Jan 6, 2011

బీటెక్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

బీటెక్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి
రాజమండ్రి క్రైం, న్యూస్‌టుడే: బీటెక్‌ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేసి పరారైన సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రి త్రీటౌన్‌ ఎస్సై వి.దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు శానిటోరియంలోని భవానీపురానికి చెందిన బాధిత యువతి రాజానగరం గైట్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల నగరంలోని లలితానగర్‌లో నివసిస్తున్న అక్క ఇంటికి వచ్చి అక్కడ నుంచి రోజూ కళాశాలకు వెళ్లి వస్తోంది. మంగళవారం బస్సు ఎక్కేందుకు వెళుతున్న ఆమెను బైకుపై అపరిచిత యువకుడు మరో యువకుడితో కలిసి వెంబడించాడు. నిలువరించి మాట్లాడమని అడిగాడు. స్పందించకపోవడంతో బ్లేడుతో దాడి చేశాడు.

ఈ సంఘటన్ని నేను తీవ్రంగా ఖండిద్దామనుకున్నా. ఇది చాలా తప్పు, ఎక్సు వై జి అందామని నోటిదాకా వచ్చింది. కానీ అనలేక పొయ్యా. కారణాలు ఏవైఉండచ్చూ అని ప్రశ్నించుకున్నా.
అతి ముఖ్యమైన కారణం - మీడియా అని నాకనిపించింది. మీడియా అంటే ఓ బ్లాంకెట్ కదా. అవును. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సినీ మీడియా. ఈ మూడే కదా ముఖ్యమైన మాధ్యమాలు ఇవ్వాళ్ళ. ఎందుకలా అనిపించిందీ అంటే -
ప్రింట్ మీడియాలో కన్స్ట్రక్టివ్ వార్తలకన్నా డిస్ట్రక్టివ్ వార్తలకే పెద్ద పీట వేస్తున్నారు. వేస్తే వేసారు కానీ, సమస్య ఎక్కడంటే, నేరాలు మర్డర్లు మానభంగాలు అన్నీ పూసగుచ్చినట్లు కళ్ళకు కట్టినట్లు రాస్తున్నారు. దానివల్ల ఏమౌతుందంటే, పై సంఘటనే తీస్కుందాం. ఆ అమ్మాయి అండర్ గ్రాడ్ మొదటి ఏడాది. అంటే లేట్ టీన్స్ లో ఉంది. పిల్లాడూ బహుశా అదే బ్యాచో లేక సీనియరో అయి ఉండచ్చు, అంటే వాడూ లేట్ టీన్స్ లేక ఇరవైల్లో ఉండచ్చు. ఈ వయసుగాళ్ళకి ఇలాంటివార్తలు రుచిగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. నేరప్రవృత్తి బీజాలు పడతాయి.
ఇక ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా [The primary electronic media sources familiar to the general public are better known as video recordings, audio recordings, multimedia presentations, slide presentations, CD-ROM and online content.]- వార్తా ఛానళ్ళు ఇత్యాదివి. ఇవి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ వారి మనీ మేకింగ్ యూనిట్స్. వీరికి కావాల్సింది టిఆర్‌పి రేటింగ్స్. దానికోసం ఎంత గడ్డైనా తింటారు, ఏవైనా చూపిస్తారు. టీన్ ఏజ్ లో ఉన్న పిల్లలకు క్రైం వాచ్ లాంటి ప్రోగ్రాములు ఆవేశాలోచనలు రేకెత్తిస్తాయి అంటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదేమో.
ఇక సినీ మీడియం -
అమ్మతోడు అడ్డంగా నరుకుతా
పొడిచేస్తా
కాల్చేస్తా
ఇక్కడతో ఆగట్లా బ్లేడుతో కంఠాన్ని తెగనరకటం, కరవాలంతో తిరగటం ఇత్యాదివి ఎలాంటి తరంగాలను ఉత్పత్తి చేస్తాయో పెద్ద ఆలోచించల్సిన పనిలేదు.
ఇలాంటివి తప్పా? వాడకూడదా? డైలాగులే ఉండకూడదా?
ఇవీ ముఖ్యమైన ప్రశ్నలే. ఉండచ్చు. నాకొడకా అని కూడా వాడవచ్చు. ఎలాంటి మాటలైనా వాడవచ్చు. ఏమైనా చేయవచ్చు. ప్రేమికుడు ప్రేమికురాలు సెట్టుసాటుకెళ్ళి ముద్దు పెట్టుకోవాస్లిన పనిలేకుండా బయటనే కెమెరా ముంగటనే పెదవులని పెనవేసుకోనూ వచ్చు, ఇంకా దిగ జారిపోనూ వచ్చు
మరి సమస్య ఎక్కడా?
పై మూడింటినీ కంట్రోల్ చేసే ప్రభుత్వం దగ్గర. అసలు విలను ప్రభుత్వ విధానం.
ఎందుకటా? అంటే -
టీవీ కార్యక్రమాల్లో కంటెంట్ రేంటింగ్ అనే విధానాన్ని ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ప్రకటించలేదు.
సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్లలో కేవలం మూడే [నాలుగు] కేటగిరీలు ఉన్నాయి. యు, యు/ఎ, ఎ.
యు = యూనివర్సల్
All ages admitted, there is nothing unsuitable for children. Films under this category should not upset children over 4. This rating is similar to the MPAA's G, the BBFC's U, and the OFLC's G ratings.

యు/ఎ = పేరెంటల్ గైడెన్స్ All ages admitted, but certain scenes may be unsuitable for children under 12. This rating is similar to the MPAA's PG-13, the BBFC's 12A, and the OFLC's PG and M ratings.

ఎ = అడల్ట్

Only adults are admitted.

Nobody younger than 18 can rent or buy an 18-rated VHS, DVD, Blu-ray Disc, UMD or game, or watch a film in the cinema with this rating. Films under this category do not have limitation on the bad language that is used. Hard drugs are generally allowed, and strong violence/sex references along with non-detailed sex activity is also allowed. This rating is similar to the MPAA's R and NC-17, the BBFC's 18, and the OFLC's MA and R ratings.


యస్ = Restricted to any special class of persons
అదే అమెరికన్ సినిమా రేటింగ్ సిస్టం చూస్తే -
G rating symbol
G- General Audiences
All ages admitted
(1968-present)

(Equivalent: Videogames: EC, Low E; Television: TV-Y, Low TV-G)

PG rating symbol
PG- Parental Guidance Suggested
Some material may not be suitable for children
(1972-present)

(Equivalent: Videogames: High E, Low E10+; Television: High TV-G, TV-PG)

PG-13 rating symbol
PG-13- Parents Strongly Cautioned
Some material may be not be appropriate for children under 13
(1984-present)

(Equivalent: Videogames: High E10+, T; Television: High TV-PG, Low TV-14)

R rating symbol
R- Restricted
Under 17 requires accompanying parent or adult guardian
(1968-present)

(Equivalent: Videogames: M; Television: High TV-14, Low TV-MA)

NC-18 rating symbol
NC-17- No One 17 and under admitted
(1990–present)

(Equivalent: Videogames: AO; Television: High TV-MA)మన సిబియఫ్‌సి వారి రేటింగులు చూసారా? Nobody younger than 18 can rent or buy an 18-rated VHS, DVD, Blu-ray Disc, UMD or game, or watch a film in the cinema with this rating.

నిజంగా చెప్పాలంటే ఎన్ని సినిమా హాళ్ళలో ఎ సర్టిఫికెట్ సినిమాకి వయసుని చూసి లోనికి పంపిస్తున్నారూ? ఇంకో ముఖ్య ప్రశ్న, ఎ సర్టిఫికెట్ సినిమాని టీవీ ఛానల్స్ లో ఎలా ప్రసారం చేస్తారూ?

ఇలా అన్నీ రకాల మాధ్యమాలు తమవంతు సహాయసహకారాలను అందిస్తుంటే, పై లాంటి సంఘటనలు జరగపోటానికి తావెక్కడా? లేని, రాని ఆలోచనలను గుప్పిస్తుంటే నేర ప్రవృత్తి పెరక్కుండా ఎలా ఉంటుందీ?

ప్రభుత్వం మేల్కోవాలి. కనీసం ఇట్లాంటి వాటిల్లోనైనా చట్టం గట్టిగా అమలుకావాలి. పోలీసు యంత్రాంగం కఠినంగా ప్రవర్తించాలి.

పైలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. పేపర్లు రాస్తూనే ఉంటాయి. నేరం చేనిన పిల్లవాడు పొద్దున్నె గడ్డితినేవాట్ట, సాయంత్రం బీరు కొట్టేవాట్ట అని పనికిరాని చెత్తని రాస్తూనే ఉంటాయి. టీవీ ఛానెళ్ళలోనూ చూపిందే చూపి చావకొడుతూనే ఉంటారు. కానీ ఒక్కరుకూడా మూలాలను గూర్చి ఆలోచించక పోవటం సోచనీయం అని నా అభిప్రాయం

ఇదే విషయంపై రెండేళ్ళ క్రితం ఓ టపా రాసాను -
http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_23.html

1 comment:

  1. నాన్నగారు మీరు చెప్పింది నిజం . మూలాలను గురించి ఆలోచించాలి . ఇటువంటివి జరిగినపుడు అమ్మాయి కుటుంబమేకాదు , అబ్బాయి కుటుంబం కూడా సఫర్ అవుంతుంది. తమ కొడుకు ఇలాంటి పని చేసాడని తెలిస్తే ఏ తల్లి మనసైనా తట్టుకోగలదా ! తన పెంపకాన్ని సమాజం మొత్తం వేలెత్తి చూపిస్తూ తన కళ్ళముందే కన్నకొడుకును చీ కొడుతుంటే అది ఆ తల్లి తండ్రులకి నరకం కాదా !
    కానీ ఏం చెయ్యగలరు తెల్లారి లేచిందగ్గరనుండీ అన్ని వైపులనుండీ ( మీరు చెప్పిన పై మార్గాలద్వారా) ఆ కుర్రాడి బుర్రలో దూరే ఆ చెత్తని, వాళ్ళు ఎలా కంట్రోల్ చెయ్యగలరు . ఆ రోజుకి ఆ అమ్మాయికి సానుభూతి అబ్బాయికి శిక్ష విధించడం గురిచికాకుండా దీన్నొక సామాజిక సమస్యగా తీసుకుని ఈ సమస్య కు కారణమయినవాళ్ళని , శిక్షించేలా లేదా నివారించేలా చట్టాలు చెయ్యాలి.
    బుజ్జిగాడు సినిమాలో " చిట్టి బుజ్జిని తప్ప మరొకర్ని ప్రేమించడానికి వీల్లేదు . అది అలా చేస్తే దాన్ని చంపాలా వద్దా " ఇది హీరోగారి డైలాగ్ . మరి సినిమాలో ఆ డైలాగ్ చెప్పినవాడు హీరో అయినపుడు నిజజీవితంలో ఆ డైలాగ్ ని అప్లై చేసినవాడు హీరో ఎందుకుకాదు ? ఆ డైలాగ్ కుర్రకారు చెవుల్లో పడకుండా ఆపెయ్యడమే వేరు పురుగును చంపి చెట్టును కాపాడుకోవటం అవుతుంది

    ReplyDelete