Jun 2, 2009

351:90

351 -
ఈ రోజు మొత్తానికి, గంటసేపు నడిచి, 351 కేలరీలు ఖర్చుపెట్టా.

ఇక 90 ఏంటారా? సదవండే -
మా ఆపీసుకెళ్ళే దారిలో ఓ డ్రైక్లీనరు కొట్టుంది. బట్టలుతికే మరలో కాలర్లమీన మట్టి పోటల్లా. మరి ఒకటా రెండా ముప్పియ్యైదు సమచ్చరాలనుండి పేరుకుందాయే. ఓసారి డ్రైక్లీనింగ్కేద్దాం అన్నా. పెళ్ళాంపిల్లలు సరే అన్నారు. సరే మూటకట్టు అన్నీ అన్నా. అవీ ఇవీ, ఉతికినవి, ఉతకనివి, వాడేవి, వాడనివి, టి చొక్కాలు కాపీ చొక్కాలూ అన్నీ ఓ గోతంలో ఏసి ఇదిగో మొత్తం 28 ఉన్నాయ్. ఏసిరా అంది మావిడాయ్. సరే, సూరిగాణ్ణి ఎంటేస్కుని ఎళ్ళా. మొట్టమొదటిసారి అమ్రికాలో డ్రైక్లీనర్ కాడికి. ఓ నల్లబాబు ఉన్నాడు.
ఏంకత
ఇయ్యన్నీ ఉతకాల
నిజంగానేనా (ఓరి సుబ్బిగా అన్నట్టు మొగం పెట్టి)
ఏంపర్లేదు, అదే నా చివరాకరి నిర్ణయం
ఎన్నున్నయ్యేంది
28
(ఆళ్ళ కొలీగు అమ్మాయిఐపు, ఏంపర్లేదు మనకి ఇంకోరోజు జీతం, దొరికాడు బకరా అన్నట్టు చూసి)బాసు వెంటెర్ కొడతన, నీ నిర్ణయంలో మార్పులేదుగా
(మనకేంతెల్సు మన డాష్ పేలబోతోందని)(ఏట్రా సుత్తినాయాల అని మనసులో అనుకుని) కానీవయ్యా
సరే 20/- రేపురా. ఇదిగో కాయితకం.

రెండో అంకం. ఇయ్యాల ఎత్తుకొచ్చుకోటాకెళ్ళా.
బాసినీ. నాబట్టలు
ఇయిగో
ఎంత నా బిల్లు( ఒసేవ్ బండదానా తొందరగా ఇయ్యి)
ఓ బకరా మాష్టరూ, మీ బిల్లు తొంబై.
వాట్? ఎలా? 20/- అన్నావుగా?
బాసూ సరిగ్గా సూడు, ఆరుబట్టలకి ఇరవై. పుడింగి పాపారావ్ లా అన్నీపీక్కొచ్చి ఏసావ్ మొత్తం 28. నేక్స్ట్
బేర్ బేర్


అదీ కధ ఈ దినం.

10 comments:

 1. > ఏంపర్లేదు మనకి ఇంకోరోజు జీతం, దొరికాడు బకరా అన్నట్టు చూసి
  :-)

  ReplyDelete
 2. మరి 140 ఏది?
  బిల్లు చూసిన తరువాత మీ ఆవిడ మీద ఎగిరినప్పుడు వచ్చిన బి.పి సంఖ్య :-P

  ReplyDelete
 3. హ హ హ బాగా అయింది ! మనకు ఇలాంటివి బోలెడు ఎక్సిపీరియన్సులు:)

  ReplyDelete
 4. అసలు డ్రై క్లీనింగ్ పని సొంతంగా చేసుకుంటే ఇంకా బోల్డన్ని కేలరీలు కరిగేవి కదా..ఆ..ఆ..ఆ...

  ReplyDelete
 5. ponlendi.. meeku oka shirt meeda concession vachchindi, choosukunnara ? :P

  ReplyDelete
 6. తమ్ముడూ అసలా బిల్లు చూసేసరికి నీకు మొత్తం కేలరీలు ఖర్చయ్యుండాలే.

  ReplyDelete
 7. పానీపూరి, యో, నీకు పెళ్ళైందా?
  >>ఆవిడ మీద ఎగిరినప్పుడు
  కలగానీ కన్నావా ఏటి?
  శ్రావ్యా - దిగితేకానీ లోతుతెలవలేదు.
  మురళి - ప్రతీ వారం అదేగా చేసేది. ఎరైటీ, ఎరైటీ కోసం ఇలా.
  నాగమల్లేశ్వర్ - నా కొంపముంచేలా ఉన్నారే మీరు, లెక్కలు గట్రా వేసి. అసలు అయ్యింది తొంభై+. కానీ కొంచెం ఊరట తెరిపి కోసం తొంభై అనే చెప్పా. బాగాచెప్పాకదా?
  పరిమళం -:):)
  పప్పూయార్ - బిల్లుచూసేసరికి ఖొరపోయింది. మంచీళ్ళకి మళ్ళీ ఉంకో డాలర్ అంటాడేమో అని రవితేజా లా నవ్వా.

  ReplyDelete
 8. ">>ఆవిడ మీద ఎగిరినప్పుడు
  కలగానీ కన్నావా ఏటి?"
  హ హ హ. నిజ్జం! బొత్తిగా అనుభవం లేనివాడిలాగున్నాడు!
  అవునూ 28 బట్టలకి 90 డాలర్లంటే, బట్టకి సుమారు 3 డాలర్లు. రీజనబుల్లే.

  ReplyDelete
 9. అన్నగారూ, ఏమి రీజనబుల్లో ఏందో, బిల్లుచూసేసరికి ఖొరపోయింది....

  ReplyDelete