Jun 15, 2009

పోనీ ఏమైనా కవితా?

పోనీ అదేమైనా సెక్సా కామోద్రేకం పొందటానికీ? కాదే
పోనీ అదేమైనా భావుకతా మన భావాల్ని తట్టి లేపుకోటానికీ? కాదే
పోనీ అదేమైనా కవిత్వమా, మనలోని కవితాకలాన్ని ఆ కవిత్వం అనే సిరా తో నింపుకోటానికి? కాదే
పోనీ ఏమైనా సామాజిక స్పృహా, మనలో స్పూర్తి రగిలించుకోటానికి? కాదే
పోనీ అదేమైనా శాస్త్ర సారమా మన తెలివితేట్లని పెంపొందించుకోటానికి? కాదే
పోనీ అదేమైనా చరిత్ర, మన అణగారిన బ్రతుకుల్ని అందులో చూస్కోటానికి? కాదే
పోనీ అదేమైనా రామాయణమా, రాముడికి సీత ఏమౌతుందో తెల్సుకోటానికి? కాదే
మరి అదేంటి - అది సుత్తి. కేవలం చెత్త.
కనీసం మామూలు చెత్త అయితే రి-సైకిల్ చేయగల వస్తువు ఏమైనా ఉందేమో అని ఎతుకుతా.
అది దేనికి పనికిరాని చెత్త - ఆ రాత! ఆ రాత చూసీ, వొద్దనుకుంటూ చదివీ, బుర్ర చెడగొట్టుకొనుట-
..... ఇంకేమిటి, మన తలరాత!!!

17 comments:

 1. "ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి సలాములు చేసే వాళ్ళు పుడుతున్నారు. జాగ్రత్త! ఈ లక్షణం పొడసూపిందా దేశం లో తోకచుక్క పుట్టిందన్నమాటే!" -- మహాకవి శేశేంద్ర

  తోకచుక్కలు పుడతున్నయ్. ఒక్కటి కాదు, రెండు కాదు... విచ్చలవిడిగా పుడుతున్నయ్!

  మిత్రులారా! మీ నగరం పైన ఆకాశం లో గద్దలు విహరిస్తున్నయ్ చూడండి!!

  ఇంతే సంగతులు... చిత్తగించవలెను....

  (వంశీ గారు థాంక్స్! చివరికి నేనూ మీలా మారిపోయా) :) :)

  ReplyDelete
 2. బాగా చెప్పారు !

  ReplyDelete
 3. కరకట్టే. ఒకడు కవితలతో ఖూనీ చేస్తా అంటున్నాడు, మరొకడూ హైకూలతోని బాకులు దింపుతుండు. దురద పుడితే గీక్కోనే తాడి చెట్లు అయిపోయినాయి బ్లాగులు. ఇది సదివినావో లేదో...

  http://anamdam.blogspot.com/2009/06/blog-post.html

  ReplyDelete
 4. కాదు కాదు!! ఛా, నేనుప్పొకోను, అది ఏడమే. లేదు లేదు. నువ్వే సరిగ్గా పట్టుకోలేదు, లేక గమనించలేదు. అది ఎడమే. అక్షరాలా, నా చెమట సాక్షిగా ఎడమే.

  ReplyDelete
 5. యోగి - "ఈ దేశం లో వంగి నడిచే వాడికి వంగి వంగి సలాములు చేసే వాళ్ళు పుడుతున్నారు. జాగ్రత్త! ఈ లక్షణం పొడసూపిందా దేశం లో తోకచుక్క పుట్టిందన్నమాటే!" -- మహాకవి శేశేంద్ర
  అత్భుతం.
  శ్రావ్యా - :):)
  దీపూ - :):)
  బ్లాగ్ వీరుడు - బాగుంది.

  "ఎక్కడో తగిలిందా? ఏదో అయ్యిందా? గుర్తుకి వచ్చాయా?"

  ReplyDelete
 6. నిజాలన్నీ ఇలా రాసేస్తే ఎలాగండి??

  ReplyDelete
 7. నిజం నిప్పులాంటిది. ఎవ్వరూ దాచలేరు, దాయలేరు.

  ReplyDelete
 8. నేను కవిని కాదన్నవారిని కత్తితో పొడుస్తా :)

  ReplyDelete
 9. నాకు తెలిసినంతవరకూ (తెలిసింది అతికొంచం అని ఒప్పుకుంటూ) ఇది మీ తొలికవిత... శుభారంభం...

  ReplyDelete
 10. భలే వారే ! అది 'రస స్పందన' ... మనబోటి వాళ్ళకి అలాంటివి అర్థం కావు లెండి !

  ReplyDelete
 11. ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
  మౌని దెల్పవచ్చు మాసమునకె
  ముప్పె దెల్పగరాదు ముప్పదేండ్లకునైన
  విశ్వదాభిరామ వినురవేమ

  ReplyDelete
 12. కుక్కతోకతెచ్చి గొట్టంబు చేర్చిన
  క్రోవి చెంతనుండు కొత తడవు
  యెంతచెప్ప చెడుగు పంతంబు మానునా! ||విశ్వ||

  ReplyDelete
 13. మీరు ఇలా ఫెడీ మని కొట్టి నట్టు చెప్తే ఎలా గురువు గారు........
  మళ్ళీ రేపో మాపో అసలు బ్లాగులు(మనవి కాకుండా వెరేవాళ్ళవి) చదవడం సుధ్ధదండగ అంటూ ఇంకొక టపా వస్తుంది జాగ్రత్త.

  ReplyDelete
 14. ఖరముపాలు తెచ్చి కాచిచెక్కెర వేయ
  భక్ష్యమగునెయెన్న భ్రష్టుడట్లె....
  .
  .
  .
  గాడ్దెమేను మీద గంధంబుపూసిన
  బూదిలోనబడుచు పొరలుమరల
  మోటువాని సొగసు మోస్తరయ్యదిసుమీ...
  .
  .
  .
  నీటిలోనివ్రాత నిలువకయున్నట్లు
  పాటిజగతి లేదు పరములేదు
  మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు...
  .
  .
  .

  ReplyDelete
 15. గాడ్దెమేను మీద గంధంబుపూసిన
  బూదిలోనబడుచు పొరలుమరల
  మోటువాని సొగసు మోస్తరయ్యదిసుమీ...

  సత్యం. కొన్ని కోట్లు విలువచేసే సత్యం. వృధాప్రయాస ఆపండయ్యా అని వేమన ఎప్పుడో చెప్పాడు. ఔను, నిజమే, ఔన్నిజమే.

  విశ్వక్శేనుడు - నిద్రపోటున్న వాణ్ణి లేపచ్చు. నిద్ర నటిస్తున్నవాణ్ణి లేపలేం.

  ReplyDelete