Dec 25, 2008

పూలు గుసగుసలాడేనని

మొన్న వారాంతం జీటీవీ సారెగామాపా 2009 కార్యక్రమంలో ప్రతిభాసింగ్ భగేల్ అనే ఓ పోటీదారు హిందీలో ఓ పాటపాడింది -
యె మై కహ ఆ ఫసి,
కైసి ఫసి,
రోన ఆవె న ఆవె హసి,
పాపె బచాలొ తుసి.
ఇది కారవాన్ అనే సిత్రంలోనిది.
మనకి వెంటనే దీని తెలుగు పాట గుర్తుకొచ్చింది, నాయ్యాల్ది, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇరగదీసి కుమ్మేసొదిలాడు ఈ పాటని. ఈ పెపంచకంలో యస్.పి.బి మాత్రమే అలా పాడగలడు.
అదేంపాట?
సిత్రం - శ్రీవారు - మావారు
సంగీతం - జికె వెంకటేష్
రాసిన వారు - సి నారాయణరెడ్డి

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది
లాల లాలాల లాల్లాల
లలలాలా లలలాల

మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున ఎగిరేనని
వయసు సవ్వడి చేసేనని
ఇపుడే తెలిసిందీ రురు .. రురు.. రురురూ

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది

అలలు చేతులు సాచేనను
నురుగు నవ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని
నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆ .. ఓ

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది

ఇక్కడ వినండి ఆ పాటని



సర్వజనులకూ ఏసుక్రీశ్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Merry Christmas to all!! Happy Holidays!!

16 comments:

  1. It is one of my favorite song. Thanks for the link.

    ReplyDelete
  2. ఆ పాట పూలగంపలో పూలలాంటిదయితే , ఆ పూలని హారం చేసిన ఘనత బాలబ్బాయ్ గారిదే (మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి - బాలుని బాలబ్బాయ్ అని పిలిచేవాడు - ఎందుకో మరి తెలియదు..)

    ReplyDelete
  3. అబ్బా, 2008 వెళ్ళేలోగా ఇంకొక్క మంచికబురిచ్చిపోరాదా, అనుకున్న తక్షణం మీ బ్లాగు దర్శనం, ఈ పాట వినే భాగ్యం. నాకిది చాలా చాలా ఇష్టమైన పాట. పంచినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. Merry Christmas to you.. manchi paata malli gurtu chesaaru

    ReplyDelete
  5. కొన్ని పాటలు బాలూ అంటే బాలూయే పాడాలంతే! అందులో ఈ పాటొకటి. మరి కొన్ని..నా టేస్టు ప్రకారం

    కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు,
    మబ్బే మసకేసిందిలే(ఈ మధ్య నేను మీకు తెలుసా అనే సినిమాలో ఈ పాట రీ మిక్స్ వింటే మానవ జన్మ ఎత్తినందుకు సిగ్గుపడాల్సి వస్తుంది)
    మధుమాస వేళలో, మరుమల్లె తోటలో
    సిరి మల్లె నీవే విరిజల్లు కావే
    మెరిసే మేఘమాలికా
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఈ మధ్య గోదావరి లో పాట ..ఉప్పొంగెనే గోదావరి
    యాతమేసి తోడినా ఏరు ఎండదు
    మల్లె తీగ వాడిపోవ మరల పూలు పూయునా....

    ఇలా బోలెడన్ని పాటలు..ఇవన్నీ బాలూయే పాడాలి!

    ReplyDelete
  6. ఆహ సూపర్ పాట గుర్తుచేసారు భాస్కర్. నిజమే ఈ పాట ని బాలు గారు ఇరగదీసి వదిలారు. నాకు చాలా నచ్చిన పాట ఇది. అన్నట్లు కొన్ని టైపోస్ కరెక్ట్ చేయండి. నచ్చిన పాటలో అక్షరం మారినా చెప్పాలనిపిస్తుంది అది నా ఈక్నెస్ :-) ఏమనుకోరులే అని ధైర్యం గా చెప్తున్నా.
    తెలిసింది.
    మబ్బు కన్నెలు..
    ..రివ్వున ఎగసేనని..
    ..చేతులు సాచేనని

    సుజాత గారు రీమిక్స్ పాట కొద్దిగా విని మొత్తం ఆ సినిమా ఆల్బం అంతా డిలీట్ చేసానండీ.. అంత గొప్ప గా ఉంది ఆ పాట.

    ReplyDelete
  7. సుజాత, ఈ రోజు మీకు తెలియకనే నా కెంత మేలు చేసారో మీకు చెప్పటం నేను మరవకూడదు. "గ్యాస్ పొయ్యి కట్టానా లేదా?, గరాజు తలుపు మూసానా లేదా" ఇటువంటి ప్రశ్నలు పదే పదే వేసుకుని నాకూ మతిమరపు వచ్చేస్తోందేమోనని మనసు పెట్టుకున్న దిగులు, మీలా నా టేస్టుకి తగ్గ బాలు పాటల లిస్టు వ్రాద్దామన్న సాధనతో మటుమాయం. ఎంతకీ తరగదే, రాసి రాసి అయ్యో ఎవరైనా consultantని పెట్టుకుంటే పోతదేమో, పని త్వరగా పూర్తి అవుతదనిపించింది ;) ఎడం బ్రెయిను కుడిదాన్ని కలేసుకొని మరీ గనులు తవ్వినట్లు, గుట్టలు గుట్టలుగ పాటలు తోడిపోసేస్తుంది. అమ్మో వుండండి, నన్ను కప్పెట్టేట్టున్నాయవి చూడబోతే!

    Thank you all!

    ReplyDelete
  8. అద్దిరింది! :)
    తెలుగులో వచ్చిన,యస్పీబాలసుబ్రమణ్యం పాడిన అత్యంత హుషారు పాటల్లో మొదటి పదిస్థానాల్లో ఉండే పాట ఇది.
    ఇంకొకటుంది భలేకుర్రదానా,హుషారైన దానా
    మరొకటేమో..గుంతలకిడి గుంతలకిడి
    అబ్బో కృష్ణకు పాడినపాటల్లొ సగం ఈ జాబితావే,
    ఇహ ఈ రెండు పాటల విషయానికొస్తే...
    కారవాన్ లో హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో,ఒక లారీమీద తిరుగుతూ,ఒకానొక రంగస్థలం ఎక్కి నోటికొచ్చిన పాట,కాలికొచ్చిన ఆటాడి అలరిస్తుంది.
    దానికి పూర్తి విరుద్ధంగా శ్రీవారు-మావారు సినిమాలో మనవాడు డబ్బులనుంచి తప్పించుకుని స్వేఛ్ఛావిహంగం లా తిరుగుతూ,ఎగురుతూ ఇరగదీస్తాడు.
    మబ్బు కన్నెలు భాస్కర్ కమ్మెలు కాదు,
    ఈ సినిమాలోనే రామకృష్ణదాస్ పాడిన మంచి పాటొకటి ఉంది చెప్పండి :)

    ReplyDelete
  9. @మాష్టారు: :)
    @వంశి: బాలబ్బాయ్ - ఇదేదో బాగుందే..బాలబ్బాయ్..
    @ఉషా గారు: ధన్యవాదాలు.
    @నేస్తం గారు : మీకు కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
    @సుజాత గారు: ఇవన్నీ నాకుకూడా అత్యంత ప్రీతిపాత్రమైన పాటాలే. మీరు ఇవి మర్చిపోయినట్టు ఉన్నారు -
    మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా
    మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
    మామా చందమామా వినరావా నా కధా వింటే మనసు ఉంటే కలిసేవూ నాజతా
    అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
    ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎఱుకా
    ... ... ...
    @వేణూ: మార్చానోయి...:):)మబ్బు కన్నెలు.
    @రాజే అన్నగారు: మంచి సమాచారం!! థాంక్సులు!!!!

    ReplyDelete
  10. మంచి పాట వినిపించారు.Thank you sir..!

    ReplyDelete
  11. రామరాజు గారూ,

    ఈ "పూలు గుసగుసలాడేనని..." ఈ పాటని గుర్తుకు తెచ్చుకుని మనస్సులో పాడుకుంటూంటే, మీరన్న బాలుగారేమో కానీ, నాకైతే "షకుముకియా" షణ్ముఖప్రియ గుర్తొస్తోందండి.

    ఈ పిల్లెవరో ఏమిటో అనుకుంటున్నారా? యింకేమనుకుంటున్నారు? ఏమైనా ఈ పాట రీమిక్స్ పాడిందేమో అని అనుకుంటున్నారా? అవేవీ కాదండీ, ఈ పాప జీ తెలుగు చానల్‌లో వస్తూన్న "సరిగమప" చిన్నపిల్లల పాటలపోటీలలో మూడవ స్థానంలో వచ్చిన 4 యేళ్ళపాప(వయస్సు సరిగ్గా గుర్తులేదండి.).

    యిక పాట విషయానికొస్తే, ఈ పాటని ఆ అమ్మాయి(అమ్మాయి కంటే పాపే సరైనదేమో) సరిగ్గా మాటలు వచ్చీరానట్లుగా పాడుతూంటే భలే ఉంటుందిలెండి. మీరుకూడా ఆ కార్యక్రమం కనుక చూస్తూన్నట్లైతే మీకిప్పటికే అర్ధం అయ్యేఉంటుంది.

    ReplyDelete
  12. @రెడ్డి గారు: పాట మాధుర్యాన్ని ఆస్వాదించండి :)
    @చంద్రశేఖర్:
    ఈ మధ్యకాలంలో తెలుగు టీవీ చూడక చాలా కాలం అయింది. ఈ మధ్య కొన్ని కొన్ని వెబ్సైట్లలో ఉచిత లంకెలు వెతుక్కుని కక్కుర్తిగా చూసా కాని, అంత మజా రాలేదు.

    ReplyDelete
  13. http://blaagadistaa.blogspot.com/2009/07/blog-post_05.html

    ReplyDelete
  14. పూలు గుసగుసలాడేనని పాటలో నారాయణరెడ్డి గారు మూడు చరణాలు రాశారు. కానీ ఎక్కడ చూసినా రెండు చరణాల్ని మాత్రమే ఉదహరిస్తున్నారు. మూడవ చరణం ఇదే:-
    పైరు పచ్చగ ఎదిగున్నది... పల్లె పడుచుల వయసున్నది
    కొత్త సొగసే రమ్మన్నది, గుండె ఝుమ్మన్నది ||పూలు గుసగుస||


    ReplyDelete
    Replies
    1. ఆ 3 చరణల పాట నా దగ్గర వుంది
      కావలసిన వారు వల్ల ఫోన్ నంబర్ పెట్టండి what's app lo పంపుతాను

      Delete
  15. మూడవ చరణం ఉన్నది

    పైరు పచ్చగా ఎదిగున్నది
    పల్లె పడుచుల విసురున్నది
    కొత్త సోగసే రామ్మన్నది
    గుండె ఝoమ్మన్నాది....

    ReplyDelete