు గారు .... ఫ్యక్షన్ లోకి దిగినా చస్తాడ దిగకపోయినా చస్తాడు కారణం తండ్రులు తాతల అస్తులతో పాటుగా ... పగలు కూడా వస్తాయి కాబట్టి వాడు దిగక తప్పదు

    ReplyDelete
  10. ఇహ, ఇప్పుడేవిటీ? మద్దెలచెఱువు సూరికి ఒక కొడుకు.
    ఆ పిల్లాడు రేపేంచాస్తాడో చూడాలని ఉంది.
    ఈ మారణ కాండలో తర్వాత ఎవరో?


    ---------------------------
    పై కామెంట్ దినికి సంభందించింది

    ReplyDelete
  11. బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ కధలు రాజు గారు కాని సీమలో సూరి -రవి కీ మించిన కధలు చాలా ఉన్నాయి నీడారం ఉళ్ళో చిన్న కాలువ కు సంబందించి మెత్తం నాలుగు ఊర్లు కొట్టుకు చచ్చారు ఇప్పటికి అక్కడ రోజుకో మనిషిని చంపుతున్నారు .. ఇలాంటి చాలా ఫ్యక్షణ్ కధలు బయట ప్రపంచానికి తెలియదు .. అయితే వీటిని ఆపడం అన్నది .. ఎవరి చేతుల్లోను లేదు చివరికి మొదలుపెట్టిన వాళ్ళ చేతుల్లోను లేదు

    ReplyDelete
  12. ఇంకిప్పుడు ఎవురు మిగిలినారప్పా?
    సూరికి కొడుకు మిగిలినాడు. మరి పరిటాల వైపు ఎవురూ?
    భాను అని వచ్చినాడు నడీనడుమ, ఆని గతి ఏమైతదో?

    ReplyDelete
  13. రాజు గారు పరిటా రవి కూడా కొడుకున్నాడనకుంటా .. కాని రవి తమ్ముడి కొడుకు మాత్రం ఉన్నాడ

    ReplyDelete
  14. సీమలోనే కాదు తమ్మీ
    ప్రతీ ఊళ్ళో ఉంటనే ఉంటాయి ఇసుమంటివి. గడ్డివాములకాడ నీళ్ళకాడ దోవల కాడ, యాణ్ణోసోట. అగ్గి రగుల్కుంటానే ఉండిద్ది. నా కండ్ల ముందు ఎన్నోజూసినా. రవి-సూరి సంగతే హైలైటు ఎందుకంటా అంటే పొలిటికల్ కాబట్టి, అంతేగాక, రెండు పెద్ద కులాల కుమ్ములాట కాబట్టి.
    కాదంటవా?

    ReplyDelete
  15. రాజు గారు పరిటా రవి కూడా కొడుకున్నాడనకుంటాను .. కాని రవి తమ్ముడి కొడుకు మాత్రం ఉన్నాడు

    ReplyDelete
  16. అవును రాజు గారు అదే అసలు పాయింట్ ఇక మన మీడియా ఓవర్ యాక్షన్ మీకు తెలియనిదికాదు గా

    ReplyDelete
  17. మెత్తానికి పగలు ప్రతికారాలు ఆగడం అనేది జరగదు .... ఒక్క వంశం నుంచి మరో వంశానికి మారుతుంటాయి అంతే తేడా

    ReplyDelete
  18. పవన్ వాళ్ళ పగలు, కక్ష్యలు సరే...కాని వీటి మధ్య నలిగిపోయే సామాన్య జనం సంగతో...ఏ తప్పు చేయని పాపానికి ఎంతమంది బలయిపోతున్నారో!

    ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూపోతే ఎలా? దీనికి అంతం లేదా?

    ReplyDelete
  19. సౌమ్య గారూ
    మీ బాధని అర్థం చేస్కోగలను సౌమ్యగారూ
    అర్థం చేస్కోగలను.
    అంతం లేదా అని ఎంత ఆర్తిగా అడిగా౨రో కదా...
    అంతం లేదా? పవన్, వి ఆల్ కొసెను, యూ ఆన్సర్...కమాన్..టెల్ అజ్. అంతం లేదా?

    ReplyDelete
  20. అంతం లేదా అంటే పరిష్కారం లేదు ఎందుకంటె చిన్న ఉదహరణ చెప్తాను ... పామును చుస్తే మనిషి కొట్టి చంపుతాడు అలాగే మనిషి కనిపడితే పాము కరుస్తుంది ... ఇక్కడ ఒక్కరి మీద మరోక్కరికి అనుమానం మనిషి చంపుతాడని పాముకు భయం, పాము కరుస్తుందని మనిషికి భయం . ఇక్కడ ఒక్కరు బతకాలంటె ఇంక్కోక్కరు చావాలి ... సరిగ్గా ఫ్యాక్షణ్ లోను ఇదే జరుగుతుంది ప్రత్యర్ధి బతికితె మనం చస్తం మనం బతకాలంటె వాడ్ని చంపాలి లేదా వాడి చేతిలో మనం చావాలి ఇదే అంతం

    ReplyDelete
  21. ఇక గొడవల గురించైతే మా ఉర్లో జరిగిందే చెప్తాను .. మా ఉర్లో హైస్కుల్ లేదు పక్కనున్న గ్రమానికి వెళ్ళి చదవాలి అయితే మా పల్లే అంటె పడని ఆ ఉర్లో కొందరు ఆకతాయిలు మా ఊరి ఆడపిల్లలను గేళి చెయ్యడం . వేధించడం ఇంకా చెయ్యి పట్టి లాగడం లాంటివి చేసే వారు మా ఉరి పెద్దలు ఎంత నచ్చ చేపినా వినలేదు .. పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టిన లాభం లేక పోయింది ఇంకా ఏక్కువ చేయ్యడం మొదలుపెట్టారు అప్పుడు ఆ ఉర్లో ఓ నలుగురిని నరికారు ... ఆ తరువాత అల్లరి చెయ్యడం మాట అటుంచి చూడ్డానికి కూడా భయపడుతున్నారు .. ఇప్పుడు చెప్పు చంపడానికి కారణం ఎవరు ....

    ReplyDelete
  22. గజగజ
    ఏమి ఊరయ్యా నాయనా మీది.
    ప్రతీదానికి నరకటమే పరిష్కారం కాదుగా తమ్ముడూ?
    సమస్య మనలోనే ఉంది. ప్రతీ మనిషిలో ఉంది. ఆ మనిషి నిర్మించుకున్న సమాజంలో ఉంది.
    చట్టం న్యాయం తమ విధులను తాము తూచా తప్పకుండా చేసుకుంటూ పోతే పైవాటికి ఆస్కారం ఎక్కడా?

    ReplyDelete
  23. అవును రాజు గారు ప్రతి దానికి నరకటమే పరిష్కరం కాదు కాని కొన్నిటికి మాత్రం నరకటం మాత్రమే పరిష్కరం ....( రేయ్ పవన్... నువ్వు మరీ పర్సనల్ గా తిసుకోకురా ...) ... వాకే .. ఇక నేను దిని గురించి మాట్లాడను రాజు గారు జనాలు నన్ను బ్యాడ్ అనుకుంటారు ...... నేను డ్రాప్ ... :-)

    ReplyDelete
  24. అసలె ఈ మద్య నాకు ajnaata అభిమానులు ఎక్కువైపోయారు

    ReplyDelete
  25. కత పవన్ ఆలోచనా విధానం బావుంది, అమలు చేసి చూడాలి. ప్రతొక్కడికి ఓ రివాల్వర్ ఇవ్వాలి, ఎక్కడి కక్కడ బట్ట కట్టిన బుర్రకి తోచిన పరిష్కారం చేసుకుంటూ పోవాల్సిందే.
    కతపవన్ తలకు చుట్టుకున్న రుమాల్ బాగుంది. :)

    ReplyDelete
  26. KataPavan,
    They teased your village girls and got killed. Should their relatives avenge their killings or not? What is your 'revolutionary answer'?

    ReplyDelete
  27. వామ్మో అమ్మయిలని ఏడిపించినందుకు తలలు నరికారా? పవన్ ఏమిటి నువ్వు చెబుతున్నది,నిజమేనా!...నే పారిపోతున్నా పోతున్నా పోయా !

    (నాకసలే ఇలాంటివంటే మహా భయం) :(((

    ReplyDelete
  28. Let these @#ckers kill each other. They don't deserve *any* kind of attention. The more they kill each other, the better.

    మా నాయనమ్మ అనేది. "నాయనా ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగుతాడు రా అని" - సూరి అయినా, రవి అయినా, ఇంకోడెవడైనా - ఉప్పు తింటే నీళ్ళు టాగాల్సిందే. మన సమయం వృథా ఎందుకు చేస్కోటం వీటి మీద?

    ReplyDelete
  29. "Let there be peace on earth
    And let it begin with me."
    ~Seymour Miller & Jill Jackson, "Let There Be Peace on Earth," 1955
    "బిక్కు బిక్కు మంటు నిండ నూరేళ బ్రతికేకన్నా ధైర్యంతో 40 ఎళ్ళు బ్రతకడం నయం"
    పేపర్ల కథనం ప్రకారం బ్రతికున్నన్నాళ్ళూ క్షణ క్షణం భయపడుతూనే గడిపాడు.
    ఎదురుగా వెళ్ళి తేల్చుకోలేనప్పుడు ధైర్యం అవ్వదు కదా, పగ అవుతుంది.
    ఆ వాతావరణంలో పుట్టి పెరిగినప్పుడు ఆలోచించుకునే అవకాశమే ఉండకపోవచ్చు.అది దురదృష్టకరం.
    A way out of these is to think of others. There are so many people living in conditions brought upon by them for no fault of theirs and with no connection to politics. If those who are filled with vengeance can be made to turn their attention to the pitiable state of others instead of being consumed with personal vendetta, perhaps better situations could prevail.
    చెప్పినంత సులువు కాదు కదా ఏవీ. So called సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ బతకనివ్వవు, చావనివ్వవు.

    ReplyDelete