Dec 8, 2008

మనల్నీ ఇలా అనుకుంటారు అటైపునుంచి

మనకి భారత్ లో ఎక్కడ బాంబు పడిన, వెంటనే ఐ.యస్.ఐ అనే వినిపిస్తుంది/అనిపిస్తుంది. ఇక్కడనుండి మతం పేరుతో పాకిస్థాన్ వైపుకి వెళ్లి అక్కడి యే ల.ఏ.తో లోనో జేరి, మళ్లి వెనక్కొచ్చి అఱాచకాలు సృష్టింస్తుంటారు అనేది మన నమ్మకం, మనకి తెల్సిన నిజం.
ఐతే, FlipSide చూస్తే?
దేనికోసమో గూగుల్లో గెలుకుతుంటె ఈ లింకు తగిలింది. చదివి బిత్తరబొయ్య, ఆశ్చర్య పోయా. నాయ్యాళ్లలారా, ఎంతకి తెగించారు అనుకున్నా. వీడి సారాంశం ఏంటంటే, పాకిస్థాన్లో జరిగే బాంబు పేలుళ్లకి కారణం మన రా (ఆర్.యే.డబ్ల్యూ - రీసెర్చ్ మరియూ ఎనాలిసిస్ వింగ్) మరియూ ఆఫ్ఘన్ ఏజెన్సీల ప్రోద్బలమే అని.
వీడంటాడూ, పాకిస్థాని ఇన్వెస్టిగేటర్లు మొత్తానికి ఛేదించారు అని, అది ఇది. ఏదేదో రాశాడు.
బాగుంది కధ, ఇటైపు మనం వాళ్లని అటైపు ఆళ్లు మనల్ని, కానీ నిజం ఏంటో ఎవ్వనికీ తెలియదు.

33 comments:

  1. అక్కడి ప్రభుత్వం పత్రికలు కలిసి ఈ రకమైన విద్వేషాన్ని పెంచుతున్నాయి.
    బహుశా తాము చేసే నిర్వకాన్ని కప్పిపెట్టుకొవడానికి కావొచ్చు.

    ReplyDelete
  2. Even their President is coming to the CNN and telling "I very much DOUBT he is a Pakistani" statment , Do you expect any better mindset from any one of them.
    Believe it or not, almost all the Pakistani people I have talked they believe that this may be the handwork of our RAW and also they are very much in denial of the training camps, LeT and ETC.
    These are the educated Pakistani people living in USA for years, what else one expect from an average Pakistan citizen.

    ReplyDelete
  3. వాళ్లలా అనుకోవటంలో తప్పు లేదు. మనమెంత దేశ భక్తులమైనా గమనించాల్సిందొకటుంది. పక్క దేశాల్లో అస్థిరత్వం రాజేయటం ఇటీవలిదాకా మన దేశంతో సహా అనేక దేశాల విధానాల్లో ఒకటి (గ్లోబలైజేషన్ కారణంగా ఈ తరహా పద్ధతుల్లో ఇటీవలికాలంలో మార్పులొస్తున్నాయి). సరిహద్దుల్లో మరో బలమైన దేశం ఉండటం మనకి మంచిది కాదు అనే పాతకాలపు యుద్ధ తంత్రం దీనికి ప్రేరణ. అలా - శ్రీలంక, నేపాల్, సింధ్ వగైరా దేశాల్లో, ప్రాంతాల్లో ఇండియా రాజేసిన నెగళ్లెన్నో. పాకిస్తాన్ని రెండు ముక్కలు చెయ్యటంలో బంగ్లా జాతిపితకి సహాయం చెయ్యటం వెనక మతలబూ అదే కదా.

    చెప్పొచ్చేదేమంటే, ఇక్కడెవరూ పవిత్రులు కారు. ఇదొక ఆట. సరిహద్దుకి అవతలైనా, ఇవతలైనా - సమిధలెప్పుడూ సాధారణ ప్రజలే.

    ReplyDelete
  4. అవును... అప్పట్లో మన 'రా' బలంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో అలాంటి పనులు చేసే వారు. ఆ మాటకొస్తే శ్రీలంక లాంటి దేశాలలో కూడా. కాకాపోతే ఇప్పుడు బలం తగ్గి, అలాంటి పనులు చేయడం లేదు, కాని అక్కడ పేరు మాత్రం ఇంకా ఉంది.

    ReplyDelete
  5. అబ్రకదబ్ర గారితో నేను అంగీకరిస్తాను.ఇంటలిజెన్స్ విభాగాన్ని, సీక్రెట్ సర్వీస్ ను ఇతరదేశాలమీద నిఘాతోపాటూ ఆ శతృదేశాల్ని బలహీన పరిచేందుకు వాడుకోవడం ఒక అంతర్జాతీయ విధానం. కోవర్ట్ ఆపరేషన్లూ, అసమ్మతి దారులకు మద్దత్తు ఆకుట్రల్లో కొన్ని విధానాలు. మనోళ్ళు పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో చేసిన ఛమక్కుల గురించి సాధారణంగా మన మీడియాకూడా మాట్లాడదు. కారణం దేశభక్తి.ఇక బాంగ్లాదేశ్ గురించి అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది లెండి!

    అమెరికన్ CIA,మన RAW, పాకిస్తాన్ ISI ఇలాంటి ఉద్దేశాలతో స్థాపించబడినవే. కాకపోతే, ‘శశి తారూర్’ అన్నట్లు "భారతదేశంలో ఈ సంస్థలు ప్రభుత్వం చేత నడిపించబడితే పాకిస్తాన్లో ప్రభుత్వమే ఈ సంస్థలచేత నడిపించబడుతోంది". అంటే, సమతుల్యం దెబ్బతినిందన్నమాట.ISI చేసిందానికి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా తప్పుబట్టలేని పరిస్థితి దాపురించింది. పాకిస్తాన్లోని సివిలియన్ ప్రభుత్వం గతి మన చేతగాని నాయకులకంటే దుర్భరం.

    ReplyDelete
  6. యండమూరి ఎక్కడో అంటాడు, మనం గాంధిని జాతిపితగా చే్సుకొంటే, వాళ్ళకి జిన్నా జాతిపిత అని.

    ఈ టపాపై కొంచెం ఎక్కువ అలజడి వస్తుందనుకొన్నానే.:-)

    ReplyDelete
  7. అంతే. మనోళ్ళు కూడా తక్కువ తిన్లేదు. మన దేశంలో బాంబులు పేలిన ప్రతిసారి, ఖచ్చితంగా ఆరు నెలలలోపు పాకిస్తాన్ లో బాంబులు పేలేవి.

    ఈ మధ్య మన దేశంలో రెండు నెలలకోసారి బాంబులు పేలే సరికి, పాకిస్తాన్ లో ఎప్పుడు పేల్తాయా అని ఎదురుచూస్తుంటే పోయిన శుక్రవారం పేలాయి. కాని అది ఎవరుచేశారో తెలియలేదు.

    ReplyDelete
  8. True. నిజం. నేనూ పై కామెంట్లతో అంగీకరిస్తాను.
    తేడా అల్లా ఏంటంటే, the degree to the extent they pursue వేరు, అలాగే తప్పనో, unintended consequences వస్తున్నాయనో తెలిసినప్పుడు ఎంత తొందరగా దాంట్లోంచి బయటకు రావడం అనేది విజ్ఞత మీద ఆధారపడుతుంది.

    అయినా ఇవన్నీ ఒక strategy నుంచి, ఇంకో strategy కి వెళ్ళే విషయాలే తప్పితే, పూర్తిగా ఎవ్వరూ వదులుకోరు, ఎందుకంటే basic trust అనేది మిస్సింగ్ కాబట్టి.

    అందుకే అందరూ వసుధైక కుటుంబంగా , అన్ని దేశాల వాళ్ళం ప్రేమతో, అన్నదమ్ముల్లాగా కలసి ఉందాం అనే దిశగా ప్రయాణిద్దాం :-)

    నాకే నవ్వొస్తోంది. That was in a lighter vein please..

    ReplyDelete
  9. అయ్యో నాన్నారు చదివితే మాత్రం ఇలా రాసేస్తారా :)
    నాగప్రసాద్ said...
    అంతే. మనోళ్ళు కూడా తక్కువ తిన్లేదు. మన దేశంలో బాంబులు పేలిన ప్రతిసారి, ఖచ్చితంగా ఆరు నెలలలోపు పాకిస్తాన్ లో బాంబులు పేలేవి. >>
    కొంచం ఎక్కువ గా అనిపించటం లేదు? :) ఒక్కప్పుడు అలా జరిగేది కాని ఇప్పుడు కుడానా?
    మహేష్ గారు, అబ్రకదబ్ర గారు బాగా చెప్పారు.నేను అంగీకరిస్తాను. కాని బంగ్లాదేశ్ ఏర్పడక పొతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించాలంటే భయం వేయటం లేదు ?

    ReplyDelete
  10. @శ్రావ్య: ఈ విధానాల వలన మనకు లాభం జరిగినమాట వాస్తవమే కదా! అలాంటప్పుడు పాకిస్తాన్ కూడా అలా అనుకొని ఇవన్నీ చేస్తే వాళ్ళకు తప్పులేదుగా! అందుకే everything is relative అనేది.మనకు తప్పయ్యింది వాళ్ళకి ఒప్పు, మనకి ఒప్పయ్యింది వాళ్ళకి తప్పు.

    ReplyDelete
  11. Yes Mahesh I too agree with you ! But upto my knowledge eventhough our government helped to formed the Bangladesh according to the wish of the people living there, that you we never tried to merge the Banglesh in India, but what Pakistan is doing is not the same thing right?

    ReplyDelete
  12. శ్రావ్య గారూ
    కాష్మీర్ విషయంలో వాళ్ల ఆర్గ్యుమెంట్ కూడా దాదాపు అదేకదా.

    ReplyDelete
  13. పాకిస్తాన్ లో బహిరంగంగా ఉగ్రవాద శిక్షిణా శిబిరాలు నడుస్తుంటాయి. ఉగ్రవాదుల సహాయార్థం దాదాపు ప్రతి చిన్న కొట్టులో కూడా ధన సహాయార్థం బాక్సులు ఏర్పాటు చేసి, వాటి మీద భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాసుంటారు.

    పాకిస్తాన్ లో ఉండే ధనవంతులు వాళ్ళ దేశం అంటే వాళ్ళకే విరక్తి చెంది ఆ దేశాన్ని విడిచిపెట్టి వలస పోతున్నారు. :)

    ReplyDelete
  14. Babaa gaaru,

    There is a lot of difference in between the issues of Kashmir and Banglasesh .Kashmir monarch wished to be with India.

    ReplyDelete
  15. @శ్రావ్య: జునాఘడ్ లో మనం కాశ్మీర్ లాజిక్ ని కాదన్నామని మర్చిపోకండి.ఇరువైపులా తప్పులు జరిగాయి. కాకపోతే అవి చారిత్రాత్మక పరిణామక్రమంలో భాగాలు.

    బాంగ్లాదేశ్ ఏర్పాటు మన దేశ సుస్థిరతకు అవసరమని మనం నమ్మాం కాబట్టి సహాయం చేసాం. అంతేతప్ప బాంగ్లాదేశీయులపైన ప్రేమ పుట్టుకొచ్చి కాదు. అదొక రాజకీయ-భౌగోళిక అవసరం.

    @నాగప్రసాద్: పాకిస్తాన్ లోని సాధారణ ప్రజలకూ ఈ ఉగ్రవాదానికీ మీకూ నాకూ ఎంత సంబంధముందో అంతే ఉంది. మొత్తం పాకిస్తానీ ప్రజల్ని ఒకేకోవలో కట్టకండి.ఇలాంటివాటిల్లో అపోహలేతప్ప నిజాలశాతం తక్కువే అని మనం గ్రహిస్తే మంచిది.

    పాకిస్తాన్ ఆర్మీ,ISI ఉసుక్కుమంటే చైనా ఈ తీవ్రవాదులకు సహాయం చెయ్యడానికి తయారుగా ఉంటే చందాలు వసూలు చెయ్యడం వీళ్ళకి అవసరమంటారా? అవన్నీ స్థానికంగా వున్న ముల్లాలు తమ పబ్బంగడుపుకోవడానికో లేక easy money కోసమో అని మనం ఎందుకనుకోకూడదు. మనం మాత్రం anti-Pakistan slogans తో రాజకీయ పబ్బాలు గడుపుకోవట్లేదూ!?

    ReplyDelete
  16. శ్రావ్య గారు
    కాశ్మీర్ విషయంలో అప్పటి రాజు పాకిస్తానులో కలవటానికి ప్రయత్నించాడన్న విషయం అబద్దంకాదుగా, ప్లెబిసైట్ జరపటానికి భారత ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది?,
    ప్లెబిసైట్ జరిగిందీ అందులో ప్రజలు పాకిస్తాన్ లో చేరటానికి వోట్ చేసారన్న పుకార్లు లేవలేదా? రి: ప్రీడం అట్ మిడ్ నైట్
    అంతెందుకు హైదరాబాద్ నవాబు కూడా విమోచనానికి ముందు వరకూ, ఫ్రాంస్ తో సంప్రదింపులు జరుపుతూ, హైదరాబాద్ ను ఫ్రాంస్ దేశంతో విలీనం చేయటానికి ప్రయత్నించలేదూ?

    డిస్క్లైమర్: నేనేమీ పాకిస్తానీ సపోర్టర్ ని కాదు, నాకు తెలిసిన విషయాలను పంచుకొంటున్నాను. తప్పయితే మార్చుకోగలను.

    ReplyDelete
  17. మహేశ్ గారు,
    చైనా చాలా రోజుల నుంచి పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నది అనేది జగద్విదితం. కాని ఇప్పుడిప్పుడే చినా లోనూ మార్పు వస్తుందంటున్నారండోయ్, కొందరు విశ్లేషకులు.

    అపరిమితంగా విస్తరిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజం మంటల నిప్పులు వాళ్ళింటి మీద కూడా పడతాయేమోనన్న భయం చైనా వాళ్ళకి మొదలయ్యిందనీ, అందుకే ఈ మధ్యన మన జర్దారీ సాబ్ జోలేలో వాళ్ళు ఏ డబ్బులు వేయలేదని కొందరి జ్ఞానుల(:-) ఉవాచ. నిజమేంటో ఆ దేవుడి కెరుక.

    వాళ్ళు కారణం పైనది అని చెప్పక పోయినప్పటికీ, ఈ క్రింది దానిని పై దానికి ఉదా. గా పేర్కొంటున్నారీ మధ్యన ఈ అనలిస్టులు.

    http://www.nytimes.com/2008/10/19/world/asia/19zardari.html?emc=rss&partner=rssnyt

    Oh well...If only "ANALYSTS" know every thing..

    ReplyDelete
  18. @కుమార్: ఈ విశ్లేషణల్లాంటి వాటిని కొన్నింటిని నేనూ చదివాను. కొంత వరకూ నిజంకూడా కావచ్చు. కాకపోతే పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల భయంకన్నా, భారతదేశాన్ని కంట్రోల్లో ఉంచాలన్న దుగ్ధ చైనాకు ఎక్కువ అనిపిస్తుంది.అందుకే వాళ్ళు పాకిస్తాన్ కు సహాయం తగ్గించినా ఇప్పట్లో మానరేమో!

    అయినా ఇండియా బూచిని చూపి చైనా నుంచీ.తాలిబాన్ (లాడెన్) ఆశచూపి అమెరికానుంచీ డబ్బులు, ఆయుధాలు దండుకోకపోతే ఇప్పటి పాకిస్తాన్ బ్రతుకు బస్టాండేకదా! ఎవరి survival వాడికి ముఖ్యం.

    ReplyDelete
  19. @Mahesh,
    Yes I am conveniently trying to forgot mistakes :) afterall I am Indian.
    Anyway I can ensure onething India never be a part in bloodshed politics for its own advantage like pakistan.

    @Baba gaaru before all this you are forgetting onething Pakistan and Bangladesh are part of India before that.:)

    ReplyDelete
  20. శ్రావ్య గారు
    మనిద్దరి కామెంట్ల మధ్య ఎక్కడో కమ్యూనికేషను గాప్ వస్తున్నదేమో.
    కొంచెం వివరణ
    according to the wish of the people living there, అన్న మీ వాఖ్య కు
    నేను
    కాష్మీర్ విషయంలో వాళ్ల ఆర్గ్యుమెంట్ కూడా దాదాపు అదేకదా.
    అని వాఖ్యానించాను. అంటే నాఉద్దేశ్యం కాష్మీర్ ప్రజల ఆకాంక్షలమేరకే ఇంత రాద్దాంతం జరుగుతున్నది అంటున్న పాకిస్తన్ వాదనను చెప్పదలిచాను.

    Kashmir monarch wished to be with India.
    Pakistan and Bangladesh are part of India before that.:)
    అని మీరన్నారు.

    బ్రిటిష్ వారు వెళ్ళిపోయేటప్పుడు సుమరు 105 ప్రింస్లీ స్టేట్స్ (స్వతంత్ర రాజ్యాలు - జునాగఢ్, హైదరాబాద్, కాష్మీరు, మైసూరు, వంటివి) వాళ్లు ఇండియాలో కలవాలంటే కలవచ్చు, లేదా పాకిస్తాన్ లో చేరాలంటే చేరొచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చి కొట్టుకు చావండర్రా అని పోతారు. వల్లభాయ్ పటేల్ ఒక్కొక్క స్టేట్ కు వెళ్ళి ఆ ఆ రాజులను భారతదేశంలో కలవటానికి ఒప్పిస్తాడు. (దీన్ని ఒక ఖాలీ బుట్ట తీసుకొని 105 ఆపిల్ పళ్ళను కోసుకొంటూ వచ్చాడని వర్ణించారు)
    ఈ ప్రక్రియలో కొరుకుడు పడకుండా మిగిలిపోయినవి హైదరాబాద్, జునాగఢ్, కాష్మీర్. హైదరాబాద్, జునాగఢ్ లను సైనిక చర్యలతో వశంచేసుకొంటుంది. కాష్మీర్ వద్దకు వచ్చేసరికి అక్కడి అబ్దుల్లా పెండ్యులంలా ఇండియా పాకిస్తాన్ లమధ్య ఊగిసలా్డుతాడు.
    అబ్దుల్లాతో బలవంతంగా ఒప్పించారన్న అభియోగాలూ లేకపోలేదు.
    నెహృ ఈ విషయాన్ని అంతర్జాతీయం చేసేయటంతో సమస్య ఇంకా బిగుసుకుపోతుంది.
    ప్లెబిసైట్ జరిపించాలన్న వాదనలు వినిపిస్తాయి. జరిగిందో జరగలేదో తెలియరాదు. సమస్య మాత్రం సజీవంగా నే ఉంది.

    ఇక బంగ్లాదేశ్ విషయమే వేరు. ఆదేశం స్వతంత్ర్యతను ప్రకటించుకోగానే మొదటగా ప్రపంచదేశాలలో భారత్ గుర్తింపునివ్వటం వెనుక పైన చెప్పినట్లు భౌగోళిక, రాజకీయ కారణాలనేకం.

    ఇక ఫ్రాంస్ విషయం ఏమిటంటే హైదరాబాద్ నవాబు ఇండియాలో కలవటానికి ఇష్టపడలేదు. అప్పటికే భారతదశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఫ్రెంచి కాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్, యానం వంటి ప్రాంతాలు ఫ్రెంచి వారి పాలనలో (1954 వరకూ) కొనసాగుతూఉన్నాయి. కనుక హైదరబాద్ నవాబుగారు తన రాజ్యాన్ని ఈ ఫ్రాంసు దేశంలో (భౌగోళికంగా భిన్నమైనప్పటికీ) అంతర్భాగం చేస్తానని ప్రతిపాదిస్తాడు. కానీ అధి సఫలం కాదు.

    బహుసా నా వాదన మీకు అర్ధమైందనుకొంటున్నానండీ
    థాంక్యూ

    ReplyDelete
  21. Babaa gaaru,

    I am sorry due busy with work I could not able to responded to you !
    From this link we can know info on so called plebisite drama.
    http://news.bbc.co.uk/1/hi/world/south_asia/1766582.stm

    What I am trying to say here is India never behaved like Pakistan to get what it wants.

    ReplyDelete
  22. I support Sravya's arguments 100%.

    Recently NDTV Prannoy Roy found out that for some unknown reason most hardcore ISI agents escaped Pakistan and infiltrated India.

    The RAW officers were trying to find out those ISI agents before they cause immense harm to India. Fortunately for India they found out those ISI agents busy responding against the post on this Blog.

    I welcome the comments, but
    before you respond read the articles at
    http://www.faithfreedom.org/

    ReplyDelete
  23. ముందుగా వ్యాఖ్యలు చేసిన అందరికీ ధన్యవాదాలు.
    రా పాకిస్తాన్నుండి, లేక శ్రీలంకనుండి అమాయక ప్రజల్ని భారత్కి రప్పించుకుని వాళ్లకి ట్రైనింగు గట్రా ఇచ్చి వాళ్లని వెన్నక్కిపంపి వాళ్ల దేశాల్ని తునాతునకలుగా పేల్చేసేలా చేసిందా?

    అమెరికా జిమ్మి కార్టర్ దెగ్గర్నుండి ఇప్పటి భూషయ్యదాకా, పైకి కనబడుతూనే బిలియన్ డాలర్లు "పాకిస్తాన్ డిఫెన్సె" కి సహాయం చేస్తూనే ఉన్నారు. Tip of the iceburg, $1 billion, unofficial గా మరి ఎంత ఉందో అది?

    మన అదృష్టమో, దురదృష్టమో మనం రష్యాతో చేతులు కలిపాం, దాని ఫలాల్ని ఇప్పుడు జూస్తున్నాం.
    >>పక్క దేశాల్లో అస్థిరత్వం రాజేయటం ఇటీవలిదాకా మన దేశంతో సహా అనేక దేశాల విధానాల్లో ఒకటి (గ్లోబలైజేషన్ కారణంగా ఈ తరహా పద్ధతుల్లో ఇటీవలికాలంలో మార్పులొస్తున్నాయి). సరిహద్దుల్లో మరో బలమైన దేశం ఉండటం మనకి మంచిది కాదు అనే పాతకాలపు యుద్ధ తంత్రం దీనికి ప్రేరణ.
    కాబట్టి రా వైపు వేళ్లు చూపటం వాళ్ల దౌత్య ప్రణాళికలో ఓ భాగం. మనం ఇప్పటికి మన వేళ్లన్నీ ఐ.యస్.ఐ వైపే పెట్టాం కానీ మన దౌత్యవేత్తలు CIA/ISI ల తంత్రాల ముందు మొట్టమొదటినుండీ ఓడిపోతూనే ఉన్నారు. ఈసారికిక ఏలనో బియ్యమక్క (కాండోలిజా రైస్) గారికి ఇవి కనబడినై, మరి అంతర్రాష్ట్రీయ మీడియా ముందు తలవంచక తప్పలేదేమో ఆమెకి, భూషయ్యకి. May be ఇవికూడా కొన్ని కారణాలు అయ్యిఉండవచ్చు - యూదులు మీద, మరియూ, తెల్లవాళ్ల మీద దాడి.
    ఒకళ్ల వైపు ఇంకొకళ్లు వేళ్లు చూపుకోవడం కేవలం ఏడవలేక మద్దెల మీద పడటమే.

    కాబట్టి, ఎవరూ పత్తిత్తులు కాదు, కాకపోతే, మనం కొంతమాత్రమే, మరియూ అది మన ప్రధాన బిజినస్ కాదు. కాని, పాకిస్తాన్ కి అదే ప్రధాన బిజినెస్.

    ReplyDelete
  24. శ్రావ్య గారు
    మీరిచ్చిన లింక్ బాగుంది.
    మీరన్నట్లు పాకిస్తాన్ అంత దారుణంగా భారత్ ఎప్పుడూ ప్రవర్తించలేదు.
    భాస్కర్ గారన్నట్లు ఇరువైపులా కొన్ని చీకటి కోణాలున్నాయి.
    కొన్ని మరుగున పడ్డ చారిత్రక సత్యాలున్నాయి.

    time has proved that bharat is right and even kashmiris will opt for bharat now rather than pakistan as thier fore fathers wished.

    ReplyDelete
  25. బాబా గారు:
    >>time has proved that bharat is right and even kashmiris will opt for bharat now rather than pakistan as thier fore fathers wished.
    ఏ కాశ్మీరీల గురించి మాట్లాడుతున్నారు మీరు? ఓరోజున, మెడిటేరియన్ సముద్రం దగ్గర కూచుని మా మిత్ర బృందంతో పిచ్చాపాటిగా కబుర్లు కొడుతుంటే, ఒక పిల్లోడు, పఠాన్ డ్రస్సులో అటుపోతూ, మా దగ్గర ఆగి, తన స్టైల్లో సలాం అన్నాడు. సరే మాటా మాటా కలిసింది. అతను ఎక్కడనుండో చెప్పాడు, మమ్మల్ని అడిగాడు, నేను హైదరబాద్ అని చెప్ప, ఇంకొకతను కాశ్మీర్ అని చెప్పాడు, ఓహ్ ఆజాద్ కాశ్మీరా, చాలా అందంగా ఉంటుదికదా కాశ్మీర్ అనిఆ పిల్లోడు అనంగనే, ఆ కాశ్మీరీ, ఆజాద్ కాశ్మీర్ కాదు, కాశ్మీర్ అని సవరించాడు. అసలు నిజమైన కాశ్మీరీలు ఏమైపొయ్యారు? ఇప్పుడు అక్కడున్నవాళ్లు మాకు ఇది కావాలి కోరుకునే హక్కు ఎక్కడిదీ?
    ఇది కేవలం మన దేశాన్ని ముక్కలు చెయ్యటంకోసం కాదు, దీనికి ఇంకా లోతైన మూలాలు ఉన్నాయ్. వాళ్లకి వాళ్ల ప్రభుత్వం ఎలా నూరిపోస్తున్నదో నాకు కొంతమంది పాకిస్తానీ స్నేహితులు చెప్పారు. ఆశ్చర్యపొయ్యా, కొన్ని వీడియోలు ప్రసారం చేస్తారట. ఐతే, ఏది నిజం? వాళ్లు చూస్తున్నది నిజమేనా? మార్ఫ్డ్ వీడియోలా? అయిఉండొచ్చు. ఎక్కడో ఓ చోట ఒక సంఘటన జరిగినంత మాత్రాన అదే నిజం అనుకుంటే?

    ఐతే - ఏ ప్రభుత్వం ఐనా, ఏ వైపైనా నిజమైన సమస్యలపై దృష్టిలేదు. నిజాన్ని నిజంగా కప్పేసేసి మోనిటరీ బెనిఫిట్ కోసం జనజీవితాల్తో తోలుబొమ్మలు ఆడతారు, ఆడిస్తారు.

    ReplyDelete
  26. అయ్యా అబరకదబర

    "శ్రీలంక, నేపాల్, సింధ్ వగైరా దేశాల్లో, ప్రాంతాల్లో ఇండియా రాజేసిన నెగళ్లెన్నో" - భూటాను ఏంజేసింది పాపం? అక్కడకూడా మన రాజేసిన నెగళ్ళు ఇప్పటికీ ఆరలేదని రాసేస్తే పొలే? ఇంతకీ మీ మేధోసంపత్తితో ఈ నెగళ్ళ వివరాలను కూడా తెలియజెప్పి అజ్ఞానులైన మాలాంటి వారిని కాంతిపధంవైపు నడిపించగలరు.

    మీరు చెప్పిన మాటలు నేను పూర్తిగా అంగీకరించే పొజిషను చర్చలో తీసుకున్నాను అనుకుందాం(మని కత్తి మహాశయునిలాగా). అంటే మీరు సెలవిచ్చిన ప్రకారం ఇదంతా ఒక ఆట. మనమంతా పావులం. మనమే బాధితులం(మిమ్మల్ని నాతోపాటే సాధారణ జనం లోకి కలుపుకుంటున్నాను, మీకు నచ్చకపోతే మన్నించగలరు). మీరన్న నెగళ్ళలో ఎన్ని వేర్పాటువాద భావజాలాలనుంచి పుట్టినవి? ఎన్ని "హిందూ ఉగ్రవాద" భావజాలాల్లో పుట్టినవి? ఎన్ని దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించే స్వభావం గలవి? (ఇప్పుడు జూలు విదిల్చుకుని బంగ్లాదేశ్ అని అరవకండి. బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఎలా ఉండేదో బుధ్ధి ఉన్న ఏ వ్యక్తయినా ఆలోచించగలడు. మీరు కూడా అలోచిస్తారని నా నమ్మకం.). ఇంకా భారతదేశం మొత్తము ఇప్పటివరకూ రాజేసిన "నెగళ్ళు" ఓ 4 వేల చిల్లర ఉన్నాయా? ఈ నెగళ్ళను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు దగ్గరగా గమనించి వారి డేటాబేసుల్లో వివరాలు జాగ్రత్తపరుస్తున్నాయా? ఈ నెగళ్ళకు ప్రపంచవ్యాప్త భారతీయులనుంచీ ఆర్థిక/నైతిక సహాయ సహకారాలున్నాయా? దేశపు "రా" అధికారులెవరన్నా మీరు సెలవిచ్చిన ఈ నెగళ్ళలో భాగంగా ఏదయినా "రా" అధికారి ఆత్మాహుతి దాళాన్ని నడిపి కనిపించిన వారందరినీ పిట్టలు కాల్చినట్లు కాల్చాడా? ఉద్యోగనిర్వహణలో పాపం "అమరుడయ్యాడా?"

    నేరం ఎక్కడైనా నేరమే. యుధ్ధంలో మరణించిన వారిని అమరులంటారు. ఎందుకంటే యుధ్ధం చేసే కొన్ని పద్ధతులుంటాయి. సుశిక్షితులైన సైనికులూ, దళాలూ పోరాడుకోవడం యుద్ధం. ఎదిరించలేని దేశాన్ని ఏకపక్షంగా నాశనం చేయటం దాడి. సైనికులు పౌరులు అనే విచక్షణలేకుండా సంచలనం భయోత్పాతం కల్గించడం ఉగ్రవాదం.

    మీకు నచ్చే భావాలని జనం మీద రుద్దటానికి మీరు యుద్ధాన్ని, ఉగ్రవాదాన్నీ ఒక్కటిచేసి మాట్లాడారు. ఒక సార్వభౌమదేశం లోని భూభాగాన్ని ఆక్రమించాలన్న్న ఆశయసాధనకై పుట్టిన ఐ యస్ ఐ ని, అదే సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్న అభిమతంతో ఏర్పాటైన ఒక దేశపు గూఢచారవ్యవస్థనీ ఒకే గాటన కడుతున్నారు.

    ఇలా చేసి మీరు జనానికేం చెప్పదలచుకున్నారు? నాకు మీలో ఒక మతి తప్పిన మేధావి కనబడుతున్నాడు!!

    ***********

    And I've read other comments too. I wish to respect Katti by *ignoring* him. So I drift!

    ReplyDelete
  27. తిలా పాపం తలా పిఱికెడు అని - ఈ నాటి ఈ ల.ఎ.తో, లేక, ఐ.యస్.ఐ యొక్క విపరీత ధోరణులకి అమెరికా పాత్ర చాలా ఉంది. తెల్లోడు ఇట్టాంటి పాముల్ని దెగ్గరకు తీసి, పెంచి పెద్దచేసి, కాటు వెయ్యటం కూడా నేర్పించి, ఎవ్వరినీ కాటు వెయ్యకు అంటే అదెలా కుదురుతుంది?
    ఆశ్చర్య కరమైన మాట ఎంటంటే - మేము ప్రతీ ఏడాది ఓకటో రెండో బిలియన్లు ఇస్తాం, మీ సైనిక అవసరాల్ని తీర్చుకోండి, భారత్ బోర్డర్ దెగ్గర నిఘా పెంచుకోండి అని చెప్తుంది అమెరిక.
    మాకు సైనిక అవసరాలు ఉన్నాయ్, ఒక 20 బిలియన్ డాలర్లు అప్పు ఇవ్వండి మేమూ మా ఆయుధ సంపత్తిని పెంచుకుంటాం అని భారత్ ప్రపంచ బ్యాంకు దెగ్గరకి వెళ్తే డ్యాష్ తో నవ్వుతుంది ప్రపంచ బ్యాంకు.

    ReplyDelete
  28. అయా భాస్కర్ గారూ :-) ఇంకో పొయ్యి రాజేసారు కదా..మెల్లిగా రగులుకుంటున్న సూచనలు కనబడుతున్నాయి :-)

    Yogi, I share your anger.

    On one side, it is at monumental proportions, having the potential of triggering clash-of-civilizations. The other one is an aberration(I am not sure if this is the right word) at best, and that too it is not based on religion, as you rightly suggested.

    రెంటినీ ఒకే గాటన కట్టటం అనేది ఖశ్చితంగా చాలా సత్య దూరం..but I don't know if anyone is doing that. I guess we all agree that we are not so self-destructive monsters.

    Disclaimer: ఓ పాసింగ్ థాట్ ని, అక్షర రూపంలో ఇక్కడ పడేసా.. నా మీదకి ఎవ్వరు దాడికి దిగకండి ప్లీజ్. ఇప్పుడు చరిత్ర లోకి దిగే ఓపిక లేదు. We have our warm-blooded young man Yogi for that:-). Hey that's a joke.

    ReplyDelete
  29. Kumaar gaaruu, I know :)

    But you have a point there. I can take the best shots fired at me, without flinching an inch irrespective of nature of the attack, personal-intellectual-socio-religisio-what not-io. So bring em on.. :)

    ReplyDelete
  30. @కుమార: Whats wrong? U made your point, I made mine. U and me cannot change the past and history. So, There is no question of fight, but, introspect ourselves to how much did we really understood of history.
    భయం దేనికి బ్రద్రు. మనం ఎమి తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. ఏమంటావ్?

    ReplyDelete
  31. భలే వాళ్ళే భాస్కర్ మీరు.. మళ్ళో కుంపటి రాజుకుంటుంటే నవ్వొచ్చిందంతే నాకు. అంతే కాని మీరు పొట్లాట మొదలుపెట్టారని నేనన్నానా? నేనేదో ఊరికే సరదాగా అన్నానా మాటలని స్మైలీ పెట్టాగా పక్కన.

    యోగి, మీరు కూడాను..మీతో అస్సలు విభేదించట్లేదు నేను. చెప్పాగా పైన. I don't have anything to throw at you.

    As far your 'toughness' is concerned, I don't have an iota of doubt..చెప్పాగా warm blooded young man అని :-)

    ReplyDelete
  32. అయ్యా జోగి,

    తమరు వెటకారం జోలికెళ్లకుండా మర్యాదగా మాట్లాడితే నేను సమాధానం చెప్పుండేవాడిని. ఇప్పుడు నేను తమర్ని ఇగ్నోర్ చేస్తున్నాను.

    ReplyDelete
  33. That was expected. Self proclaimed pseudo intellectual retards must know that sarcasm was equally honorable as logic in a dialogue, if not more.

    My middle finger goes up for these retards who evade issues in the name of a perceived 'personal attack'

    ReplyDelete