Jun 26, 2009

పాప్ రారాజు మైకెల్ జాక్సన్ ఇక లేడు

50 సంవత్సరాల మైకెల్ జాక్సన్ లాస్ ఏంజలస్ లోని ఓ ఆశుపత్రిలో కన్నుమూసాడు.
మైకెల్ జాక్సన్ గురించి రాయాలంటే ఎంతో ఉంది. తనదైన స్టైల్, తనవైన డాన్స్, అతని కాస్ట్యూంస్, మూన్ వాక్ జనాలని ఉర్రూతలూగించినా ఎన్నో అపవాదాలు మూటకట్టుకుని పైకి వెళ్ళిపోయాడు.
ఇప్పటికీ థ్రిల్లర్ కానీ, బాడ్ కానీ, బ్లడ్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ కానీ ఉర్రూతలూగిస్తాయ్.

నింగికెగసిన ఒక కెరటం!!

అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటా

Jun 21, 2009

ఇంక నీ సుత్తి ఆపు

ఒక ఆఫీసులో రెండు వందల మంది ఉంటే దాంట్లో యాభై మంది తెలుగోళ్ళు ఉంటె దాంట్లో సగం బ్లాగులు చదివితే దాంట్లో కనీసం ఐదుగ్గురు రెప్లైలు ఇస్తుంటే వాళ్ళందరికీ ఒకే గేట్వే ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తే, వాళ్ళందరి ఐ.పి అడ్రస్స్ ఒకటే.

ఇక నీ పిచ్చి గెంతులు ఆపు. నిన్ను హేట్ చేసే వాళ్ళు ఒక ఆపీసులోనే కనీసం ఇద్దరు ఉన్నారు. ఇక ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉన్నారో.

నా ప్రొఫైల్, నేను, నేనేంటో నాకు తెలుసు. నువ్వు నీ గురించి తెల్సుకో.
నా నిన్నటిపోస్టుకి నా పోస్టులే కొన్ని పెట్టావ్, ఈట్ మై వర్డ్స్ అని పెట్టావ్.

అది నువ్వు చెయ్యాలేమో. నీ పోస్టుల్లో నువ్వు రాసినవి మళ్ళీ పెట్టాలీ అంటే రెండువందల పోస్టులు పెట్టాలి. అంత ఓపిక సమయం నాకు లేదు.

నీకు మితృలు చాలా మందే ఉన్నారు. గుడ్ ఫర్ యూ.

చివరిగా -
౧. అబ్రకదబ్ర - చాలా మంచి పని చేస్తున్నావ్. ధ్న్యవాదాలు.
౨. పుస్తకం డాట్ నెట్ -
జనులారా. ఇది అందరికీ. ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్స్ చేస్కోవాకండి. మీ ఐ.పి. లు గట్రా ఎస్పోజ్ చెయ్యబడతాయ్. అదేం పెద్ద విషయం కాదు, కానీ, షేర్ చేస్కోబడతాయ్.
౩. అతను అతని మిత్ర బృందం - పు.వే.వా
౪. ఇక రేపు నవతరంగం నూండి
౫. ఎల్లుండి కూడాలి నుండి.

నాకో ప్రశ్న. వీళ్ళాందరూ ఇలా ఒక రీడర్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేకునే బదులు అన్నీ అతని బ్లాగులో కలిపేయొచ్చుగా?

ఇక ఇజాలు, వ్యాఖ్యలు -
రాముడికి సీతేమౌతుంది అంటే అది సెన్స్, నువ్వు నీ పిచ్చి రాతలు మానేయ్ అంటే అది నాన్సెన్స్. అవును, కారణం ఎవడికాడికి ఆడి డ్యాష్ కింద నలుపు కపించదు. ఎవుడికాడికి ఆడుతొక్కిన ఆడిపియ్య కమ్మటోసన.

ఇలాంటి వాటివల్ల ఒనగూరేది ఏమీలేదు కేవలం కామెడీ తప్ప.

ఇంకో విషయం!! ఇలా ఐ.పి బేస్డ్ వ్యాఖ్యల్ని అందరి దగ్గరా అడుక్కుని తీస్కొచ్చి పెట్టటం ఏమి నిరూపిస్తుంది? ఐతే ఆ వ్యాఖ్యలు చదవండి. అయ్యగారిమీద రాసిన వ్యాఖ్యలు ఐతే మహా రంజుగా ఉంటాయ్.

Jun 20, 2009

సైబర్ నేరం, మర్యాద!! ఉఫ్ - బడే హోజావ్ బచ్చే

wow
great.
so whats the point? నేను వ్యభిచారం చేస్తే మర్యాదన్ కోల్పోయినట్టు.
ఏమి నిరూపిద్దాం అని నీ గోల, సొద?
పుస్తకం లో గోవిందరాజు తో రాసింది నీకు తెలియటం లాబీయింగ్. అది పుస్తకం డాట్ నెట్ వారి విజ్ఞత. మరియూ నీ తెలివి.
వాట్ యూ ప్రూవ్డ్?

ఇక సైబర్ నేరం?
వావ్? కేక. అసలు సైఅర్ నేరం అంటే ఏంటి?
సరే లీగల్ యాక్షన్. నీకు నా ఛాలెంజ్. నా మీద లీగల్ యాక్షన్ తీస్కో దమ్ముంటే.

నీ మతి స్థితి -
అక్కడ పెట్టిన కామెంటులో నీకు కటువుగా ఉన్నదాన్ని తెచ్చి ఇక్కడ పెట్టావ్. నేనే నీ స్థానంలో ఉంటే మొత్తం పెడతా.

ఇక నీ బ్లాగులో ఉటంకించిన బొమ్మల్లో -
http://anilroyal.wordpress.com/2009/04/23/%e0%b0%9b%e0%b1%80-%e0%b0%9b%e0%b1%80/

ఛీ ఛీ అనే అబ్రకదబ్ర పోస్టులో తమరి వ్యాఖ్య కి నా కామెంటు -
భాస్కర్ రామరాజు 1:33 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 24, 2009

నే రాద్దాం అనుకున్నదాన్ని తమరు రాసేసారు.
>>ఎలాగూ మనది sex starved దేశం. మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి.
మన సంస్కృతి మీద అంత విషం దేనికో జనలకి? నిజమైన సంస్కృతి ఎంటో విజ్ఞులు తెలియజెప్పాలి నాలాంటి అజ్ఞానులకి.
సుజాత గారు >> ఈ ఎన్నారైలందరికీ ఇంత దేశభక్తి ఎందుకో అర్థం కాదు. అక్కడికెళ్ళి కూడా ఇక్కడ నడిచే చెత్త ప్రోగ్రాములు చూడకపోతే ఏమో?
ఇదెలా? ఎక్కడకి వెళ్ళినా ఏదో మన అనే దానికోసం చూడటమే, కేవలం టైంపాస్ కోసం. అంతే కానీ ఓ పెద్ద పొందే లాభం ఏమీ లేదు వీటివల్ల, నెలకి పది డాలర్ల బొక్క తప్ప.

ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెళ్ళు విధిగా ఇవి ఏ ఆడియన్స్ కోసమో చెప్తే కాస్త గుడ్డిలో మెల్ల. ఇది

దీంట్లో ఏమైనా బూతు ఉందా? అమర్యాద ఉందా?
నీ నీచ సంస్కృతి తెలుస్తోంది. నీ మరకని నా రాతలద్వారా ఎత్తి చూపుతున్నావ్. నిన్ను నువ్వు చూపించుకుంటున్నావ్.
అబ్రకదబ్ర ద్వారా బాగానే సంపాదించావ్. బాగుంది.
లేక - దీంట్లో ఉందా బూతు - http://parnashaala.blogspot.com/2009/06/blog-post_15.html
పాటకు పరవశిస్తున్న నువ్వు, నా చెయ్యి నీ బ్లౌజు మీదున్న చెమట తడిని ముట్టుకున్నా కళ్ళు తెరవలేదు. నీ మెడనుంచీ చెమట మెల్లగా కుడి వక్షం వొంపు క్రిందకు నిదానంగా జారుతుంటే నేనందుకున్నాను. నువ్వుమాత్రం కళ్ళు మూసుకుని మెత్తగా నవ్వుకున్నావు. ఆ నీ చెమట బిందువు నా వేలికొసపై చిన్నగా, వెలుతురు సరిగా లేని గదిలో వెచ్చగా మెరిసింది. ఆ తడి వేలిని నా పెదాలు తాకాయి. ఆ క్షణంలో ఈ వేసవి రుచి నాకు అవగతమయ్యింది.



కులం, మతం, ఇలాంటి అరుపులు ఎవరివీ? నీ బ్లాగులు, నువ్వు రాసే కామెంట్లు అన్నీ చదువుకో నీకే తెలుస్తుంది.

నా మర్యాదేంటో నాకు తెలుసు. నీకున్న మర్యాద నువ్వు చూస్కో.

----------------
అసలు కామెంటు ఇదీ
మార్తాండ
నీ వాదన అత్యంత దివాలాకోరు తనంగా ఉంది.
ఒకడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు, ఆడి ఊరు స్టువార్టుపురం. కాబట్టి స్టువార్టుపురం వారందరూ దొంగలే అనొచ్చా.
మీ ఉద్దేశం చలం రచనలో బూతుని వెతకాలీ అంటే, దానికి అర్హత -
ప్రతీ ఊరికి వెళ్ళి వీధివీధినా బూతుబొమ్మల్ని వెతికి ఆటిని ఉతికిఆరేసిన అనుభం ఉంటే కానీ చలం మీద మాట్లాట్టానికి అర్హతలేదన్నమాట.
బాగుంది.
యో కత్తీ – ఆపవయ్యా నీ సుత్తి. ప్రతీదానికి ఎగరేస్కుంట వస్తావు. నీకన్న చదువుకున్నోళ్ళు “చదువు ని చదివిన వాళ్ళూ” సానా మందే ఉన్నారు. హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక.
>>చలాన్నీ చలం రచనల్నీ విమర్శించాల్సిందే. వీలైతే తగలబెట్టెయ్యాల్సిందే. ఆ వెలుగు వేడిలోగానీ మన శరీరాలు ఆత్మలకు స్పందించవు.
భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని విమర్శించటానికి ఏమి అర్హత కావాలో చలాన్ని విమర్శించే వాళ్ళకీ అదే అర్హత కావలి.
“రహస్య కుతి” కోసం వెంపర్లాడే వాళ్ళకి ఏమి అర్హత కావాలో చలం ని విమర్శించేవాళ్ళకీ అదే అర్హత కావాలి.
పిచ్చి వాగుడు కట్టిపెట్టు.

>>మగపిల్లలు ఎప్పుడూ తల్లి పట్ల చాలా పొసెసివ్ ప్రవర్తిస్తారు. తండ్రి తల్లి పక్కన చేరడాన్ని సహించలేరు. తల్లి స్పర్శకోసం, ప్రేమకోసం తండ్రితో పోరాడతారు.(మీరు దాన్ని కామించటం, శారీరకంగా లొంగదీసుకోవటం అన్నారు) తండ్రి నుంచీ తల్లిని కాపాడాలనుకుంటాడు. మీరా అలాంటి వాడు. మీరా రాజేశ్వరిలోని మాతృత్వానికి ప్రతీక మీరా. అందుకే “మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు.” అన్నాను. He is a creature out of the world.
ఇది ఎవరి ప్రతిపాదన? నీ ప్రతిపాదనా? నువ్వు పరిశీలించి సోధించిన శాస్త్ర పరిశోధనా ఫలమా? సరే దీన్ని ఇంటర్నేషన్ల్ సైన్స్ ఫైర్ కి పంపించు. ప్రైజు వస్తుంది.
ఎవరికి క్కావాల్సిన కోణాలు ఆళ్ళు ఎతుక్కుంటారు, ముందు నీకోణాలని నువ్వు ఎతుక్కో.


సైబర్ నేరం -
ఏది సైబబ్ర్ నేరం? మారు పేరుతో ఇంకోచోటా కామెంటు పెట్టాడం సైబర్ నేరమా? లేక ఆ కామెంటు ఎందుకు పెట్టారూ, ఎందుకు పెట్టాల్సి వచ్చంది అనేది సైబర్ నేరమా?

౧. భ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ పిచ్చి రాతలు రాసినందువల్ల బ్రాహ్మలు నీ మీద కోర్టుకెల్లలేరా. ఇప్పుడు వెళ్తాం.
౨. మన సంస్కృతి సాంపదాయం మీద నువ్వు వేసే భయంకరమైన సెటైర్ల మీద పిల్ వెయ్యలేరా. ఇప్పుడు వేస్తాం.
౩. పద్యం లో నువ్వు రాసిన జెనరలైజేషన్ చదివాక ఇంకా నీతో వాదన ఏంటి?
అయ్యలారా అమ్మలారా అక్కడ మన మహేష్ గారు, పెద్ద మనిషి, ఇలా రాసారు

మగపిల్లలు ఎప్పుడూ తల్లి పట్ల చాలా పొసెసివ్ ప్రవర్తిస్తారు. తండ్రి తల్లి పక్కన చేరడాన్ని సహించలేరు. తల్లి స్పర్శకోసం, ప్రేమకోసం తండ్రితో పోరాడతారు.

ఇది చదివినాక ఎవరైనా ఎలా వ్యాఖ్యానిస్తారు?

౪. నేను వేసిన ప్రశ్న
రిజర్వేషన్ తీస్కుని చదివావు అని. ఎక్కడ కుల ప్రసక్తి? ఎక్కడా మత ప్రసక్తి?

Jun 19, 2009

ఏమిటి లోకం పలుగాకుల లోకం -

ఎవడో అజ్ఞాత కాకి ఇలా కావు కావు అంది ఓ బ్లాగ్ లో -
జనాలకు ఇంత వినోదాన్ని అందిస్తున్న మీ ఇద్దరినీ(మహేశ్ & యోగి) అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా యోగికి మరింత అభినందనలు. చదువేస్తే ఉన్నమతి పోతుంది అన్నదానికి యోగీ, మహేశ్‌లు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒకరినొకరు దూషించుకోవటం, రెచ్చగొట్టుకోవటం, హేళన చేసుకోవటంతోనే వీళ్ళ తెలివితేటలను బయటపెట్టుకుంటున్నారు. అందులో అరక్షణం కూడా ఎదుటివారి మాటలను అర్ధం చేసుకోటానికి వెచ్చించే ఓపిక ఇద్దరికీ లేదు. కనీసం మహేశ్ యోగితోనే ఆపేస్తాడు. కానీ యోగి మాత్రం మహేశ్‌ని అభినందించేవాళ్ళని కూడా వదిలిపెట్టాడు. గొప్పగా చదివి ఊడబొడిచాను కదా, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే అహంకారమే కనిపిస్తుంది. విపరీతమైన సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇచ్చే మహేశ్ ఏమీ తక్కువ కాదు. అసలు యోగి రాక వల్ల భాస్కరరామరాజు నుండి ఈ మద్యనే వచ్చిన విశ్వక్శేనుడు వరకూ అందరూ మహేశ్‌ని తిట్టి ఆనందించేవాళ్ళే. వీళ్ళని అదుపుచేసేవాళ్ళే లేరు. అందరినీ ప్రశ్నించే యోగిని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అతను నోరేసుకొని పడిపోవటంలో సిద్దహస్తుడు.

ఇక్కడ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా రెండు పైసలు -
యోగి నేను స్నేహితులం.
నన్ను తన అన్నలా భావిసస్తాడు యోగి. మేమిద్దరం సమయం దొరికినప్పుడల్లా ఛాట్ చేస్కుంటాం. ఛాట్ లో భావాలను పంచుకుంటాం. అంతేకానీ పొద్దస్తమానం ఎవడిమీద బురదజల్లుదాం అని చూడం. అలా చూడాల్సిన అవసరం లేదు. అంత సమయమూ లేదు, ఓపికా అంతకన్నా లేదు. ఎవుడికాడికి అంతకన్నా పెద్ద పెద్ద పనులే ఉన్నాయ్. అయినా ఓ వ్యాఖ్య రాయటానికో లేక ఓ పోష్టు రాయటానికో యోగికి చెప్పి అతని అంగీకారం తీస్కుని వేసేంత వెన్నెముకలేని జీవిని కాన్నేను. ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.

ఇక పైన ఉటంకించన బ్లాగు -
నేను ఆ బ్లాగు(లు) చదవను.

నా దృష్టిలో బ్లాగింగు -
బ్లాగు రాయడం ఫన్ కోసం. సమాచార సేకరణ కోసం లేక సమాచారం పంచుకోవడం కోసం. మన దైనందిన కార్యక్రమాలు కలిగించే వత్తిడిని మర్చిపోటంకోసం బ్లాగు. కనీసం ఆ నిమిషమైనా దైనందిన ఆలోచనలను అటకెక్కించి విముక్తి పొంది కొత్త కొత్త ఆలోచనలని తవ్వటంకోసం. అంతేకానీ రెంటికీ చెడ్డ రేవడి చేస్కోటానికి బ్లాగాల్సిన పని లేదు, అంటే అసలే తలనొప్పులు పైగా ఇక్కడ ఇంకో తలనొప్పి దేనికి? అని.

నా బ్లాగులు -
ఇప్పటివరకూ నాకు నచ్చిన విషయాల మీద నాకు చేతనైన విధంగా, నా స్టైల్లో రాసాను. నేను ఎప్పుడూ నా భావాజాలాన్ని గాలంగా రాయలా. బ్లాగు నా భావాజాలాన్ని ప్రతిబింబించాల్సిన పనిలేదు. నేను బ్లాగుని కేవలం అందరితో పంచుకోడానికే రాస్తా. నా ఆత్మ సంతృప్తి కోసం బ్లాగే రాయాల్సిన పనేముంది. బ్లాగులో "సంతృప్తి" అనే మాటకి అర్ధం లేదు అని నా అభిప్రాయం.

ఇక చిల్లర గొడవలు -
నేను ఎవ్వనితో గొడవకు దిగను, నన్ను కించపరిస్తే తప్ప. అలా కొన్ని సార్లు జరిగింది కూడా. నేను పెద్ద లెక్క చెయ్యను దేన్నైనా. ఇలాంటిది ఇక్కడ జరిగే కాళ్ళు లాగుడు గట్రా ఐ కేర్ ఏ హూట్.

నా వ్యాఖ్యలు -
నలుగురితో పాటు నారాయణ. ఒక్కోసారి ఒక్కోడి ఆలోచనా ధోరణి మనకి పడకపోవచ్చు. సాధ్యమైతే ఎదురిస్తా, సున్నితమైన విషయాలమీదనైతేనే. కొన్నికొన్ని సార్లు అలాంటి టపాలకి వ్యాఖ్యలు పెట్టాను. తెగిందాకా దేన్నీ లాగలా. నా దృష్టిలో ఇదీ అని చెప్పా. నేను చెప్పిందే వేదం అని ఎప్పుడూ చెప్పలా. నేనెప్పుడూ అలా అనుకోను. నేనే, నేనే హీరో నేనే విలన్ అని నేను ఎప్పుడూ భావించను.

కాబట్టి -


ఓ ట్యాగ్ వెయ్యటం చాలా ఈజీ. యోగీ భస్కర్ వీళ్ళందరూ ఒక్కటే అని. ఎలా?
నే రాసిన ప్రతీ టపాకి యోగి కామెంటు వేస్తాడు. అదీ ఆహా ఓహో అద్దిరింది అనే భజన చేసినట్టు ఏమీ లేదు. నా బ్లాగులు చదివేవారు నా ప్రతీ టపాకి వ్యాఖ్యానిస్తారు. అందులో వింతేముంది. వింత ఉంటే గింటే భజన చేసినప్పుడు. ఆహా ఓహో అని ఊగిపోతే అప్పుడు ఓ ట్యాగ్ పెట్టండి. భాస్కర్ మరియూ యోగి మరియూ బృందం ఒకరికొకరు భజన పరులు అని.

చివరగా - ఈ పాట వీంటూ పనిచూకుందాం. అది బెస్ట్ ఎప్పటికైనా, ఎవ్వరికైనా -

(कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना ) - २
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना

कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई - २
तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई
फिर क्यूँ संसार की बातों से, भीग गये तेरे नयना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे ...

हमको जो ताने देते हैं, हम खोए हैं इन रंगरलियों में - २
हमने उनको भी छुप छुपके, आते देखा इन गलियों में
ये सच है झूठी बात नहीं, तुम बोलो ये सच है ना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे ...

Jun 18, 2009

హంస గాయత్రి

॥తృతీయ న్యాసే హంస గాయత్రీ స్తోత్రమ్॥
అస్య శ్రీ హంస గాయత్రీ మహామంత్రస్య। ఆత్మా ఋషిః। పరమాత్మా దేవతా।
అవ్యక్త గాయత్రీ ఛన్దః। హంస గాయత్రీ ప్రసాద సిద్ధ్యర్ధే హంస గాయత్రీ జపే వినియోగః॥

హంసాం అంగుష్ఠాభ్యాం నమః॥
హంసీం తర్జనీభ్యాం నమః॥
హంసూం మధ్యమాభ్యాం నమః॥
హంసైం అనామికాభ్యాం నమః॥
హంసౌం కనిష్ఠికాభ్యాం నమః॥
హంసః కరతలకరపృష్ఠాభ్యాం నమః॥

హంసాం హృదయాయ నమః॥
హంసీం శిరసే స్వాహా॥
హంసూం శిఖాయై వషట్॥
హంసైం కవచాయ హుమ్॥
హంసః అస్త్రాయ ఫట్॥
భూర్భువస్సువరోమితి దిగ్భన్ధః॥

ధ్యానమ్

గమాగమస్థం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారమ్।
పశ్యామి తే సర్వజనాన్తరస్థం నమామి హంసం పరమాత్మరూపమ్॥

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః।
త్వజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్॥

హంస హంసః పరమ హంస్సోహం హంసః సోహం హంసః॥

హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి।
తన్నో హంసః ప్రచోదయా"త్॥

హంస హంసేతి యోబ్రూయాద్ధంసో నామ సదాశివః।
ఏవం న్యాసవిధిం కృత్వా తతస్సంపుటమారభేత్॥


మహాన్యాసంలో మూడో న్యాసం హంసగాయత్రీ స్తోత్రమ్.
మహాన్యాసంలో హంస గాయత్రి ఎందుకు చెయ్యాలి?
అసలు హంస గాయత్రి అంటే ఎవరు?

Jun 15, 2009

పోనీ ఏమైనా కవితా?

పోనీ అదేమైనా సెక్సా కామోద్రేకం పొందటానికీ? కాదే
పోనీ అదేమైనా భావుకతా మన భావాల్ని తట్టి లేపుకోటానికీ? కాదే
పోనీ అదేమైనా కవిత్వమా, మనలోని కవితాకలాన్ని ఆ కవిత్వం అనే సిరా తో నింపుకోటానికి? కాదే
పోనీ ఏమైనా సామాజిక స్పృహా, మనలో స్పూర్తి రగిలించుకోటానికి? కాదే
పోనీ అదేమైనా శాస్త్ర సారమా మన తెలివితేట్లని పెంపొందించుకోటానికి? కాదే
పోనీ అదేమైనా చరిత్ర, మన అణగారిన బ్రతుకుల్ని అందులో చూస్కోటానికి? కాదే
పోనీ అదేమైనా రామాయణమా, రాముడికి సీత ఏమౌతుందో తెల్సుకోటానికి? కాదే
మరి అదేంటి - అది సుత్తి. కేవలం చెత్త.
కనీసం మామూలు చెత్త అయితే రి-సైకిల్ చేయగల వస్తువు ఏమైనా ఉందేమో అని ఎతుకుతా.
అది దేనికి పనికిరాని చెత్త - ఆ రాత! ఆ రాత చూసీ, వొద్దనుకుంటూ చదివీ, బుర్ర చెడగొట్టుకొనుట-
..... ఇంకేమిటి, మన తలరాత!!!

Jun 12, 2009

పత్రికల్లో మనకి చెప్పకుండానే

పత్రికల్లో మనకి చెప్పకుండానే మన బ్లాగు పోస్టులు ఏసేస్తారు. నేను ఈ పూట ఏమీ పొద్దుపోక ramakantharao.blogspot.com అని కొట్టా గూగుల్లో, ఈ కింది లింకు తగిలింది.
పోయినేడాది నవంబర్లో నవ్య లో నా పోస్టుగురించి వేసారు.
నే రాసిన దానికి ఓ నానమ్మని, అదీ తెల్ల నానమ్మని జతచేసి మరీ వేసారు. ఇక్కడ చూడండి -http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/20navya9



పై కధనం, ఈ పోస్టునుండి - నానమ్మలు ఏడుస్తున్నారు http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_03.html
ఇదే పేజీలో మన జాన్ హైడ్ కనుమూరి గారి బ్లాగు లోంచి ఒక పోస్టు ని వేసారు.

అదీ కధ ఈ శుక్రవారం

Jun 11, 2009

హైపర్ వాల్

2009 ప్రపంచ యాపిల్ డెవలపర్స్ కాన్ఫరెన్సు లో (WWDC), యాపిల్ ఒక జైన్ట్ హైపర్ వాల్ ని నెలకొల్పి ఇరవైవేలపైచిలుకు జనాదరణ పొందిన యాపిల్ ఐఫోన్ అప్లికేషన్స్ ని యాపిల్ లైవ్ స్టోర్ తో అనుసంధానం చేస్తూ ప్రదర్శనకి పెట్టింది. ఎక్కడైనా ఓ ఐఫోన్ యూజర్ ఏదైనా ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేస్కోంగనే ఐదు నిమిషాల్లో ఈ హైపర్ వాల్ మీద ఆ అప్లికేషన్ రిపుల్ అవుతుంది.

హైపర్ వాల్ ని ఎలా నిర్మించిందీ -
Mac OS X Snow Leopard మీద నడిచే 20 Mac Pro Towers తో ఈ హైపర్ వాల్ ని నిర్మించింది.
[ఒక్కో టవర్ లో నిలువు పాతిక అడ్డం నలభై అప్లికేషన్లు డిస్ప్లేయ్ కాబడుతున్నాయ్ - లెక్కెట్టాలే]



....
మిగతావి ఇక్కడ చూడండి....
http://www.appleinsider.com/articles/09/06/09/apple_stuns_wwdc_crowd_with_pulsating_app_store_hyperwall.html

Jun 10, 2009

జ్ఞాపకాల దొంతర - హైద్

ఓ డొక్కు సైకిలు. ఎనక ఓ బుట్ట. సైకిలుకిటుపక్కన వైరుతో అల్లిన ఇనప ఫ్రేము బుట్ట. మెలేసిన మీసాలు. సన్నని రివటలాంటి శరీరం. నరాలు కనిపించే జీవంలేని కండలపైకి మూడిచిన చొక్కా. ఓ పక్క కారాకిళ్ళీ తో ఉబ్బిన బుగ్గ, ఇంకోపక్క చప్పిడైపోయిన బుగ్గ, పోలీసు కట్టింగు - వెరసి సత్తార్. సత్తార్ నడిపే క్యంటీన్ పేరు "సత్తార్ క్యాంటీన్". తార్నాక కాణ్ణుంచి, ఇటు అడిక్మట్, శంకర్ మట్, అటు శివం, అంబర్ పేట్ వరకూ, నల్లకుంట, ఎక్కడైనా, రాత్రి రెండుకి చాయ్ కావాల్నంటే ఏకైక దిక్కు - సత్తార్ క్యాంటిన్.
సత్తార్ క్యాంటీన్ ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్ లో హాస్టల్ గంగ మరియూ హాస్టల్ స్వర్ణముఖి ల మధ్యలో ఉంటుంది. సాయంత్రం ఎనిమిదికి తెరుస్తాడు సత్తార్. సత్తార్ కి హెల్ప్ చెయ్యటానికి ఓ చిన్న పోరడు. ఈ చిన్న పోరడు రెండు హాస్టళ్ళ డిమ్యాండ్స్ ని అటెండ్ జేస్తడు. అంటె, స్వర్ణముఖి,రూం నెంబర్ 38 నుండి ఒకడు, ఛోటే చార్ చాయ్ లా అని జెప్తడు. ఇంతలో రూం నెం 67 లోంచి ఇంకొకతను, అబే దోబడా చార్ సమోసా అంజెప్తడు. ఇలా. ఆ రెండు హాస్టల్ల మొత్తానికీ గీ పోరడే. లేటైతే ఏంరా, ఏం లేట్జేస్తవ్ సాలే అని తిట్లు, పైకి తిట్టినా, తమ్మీ నువ్వూ ఈ సమోసా తిను, లేకుంటె తమ్మీ చాయితాగినావురా? అని అడిగే వాళ్ళు. ఏంరా పైసల్ ఏమన్న గావాల్ల్నా అని అడిగేటోళ్ళు ఇంకొందరు.
ఇక దుకాణం తెరిచినంక, ఒక్కోడు నెమ్మదిగా జేరుకుంటడాడికి. పక్కనే ఓ చిన్న క్రీక్ పోతుండ్లే, దానికి గట్లు కట్టిన్రు. నెమ్మదిగా దాని మీంకి జేరుకుంటరు పోరగాళ్ళు. ఇక, చాయి మీన చాయ్, దమ్ముమీన దమ్ము. ముంగట ఒక్కడే ఒస్తడు, ఇంక ఆని స్నేహితులు జేర్కుంటరు ఒక్కోడొక్కోడు. పదకొండింటికి పుల్లుగా కితకిత లాడుతుంటరు జనం.
ఒక రౌండు సమోసలు అయిపోనంక, ఇంకో తట్ట తెప్పిస్తడు సత్తార్. తినోటోళ్ళు తినుడు. ఇక అక్కడ్కి చేరినోళ్ళు గుండుసూది కాడ్నుంచి ఇమానాలదాంక, లేటెస్టు పాలిటిక్స్ మీన, అబ్బో మహా రంజుగా ఉంటై అక్కడి రచ్చబండ చర్చలు. ఇంక స్వర్ణముఖి యం.టెక్ హాస్టల్ కావటంతో అక్కడి చాలామంది, సివిల్స్ ప్రిపేర్ అవ్వటానికొస్తరు. ఇక వాళ్ళు జనరల్ నాలడ్జి మీద, యాంత్రొపాలజీ మీద ఇలా అబ్బో, పెద్ద పెద్ద డిస్కషన్స్ నడుస్తుంటై.
ఇక సత్తార్ భాయ్ క్యాంటీన్ లో యస్.పి ఏంది? అని ఎవుడైనా అడగొచ్చు. యా, సెప్తా తమ్మీ -
బ్రెడ్ ఆంలెట్.
ఫ్రెంచ్ టోస్టు.
బ్రెడ్ ఆంలెట్ ఆర్డర్ జేస్తే ఓ అరగంట పడ్తది. దేనికివయ్యా అంటే, అంత క్యూ.
ఇక ఫ్రెంచ్ తోస్ట్. మాంచి ట్యాప్ నీళ్ళలో పాలు పోశ్తడా, భలే చిక్కంగుంటై ఆ పాలు. అందల బ్రేడ్డుని తడిపి, ప్యాన్ మీన ఫ్రై చేసి ఇస్తడు. వేడివేడి ఫ్రై, ఆకలిమీద, రాత్రి పదకుండింటికో పన్నెండింటికో తింటుంటే...ఆహా వోహో.
హైద్ అనంగనే మనిషి స్పురణకి వచ్చేది - కేఫ్లు, చాయ్, బిర్యాని, సమోస.
ఇక శంకర్ మట్ రోడ్లో రైల్వేలైన్ దాటంగనే ఓ కేఫ్. రాంనగర్ గుండు ఈ కేఫ్ ఎనకనే. ఇక్కడా బాగనే ఉండేది చాయ్.
నాకు బాగా నచ్చిన సమోస - ఆల్ఫా, మరియూ, అమృతా క్యాజిల్ కి దగ్గర్లో ఒక కేఫ్. గుర్తుకి రావట్లా. అబ్బో ఆ రుచే వేరు.

బిర్యానీ గురించి ఓ పోస్టేస్కుందాం తర్వాత.
అలానే మెస్సుల గురించీ ఇంకో పోస్టు.

Jun 9, 2009

సముద్రం అల్లల్లాడి అలల దుప్పటి కప్పుకుని పడుకుంది, నేను మాత్రం..

దిల్ గిరా కహీ పర్ దఫతన్
దిల్ గిరా కహీ పర్ దఫతన్
జానే మగర్ యే నయన్
తేరి ఖామోశ్ జుల్ఫొన్ కి గెహరాయియా
హై జహా దిల్ మెరా ఉల్ఝా
హూఅ హై వొహీన్ ఖో గయ
తూ మగర్ హై బెఖబర్, హై బెఖబర్
దిల్ గిరా కహీ పర్ దఫతన్
క్యోం గూంజ్ రహి హై ధడ్కన్...
...జానె మగర్ యెహ్ నయన్

సిపియొన్ కి హూట్ సె మొతి చలక్ రహీ హై
ఘజ్లొన్ కి సొహ్బత్ మే గీత్ భి భెక్ రహి హై
సముందర్ లెహ్రా కె లెహ్రొన్
కి చదరొడ్ కె సొ రహ హై
పర్ మె జాగు ఎక్ ఖుమరి ఏక్
నషా సా ఏక్ నషా సా హో రహ హై
తు మగర్ హై బెఖబర్ హై బెఖబర్
దిల్ గిరా కహీ పర్ దఫతన్
క్యోం గూంజ్ రహి హై ధడ్కన్...
...జానె మగర్ యెహ్ నయన్
ఖుష్బు మే లిపటె మౌసం
తేరి ఖామోశ్ జుల్ఫొన్ కి గెహరాయియా
హై జహా దిల్ మెరా ఉల్ఝా
హూఅ హై వొహీన్ ఖో గయ
తూ మగర్ హై బెఖబర్, హై బెఖబర్
దిల్ గిరా కహీ పర్ దఫతన్
క్యోం గూంజ్ రహి హై ధడ్కన్...
...జానె మగర్ యెహ్ నయన్

दिल गिरा कहीं पर दफतन
जाने मगर यह नयन,
तेरी खामोश जुल्फों की गहराइयां है जहाँ,
दिल मेरा उलझा हुआ है वहीँ खो गया,
तू मगर है बेखबर, है बेखबर,
दिल गिरा कहीं पर दफतन,
क्यों गूंज रही है धड़कन,
जाने मगर यह नयन..

सीपियों के होंठ से,
मोती छलक रहे हैं,
गज़लों की सोहबत में,
गीत भी बहक रही है,
समुंदर लहरों की लहरों की,
चादर ओढ़ के सो रहा है,
पर मैं जागूँ, एक खुमारी,
एक नशा सा, एक नशा सा हो रहा है,
तू मगर है बेखबर, है बेखबर
दिल गिरा कहीं पर दफतन,
क्यों गूंज रही है धड़कन,
जाने मगर यह नयन,
खुशबु में लिपटे मौसम,
तेरी खामोश जुल्फों की गहराइयां है जहाँ,
दिल मेरा उलझा हुआ है वहीँ खो गया,
तू मगर है बेखबर, है बेखबर,
दिल गिरा कहीं पर दफतन




చిత్రం - Delhi-6
కలం - Prasoon Joshi
గళం - Ash King, Tanmayee
సంగీతం : A.R. Rahman

Jun 6, 2009

జ్ఞాపకల దొంతరలు - చోటే, ఏక్ చాయ్, దో బడా

నిన్నటి నా పోస్టుకి అందరూ అభినందనలు తెలియజేసారు. సోదరుడు యోగయ్య, భా.రా.రె, శరత్ పార్టీ అన్నారు. :):) శరత్ గారికి ఓ నాలుగు మగ్గులు పంపాను. భా.రా.రె కి యోగికి ఇలా ఆర్డర్ చేసా.
చోటే భాయియోంకో చాయ్ లా, ఔర్ యోగి, బారారె కో దో బడా లా.
అంటే ఏంటో చూద్దాం....
నేను మొట్టమొదట అనగా నేను ఒక్కణ్ణే హైదరాబాద్ 1991 లో వెళ్ళా. మా అన్నయ్య ఉస్మానియాలో యం.టెక్ చేస్తుండేవాడు. ఎండ్లకాలం, గుంటూర్ సికందరాబాదు ప్యాసింజర్ బండి. కొత్తగా వేసిన ట్రాక్ అది. అనగా, అంతక ముందు గుంటూర్ నుండి సికిందరాబాద్ వెళ్ళాలీ అంటె బెజవాడ, ఖమ్మం, ఖాజీపేట మీదుగా వెళ్ళాల్సి వచ్చేది. ఆ బండి పేరు యాదుకొస్తల్లే. ఏదో ప్యాసింజర్. కొత్త ట్రాక్ గుంటూర్ - పొందుగల, విష్ణుపురం, మిర్యాలగూడెం, నల్లగొండ ల మీదుగా సెకందరాబాద్. దీనివల్ల కనీసం వంద నుండి నూట యాభై కిలోమీటర్లు తగ్గింది ప్రయాణం.

మరి ఓ రోజు పొద్దున్నే ఎక్కాం బండిని. పొద్దున్నే ఎనిమిదిన్నరకి. ఎఱ్ఱబస్సు మీద ఇలా రాసుంటుంది ఎవురైనా గమనించారా "ఈ బస్సు చెయ్యి ఎత్తినచో ఆపబడునూ" అని. అలానే, ఈ ప్యాసింజరు కూడా అంతే. దారిన పొయ్యేవాడు చంక గోక్కోటానికి చెయ్యెత్తినా ఠకా మని ఆగుతుంది.
బండి ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా మొత్తానికి పొందుగల కాడికి జేరింది. మరి మనూరేగా. మనం సీట్లో యాడుకూకున్నాం. మొత్తం ఆ తలుపుకాడేగా. సూద్దాం ఊర్నీ అనుకుంటే యాడా? ఊరే కనపళ్ళా. అల్లంత దూరంలో ఉంది ఊరు. ఇక కిట్నమ్మ ని దాటాం. వారేవా. నాకు ఎంట్రుకలు నిక్కపొడ్చుకున్నాయ్ ఆరోజు. ఇంకా గుర్తే అది. అలా ఇష్ణుపురం అ.క.అ వాడపల్లి, దామరసెర్ల, మిర్యలగూడ, కుక్కడం, తిప్పర్తి, చిట్యాల, నల్లగొండ, నాగిరెడ్డీపల్లి, పగిడిపల్లి, బీబీనగర్, ఘటుకేసర్ దాటి చర్లపల్లి చేరినాక ఔటర్లో ఓ గంట దొబ్బిచ్చుకుని మొత్తానికి సాయంత్రం ఎనిమిదికి చేరాం.

సికందరాబాదు ఇస్టేషన్ల దిగి, బస్సు పట్టుకుని అన్న హాస్టల్కి చేరుకునే సరికి పది దాటిపోయింది. ఆ బస్సులు!! వాహ్. అదే మొదటి అనుభవం కదా భలే రంజుగా అనిపించింది లే. ఆడోళ్ళుంటే ఆపడం, లేకపోతే బస్సు ఆగదు. స్లో అవుతుంది. దిగగలిగితే గొప్పోడివి. లేకపోతే నీ ఖర్మ. కండక్టరు టికెట్ అడగడు, ఇజిల్ ఏస్తాడు, తలకాయ్ ఊపి. సరే మర్రోజు పొద్దున్నే!! ఇంట్లో ఇడ్లీలు, అట్లు తినే ప్రాణమా, ఆకలి, నకనక. అన్నా ఆకలి అన్నా, పద అన్నాడు, వాళ్ళ మిత్రబృందంతో సహా, నడ్చుకుంటూ వెళ్ళాం. అడిక్మట్ కార్నర్లో ఓ కేఫ్. సమోసా ఆర్డర్ చేసాడు సోదరుడు. మనకేమో పొద్దున్నే సద్దిమొహంతో కాపీ తాక్కపోతే దిగదు. ఆడేమో ఓ ప్లేటు నిండా ఊరిబంతికి కావాల్సినన్ని ఏసి ఇచ్చాడు. అదేంట్రా, ఉన్నది ముగ్గురమే కదా అనుకున్నా. సరే సమోసా లాగించాక, ఆడు మిగిలినవి తీస్కెళ్ళిపొయ్యాడు. సామఝ్గాలే ఆ దినం. అయ్యాక చోటే దోబడా, ఏక్ చాయ్ లా అని చెప్పాడు సోదరుడు. మనం హిందీలో మహా వీక్. ఏందిరా అనుకున్నా. చాయ తెచ్చాడు వాడు. కప్పు, సాసరు, ఓ ఖాళీ కప్పు. హైద్ లో, సింగిల్ చాయ్ చెప్తే సాసరు, కప్పు చాయ్, ఓ ఖాళీ కప్పు ఉచితం. దాంతోపాటు రెండు బడా తెచ్చిచ్చాడు వాడు. బడా = బడా గోల్డ్ఫ్లేక్.
అప్పటిసంది ఇప్పటిదాంక, అనగా ఇండియాలో ఉన్నదాకా, హైద్ లో ఉన్నదాకా, ఏక్ బడా దే అంటే ఓ గోల్డ్ఫ్లేక్ కింగు కొట్టుగురూ అని నెట్టుకొచ్చాం. గిప్పుడు మానేసినం అనుకో గదిఏరే సంగతి.
గేంద్వయా అంటే, కేఫ్ కి పోవుడు, ఓ చాయ్ జెప్పుడు, చాయ్ తాగుతూ ఓ దమ్ముకొట్టుడూ. ఏందో!! గెటుబోయినయ వయా గా దినాలు. ఏం టైం పాస్ ఔతల్లే? ఛల్, కేఫ్ కి బో. మస్తు టైంపాస్.

Jun 4, 2009

మొత్తానికి తేలింది! కధ!!

పోయినేడాది ఆగస్టు నుండి నాన్చీ నాన్చీ, ఒక నెల, ఇంకో నెల, ఇరవై రోజులు, మూడు నెలలు, ఆరు రోజులు, ఆరు నెలలు ఇలా పొడిగింపులకు గురై, మనస్సుని మనస్సులో లెకుండా చేసి, ఆటలాడించి, భారీ ఒత్తిడికి గురిచేసి, నిద్రలేకుండ చేసి, భయపెట్టి, ఎన్నెన్నో ఊహాగానాల్లోకి లాక్కెళ్ళి, మరెన్నో అసంబద్ధపుకార్లలతో ఉద్వేగానికి గురిచేసి, మౌఖిక పరీక్షలు అయ్యాక కూడా నెల నెల పొడిగింపుకు గురైన గుత్త...చివరికి, ఈ రోజుకి, తేలింది, తెరిపినిచ్చింది. ఔను! నువ్వు మళ్ళీ పద్దెనిమిది నెలలు గుత్తేదారుగా ఇక్కడే పనిచెయ్యబోతున్నావు అని వినిపించారు మా రాజావారు.

నా గుత్త, "మరి పద్దెనిమిది నెలలు పొడిగింపబడిందీ" అని తెలియజేయటానికి ఆనందిస్తున్నవాడను.

Jun 3, 2009

జొ(హో)గా బొనీతో; అత్భుతంగా ఆడు;ప్లే బ్యూటిఫుల్

ఏ ఆటకైనా ఆడేవాడికి కావాల్సింది ఆ ఆటంటే ప్రేమ, మక్కువ, ప్యాషన్. చాలామంది అంటుంటారు, భారతంలో క్రికెట్ కి బాగా క్రేజ్ అని. కాదు, డబ్బున్నోడు క్రికెట్ని బాగా మార్కేట్ చేసాడు. అంతే, టూత్పేష్ట్ అంటే కోల్గేట్ ఎలానో, ఆట అంటే క్రికెట్ అనేలా దాన్ని మన నరనరాల్లోకి ఎక్కించాడు. ఈ ఆటవల్ల కొన్ని కొన్ని వ్యాపార జీవులు అందలాలకి ఎక్కాయి. మన సగటు ఆటలు మరుగున పడ్డాయి. నాకేమి క్రికెట్ అంటె కోపం లేదు. నేనూ క్రికెట్ చూసేవాణ్ణే. ఐతే, నా అదృష్టం క్రికెట్ అనే ఆటా ఉందని నాకు నా ఇంటర్లో తెలిసంది కాబట్టి ఆ ఆటకి నా జీవితాన్ని బలి ఇవ్వలా.
చాలా మంది అంటారు, క్రికెట్ చలా తక్కువ ఖర్చుతో ఆడచ్చు అని. దానికి ఏమీ అక్కర్లేదు, ఇద్దరు పిల్లలు, ఒక బ్యాటు బాలు ఉంటె చాలు అని.
నా దృష్టిలో ఒక ఆట ఆట్టానికి కావల్సింది వసతులు, డబ్బు, అవీ ఇవీ కాదు. కావాల్సింది ఆటమీద ప్రేమ, దాహం, వ్యసనం, పట్టుదల, వెరసి - ప్యాషన్.
ఐతే మన దురదృష్టం, మనకి ఇలాంటివాటిమీద దృష్టి మరలదు. మన పెద్దలు లేక మన సమాజం ఇంజనీరింగు, లెక మెడిసిన్ లేక ఇంకేదో నిచ్చన్లని తయ్యారు చేసిందే తప్ప, ఆట, మానసిక, శారీరక వికాశాలకి తావివ్వలేదు. మనకి ఉన్న అతి తక్కువ లైబ్రరీలలో కూడా ఆటలకి సంబంధించిన పుస్తకాలు లేవు. టివీ పెడితే పొద్దస్తమానం క్రికెట్టే. ఇక మిగతా ఆటల గురించి ఎలా తెలుస్తుంది. ఈ పరీస్థితి నిజంగా దౌర్భాగ్యం.
ఒకప్పటి మన లెగసీ హాకీ కూడా తొందర్లో అంతరించి పోతుంది చూస్తూ ఉండండి.
ఇంతకీ నే చెప్పేదేంటంటే, జో(హో)గా బొనీతో. అనగా - ప్లే బ్యూటిఫుల్.
పోయిన సాకర్ ప్రపంచకప్ సమయమ్లో నాకు ఈ హోగా బొనీతో అనేది తగిలింది. ఇక్కడ కొన్ని యూగొట్టం నుండి నూక్కొచ్చిన లింకులు పెడుతున్నా చూడండి.




ఆడవాళ్ళ ఫ్రీ స్టైల్


ఎవ్వరు చెప్పారూ కాలిబంతి ఆడాలి అంటే ఓ పెద్ద గ్రౌండ్ కావాలి, దానికి పెట్టుబడి కావాలి అది కావాలీ అని. ఇక్కడ చూడండి.



ఇది చూసాక ఇప్పుడు చెప్పండి - ఒక ఆట ఆట్టానికి కావల్సింది ప్యాషనా లేక వసతులా?
మీ పిల్లల్ల్ని ఇతరఆటల వైపుకి కూడ మరల్చండి.
ఇరాన్ లాంటి దేశాలు ఫిఫా లో చోటు సంపాదిస్తుండగా వందకోట్ల జనాభానుండి మనం కనీసం పాతిక మంది సాకర్ ఆటగాళ్ళని తయ్యారు చేస్కోలెకపోతున్నాం అంటే క్రికెట్ మధుమేహ వ్యాధిలా గమనించలేనంతగా ఎలా ప్రబలిందో చూడండి..

అలానే నా శ్రీరామనవమి శుభాకంక్షలు పోస్టులో చెప్పినట్టుగా
మనం ఒకడేమి చేస్తే పొలోమని అందరం అదేచేస్తాం. అన్నమాచార్య కీర్తనలే తీస్కోండి ఉదాహరణకి. పొలోమని అందరూ అవే కీర్తనలు నేర్చుకునేది. అన్నమాచార్యులవారికి దక్కినంత ప్రాచుర్యం భక్త రామదాసుకి దక్కపోవటం లోటే. అవునులే అన్నమాచార్యులవారిని తి.తి.ది వారు తమ భుజస్కంధాలపై మోసి ప్రాచుర్యం చేసారు. సంగీతం నేర్పే వారికి, నేర్చుకునే పిల్లల తల్లితండ్రులకూ భక్త రామదాసు కీర్తనలు కూడా నేర్పిస్తుండండి. తప్పేమీ లేదు.

Jun 2, 2009

351:90

351 -
ఈ రోజు మొత్తానికి, గంటసేపు నడిచి, 351 కేలరీలు ఖర్చుపెట్టా.

ఇక 90 ఏంటారా? సదవండే -
మా ఆపీసుకెళ్ళే దారిలో ఓ డ్రైక్లీనరు కొట్టుంది. బట్టలుతికే మరలో కాలర్లమీన మట్టి పోటల్లా. మరి ఒకటా రెండా ముప్పియ్యైదు సమచ్చరాలనుండి పేరుకుందాయే. ఓసారి డ్రైక్లీనింగ్కేద్దాం అన్నా. పెళ్ళాంపిల్లలు సరే అన్నారు. సరే మూటకట్టు అన్నీ అన్నా. అవీ ఇవీ, ఉతికినవి, ఉతకనివి, వాడేవి, వాడనివి, టి చొక్కాలు కాపీ చొక్కాలూ అన్నీ ఓ గోతంలో ఏసి ఇదిగో మొత్తం 28 ఉన్నాయ్. ఏసిరా అంది మావిడాయ్. సరే, సూరిగాణ్ణి ఎంటేస్కుని ఎళ్ళా. మొట్టమొదటిసారి అమ్రికాలో డ్రైక్లీనర్ కాడికి. ఓ నల్లబాబు ఉన్నాడు.
ఏంకత
ఇయ్యన్నీ ఉతకాల
నిజంగానేనా (ఓరి సుబ్బిగా అన్నట్టు మొగం పెట్టి)
ఏంపర్లేదు, అదే నా చివరాకరి నిర్ణయం
ఎన్నున్నయ్యేంది
28
(ఆళ్ళ కొలీగు అమ్మాయిఐపు, ఏంపర్లేదు మనకి ఇంకోరోజు జీతం, దొరికాడు బకరా అన్నట్టు చూసి)బాసు వెంటెర్ కొడతన, నీ నిర్ణయంలో మార్పులేదుగా
(మనకేంతెల్సు మన డాష్ పేలబోతోందని)(ఏట్రా సుత్తినాయాల అని మనసులో అనుకుని) కానీవయ్యా
సరే 20/- రేపురా. ఇదిగో కాయితకం.

రెండో అంకం. ఇయ్యాల ఎత్తుకొచ్చుకోటాకెళ్ళా.
బాసినీ. నాబట్టలు
ఇయిగో
ఎంత నా బిల్లు( ఒసేవ్ బండదానా తొందరగా ఇయ్యి)
ఓ బకరా మాష్టరూ, మీ బిల్లు తొంబై.
వాట్? ఎలా? 20/- అన్నావుగా?
బాసూ సరిగ్గా సూడు, ఆరుబట్టలకి ఇరవై. పుడింగి పాపారావ్ లా అన్నీపీక్కొచ్చి ఏసావ్ మొత్తం 28. నేక్స్ట్
బేర్ బేర్


అదీ కధ ఈ దినం.

Jun 1, 2009

జ్ఞాపకాల దొంతర - గానాట

మన నెమలికన్ను మురళిగారి ఈతపళ్ళు ముంజలబండి స్పూర్తితో..
ఆ రోజుల్లో, మరి ఆరు, ఏడు తరగతులప్పుడు, కొంచెం కాలక్షేపం ఎలా? ఇప్పట్లా టీవీ గట్రా ఉండేవికాదుగా...
దాదాపు ప్రతీ ఊళ్ళో ఒక చెఱువు ఉండేది ఒకానొక సత్తెకాలంలో. ఆ చెరుఎమ్మట, ఓ వైపు నిప్పులు. ఇంకో ఐపు, నిలుపుకున్న గుర్రబ్బళ్ళు, గుర్రాలు, బర్రెలు, ఇయన్నీ తిరుగాడతా ఉండేయి. ఇంకోఐపు కరకట్ట మస్టు. ఆ కరకట్టమీన, ఎద్దులబళ్ళ సెక్రాలకి ఇనప తొడుగులు కాల్చేవోళ్ళు. ఇనప సెక్రం ఎట్టి, దానిమీన పిడకలు అయ్యి ఇయ్యి ఏసి నిప్పెడితే, ఎర్రంగ కాలుద్దా, అప్పుడు, దాన్ని సుత్తితో కొడితే షేపు వొచ్చుద్ది.
కొన్తమంది కుర్రోళ్ళు ఊరి ఆచారికాడికిబొయ్యి, సిన్న సిన్న ఇనప గాన్లు సేయించుకునేవోళ్ళు. ఆటినీ కరకట్టమీన్నే కాలిపించుకునేవోళ్ళు. ఎలా ఉండిద్దంటే, బండిసెక్రం ఉందా, దానికి మద్దెలో, ఇరుసుని ఇరికించటానికి ఒక పెద్ద సెంటర్ పాయింట్..దానికి సివర్న, అది పగిలిపోకుండా ఓ ఇనప సట్రం. ఆ సట్రం ఓ గాను అనుకో.
ఇక ఓజాన కర్ర. దానికి చివరాకర్న ఒక మేకు. ఇక గాన్ని, ఆ మేకుతో నెట్టుకుంటా తిరగటం. యాడికిబోయినా అది ఎమ్మటుండాల. అది నెట్టుకుంట, సర్రున సౌన్డు జేస్కుంటాబోవాల. ఆ ఇనప గాన్ని తగిలియ్యటానికి గోడకి ఓ మేకు. ఇంటికిబోంగనే గాన్ని ఆ మేక్కి తగిలించల.

మన్లాంటోళ్లకి అట్టాటియి ఉండేయి కాదు. ఉన్నోళ్ళకాడికిబొయ్యి, బతివలాడుకొని ఓ సుట్ట సిట్టుకొచ్చి, అబ్బా ఇట్టాంటిది మనకాడ ఉంటే ఎంతబాగుండు అనుకోటం.

సైకిలు టైరు, కర్రబెట్టి కొట్టుకుంటా తిరిగేవోళ్ళం.
ఇక, సైకిలు రిమ్ము. స్పోకులు తీసేసిన సైకిలు రిమ్ము. ఈ సెక్రం మద్దెనలోకి నొక్కినట్టుగా ఉండిద్దా, ఓ కర్రముక్కతో ఆ మద్దెనబెట్టు తోస్కుంటా ఆడుకునేవోళ్ళం.

ఇయన్నీ కేక. ఇప్పుడు యాడున్నై ఇయ్యి.