ఎవడో అజ్ఞాత కాకి ఇలా కావు కావు అంది ఓ బ్లాగ్ లో -
జనాలకు ఇంత వినోదాన్ని అందిస్తున్న మీ ఇద్దరినీ(మహేశ్ & యోగి) అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా యోగికి మరింత అభినందనలు. చదువేస్తే ఉన్నమతి పోతుంది అన్నదానికి యోగీ, మహేశ్‌లు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒకరినొకరు దూషించుకోవటం, రెచ్చగొట్టుకోవటం, హేళన చేసుకోవటంతోనే వీళ్ళ తెలివితేటలను బయటపెట్టుకుంటున్నారు. అందులో అరక్షణం కూడా ఎదుటివారి మాటలను అర్ధం చేసుకోటానికి వెచ్చించే ఓపిక ఇద్దరికీ లేదు. కనీసం మహేశ్ యోగితోనే ఆపేస్తాడు. కానీ యోగి మాత్రం మహేశ్‌ని అభినందించేవాళ్ళని కూడా వదిలిపెట్టాడు. గొప్పగా చదివి ఊడబొడిచాను కదా, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే అహంకారమే కనిపిస్తుంది. విపరీతమైన సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇచ్చే మహేశ్ ఏమీ తక్కువ కాదు. అసలు యోగి రాక వల్ల భాస్కరరామరాజు నుండి ఈ మద్యనే వచ్చిన విశ్వక్శేనుడు వరకూ అందరూ మహేశ్‌ని తిట్టి ఆనందించేవాళ్ళే. వీళ్ళని అదుపుచేసేవాళ్ళే లేరు. అందరినీ ప్రశ్నించే యోగిని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అతను నోరేసుకొని పడిపోవటంలో సిద్దహస్తుడు.
ఇక్కడ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా రెండు పైసలు -
యోగి నేను స్నేహితులం.
నన్ను తన అన్నలా భావిసస్తాడు యోగి. మేమిద్దరం సమయం దొరికినప్పుడల్లా ఛాట్ చేస్కుంటాం. ఛాట్ లో భావాలను పంచుకుంటాం. అంతేకానీ పొద్దస్తమానం ఎవడిమీద బురదజల్లుదాం అని చూడం. అలా చూడాల్సిన అవసరం లేదు. అంత సమయమూ లేదు, ఓపికా అంతకన్నా లేదు. ఎవుడికాడికి అంతకన్నా పెద్ద పెద్ద పనులే ఉన్నాయ్. అయినా ఓ వ్యాఖ్య రాయటానికో లేక ఓ పోష్టు రాయటానికో యోగికి చెప్పి అతని అంగీకారం తీస్కుని వేసేంత వెన్నెముకలేని జీవిని కాన్నేను. ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.
ఇక పైన ఉటంకించన బ్లాగు -
నేను ఆ బ్లాగు(లు) చదవను.
నా దృష్టిలో బ్లాగింగు -
బ్లాగు రాయడం ఫన్ కోసం. సమాచార సేకరణ కోసం లేక సమాచారం పంచుకోవడం కోసం. మన దైనందిన కార్యక్రమాలు కలిగించే వత్తిడిని మర్చిపోటంకోసం బ్లాగు. కనీసం ఆ నిమిషమైనా దైనందిన ఆలోచనలను అటకెక్కించి విముక్తి పొంది కొత్త కొత్త ఆలోచనలని తవ్వటంకోసం. అంతేకానీ రెంటికీ చెడ్డ రేవడి చేస్కోటానికి బ్లాగాల్సిన పని లేదు, అంటే అసలే తలనొప్పులు పైగా ఇక్కడ ఇంకో తలనొప్పి దేనికి? అని.
నా బ్లాగులు -
ఇప్పటివరకూ నాకు నచ్చిన విషయాల మీద నాకు చేతనైన విధంగా, నా స్టైల్లో రాసాను. నేను ఎప్పుడూ నా భావాజాలాన్ని గాలంగా రాయలా. బ్లాగు నా భావాజాలాన్ని ప్రతిబింబించాల్సిన పనిలేదు. నేను బ్లాగుని కేవలం అందరితో పంచుకోడానికే రాస్తా. నా ఆత్మ సంతృప్తి కోసం బ్లాగే రాయాల్సిన పనేముంది. బ్లాగులో "సంతృప్తి" అనే మాటకి అర్ధం లేదు అని నా అభిప్రాయం.
ఇక చిల్లర గొడవలు -
నేను ఎవ్వనితో గొడవకు దిగను, నన్ను కించపరిస్తే తప్ప. అలా కొన్ని సార్లు జరిగింది కూడా. నేను పెద్ద లెక్క చెయ్యను దేన్నైనా. ఇలాంటిది ఇక్కడ జరిగే కాళ్ళు లాగుడు గట్రా ఐ కేర్ ఏ హూట్.
నా వ్యాఖ్యలు -
నలుగురితో పాటు నారాయణ. ఒక్కోసారి ఒక్కోడి ఆలోచనా ధోరణి మనకి పడకపోవచ్చు. సాధ్యమైతే ఎదురిస్తా, సున్నితమైన విషయాలమీదనైతేనే. కొన్నికొన్ని సార్లు అలాంటి టపాలకి వ్యాఖ్యలు పెట్టాను. తెగిందాకా దేన్నీ లాగలా. నా దృష్టిలో ఇదీ అని చెప్పా. నేను చెప్పిందే వేదం అని ఎప్పుడూ చెప్పలా. నేనెప్పుడూ అలా అనుకోను. నేనే, నేనే హీరో నేనే విలన్ అని నేను ఎప్పుడూ భావించను.
కాబట్టి -
ఓ ట్యాగ్ వెయ్యటం చాలా ఈజీ. యోగీ భస్కర్ వీళ్ళందరూ ఒక్కటే అని. ఎలా?
నే రాసిన ప్రతీ టపాకి యోగి కామెంటు వేస్తాడు. అదీ ఆహా ఓహో అద్దిరింది అనే భజన చేసినట్టు ఏమీ లేదు. నా బ్లాగులు చదివేవారు నా ప్రతీ టపాకి వ్యాఖ్యానిస్తారు. అందులో వింతేముంది. వింత ఉంటే గింటే భజన చేసినప్పుడు. ఆహా ఓహో అని ఊగిపోతే అప్పుడు ఓ ట్యాగ్ పెట్టండి. భాస్కర్ మరియూ యోగి మరియూ బృందం ఒకరికొకరు భజన పరులు అని.
చివరగా - ఈ పాట వీంటూ పనిచూకుందాం. అది బెస్ట్ ఎప్పటికైనా, ఎవ్వరికైనా -
(कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना ) - २
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई - २
तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई
फिर क्यूँ संसार की बातों से, भीग गये तेरे नयना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे ...
हमको जो ताने देते हैं, हम खोए हैं इन रंगरलियों में - २
हमने उनको भी छुप छुपके, आते देखा इन गलियों में
ये सच है झूठी बात नहीं, तुम बोलो ये सच है ना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे ...
Jun 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
వ్హా! క్యా గానా హై!
ReplyDeleteబహుత్ ఖూబ్ కహా ఆప్ నే!!
:) బాగా చెప్పారు.
ReplyDelete"ఓ ట్యాగ్ వెయ్యటం చాలా ఈజీ. యోగీ, భాస్కర్ వీళ్ళందరూ ఒక్కటే అని." - ఎవరు టాగ్ వేశారు? ఎక్కడ?
ReplyDeleteబ్లాగ్ అనే ఒక ఆహ్లాదకరమైన అనుభవం నుంచి ద్వేషపూరితమైన లేఖలు చదవాల్సి రావటం బాధాకరమే. ఇది కొంతమందిని బ్లాగులకు దూరంగా వుంచుతుంది. సున్నిత మనస్కులను గాయపరుస్తుంది.
బ్లాగ్ అనే ఒక ఆహ్లాదకరమైన వేదికని అరమరికలి లేకుండా అందరం కలసి అలంకరించాలని ఆశిద్దాం!
ReplyDelete"కుచ్ తో లోగ్ కహేంగే!
ReplyDeleteలోగోన్ క కాం హై కెహన!
ఆప్ ఇస్ సె నారాజ్ న హోన!
హంతో ఇస్ బ్లాగ్ సె దిల్ బెహలాలేంగే!"
నాకిష్టమైన పాటలలో ఇదీ ఒకటండి....
పాట బాగుంది :) ఇక టపా గురించి ఐతే ఏమిటి మీరు ఇంత సీరియస్ గా తీసుకొంటున్నారు? పని పాట లేకుండ ఎదో ఒకటి రాసే వాళ్ళ గురించి ఇంత ఆలోచన ఇంత బ్లాగు స్పేసు అనవసరం! ఐనా మళ్ళీ ఒకసారి ఆ కామెంట్ ని బాగా చదవండి ఎవరు రాసారో మీకే తెలుస్తుంది .
ReplyDelete