Jan 26, 2011

భారతదేశ మాఫియా శిక్షాస్మృతి

భారతదేశ మాఫియా వాళ్ళు వారి సొంత శిక్షాస్మృతిని రూపొందించారు, దానిపేరు భారతీయ మాఫియా శిక్షాస్మృతి. ఇందులో రకరకాల సబ్ కేటగొరీస్, డివిజన్స్, ఉన్నాయి. డీజిల్/కిరసనాయలు మాఫియా వారు వారికనుగుణంగా కొన్ని పేజీలను చెక్కుకున్నారు. ఆ పేజీల్లో, సెక్షను ౧౬౮.ఎ ప్రకారం, ఎవరైనా ఎడిషనల్ కలెక్టర్, లంచాలు తినకండా, డీజిల్/కిరసనాయలు కల్తీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే, వారిని, అదే కిరసనాయలు పోసి తగలబెట్టటం.

యశ్వంత్ సోనావానె, ఎడిషనల్ కలెక్టర్, పట్టపగలు అందరూ చూస్తుండగా డీజిల్ మాఫియా చేత సజీవదహనం కాబడ్డాడు.
దారిన వెళ్తున్న యశ్వంత్, ఇంధనాన్ని కల్తీ చేస్తున్న కొందర్ని చూసి, ప్రశ్నించటానికి ఆగా౨డు. అదీ అతని నేరం.

కారులో మన్మాడో ఎక్కడికో వెళ్తున్నాట్ట.
రోడ్డుపక్కగా ఓ రెండు టాం౨కర్లు ఆగి ఉన్నాయట. పబ్లిగ్గా కల్తీ చేస్కుంటున్నారు సదరు యజమానులు మాఫియాగాళ్ళు. తన మొబైల్లో చిత్రించాట్ట. అదనపు బలగాలకోసం కబురుబెట్టాడట. చెట్టుకింద నిల్చున్నాడట. ఇంతలో మాఫియా వాళ్ళ పెద్దన్నా చిన్నన్నా బండిమీద వచ్చారట, యశ్వంత్ ఎక్కడా అని, చెట్టుకింద అతను నిల్చుని ఉంటాన్ని చూసి, వెళ్ళి, గాసొలిన్ పోసి నిప్పెట్టేసారట.
పోలీసులు యశ్వంత్ మొబైల్ ని తమ కంట్రోల్ లోకి తీస్కున్నారట.

యధాప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గోళ్ళు గిల్లుకుంటూ, ఈ సంఘటనను ఖండించారు. ఎంక్వైరీ వేస్తామని, నేరస్తులు దొరికితే (నేరం చేసినట్లుగా అనుమానిస్తున్న ఏడుగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసారు), కఠినంగా (ఏ సెక్షను అంత కఠినంగా ఉందో భారతీయా శిక్షాస్మృతి రాసినికే తెలియదు) శిక్షిస్తామని చెప్పారు.
మీడియా యధాప్రకారం ఓ రెండురోజులు రకరకాల యాంగిల్స్ చూపుతుంది.
యధాప్రకారం మళ్ళీ, అందరూ మర్చిపోతారు ఇలాంటి సంఘటనలను.
యశ్వంత్ సోనావానె కుటుంబం అలా కుమిలిపోతూ ఉంటుంది.
ప్రభుత్వం ఏదో ఒకటి ప్రకటిస్తుంది.కానీ, న్యాయం మాత్రం జరగదు.


జై హింద్

11 comments:

 1. పిరికితనం జాతినరనరాన జిర్ణించుకునిపోయిఉన్నది. ఇప్పుడెవరు కూడా కళ్లముందే ఇలాంటి అన్యాయం జరిగినా స్పమ్దించే ్ స్థితిలో లేరు.జనం బలహీనతే దుర్మార్గునికి బలం . బలహీనుల చట్టాలు బలహీనంగానే ఉంటాయి

  ReplyDelete
 2. దుర్మార్గం చేసే వారిని నిలదీసి నెగ్గుకు రావడం సులభమైతే దుర్మార్గం జరుగుతుందా, పెరుగుతుందా? వాళ్ళ శిక్షా స్మృతి సరే. మనకున్న శిక్షణ సరిపోదు అన్యాయాన్ని అరికటాడానికి. కొత్త పాఠాలు నేర్చుకోవాలి. కొత్త మార్గంలో ఎదిరించాలి. బాధేసింది చదువుతుంటే. ఇలాంటివి ఎన్నో. తప్పించుకుని తిరుగుతూ ధన్యులమనుకుంటున్నాము అంతే.

  ReplyDelete
 3. దుర్మార్గం చేసే వారిని నిలదీసి నెగ్గుకు రావడం కోఱకే గదా మనకి చట్టాలు, న్యాయాస్థానలు, రక్షక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉన్నదీ?

  ReplyDelete
 4. "దుర్మార్గం చేసే వారిని నిలదీసి నెగ్గుకు రావడం కోఱకే గదా మనకి చట్టాలు, న్యాయాస్థానలు, రక్షక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉన్నదీ? "
  కూరగాయలు కోసేందుకే కత్తి ఉన్నది.
  అది మొండి వైపు పెట్టి కోస్తే మనకే కోసుకుంటుంది.
  అంత సులభం కాదండీ. ఈ వ్యవస్థలన్నీ "మూడో" మనిషి లాగా అంతా జరిగాక ఒకరిది తప్పు, ఒకరిది తప్పు అని చెప్పడానికి. ఆ లోపల కథ జరిగిపోతుంది.
  పోరాటానికి వెళ్ళినప్పుడు పరాభవానికీ ఆస్కారముంటుంది. పోరు ప్రకటించగానే తప్పు చేసే వారు తగ్గిపోరు. అదే జరిగితే ఇంక "పోరాడడం" ఎందుకు?
  "ఇక్కడ చరిత్రలో చదువుతాము, "రోసా పార్క్స్" లేచి సీటివ్వనంది. తిరుగుబాటు చేసింది. నల్ల వాళ్ళందరూ బస్సులెక్కడం మానేశారు. వివక్షతను చూపించే చట్టాన్ని ఎత్తి వేశారు". Something to that effect.
  ఐతే ఒక సంవత్సరం పాటు నల్ల వాళ్ళుఅష్ట కష్టాలు పడుతూ కాలి నడకనే ప్రయాణం చేశారన్నదానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తాము? process చాలా ఉంటుంది, spark కీ ఫలితానికీ మధ్య. త్యాగాలూ, బలిదానాలు కావాలి.
  నా చిన్న ప్రపంచంలో నెగ్గుకు రావడానికే నా నిజాయితీ ఒక్కటీ సరిపోదని తెలుసుకున్నాను. నా నిజాయితీ నా ఆత్మ సంతృప్తి కోసం. గెలుపునే ఆశిస్తే అది పోరాటం కాదు.
  ఏదో దేశభక్తి కూడలి లో పొంగి పొర్లుతుంటే కాస్త ఆవేశం బయటికి లీక్ అయ్యింది.
  ఇంతటితో సరి :)

  ReplyDelete
 5. వ్యవస్థలో పటుత్వం లేనంతవరకూ, మీరన్నట్లు ప్రతీ పిల్లరూ *మూడో వ్యక్తి* లాగానే నిల్చిపోతాయి. ఐతే, కావాల్సింది, అబ్బాయీ ఇలాంటి పనులు చేస్తే ఇదీ దండన, కాబట్టి, అలాంటి అడుగులు వేయకూ అని ఉదాహరణలతో సహా చెప్పే వ్యవస్థ, దాని బలిమి ముఖ్యం.
  గమనించాల్సింది, *వివక్షతను చూపే చట్టాన్ని ఎత్తివేసారు* తోపాటుగా, *వివక్షతను చూపే చట్టాని కఠినంగా అమలు పరచారూ* అని.
  మనకీ చట్టం వ్యవస్థ ఉన్నాయి. కానీ, ప్రలోభాలకూ, స్వార్థానికీ లోబడి నడుచుకుంటున్నాయి.
  ఎక్జంప్లరీ పనితీరు అనేది కొఱవడింది.

  ఐతే ఇలాంటి సంఘటనల యొక్క రిపుల్ ఎఫెక్ట్ - వ్యవస్థలో ఉన్న అఱాకొఱా నిజాయితీ పరులకు మోటివేషన్ తగ్గిపోతుంది.

  *నా నిజాయితీ నా ఆత్మ సంతృప్తి కోసం. గెలుపునే ఆశిస్తే అది పోరాటం కాదు.*

  బాగా చెప్పారు లలిత గారూ. :):) గణతంత్ర దినోత్సవం మీలో దేశభక్తిని ఉప్పొంగేలా చేసింది.

  ధన్యవాదాలు.

  ReplyDelete
 6. హ్మ్మ్, ఇందాకే లంచ్ లో కొలీగ్ తో ఏదో మాట్లాడుతూంటే ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. పైకొచ్చి బజ్ చెక్ చేస్తే మీ బ్లాగు.

  మధ్యతరగతి నిర్వీర్యం అయిపోయిన తర్వాత సమాజాన్ని కొండ కింద నించి పైకి తోయాలంటే, ఏదో అతీంద్రీయ శక్తి, నర నరాల్లో జొరబడాల్సిందే. అప్పట్లో బోర్డు రూములకీ, ఇంటలెక్చువల్ వర్గాలకీ పరిమితమయిన, స్వరాజ్యం అనే ఓ స్లోగన్ ని, మహాత్ముడు మధ్యతరగతి వంటింట్లోకి తీసుకొచ్చాడు.

  మన సైలెంట్ మెజారిటీ మత్తు వదిలి మేలుకోవాలంటే, మరిప్పుడేం కావాలో/రావాలో?

  మెక్సికో సోసైటీని ఎవరైనా ఫాలో అవుతున్నారా ఎవరైనా? నేనక్కడ ఓ ఆర్నెల్లు పని చేసాను కాబట్టి కొంచెం ఓ చెవి అటు పడేస్తా ఉంటా. మన దేశంలో సిస్టం అలా అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం ఏమీ లేదేమో అనిపిస్తూంటుంది, ఇలాంటివి విన్నప్పుడు.

  ReplyDelete
 7. కుమార్ భాయ్
  ఓ టపా కుమ్మవచ్చుగా మెక్సికోలో మీ గమనింపులపై? నా బ్లాగుని మీ బ్లాగుగా అనుకోండి.

  ReplyDelete
 8. పై సంఘటనపై ప్రముఖుల వ్యాఖ్యలు
  Leader of Opposition in legislative assembly Eknath Khadse, held Food and Civil Supplies department responsible for the incident.

  “Two months ago Food and civil supplies Minister Anil Deshmukh carried out the farce of conducting raids (on oil mafia),” Mr. Khadse said.


  Republican Party of India Leader and former MP Prakash Ambedkar also demanded a CBI inquiry into the incident.

  ReplyDelete
 9. DAVOS: Noted industrialist Azim Premji, who was named for the Padma Vibhushan this year, on Wednesday said he is "extremely disappointed" about the performance of the government at the Centre.

  Wipro chairman Premji, who along with a number of eminent personalities had recently written an open letter on a " governance deficit", said they would focus on the "complete breakdown in public governance across the board".

  "I am extremely disappointed. I think it is a national calamity and is personally very devastating because one had so much confidence when they (UPA-II) came in," he told television channels when asked whether the present government was "unable to deliver".

  "But I think, it has reached a point of catharsis. And when something reaches a point of catharsis, there seems to be no alternative but to change. I am optimistic...," he said.

  He said the group (of eminent personalties) would follow up the matter with "fairly concrete" action recommendations as to what can lift the level of governance and make it more focused.

  "We think it is important. We focus attention on the complete breakdown in public governance across the board, whether it be government, or businessmen, or traders...," he said.

  "One has reached a point in public governance where one has to take stock... Enough is enough, we have to reform ourselves. If we don't do that, we are not going to leave children behind us proud of the country, despite 8-9 per cent (economic) growth."

  Recently, a group of prominent personalities, including Premji, Mahindra & Mahindra chairman Keshub Mahindra, HDFC chairman Deepak Parekh, former RBI governors M Narasimham and Bimal Jalan, among others, had expressed concern over a series of scams that pointed toward a "governance deficit".

  In the letter, they had asked the government to deal with burning issues like corruption urgently.

  "We will make concrete recommendations to the government and we will pursue them with tenaciousness...," Premji said.

  On the award, he said: "I am quite honoured. It is a prestigious award. I am humbled to receive it."

  He said the signatories to the open letter have identified a few steps that can result in the highest standards of governance.

  Citing the example of "sacrosanct" regulatory bodies like SEBI and the RBI, Premji asked, "Why can not we make something like that in environment? A regulatory organisation separate from minister or secretary?"

  He, however, said they did not get any response from the Indian government on the open letter.

  "We did not expect a response, but there have been individual meetings with some people. Our objective was not to antagonise the government, but we want them to implement... We are in a state of limbo."

  On the issue of black money stashed abroad, he said, "Every country that has some scent of it (black money) is going after it. Its an issue of public morality which is at stake here."

  "What you need is tenaciousness. US has the tenaciousness to go after people who are involved in it... When pressure builds and builds... you have to have change, because you have a situation of catharsis," Premji said.

  http://timesofindia.indiatimes.com/business/india-business/Enough-is-enough-have-to-reform-Premji-on-governance-deficit/articleshow/7367624.cms

  ReplyDelete
 10. చాలా దారుణం.
  కానీ దేశానికి మంచి రోజులు ముందు ఉన్నాయి. అభివృద్దితో పాటూ విద్యా పెరుగుతుంది. అన్యాయాలను అవినీతిని సహించే సహనం పోతుంది

  We will never ever be like Mexico. It is total chaos there. We have institutions, how imperfect they may be.

  For example:
  We talk about money power in elections. In that case why the ruling party loses in elections. Being in the power, wont they outspend the opposition. That is the power of people. Is it working perfect, ideal? No. It is not. It takes time, it takes generations.

  మన సంస్కృతి బ్రష్టుపడుతుందని భాద పడుతున్నాం. అది ఎవరి వల్ల సాధ్యం కాదు.

  Materialism will always be checked by our culture and tradition and the values. As of now materialism and western values may seem to be in the upper hand, there will be revivalism. There will be pride about our history and our contributions to the world.

  Never give up hope

  ReplyDelete
 11. The Maharashtra government has announced ex gratia of Rs. 25 lakh for the family of Mr. Sonawane. The officer's salary till his retirement has been promised to them, in addition to a house, a government job for one dependent and education expenses of his children up to the graduation level.

  ReplyDelete