Jan 19, 2011

మా గోడలు సాలటంల్యా

ఈ మధ్య తలా ఓ డబ్బా క్రేయాన్స్ కొని తెచ్చా. వాడికి జంబో క్రేయాన్స్, పిల్లకి ట్రైయాంగిల్ షేపువి, పట్టుకోటం సులువి అని. మురిసిపొయ్యి ఎగిరి గెంతి లాక్కుని అప్పటికప్పుడు తెల్లఠావుల లాగి బొమ్మలేయటం మొదలుపెట్టారు ఇద్దరూ. పనిలో పని క్రేయాన్స్ తోబాటు, రంగులు పులుమటానికి పుస్తకాలు కూడా తెచ్చా. వాడికి కార్స్, అనఘకి ప్రిన్సెస్. అంతా బానే ఉంది వాతావరణం ఓ గంటవరకు. అంత మౌనంగా ఉండటం తుపాను ముందు ప్రశాంతత అని అర్థం కాలా. ఉన్నట్టుండి తుపాను ఎఫ్-౫ తుపాను. ఎందిరా అంటే, అనఘ వాడి మీదపడి లాక్కుంటోంది. ఏంకావాలే అంటే పింక్ క్రేయాన్. అమ్మాయి డబ్బాలో లేదు అది. వాడి జంబో క్రేయాన్స్ డబ్బాలో ౧౬ క్రేయాన్స్ ఉంటే పిల్ల దాంట్లో కేవలం ఎంది. పింక్ లేదు. అసలే అమ్మాయికి పింక్ అంటే ప్రాణం. గింజులాట, కొట్లాట పోట్లాట. ఇలా గడుస్తుండాగా
వారి యుద్ధాల్లో పాపం క్షగాత్రులుగా మిగిలిపొయ్యాయా క్రేయాన్లు ముక్కలు ముక్కలై. కిం కర్తవ్యం అని ఆలోచించి మరోమారు ఇద్దరికీ మరో సెట్టు క్రేయానులు కొనేందుకు వెళ్ళాను వాల్మార్టుకు. ఈసారి క్రేయాన్స్ పక్కనే జంబో కలరింగ్ పేజస్ కనిపించినై. బుద్ధి గడ్దితిని, తెచ్చాను. ఇప్పుడాన్నీ డబుల్ ఢమాకాలు కదా. వాడికి కొంటే అమ్మగారికీ కొనాలి కదా. వాడికి కార్స్ కలరింగ్ పేజెస్ కొంటే, అమ్మాయికి టింకర్ బెల్ కొన్నా. వాడికి జంబో క్రేయాన్స్ డబ్బా, అమ్మాయికి ఈసారి పింక్ కలర్ ఉండేలా ఓ డబ్బా చూసి కొన్నాను. ఎవరిది వారికి అందజేసాను. షరా మామూలే, వాడిది వాడు లాక్కుని ఓ మూల సెటప్పు పెట్టుకుని కూర్చున్నాడు. వాడికి ఎదురుగా వాడికి పోటీగా అమ్మాయి కూర్చుంది. ఇక రంగులు పులమటం మొదలెట్టారు.
అందాకా బాగనే ఉన్న కథ, అంతలో ఊహించని మలుపుకి తిరిగింది. వాడేసిన కాయితం తెచ్చి చూపించాడు, బాగుందిరా అన్నా, వాళ్ళ అమ్మకి చూపించాడూ అబ్బో కేక కెవ్వు అంది, మరింకేం ఐతే, గోడకి తగిలించూ అంటాడు. అలా కాదురా అంటే వినడే. సరే అని ఒకటి అంటించాం.


మరో షీటు తీసాడు, రంగులేయటం మొదలుపెట్టాడు. అరగంట, ఇదిగో ఇదీ గోడకి పెట్టు అని తెచ్చాడు.


మా గోడలు చాలటంలేదు. మీవి ఇస్తారా?

8 comments:

  1. Been there :)
    Now' it's face book wall time :)

    ReplyDelete
  2. ఒక మంచి అవిడియా చెప్పమంటారా, ఓ వెబ్ సైటు/పికాసోపుటో తెరవండి (అహ, రెండు చెరోటి). ఇక ఇష్టమొచ్చిన్ని గియ్యమనండి.

    ReplyDelete
  3. haaa haa bagundi..maa godalu kuda nindayi daadapu ga ilage..

    ReplyDelete
  4. I was there in the same situation.
    Impemented this idea. Hang a picture on a big pinboard every morning and call it as 'Picture of the Day', rule is it should be his own art work, no coloring pages. Till date its working good, should see how long it goes.
    Apologies for posting in english.

    ReplyDelete
  5. వెళ్లండి వెళ్లండి, మా గోడలే మాకు చాలటం లేదంటే మధ్యలో మీ గోలేంటి? ఇంటినిండా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఆ మ్యాన్ ఈ మ్యాన్... అసలు లేనివాడు లేడు. ఏ కార్టూన్ కేరక్టరయినా, ప్రపంచంలో ఏ మూల రిలీజయినా ముందు మా ఇంటి గోడల మీదకే వచ్చేస్తుంది. పిల్ల బొమ్మలు పెట్టలేదేం? పక్షపాతమా?

    ReplyDelete
  6. చాలా అదృష్టవంతులు..మీ పిల్లలు కాగితం మీద గీసి గోడకు తగిలిస్తున్నారు. మాకు ఏకంగా గోడలే కేన్వాస్. అన్ని గదుల గోడలు నిండిపోతే ఇంటివాళ్లని బ్రతిమిలాడి మళ్ళీ రంగులు వేయించాల్సిన అగత్యం ఏర్పడింది.

    ReplyDelete
  7. లలిత గారూ - తొందర్లో వాడే ఫేస్ బుక్కుకి ఎక్కించేలా ఉన్నాడు.
    నాగేస్రావ్ గారూ - కళ్ళకు స్ట్రైన్ కదా అంతసేపు కంప్యూటర్ ముందు
    మంజు - :):)
    హరే - :)
    సురభి - అవి అయ్యాయండీ. సొంత ఆర్టులు చాలా అయ్యాయి. ఐనా చక్కటి ఐడియాని సూచించారు.
    అరుణ - :):) మావాడు స్పైడర్ మాను, ఆ మాను ఈ మాను దాకా వచ్చాడు కానీ ఈ పిక్సర్ కార్స్ ముందు వాళ్ళు పాపం దిగతుడుపే.
    పిల్ల బొమ్మ పెట్టలేదంటే :):) పక్షపాతమా పాడా, పిల్ల బొమ్మ వేసి చివర్లో, కాయితం జరగటమో ఐతే, ఇదీ, ఇదీ రాదూ అని నలిపేసి ఇసిరి అవతలేస్తుందింది. తొందర్లో పెడతా చక్కగా పులిమినప్పుడు జాగ్రత్త చేసి.
    తృష్ణ - ఈ గోడలమీద గీతలు అనే దానిపై ఓ టపా కొడతా తొందర్లో.

    ReplyDelete