ఏ ఆటకైనా ఆడేవాడికి కావాల్సింది ఆ ఆటంటే ప్రేమ, మక్కువ, ప్యాషన్. చాలామంది అంటుంటారు, భారతంలో క్రికెట్ కి బాగా క్రేజ్ అని. కాదు, డబ్బున్నోడు క్రికెట్ని బాగా మార్కేట్ చేసాడు. అంతే, టూత్పేష్ట్ అంటే కోల్గేట్ ఎలానో, ఆట అంటే క్రికెట్ అనేలా దాన్ని మన నరనరాల్లోకి ఎక్కించాడు. ఈ ఆటవల్ల కొన్ని కొన్ని వ్యాపార జీవులు అందలాలకి ఎక్కాయి. మన సగటు ఆటలు మరుగున పడ్డాయి. నాకేమి క్రికెట్ అంటె కోపం లేదు. నేనూ క్రికెట్ చూసేవాణ్ణే. ఐతే, నా అదృష్టం క్రికెట్ అనే ఆటా ఉందని నాకు నా ఇంటర్లో తెలిసంది కాబట్టి ఆ ఆటకి నా జీవితాన్ని బలి ఇవ్వలా.
చాలా మంది అంటారు, క్రికెట్ చలా తక్కువ ఖర్చుతో ఆడచ్చు అని. దానికి ఏమీ అక్కర్లేదు, ఇద్దరు పిల్లలు, ఒక బ్యాటు బాలు ఉంటె చాలు అని.
నా దృష్టిలో ఒక ఆట ఆట్టానికి కావల్సింది వసతులు, డబ్బు, అవీ ఇవీ కాదు. కావాల్సింది ఆటమీద ప్రేమ, దాహం, వ్యసనం, పట్టుదల, వెరసి - ప్యాషన్.
ఐతే మన దురదృష్టం, మనకి ఇలాంటివాటిమీద దృష్టి మరలదు. మన పెద్దలు లేక మన సమాజం ఇంజనీరింగు, లెక మెడిసిన్ లేక ఇంకేదో నిచ్చన్లని తయ్యారు చేసిందే తప్ప, ఆట, మానసిక, శారీరక వికాశాలకి తావివ్వలేదు. మనకి ఉన్న అతి తక్కువ లైబ్రరీలలో కూడా ఆటలకి సంబంధించిన పుస్తకాలు లేవు. టివీ పెడితే పొద్దస్తమానం క్రికెట్టే. ఇక మిగతా ఆటల గురించి ఎలా తెలుస్తుంది. ఈ పరీస్థితి నిజంగా దౌర్భాగ్యం.
ఒకప్పటి మన లెగసీ హాకీ కూడా తొందర్లో అంతరించి పోతుంది చూస్తూ ఉండండి.
ఇంతకీ నే చెప్పేదేంటంటే, జో(హో)గా బొనీతో. అనగా - ప్లే బ్యూటిఫుల్.
పోయిన సాకర్ ప్రపంచకప్ సమయమ్లో నాకు ఈ హోగా బొనీతో అనేది తగిలింది. ఇక్కడ కొన్ని యూగొట్టం నుండి నూక్కొచ్చిన లింకులు పెడుతున్నా చూడండి.
ఆడవాళ్ళ ఫ్రీ స్టైల్
ఎవ్వరు చెప్పారూ కాలిబంతి ఆడాలి అంటే ఓ పెద్ద గ్రౌండ్ కావాలి, దానికి పెట్టుబడి కావాలి అది కావాలీ అని. ఇక్కడ చూడండి.
ఇది చూసాక ఇప్పుడు చెప్పండి - ఒక ఆట ఆట్టానికి కావల్సింది ప్యాషనా లేక వసతులా?
మీ పిల్లల్ల్ని ఇతరఆటల వైపుకి కూడ మరల్చండి.
ఇరాన్ లాంటి దేశాలు ఫిఫా లో చోటు సంపాదిస్తుండగా వందకోట్ల జనాభానుండి మనం కనీసం పాతిక మంది సాకర్ ఆటగాళ్ళని తయ్యారు చేస్కోలెకపోతున్నాం అంటే క్రికెట్ మధుమేహ వ్యాధిలా గమనించలేనంతగా ఎలా ప్రబలిందో చూడండి..
అలానే నా శ్రీరామనవమి శుభాకంక్షలు పోస్టులో చెప్పినట్టుగా
మనం ఒకడేమి చేస్తే పొలోమని అందరం అదేచేస్తాం. అన్నమాచార్య కీర్తనలే తీస్కోండి ఉదాహరణకి. పొలోమని అందరూ అవే కీర్తనలు నేర్చుకునేది. అన్నమాచార్యులవారికి దక్కినంత ప్రాచుర్యం భక్త రామదాసుకి దక్కపోవటం లోటే. అవునులే అన్నమాచార్యులవారిని తి.తి.ది వారు తమ భుజస్కంధాలపై మోసి ప్రాచుర్యం చేసారు. సంగీతం నేర్పే వారికి, నేర్చుకునే పిల్లల తల్లితండ్రులకూ భక్త రామదాసు కీర్తనలు కూడా నేర్పిస్తుండండి. తప్పేమీ లేదు.
Jun 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
"మన పెద్దలు లేక మన సమాజం ఇంజనీరింగు, లెక మెడిసిన్ లేక ఇంకేదో నిచ్చన్లని తయ్యారు చేసిందే తప్ప, ఆట, మానసిక, శారీరక వికాశాలకి తావివ్వలేదు."...ఇది మొదటి నుంచీ ఉన్నది కాదు.. ఈ తరం లో వచ్చిన మార్పు.. చిన్న చిన్న పల్లెల్లో కూడా కబడ్డీ పోటీలు జరిగాయి వెనుకటి తరంలో...
ReplyDeleteఅవును మురళీ భాయ్. మా బళ్ళో మేము ఆడిన ఆటలు కబడ్డి, ఖోఖో, బాల్ బ్యాడ్మెంటెన్, వాలీబాల్, సాఫ్ట్బాల్. ఆంధ్రపదేశ్ ప్రజాపరిషత్ ఉన్నత పాఠశలలో చదవడం మూలాన, మరీ ఇప్పుడున్నంత వత్తిడి ఉండేది కాదు చదువుల్లో. ఇప్పుడు ఆడదామన్నా గ్రౌండేది బళ్ళో? ఉన్నా తల్లితండ్రులు ఆడనిస్తారా?
ReplyDelete