నిన్నటి నా పోస్టుకి అందరూ అభినందనలు తెలియజేసారు. సోదరుడు యోగయ్య, భా.రా.రె, శరత్ పార్టీ అన్నారు. :):) శరత్ గారికి ఓ నాలుగు మగ్గులు పంపాను. భా.రా.రె కి యోగికి ఇలా ఆర్డర్ చేసా.
చోటే భాయియోంకో చాయ్ లా, ఔర్ యోగి, బారారె కో దో బడా లా.
అంటే ఏంటో చూద్దాం....
నేను మొట్టమొదట అనగా నేను ఒక్కణ్ణే హైదరాబాద్ 1991 లో వెళ్ళా. మా అన్నయ్య ఉస్మానియాలో యం.టెక్ చేస్తుండేవాడు. ఎండ్లకాలం, గుంటూర్ సికందరాబాదు ప్యాసింజర్ బండి. కొత్తగా వేసిన ట్రాక్ అది. అనగా, అంతక ముందు గుంటూర్ నుండి సికిందరాబాద్ వెళ్ళాలీ అంటె బెజవాడ, ఖమ్మం, ఖాజీపేట మీదుగా వెళ్ళాల్సి వచ్చేది. ఆ బండి పేరు యాదుకొస్తల్లే. ఏదో ప్యాసింజర్. కొత్త ట్రాక్ గుంటూర్ - పొందుగల, విష్ణుపురం, మిర్యాలగూడెం, నల్లగొండ ల మీదుగా సెకందరాబాద్. దీనివల్ల కనీసం వంద నుండి నూట యాభై కిలోమీటర్లు తగ్గింది ప్రయాణం.
మరి ఓ రోజు పొద్దున్నే ఎక్కాం బండిని. పొద్దున్నే ఎనిమిదిన్నరకి. ఎఱ్ఱబస్సు మీద ఇలా రాసుంటుంది ఎవురైనా గమనించారా "ఈ బస్సు చెయ్యి ఎత్తినచో ఆపబడునూ" అని. అలానే, ఈ ప్యాసింజరు కూడా అంతే. దారిన పొయ్యేవాడు చంక గోక్కోటానికి చెయ్యెత్తినా ఠకా మని ఆగుతుంది.
బండి ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా మొత్తానికి పొందుగల కాడికి జేరింది. మరి మనూరేగా. మనం సీట్లో యాడుకూకున్నాం. మొత్తం ఆ తలుపుకాడేగా. సూద్దాం ఊర్నీ అనుకుంటే యాడా? ఊరే కనపళ్ళా. అల్లంత దూరంలో ఉంది ఊరు. ఇక కిట్నమ్మ ని దాటాం. వారేవా. నాకు ఎంట్రుకలు నిక్కపొడ్చుకున్నాయ్ ఆరోజు. ఇంకా గుర్తే అది. అలా ఇష్ణుపురం అ.క.అ వాడపల్లి, దామరసెర్ల, మిర్యలగూడ, కుక్కడం, తిప్పర్తి, చిట్యాల, నల్లగొండ, నాగిరెడ్డీపల్లి, పగిడిపల్లి, బీబీనగర్, ఘటుకేసర్ దాటి చర్లపల్లి చేరినాక ఔటర్లో ఓ గంట దొబ్బిచ్చుకుని మొత్తానికి సాయంత్రం ఎనిమిదికి చేరాం.
సికందరాబాదు ఇస్టేషన్ల దిగి, బస్సు పట్టుకుని అన్న హాస్టల్కి చేరుకునే సరికి పది దాటిపోయింది. ఆ బస్సులు!! వాహ్. అదే మొదటి అనుభవం కదా భలే రంజుగా అనిపించింది లే. ఆడోళ్ళుంటే ఆపడం, లేకపోతే బస్సు ఆగదు. స్లో అవుతుంది. దిగగలిగితే గొప్పోడివి. లేకపోతే నీ ఖర్మ. కండక్టరు టికెట్ అడగడు, ఇజిల్ ఏస్తాడు, తలకాయ్ ఊపి. సరే మర్రోజు పొద్దున్నే!! ఇంట్లో ఇడ్లీలు, అట్లు తినే ప్రాణమా, ఆకలి, నకనక. అన్నా ఆకలి అన్నా, పద అన్నాడు, వాళ్ళ మిత్రబృందంతో సహా, నడ్చుకుంటూ వెళ్ళాం. అడిక్మట్ కార్నర్లో ఓ కేఫ్. సమోసా ఆర్డర్ చేసాడు సోదరుడు. మనకేమో పొద్దున్నే సద్దిమొహంతో కాపీ తాక్కపోతే దిగదు. ఆడేమో ఓ ప్లేటు నిండా ఊరిబంతికి కావాల్సినన్ని ఏసి ఇచ్చాడు. అదేంట్రా, ఉన్నది ముగ్గురమే కదా అనుకున్నా. సరే సమోసా లాగించాక, ఆడు మిగిలినవి తీస్కెళ్ళిపొయ్యాడు. సామఝ్గాలే ఆ దినం. అయ్యాక చోటే దోబడా, ఏక్ చాయ్ లా అని చెప్పాడు సోదరుడు. మనం హిందీలో మహా వీక్. ఏందిరా అనుకున్నా. చాయ తెచ్చాడు వాడు. కప్పు, సాసరు, ఓ ఖాళీ కప్పు. హైద్ లో, సింగిల్ చాయ్ చెప్తే సాసరు, కప్పు చాయ్, ఓ ఖాళీ కప్పు ఉచితం. దాంతోపాటు రెండు బడా తెచ్చిచ్చాడు వాడు. బడా = బడా గోల్డ్ఫ్లేక్.
అప్పటిసంది ఇప్పటిదాంక, అనగా ఇండియాలో ఉన్నదాకా, హైద్ లో ఉన్నదాకా, ఏక్ బడా దే అంటే ఓ గోల్డ్ఫ్లేక్ కింగు కొట్టుగురూ అని నెట్టుకొచ్చాం. గిప్పుడు మానేసినం అనుకో గదిఏరే సంగతి.
గేంద్వయా అంటే, కేఫ్ కి పోవుడు, ఓ చాయ్ జెప్పుడు, చాయ్ తాగుతూ ఓ దమ్ముకొట్టుడూ. ఏందో!! గెటుబోయినయ వయా గా దినాలు. ఏం టైం పాస్ ఔతల్లే? ఛల్, కేఫ్ కి బో. మస్తు టైంపాస్.
Jun 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
హహ్హ.. బడా.. నేను నిన్ననే 230 వ సారి మానేసినా :)
ReplyDeleteఅయినా గేందివయ్యా నీ బ్లాగి ముచ్చటి? మా ఇంట్ల ఎవ్వరన్న ఇది సదివిండ్రనుకో నాకు తాట దీస్తరు ’బడా గావాల్నా బడా’ అని.
ReplyDeleteసరే మా ఆర్డర్ మాచెర్ల బెల్లం బూందీ మిఠాయి, ఏలూరు బాదం ఖీర్, హైదరాబాదు ఇరాని సమోస, చాయ్ కి మేము దూరం. పోతే మా స్నేహితులొకరి మొదటి సారి ఉత్తరాదికి వెళ్ళిన అనుభవమిది - 'దోచెయ్' అంటే ఆయన ఉద్దేశ్యంలో కాస్త ఉచ్చారణ దోషమున్నా "ఒక దోస వెయ్యి" అని. ఆ సర్దార్జీ గారు "రెండు టీలు (దో + చాయ్)" తెచ్చి ఇచ్చారట. నా water aerobics దోస్త్ మొన్నీ మధ్య చెప్పింది "ఆరేళ్ళలో ఇది తొమ్మిదో సారి క్విట్ చేయటం" అని. ;)
ReplyDeleteటపా గయితే మస్తుగుంది భాయ్, దో బడా గెప్పుడే ఇస్తావ్?
ReplyDeleteక్లాసులో ఎప్పుడూ హిందీ ఫస్టే.. అదేంటో కానీ హైదరాబాద్ హిందీ (?) ఒక్క ముక్క అర్ధం కాలేదు.. పర్లేదు ఇంకా చాలా మంది ఉన్నారు :):)
ReplyDeleteహైదరాబాద్ హిందీ కూడా బావుంటుంది..బావుంది పోస్ట్
ReplyDeleteమీ కిందటి పోస్టుకు అభినందనలు, ఈ పోస్టుకు నవ్వులు. భయ్య, మా బాస నీకింత సక్కగొస్తదని నాకేమెర్క? పో, పొయి చా జెయ్యమని జెప్పు ఒదిన్కు. ఎంతసేపూ సూరీడు సూరీడని పోరడిగురించే రాస్తవుగాని బిడ్డగురించి ఒక్క ముక్కయిన రాయవేంది?
ReplyDeleteవావ్..అరుణ గారూ, you surprised me!
ReplyDeleteచాలా మంది ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణా యాసని అనుకరించాలని ప్రయత్నించినప్పుడు, "ఏంది", "ఏంద్వయ్యా" అనేదాన్ని "గేంది", "గేంద్వయ్యా" అని రాయడమో, చెప్పడమో చేస్తారు, కాని అది నిజానికి అలా ఎవరూ అనగా వినలేదు నేను. పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి, నాకు ఈ అనుకరన చేసేవాళ్ళ తెలంగాణ తెలుగు చాలా ఎబ్బెట్టుగానూ, వినటానికి కష్టంగానూ ఉంటుంది.
మీరు అంత చక్కగా రాయడం నన్ను ఆశ్చర్య పరచింది. (మీరు తెలంగాణలో పెరగలేదన్న assumption తో)
పోతే "ఎంతసేపూ" అనేబదులు "పొద్దుగూకూ" అని కాని "దినాం" అని కాని వాడి చూడండి. అలాగే "పోరడి గురించే" అనే బదులు 'పోరని గురించే" అంటే ఇంకొంచెం బాగా ఇముడుతుంది.
గిదేంది వాయ్ తమ్మీ మల్లీ మొదలెట్టినవ్ గీ లొల్లి. గావ్ మరి నాకేది ఏక్ చాయ్ దో బడా...కుమ్మేసినవ్ గందా...
ReplyDelete:)
ReplyDeleteఆహా..... ఇంచుమించు నాకు కూడా ఇలాంటి తొలి అనుభవమే ఎదురైంది......ఇప్పుడైతే అలవాటయింది......!
ReplyDeleteకాకపోతే మనం మొదట ఎక్స్ ప్రెస్ తో మొదలు పెట్టినం.....!
మొదటి నుండి ఒకే బడి కావటం అది కూడా రైల్వే స్టేషన్ ప్రక్కన వుండటం వలన....నాకు రైల్వే ఉగ్యోగం అంటే మోజు ఏర్పడ్డది. డిగ్రీ తర్వాత రెండు మూడు సార్లు రై. రి. బో కు ప్రయత్నం చేసాను కూడా..........!
ReplyDeleteయోఘి, భా.రా.రె - అంపించినాగా. మీకాడికింకా రాలే?
ReplyDeleteఉష గారూ - ఇదేం బాలేదండీ. మీరు నా పాత పోష్టులు పెద్దగా చదివినట్టు లేరు. సరే ఇది చదవండి http://ramakantharao.blogspot.com/2008/10/aka-snacks.html
మురళీ భాయ్ - మనం "నేర్చుకునే" హిందీ వేరు, వ్యావాహారిక హిందీ వేరు. అదీ హైద్ లో హిందీని హిందీ అనకూడదేమో. దాన్ని ఇలా అనుకోవచ్చేమో ఉర్దూఇష్ హింది. ఎందుకంటె, మాలూమిచ్ నహీ, హళ్ళు హళ్ళు, పతాఇచ్ నహీ. "క్యోం" లేదు హైద్ లో, "కైకు" ఉంది. :):)
హరే కృష్ణ గారు - ఔను. భాషని ఆశ్వాదించాలి. అప్పుడే మనం దాన్ని సరిగ్గా అనుకరించి ఉపయోగించుకోగలుతాం. :):)
అరుణం - చెప్పినా, ఛల్ చాయ్ జెయ్య్ అని. బిడ్డ గురించి రాయాలే. ఇంకొంచెం టైం పడ్తది. ఇప్పుడిప్పుడె లేచి కూర్చోటానికి ట్రై జేస్తల్లే మరి. కూర్సున్నాక, ఇంక పోస్టులే పోస్టులు.
కుమార్ణ్ - :)
పప్పూయార్ - ఛల్, తమ్మీ, అన్నకి ఏక్ చాయ్ ఔర్ ఏక్ బడాలా. అన్నా చెప్పిన్నే.
అమర్ - :)
వేణు - :)
రామరాజుగారూ, ఎన్. కుమార్ గారూ
ReplyDeleteధాంక్స్. తప్పకుండా మెరుగుపడటానికి ప్రయత్నిస్తా. ఉగాదికి రాసిన ఒక చిన్న ఆర్టికల్లో ‘బాడుక్కిల్లుగావాలని తిర్గుతున్న’ అని రాశాను. మర్నాడు ఆఫీసులో ఒకాయన చూసి సరిచేశారు, తెలంగాణలో బాడుగ అనరు, కిరాయి అంటారు. అలానే రాయాలి అని. ఇంతకీ హైదరాబాద్ వచ్చి తొమ్మిదేళ్లవుతోందిగానీ, ఇప్పటిదాకా నేనొక్కసారి కూడా ఇరానీ కేఫ్ కు వెళ్లలేదు, చాయ్ తాగలేదు, ఉస్మానియా బిస్కెట్ రుచి చూడలేదు... ఇంక ‘బడా’ల వాసన అయినా చూడలేదు. :)