Jan 28, 2011

నన్నుచుట్టి చీకటున్నా, నేను కాలిపోతున్నా

ఆరాధన అనే చిత్రం నుండు ఈ పాత విన్నా ఈ మధ్య. ఇంతక ముందు ఇదే చిత్రం నుండి వేరే పాటలు వినాగానీ ఈ పాటని బహుశా పట్టించుకోలేదేమో.

తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా, అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాటమేనా?
మమత కలబోసిన మాట కరువేన?


ఈ పాట చాలా బాగుంటుంది.
ఇక ఈ పాట చాలా ఖ్యాతి చెందింది -
అరె ఏమైందీ? ఒకమనసుకి రక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అందునుండి కొన్ని పంక్తులు -
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగికేమో పూల దోసిలిచ్చింది

పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు

కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చుశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
మది దోచావో...


నిన్న విన్న పాట, పై పాట ట్యూన్ లోనే, విషాదంతో నిండింది
ఏమౌతుందీ! తన మనసును మరచిన మనసెటు వెళ్తోందీ
ఈ పాట వింటుంటే, ఒక కవి ఇంతలా ఎలా ఊహించగలడూ అనిపించింది.

కలలన్నీ కరిగాక కనులేల అంటోంది
ఇక వెన్నల లేని పున్నమి మిగిలింది

హ్మ్!! అంతేనా
పూవులెన్నీ పూస్తూవున్నా ముల్లు నాకు దక్కింది
పూజచేయు కోరికున్నా కోవెలేమో కూలింది

ఇది మరీ దారుణమైన ఊహ. మరీ ఇంత నిరాశావాదమా?
దేవి లేని కోవెలుంది, దీపమేమో ఆరుతోంది
చమురు పోయు చేయి ఉంది, ప్రమిద దానికందకుంది
నన్నుచుట్టి చీకటున్నా, నేను కాలిపోతున్నా
వెలుగులోకి వెళుతూ వున్నా, నేను చీకటౌతున్నా


పై రెండు చరణాలు నాకు భలే నచ్చాయి
కీ।శే॥ ఆచార్య ఆత్రేయకి జైజైలు.

2 comments:

  1. ఈ సినిమాలో పాటలు బాగుంటాయి. :) కానీ అవి విని సినిమా చూసే ప్రయత్నం చేస్తే విరక్తి వచ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదు.

    ReplyDelete
  2. ఈ రెండుపాటలూ బాగుంటాయి. ముఖ్యంగా "తీగనై మల్లెలు" పాట నాకు చాలా నచ్చుతుంది.

    ReplyDelete