Apr 3, 2009

శ్రీ రామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి మనకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లోని భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా ఆంధ్రులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

ఉత్సవంలో విశేషాలు

* ప్రతీ ఆలయంలో పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
* బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
* ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
* దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
* భద్రాచలంలో భక్త రామదాసుచే కట్టింపబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు

ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో విజవవాడ కేంద్రం నుండి, శ్రీ ఉషశ్రీ ప్రత్యక్ష ప్రసారం ఉండేది. ఉషశ్రీ వ్యాఖ్యానం ఇక్కడ వినండి
రేడియోలో వింటూ కూడా తాళిబొట్టు అందరికీ చూపుతున్నారు వశిష్టులవారు అనంగనే లేచి నుంచుని దండం పెట్టుకునేవాళ్లని చాలామందినే చూసా.
శ్రీరామనవమి అంటే ముందు మనకి గుర్తుకి వచ్చేది - వీధి వీధినా తాటాకు పందిళ్లు. వాటిల్లో పానకం పంచేవాళ్లు. అలానే ప్రతీ పందిర్లో ఓ మైకు. లవకుశ పాటలు, సీతారాముల కళ్యాణం పాటలు.

సీతారాముల కళ్యాణం చూతమురారండి

శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంప జవ్వాజి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంప జవ్వాజి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

ఈ పాట లేకుండా ఏ పందిరీ ఉండదు.
దీని తర్వాత లవకుశ పాటలు -
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా
అయోధ్య నగరనికి రాజు దశరధ
మహారాజు, ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య
సుమిత్ర, కైకేయి నోము ఫలములై వారికి
కలిగిరి కొమరులు నల్వురు - రామ - లక్ష్మణ - భరత - శతృఘ్నులు
గడియనేని రఘురాముని విదిచి గడుపలేదు ఆ భూజా
కౌశికయాగము కాచి రమ్మని పనిచెను నీరదశ్యాముని
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా

తాటకి దునిమి జన్నముగాచి తపముల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిధిలకు
దాశరధీ - మదనకోటి సుకుమారుని గనుగొని మిధిలకు
మిధిలయే మురిసినదీ - ధరణి మనలో విల్లు మెరిసిన
మోదము కన్నుల వెన్నెల విరిసినదీ హరుని విల్లు రఘు
నాధుడు చేకొనిఒ ఎక్కిట ఫెల ఫెళ విరిగినదీ - కళ కళ
సీతారాముల కన్నులు కరములు కలసినవీ
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా

అయ్యాక ఈ పాట -
ఓ ఓ ఓ .....

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
.....
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా .....

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని .....
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని ..... మంథర మాట విని

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని ..... కూలే భువి పైని

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాల వ్రాలి

ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా .....
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకొన్నది
అడుగులబడి రాఘవా .....
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది .....
అడలి అడలి కన్నీరై అరయుచున్నది .....

అలానే ఈ పాట
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

రాము గని ప్రేమ గొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

ఆ ఆ ఆ ..... నాథా ..... ఆ ..... రఘునాథా ..... ఆ ..... పాహి పాహి .....

పాహి అని అశోకవనిని శోకించే సీతా .....
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని .....
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి .....
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా .....
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత .....
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట .....
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా ..... వినుడోయమ్మా

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి

నాకనిపిస్తుంటుంది. ఈపాటల వల్ల ఈ సినిమాలు హిట్ అయ్యాయా అని.

ఇవిగాక రేడియోలో భక్త రామదాసు కీర్తనలు వచ్చేవి. అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇక్ష్వాకుకుల తిలక, పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో, సీతమ్మకు చేయిస్తీ, ఇవి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గొంతులో అత్భుతంగా ఉండేవి.
[అన్నమాచార్యులవారికి దక్కినంత ప్రాచుర్యం భక్త రామదాసుకి దక్కపోవటం లోటే. అవునులే అన్నమాచార్యులవారిని తి.తి.ది వారు తమ భుజస్కంధాలపై మోసి ప్రాచుర్యం చేసారు. సంగీతం నేర్పే వారికి, నేర్చుకునే పిల్లల తల్లితండ్రులకూ భక్త రామదాసు కీర్తనలు కూడా నేర్పిస్తుండండి. తప్పేమీ లేదు.]
చివరగా పై పాటలు ఇక్కడ వినొచ్చు.


చివరగా -
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |
సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||

10 comments:

  1. రామరాజుగారు,

    చిన్న అక్షరాల్లో దాచేశారుగాని ఈ టపాతో మీరిచ్చిన అమూల్యమైన కానుక ఉషశ్రీ + మల్లాదివారి సీతారామకల్యాణ వ్యాఖ్యానం. దీంతో మా ఇంట్లో (ప్రవాసులం కదా) పండగ పరిపూర్ణమైంది. జై శ్రీరామ.

    ReplyDelete
  2. మీకూ మీ కుటుంబానికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు సోదరా...

    ReplyDelete
  3. శ్రీరామ నవమి శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకూ మీ కుటుంబానికీ

    ReplyDelete
  5. అయ్యా భాస్కర్ గారు, ఇన్ని పాటలు ఎలా దాచారండి ఇన్నిరోజులు?

    ReplyDelete
  6. సత్య ప్రసాద్ అరిపిరాల గారు - :):) జై శ్రీరాం.
    వేణూ - ధన్యవాదాలు సోదరా
    అమర్ - పానకం తాగావా?
    శ్రావ్యా గారు - ధన్యవాదాలు, అటు, నలభీమ వైపుకెళ్లి పానకం ఓ గుక్కెడు తాగటం మర్చిపోకండి. :):)
    భాస్కరా -
    ఆర్బిట్ (http://www.orbitdownloader.com/) అని ఒక డౌన్లోడ్ మేనేజర్ ఉంది. దాంట్లో, గ్రాబ్ అని ఒక టూల్. దాని సహాయంతో మీరు, ఎక్కడైనా మీకు నచ్చిన యమ్.పి.మూడు లేక ఎనీ అంటే షాక్వేవ్, ఫ్లాష్, ఆడియో, వీడియో డౌన్లోడ్ చేస్లోవచ్చు.

    ReplyDelete
  7. మంఛి సైటు ని పరిచయము చేసారు.Added into my favorites.

    ReplyDelete
  8. భాస్కర్ రామరాజు గారు , ఇప్పుడే తెలిసింది నలభీమపాకం మీదని ..ఇక నా పులిహోర పెట్టడానికి ధైర్యం చాలట్లేదండీ ....:)
    మంచిపాటలు వినిపించారు ధన్యవాదాలు . మీకూ మీ కుటుంబానికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు .

    ReplyDelete
  9. భాస్కర్ గారు !!! మొట్ట మొదటిగా మీకు ధన్య వాదములు
    ఇంకా భక్తి పాటలు, గీతాలు, భజనలు ఉన్నచో వెబ్సైటు లో పెట్టగలరు.
    అభినందనలతో....
    శ్రీహరి సింగు
    మరిపెడ, వరంగల్

    ReplyDelete
  10. చిన్నప్పటి విషయాలు, అనుభూతులు బాగా గుర్తుచేసారు.

    మీకు, మీ ఇంటిల్లిపాదికి
    :: శ్రీరామనవమి శుభాకాంక్షలు ::

    ReplyDelete