Dec 31, 2008

నా ప్రకటన

మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీలో ఆనందోత్సాహాల్ని రేకెత్తించాలని కోరుకుంటూ -
భాస్కర్, హరి, సూర్య మరియూ అనఘ




iTunes Tell a Friend

Bhaskar's Posterous



Cover Art bhaskar's posterous
Unknown


iTunes


Genre: Kids & Family




Download iTunes
iTunes for Mac and Windows
iTunes for Mac and Windows

Copyright © 2008 Apple Inc. All rights reserved



Dec 29, 2008

కత్తెర #2




"ఇలా ఎందుకు చేసావ్? ఇప్పుడు చూడూ, గుండు మీద చెట్లు మొలిచి పూలు పూస్తాయి!! ఇలా చెయ్యకూడాదు. చిన్నపిల్లలకి హెయిర్ కట్ చెయ్యాలి, గుండు చెయ్యకూడదు." - సూర్య

Dec 27, 2008

కత్తెర

శుక్రవారం మద్యానం మా ఆవిడ ఫోను

"ఏంటి"
"మీవాడు ఘనకార్యం"
"ఏమిజేసాడూ?"
"పిల్లని పడుకోబెట్టి వచ్చేలోపు"
"ఏమిజేసాడూ????"
"కుర్చీలాక్కుని, దానిమీదకెక్కి, గూటితలుపుతీసి, గూట్లోంచి కత్తెర తీసి, పెంగ్విన్ కి బొచ్చు పెరిగిందిటా!!! దానికి కత్తిరించి, తన జుట్టునీ కత్తిరించుకున్నాడు"
"హా!!!!"
"అవును బాబు, వాడికీ పెరిగిందట. మళ్లీ వాడికి క్షురకర్మ జేసి తలంటిపోసి ఇప్పటికి కూర్చుందాం అని వస్తే ఆ పిల్ల లేచింది. అదీ కధ నాయనా"
"హా$%$%@^@%$^"


కొసమెఱుపు:
"ఎందుకు తీసావు కత్తెర?"
"అస్సలునువ్వు నాకు అందేలా ఎందుకు పెట్టావు? కత్తెర్లు అలాంటివి దాచిపెట్టుకోవాలి కదా?"

Dec 26, 2008

భాస్కర్ యొక్క పాడ్కాస్ట్

నా పాడ్కాష్టు ఫీడ్ ని ఐట్యూన్ వాడు అంగీకరించాడు.

నా పాడ్కాస్ట్ ఫీడ్కోసం ఇక్కడ సబ్స్క్రైబు చేస్కోండి. ఇది పూర్తిగా ఉచితం.
మీకూ ఐఫోను ఉంటే, దాంట్లో ఐట్యూన్స్ -> పాడ్కాస్ట్ -> ఆడియో పాడ్కాస్ట్ -> కిడ్స్ మరియూ ఫ్యామిలి -> భాస్కర్'స్ పోస్టేరస్ (iTunes -> PodCast -> Audio PodCast -> Kids & Family -> Bhaskar's Posterous) కోసం వెతకండి. మీకేమైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి. నా పాడ్కాస్ట్ వినటానికి ఐఫోనే అవసరంలేదు. ఐట్యూన్స్ ఉంటే చాలు. పైన ఇచ్చిన లింకుని మీటితే మీ కంప్యూటరులో ఐట్యూన్స్ ఉంటే అదే ఐట్యూన్స్లో తెరుచుకుంటుంది, ఒకవేళ ఐట్యూన్స్ లేకపోతే మీకు చెప్తుంది "మీ కంప్యూటర్లో ఐట్యూన్స్ లేదు, ఇన్స్టాల్ చేస్కోండి" అని.




Happy Podcasting.

కప్పలు

నిన్న ఎదో ప్రోగ్రాములో కప్పలు వెయ్యటం చూపిస్తున్నాడు. అది ఏమి ప్రోగ్రాము? దానిగురించి సవివరంగా రాస్తా ఇంకో పోష్టులో.
ముందు దీని సంగతి చూద్దాం.
హా!! కప్పలు!!!
మీకు కప్పలు వెయ్యటం అంటె తెలుసా? నిశ్చలనంగా ఉన్న నీళ్లలో, బల్లపరుపుగా ఉన్న రాయినో లెక ఓ పెంకునో తీస్కుని ఏటవాలుగా విసిరితే అది నీళ్ల మీద కప్పలా తెప్పలేస్కుంటూ కొంతదూరం వెళ్తుంది. కప్ప గెంతినట్టు వెళ్లటం వల్ల దాన్ని కప్పాట అనే వాళ్లం. మజా వచ్చేది తస్సదియ్య. నీళ్లు కనిపిస్తే చాలు, ఏస్కో రాళ్లు. పందాలు ఆటికి, ఎవుడిదెక్కువ తెప్పలు అని. రాయి విసరటం ఒక న్యాగ్గా ఒక పధతి, ఆ రాయిని ఎన్నుకోవడం ఇంకో విధానం. చిన్నప్పుడు జేబులోనో బడి సంచిలోనో నాలుగైదు రాళ్లు ఉండేవి. వాటిని బెచ్చాలు అంటాం. కప్పాటకి వేసే రాళ్లుకూడా అలానే గుండ్రంగా, కొంచెం పల్చగా ఉండేలా ఎతుక్కునేవాళ్లం.

మనసు కేరింతలు కొడుతున్నది.
ఉంటా

Note : తెప్పలు - గెంతులు

ఈ పోష్టు రాస్తుంటే మనసులో ఇంకో ఆలోచన కలిగింది. దాన్ని ఇక్కడ పెట్టా. ఆశీర్వదించండీ, మీరూ ఓ చెయ్యి వెయ్యండి, కాలు గూడా వేయొచ్చు!!
http://veedhiaata.blogspot.com/

Dec 25, 2008

పూలు గుసగుసలాడేనని

మొన్న వారాంతం జీటీవీ సారెగామాపా 2009 కార్యక్రమంలో ప్రతిభాసింగ్ భగేల్ అనే ఓ పోటీదారు హిందీలో ఓ పాటపాడింది -
యె మై కహ ఆ ఫసి,
కైసి ఫసి,
రోన ఆవె న ఆవె హసి,
పాపె బచాలొ తుసి.
ఇది కారవాన్ అనే సిత్రంలోనిది.
మనకి వెంటనే దీని తెలుగు పాట గుర్తుకొచ్చింది, నాయ్యాల్ది, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇరగదీసి కుమ్మేసొదిలాడు ఈ పాటని. ఈ పెపంచకంలో యస్.పి.బి మాత్రమే అలా పాడగలడు.
అదేంపాట?
సిత్రం - శ్రీవారు - మావారు
సంగీతం - జికె వెంకటేష్
రాసిన వారు - సి నారాయణరెడ్డి

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది
లాల లాలాల లాల్లాల
లలలాలా లలలాల

మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున ఎగిరేనని
వయసు సవ్వడి చేసేనని
ఇపుడే తెలిసిందీ రురు .. రురు.. రురురూ

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది

అలలు చేతులు సాచేనను
నురుగు నవ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని
నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆ .. ఓ

పూలు గుసగుసలాడేనని జతగూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈరోజే తెల్సింది

ఇక్కడ వినండి ఆ పాటని



సర్వజనులకూ ఏసుక్రీశ్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Merry Christmas to all!! Happy Holidays!!

Dec 24, 2008

ఎవ్వడు చూడొచ్చు,ఎవ్వడు చూడకూడదు

ఇప్పటికి చాలామంది, చాలాసార్లు, చాలారకాలుగా రాస్కొచ్చారు, రాసారు, చదివాం, చదువుతూనే ఉంటాం - టీవీ వార్తల, టీవీ సీరియళ్ల తఢాకా గురించి, ఎలక్ట్రానిక్కు మీడియా గురించి. కొన్ని కొన్నిసార్లు వళ్లు జలదరిస్తుంటుంది టీవీల వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలకి. ఓ రోజునా నాకు బాగా గుర్తు, టీవీ 9 లో(అప్పుడప్పుడే వచ్చింది ఈ టీవీ9, రవిప్రకాశ్, బ్లాబ్లా వల్ల మా నాన్నా నేను తెగ చూసే వాళ్లం) ఓ వార్త ఒంగోలు జిల్లాలో చాపకిందనీరులా అర్ధరాత్రులు జరుగుతున్న "నగ్న నృత్యాలు" అని. సరే, బానే ఉంది, మన సమాజ దిగజారుడుతనం, వెంటనే ప్రత్యక్షం ఆ నృత్యం దృశ్యాలు. షాక్ అయ్యాం. కనీసం బ్లర్ కూడా చేయకుండ వేసేసాడు. ఇంకోరోజున, ఎక్కడో హైదరాబాద్లో ఓ మస్సాజ్ సెంటరు, వాడు మస్సాజు చేస్తు చేసిన అకృత్యాలని టీవి9 బయటకిలాగింది. సరే బానే ఉంది. మస్సాజు చెసేవాడు దొంగతనంగా తీసిన వీడియోలు గట్రా ప్రసారం జేసేసాడు నిస్సంకోచెంగా. ఇంకోసారి ఏదో ఇంటర్నెట్ సెంటర్లో జరిగిన కామక్రీడ అని ఆ వీడియోని ప్రసారం జేసేసాడు. ఇదిజాలదన్నట్టు పొద్దుణ్ణుండి సాయంత్రం దాకా అదే వార్త సూపించిందే సూపించి జనాల్ని రెచ్చగొటేస్తున్నారు, హింసించేస్తున్నారు.
మనలో ఎంతమంది ఎన్నిసార్లు ఇలా అనుకోలేదు, చిన్నపిల్లల ముందీ పాడు/ పాడు నాటాకాలు /పాడు సినిమాలు చూడలేకపోతున్నాం అని, ఛీఛీ ఏంటీ వీళ్ల కార్యక్రమాలు అనీ.
మన ప్రసారభారతి, బ్రాడ్క్యాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు విధిగా ప్రతీ టీవీ ఛానెల్కీ ఈ క్రిందతెలిపిన లోగోలని ప్రతీ కార్యక్రమంలో ప్రసారం చేసి తీరాలి అని ఎందుకు చెప్పరూ?
TV-Y (Youth Television) (All children)
రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు వాళ్లకి
TV-Y7/TV-Y7-FV (Directed to older children) (Youth-7 Television)
ఏడేళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి
FV - అంటే ఫాంటాసీ వయొలెన్సు అని.
TV-G (General audience)
ఎవుడైనా జూడొచ్చు అని
TV-PG (Parental guidance)
ఈ కార్యక్రమాల్ని తల్లితండ్రుల పర్యవేక్షణాలో మాత్రమే చూడాలీ అని అర్ధం.
దీంట్లో
V - కొంచెం వయొలెన్స్
S - సజెస్టివ్ కౄడ్ హ్యూమర్. అంటే కుళ్ళుజోకులు అని అనుకోవచ్చేమో. ఉదా!! ఆంటినడుగూ ఏదైనా ఇస్తది (భగవాన్ డైలాగు - దేన్ని మన వెన్నెముకలేని తెలుగు జనాలు పంచ్ అంటారు - బొంగు భోషాణం)
L - స్వల్ప కారు కూతల, పిచ్చి భాష (డబల్ మీనింగు వచ్చేలా ఉండే భాష)
D - పిచ్చి పిచ్చి డైలాగులు
TV-14 (Recommended for people 14 or older)
పధ్నాలుగు ఏళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి
V భయంకరమైన కౄరత్వం, చంపుకోడాలు, నరుక్కోడాలు
S కామప్రక్రియలు, అంటే ముద్దులు, వాటేస్కోడాలు అవి ఇవీ.
L బూతులు
D బూతికూతలు
TV-MA (intended for mature audiences)
పదిహేడు ఏళ్లకన్నా ఎక్కువ వయసువారికి మాత్రమే. అంటే పెద్దలకి మాత్రమే అని.
V భరించలేనంత కౄరత్వం
S కామక్రీడలు
L దారుణమైన బూతిమాటలు

వివరాల పట్టిక




దీని ప్రకారం చిన్నపిల్లలకి ఇవి చూపరాదు, వినబడనివ్వరాదు, కనబడనివ్వరాదు
#౧. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే రా
#౨. పందినాకొడుకులు, సచ్చారు
#౩. నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి, అదివినబడుతుంటే జారుతుంది మిడ్డీ.
#౪. భగవాన్ పంచులు
#౬. వార్తల్లో బూతు బొమ్మలు
#౭. తొడకొడతా, జడపడతా
అట్.అల్ (et. al)

Dec 22, 2008

వారాంతపు మంచుతుపాను

నిన్నటి వారం, శుక్రవారం నుండి-ఆదివారం వరకూ ఉత్తర అమెరికా మొత్తం మంచు దిబ్బలు దిబ్బలుగా పడింది. మాకు శుక్రవారం మద్యానం 12 మొదలై, శనివారం రాత్రికి కొంచెంతెరిపిచ్చి, ఆదివారం సాయంత్రం వరకూ కుమ్మేసింది. చికాగోలో జనాలు -24 ఫారెన్హైట్ విండ్చిల్ల్ చూసారని వార్త. జీవితం అంటె అంత సులభం కాదు అనిపిచటంలేదూ?

ఈ తుపాను ఫోటోలు, కొన్ని వీడియోలు ఇక్కడ పెడుతున్నా చూడండి.
మంచుతుపాను

నా అసంపూర్ణ పేరడి

అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు
అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు
కల్లిబొల్లి కబుర్లతోటి మనకి గుండుకొట్టిస్తడు
పిచ్చి పిచ్చి రాతలతోని మనల్ని బోల్తా కొట్టిస్తడు
తనేంజెప్పినా అదే పచ్చి నిజం అని నమ్మిస్తడు
అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు

లింకు: http://ashtavakram.blogspot.com/2008/12/blog-post_5983.html

Dec 20, 2008

ఫెర్రారి

నిన్న దేశి షాపుకి వెళ్లాం, వస్తుంటె, ఓ చోట సిగ్నలు పడింది, ఆగాను, పక్కనే సిమెట్రీ, అదేంటి అని అడిగాడు సూరిగాడు,
"సిమెట్రి"
"ఎందుకది?"
"చనిపొయ్యాక అక్కడ బూడ్చిపెడతారు"
"చనిపోవటం అంటే"
"యం&యం తిను అరవకుండా"
"its dark out there, its spooky out there, hello"
"ఎవరికిరా హెల్లొ?"
"చెయ్యిఫోను లో మాట్లాడుతున్నా?"
"చెయ్యిఫోనా? అంటే?"
"చేతిని చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడితే చెయ్యిఫోను, కాలుని చెవిదెగ్గర పెట్టుకుని మాట్టాడితే కాలు ఫోను"
"ఇంతలో నాకు call, మా మితృడు, ఎదో install చెయ్"
"Install అంటే ఏంటి?"
"నీకు తెలియదులే నాన్నా"
"install కాదు, అది బ్యాడ్, చిన్నపిల్లల దెగ్గర అనకూడదు"
ఇంతలో పోలీస్ కార్ పక్కనుంచి కుయ్యో కుయ్యో
"పోలీస్ పోలీస్"
"అవునమ్మా, గోల చేస్తే నిన్ను ఇచ్చేస్తా"
"అతను గుడ్ పోలీస్, నన్ను తీస్కెళ్లి అమ్మకి ఇచ్చేస్తాడు సూర్యా గుడ్ బోయ్ అని. పోలీస్కి కూడా పోలీస్ బేబి ఉంటుంది, ఆ బేబి పోలీస్ కార్ సీట్లో కుర్చుంటుంది. మోన్స్టరేమో కేజ్ లో ఉంటుంది."
"సరే నాన్నదేం కారు?"
"నిస్సాన్ ఆల్టిమా, నాన్నా నీకారు బాగలేదు"
"ఏమిరా ఏమి దీనికి"
"నా షూస్ లైటెనింగ్ మెక్వీన్, క్యాప్ లైటెనింగ్ మెక్వీన్, గ్లొవ్స్ లైటెనింగ్ మెక్వీన్, జాకెట్టు లైటెనింగ్ మెక్వీన్, టీ షర్టు లైటెనింగ్ మెక్వీన్, కార్ లైటెనింగ్ మెక్వీన్! ఫెర్రార్రీ కొను రెడ్ ఫెర్రారీ, 95 వ్రూం వ్రూం వ్రూం!!"
"హా!!!!!@#@#$!$%%^!#$^!^&^&*&*()*)"
Note : Vroom = side exhausts, 95 is the car number for ferrari in famous pixar movie called "CARS"

Dec 17, 2008

సింహావలోకనం

ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూస్కుంటే, ఎన్నో ఓడుదుడుకులు, ఎన్నో మైలురాళ్లు, ఎన్నో గోతులు, ఎన్నో బొక్కలు, ఎన్నో అబద్ధాలు, అన్నో పచ్చి నిజాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో కష్టాలు, కన్నీళ్లు.
ప్రతీ మనిషీ తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు, తెలియక కొన్ని తప్పులు చేస్తాడు, తప్పటడుగులు వేస్తాడు. ఐతే తెల్సిచేసిన తప్పులు ఈష్టు తెలియక చేసిన తప్పుల నిష్పత్తి చాలా ముఖ్యం. నేనూ చాలా చేసాను, కొన్ని కొన్ని సార్లు తెల్సి చేసాను. కొన్ని తెలియక చేసాను, కొన్ని అడాలసెంట్ వయసు చేయించింది. అలాంటి తప్పుల్లో నా అతిపెద్దద్ది, సిగరెట్టు తాగే అలవాటు. సరదాగా మొదలుపెట్టాను, అందర్లానే. దాన్ని మానటం పెద్ద కష్టమైన విషయం కాదు అనికూడా తెల్సు మొదలెట్టిన రోజున, కాని, దేనికో అసంబద్ధమైన కారణాలు నాకు నేనే చూపుకుంటూ అలా తాగుతూనే వచ్చా. ఓ రోజున ఠకా మని మానేసా, కొన్ని నెలల క్రితం. అది ఎప్పుడో చేసుండాల్సింది.
ఎంతైనా ప్రతీ మనిషికీ సమాజం కొన్ని పాఠాలు నేర్పిస్తే, జీవితం కొన్ని నేర్పుతుంది. నేనూ నాజీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా.
ఐతే, నా జీవితమ్లో నాకు జరిగిన అతిపెద్ద నష్టం, మా నాన్నని కోల్పోవటం. ఆనందాలు -పెళ్లి, నేనంటే ప్రాణం అనే శ్రీమతి, సూరిగాడు పుట్టటం, ఇప్పుడు పాప పుట్టటం. ఐనా ఏదో వెలితి. మా అమ్మ ఒక్కతే దేశంలో ఉందే అని. కోరి అమెరికా రావడం నిజంగా నా జీవితంలో పెద్ద తప్పటడుగు. మనం కొన్నిటికి వేదాంతంతో మూసేసుకుంటాం "డెస్టినీ ఎవ్వర్ని ఎటు తీకెళ్తుందో కదా" అని. చూద్దాం ఇక ముందు ముందు ఎలా ఉంటుందో.
కానీ అమెరికా కి వచ్చి నేను ఎన్నో నేర్చుకున్నా. నేను ఎన్ని బ్లాగులు రాస్తున్నా, నా పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలా. Bhaskar is the pillar for the projects అని అనిపించుకున్నా. Bhaskar, Problem Solver అనే అనిపించుకున్నా. I am happy for that.
నాకు చేతైనంతలో నా అనుభవాల్ని నలుగురితో పంచుకుంటున్నా. WebSphere మీద బ్లాగు రాస్తున్నా. నాకు ఎవ్వరైనా మెయిల్ చేసి సహాయం అడిగితే వాళ్లని ఏమాత్రం నిరుత్సాహపరచను. FileNet మీద ఈ ఫోరంలో ప్రశ్నలకి నాకు తెల్సిన సమాధానాలు రాస్తుంటా. నలుగురికీ ఉపయోగపడాలని http://projectsforfuture.blogspot.com రాస్తున్నా.

ఈ గోల దేనికీ అంటే ఈ రోజు నా పుట్టినరోజు.

Dec 12, 2008

అగ్గి

లేక అగ్ని.
ఈరోజు మా కార్యాలయంలో అగ్గి సైర్రన్లు కుయ్ కుయ్ కుయ్ అని మోగినై. అందరం కిందకి వెళ్లాం, అగ్నిమాపక యంత్రం వెంటనే వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది లోపలకి వెళ్లారు. వాళ్లు మొత్తం చూసి మొత్తానికి ఆ అలారం అఱుపులు అపేసి, మేము మళ్లీ తిరిగి మామా సీట్లలోకి వచ్చేసరికి అరగంట పట్టింది. మా కార్యాలం ఓ పెద్ద ఆకాశ హార్మ్యం కాదు. ఆరు అంతస్థులు ఉంటాయ్ మొత్తం. మేము నాలుగో అంతస్థులో ఉంటాం. మాకు మా వింగులో మొత్తం ఇద్దరు అగ్ని మార్షల్స్ ఉంటారు. వీళ్లు అగ్ని అలారం మోగంగనే రంగమ్లోకి దిగి ఇటు వెళ్లండి, అటు దూకండి అని చెప్తారు, దారి చూపిస్థారు. మరియూ అందరూ ఖాళీ చేసారా లేదా, రెష్ట్ రూముల్లో, డెస్కుల కిందా లేక మూలల్లో ఎవరైనా మిగిలిపొయ్యారా అని చూసే బాధ్యత వీళ్లదే. అప్పుడప్పుడు డ్రిల్లు కూడ చేస్తారు. అంటే ఫాల్స్ అలారం వీళ్లే ఇచ్చి, అందర్నీ కిందకి పంపించి ఇదిగో ఇలా అలారం మోగంగనే కిందకి రావాలి, ఆ అగ్ని మార్షల్స్ చెప్పినట్టు చెయ్యాలి అని చెప్తారు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటె, నేను కొంతకాలం క్రితం చెన్నై లో పనిచేసేవాడిని. మా కార్యలయం క్యాపిటాలే టవర్సు, అన్నా సాలై, తెయినంపేట. ఈ బిల్డింగులో మొత్తం 11 అంతస్థులు ఉంటాయ్. నిల్చోబెట్టిన అగ్గిపెట్టెలా ఉంటుంది ఈ కట్టడం. దీంట్లో మావి 8,9,10,11 అంతస్థులు. రెండు లిఫ్ట్లు. లిఫ్టుకి రెండువైపులా మెట్లు. ఇది అమెరికన్ పద్ధతిలో కట్టబడింది. అంటే తెల్సుగా, ఫ్లోర్లు పైకిలేపటం, చుట్టూ అద్దాలతో మూసేయ్యడం. ప్రతీ ఫ్లోరుకి అగ్ని అలారమ్లు ఉన్నయ్.
ఇంతకీ సంగతేంటంటే, అప్పుడప్పుడూ అగ్ని అలారం మోగేది. మనోళ్లు పొరబాటున కూడా లేచే వాళ్లు కాదు సీట్లలోంచి. అలారం మోగంగనే సెక్యూరిటీ వచ్చి దాన్ని ఆపేసి వెళ్ళిపొయ్యేవాడు. దీంట్లో పెద్ద రాయటానికేముంది అనుకుంటున్నారా. చెప్తా! నిజంగనే అగ్ని పుట్టింది, అలారం మోగింది. కిందకి ఎలా వెళ్లాలి? ఫ్లోరు మొత్తానికి ఒక్కటే ద్వారం. ఎంతమంది పడతారు దాంట్లోంచి? ఎప్పుడైనా ఒక డ్రిల్లు జరిగిందా ఇదీ పద్ధతీ నిజంగా అగ్ని రాజుకుంటే - మిమ్మల్ని మీరు బయటపడేస్కునే విధానం ఇదీ అని ఎప్పుడూ ఎవ్వడూజెప్పలా. ఒక్క వాలంటీరు కూడా లేడు. కనీసం అగ్ని అలారం మోగినప్పుడు ఇలా చెయ్యండి అనే బొమ్మలు కూడా లేవు. మీరు ఇక్కడ ఉన్నారు అనే ఒక లేఅవుట్ పెట్టినంత మాత్రాన సరిపోదుకదా?

ఓ బిల్డింగులు కట్టేస్కుంటాం, అమెరికా ఎక్కడోలేదు ఇక్కడే మన కళ్లముందే ఉంది అనేట్టు ఆర్భాటం చేస్కుంటాం. కానీ కనీస వసతులు మర్చిపోతాం. మీ కార్యాలయంలో కూడా ఇలానే ఉంటుందా? జనాలకి తెలియజెప్పండి. మీ మేనేజిమెంటుకి తెలియజేయండి, కనీసం ఆరు నెలలకోసారి డ్రిల్లు ఏర్పాటు చెయ్యమని. మార్షల్స్ ని తయ్యారు జేస్కోండి, ఆళ్లకి శిక్షణ ఇవ్వమని తెలియజేయండి.

Dec 11, 2008

ఓ తోటమాలి కధ - బాగ్బాన్

పోయిన ఆదివారం రాత్రి టీవీ ఏసియా లో బాగ్బాన్ అనే సినిమా వేసాడు. నేను ఈ సినిమా మొట్టమొదటినుండీ చూడలేకపోయినా సగం నుండి చూడటానికి వీలైయ్యింది.
ముందుగా బాగ్బాన్ అంటే అర్ధం ఏమైఉంటుందీ అనుకుని, గూగుల్లో గెలికా, వెంటనే "తోటమాలి" అని వచ్చింది. ఆ పేరు ఈ సినిమా కధకి వందశాతం సరిగ్గా సరిపోయింది. తండ్రి అనే తోటమాలి సంసారం అనే తోటని, పిల్లలు అనే మొక్కల్ని, ఎంత అపురూపంగా పాదులు తీసి, నీళ్లు పోసి, పురుగుపుట్రా నుండి కాపాడుతూ, రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేసుకుంటు, చిగుళ్లేస్తే ఆనందపడుతూ, పూలుపూస్తే కేరింతలుకొడుతూ అహర్నిశలూ తపిస్తాడు. ఈ సినిమా అలాంటి ఓ తోటమాలి కధ.

అడ్డాలనాటి పిల్లలే కాని గడ్డాలనాటి పిల్లలు కాదు ఓ సామెత. ఒక తండ్రి కొడుక్కి మొట్టమొదటి అడుగు వెయ్యటానికి అండగా నిలిస్తే, ఆ కొడుకు ఆ తండ్రికి చివరి అడుగు వెయ్యటంలో అండగా ఎందుకు నిలవలేకపోతున్నాడు?. ఈ సినిమా కధ అదే. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటివి ఉన్నాయ్, కాని, అమితాభ్ మళ్లీ ఈ సినిమాలో, "అమితాభ్ ఒక్కడే" అనిపించుకున్నాడు. నాకు ఆ పాత్రలో ఆయన మా నాన్నలానే అనిపించాడు, మీకూ మీనాన్నలానే అనిపిస్తాడు. అంత సహజంగా జీవించాడు, ఎందుకంటే అతనూ ఓ తండ్రేగా.

సరే, ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు
అమితాభ్, హేమామాలిని, శరత్ సక్సేనా, పరేశ్ రావల్, మరియూ బృందం
విడుదల - అక్టోబర్ 2003
దర్శకత్వం - రవి ఛోప్ర
కధ - బి ఆర్ ఛోప్ర
ఈ కధని బి.ఆర్. ఛోప్రా ఎప్పుడో రాసిపెట్టుకున్నారుట. ఆయన దిలీప్ కుమార్ మరియూ రాఖీ లనిపెట్టి తీద్దాం అనుకున్నారుట.
కధలోకొస్తే :-
రాజ్ మల్హోత్ర (అమితాభ్), పూజ (హేమామాలిని) దంపతులకు నలుగురు పిల్లలు. రాజ్ ICICI బ్యాంక్లో పనిచేస్తూ సంతుష్టంగా బతికేస్తూ ఓరోజున పదవీ విరమణ చేసి, పెళ్లాం పిల్లతో గడపొచ్చు అని ఆశిస్తాడు. రాజ్ పూజాల వైవాహిక బంధం 40 ఏళ్లైనా వాళ్ల ప్రేమ ఇంకా వికసిస్తూనే ఉంటుంది. ఐతే, మరి పదవీ విరమణ అయ్యాక, పెద్దరికం వల్లా, ఇక పిల్లలదెగ్గరకి చేరుకుందాం సహారాకోసం అనుకుంటారు రాజ్ మరియూ పూజ. కానీ వీళ్ల బాధ్యతల్ని తాము తీస్కోటానికి ఆ పిల్లలు పెద్దగా ఇష్టపడరు, దానికో ప్రత్యేక కారణం రాజ్ దెగ్గర ఆస్తులు కూడా లేకపోవటం. మొత్తానికి ఆ నలుగురు పిల్లలు ఒక పరిష్కారం కనిపెడతారు. అది, రాజ్ పెద్ద కొడుకు దగ్గర, పూజ రెండో కొడుకు దగ్గర ఉండాలి అని. ఆరూనెలల తర్వాత, రాజ్ మూడోవాడి దగ్గర, పూజ నాలుగోవాడి దగ్గరకీ మారాలి అని. రాజ్ కి ఈ ఆలోచన నచ్చదు, పూజ ని తనని అలా విడదీయ్యటం అతనికి మింగుడుపడదు. కాని తప్పని పరీస్తితుల్లో రాజ్ మరియూ పూజ విడిపోయి పిల్లలదగ్గరకి చేరుకుంటారు. ఇక వాళ్ల కష్టాలు మొదలౌతాయి. ఇక్కడ కష్టాలకన్నా అభిమానాలు హర్ట్ అవుతుంటాయి. ఇటు తండ్రికి రావాల్సిన గౌరవం అటు తల్లికి ఇవ్వ్లాల్సిన గౌరవం ఉండదు. పిల్లల మాటలు చాలా కటువుగా, వీళ్లు తమ కొడుకులపై పెట్టుకున్న నమ్మకాల్ని చీల్చి చెండాడుతూ ఉంటాయి. ఉదాహరణాకి, రాజ్ పొద్దున్నే బ్రేక్ఫాష్ట్ చెయ్యటనికి భోజనబల్ల దెగ్గరకి వస్తాడు, ఓ కుర్చీలో కూర్చుంటాడు, వెంటనే కోడలు, మామయ్య, అది మీకొడుకు కూర్చునే కుర్చి, మీరు అటు కూర్చోండి అని చెప్తాడు. ఈ లోపల రాజ్ కి అదే అపార్ట్మెంటుల్లో ఉంటున్న పరేశ్ రావల్ పరిచయం అవుతాడు. ఇతనికి ఓ కాఫీషాప్ ఉంటుంది. పరేశ్ రావల్, రాజ్ తో మీ కధని కాయితానికెక్కించండి అని ప్రోత్సహిస్తే, రాజ్, అది రాస్తుంటాడు, ఒక చిన్న టైప్ రైటర్ సహాయంతో. ఓరోజు నిద్ర పట్టక టైప్చేస్తూ ఉంటాడూ టిక్కు టిక్కు అని. ఆ శబ్దానికి కోడలుగారికి నిద్ర పట్టక మొగుడ్నిలేపి పంపిస్తుంది ఆపమని చెప్పు మీ నాన్నకి అని. వాడు వచ్చి, ఏంటి ఈ గోలా అంటాడు. నిద్ర పట్టడమ్లేదు అందుకని అంటే ఈ వయ్యసులో నిద్ర పట్టదు, అది మామూలే, ఐతే, మేముకూడా నిద్రపోకూడదా అంటాడు. ఓరోజు అర్ధరాత్రి కొడుకు పనిచేస్కుంటుంటే రాజ్ అడుగుతాడు, ఏంజేస్తున్నావ్ అని, ప్రెజెంటేషన్ తయ్యారు చేస్తున్నా అంటాడు కొడుకు. నేను సహాయం చేయనా అంటే కొడుకు తండ్రిని ఎగతాళిగా మాట్లాడుతూ, మేము మీలా కాదు, మా ఆలోచనల్తో యింతవాళ్లమయ్యాం, మీ వయ్యస్సొచ్చినా ఇబ్బందిలేకుండా, మీలా ఇంకొకళ్ల దెగ్గర దేబిరించకుండా కూడబెట్టుకుంటున్నాం అంటాడు. ఇలాంటివి పూజ కి కూడ జరుగుతూ ఉంటయి. ఇలా ఆరునెలలు గడచిపోతాయి. మరి బాధ్యతలు షిఫ్ట్ అయ్యే రోజు వస్తుంది. కింది కొడుకులు ఇద్దరూ అస్సలు సుముఖంగా ఉండరు వీళ్ల బాధ్యతల్ని తీస్కోటానికి. ఇంతలో రాజ్ తన కధని, పేరు బాగ్బన్, పూర్తి చేసి, పరేష్ రావల్ కి ఇచ్చేసి వెళ్లి పోతాడు. పూజ కి ఫోన్ చేసి నువ్వు వచ్చే రైలు, నేనొచ్చే రైలు కలిసే చోట మనం ఒకచోట కలుద్దాం అంటాడు. తను సరే అని ఆ స్టేషన్లో దిగుతుంది. రాజ్ పూజ కలుస్తారు. ఆ వూరు వాళ్లు వాళ్ల జీవితాన్ని మొదలుపెట్టిన ఊరే. మొత్తానికి అక్కడ రాజ్ యొక్క పెంపుడుకొడుకు, సల్మాన్ కలుస్తాడు. సల్మాన్ ఇంటికి వీళ్లు వెల్తే అక్కడ భగవంతుడితో పాతు వీళ్లని కూడా పెట్టి పూజిస్తున్నట్టు తెల్సుకుంటారు రాజ్ మరియూ పూజ.
ఇంతలో పరేష్ రావల్ మరియూ అతని భార్య ఈ కధని చూసి చెలించిపొయి, ఇతన్ని కలుద్దాం, అనుకునేలోపు, కొంతమంది సలహామేరకు బాగ్బన్ అనే కధని అచ్చువేస్తారు, ఆ కధకి ఉత్తమ కధ అవార్డ్ వస్తుంది. ఆ కధ పబ్లిషర్ టోకెన్ అడ్వాన్స్ కింద ఒక 10 లక్షల చెక్కు ఇస్తే, దాన్ని రాజ్ కి అందిద్దాం అని పరేష్ రావల్ రాజ్ దెగ్గరకి వెల్తాడు.
ఆ పుబ్లిషర్ రాజ్ కి సన్మానం ఏర్పాటు చేస్తాడు. దీని సంగతి తెల్సుకుని రాజ్ కొడుకులు "రాజ్ దెగ్గర డబ్బు మళ్లీ వచ్చింది" కాబట్టి, వెళ్లి కాళ్ల మీద పడి క్షమించేయమని అడుగుదాం, తల్లితండ్రులు క్షమిచి తీరుతారు అని ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్తారు.

ఇక ఈ సినిమాకి హైలైట్ మొదలు - అది - ఆ వేదికనుద్దేశించి రాజ్ ఇచ్చిన ప్రసంగం.


ప్రసంగం అయ్యాక, రాజ్ పూజ ని తీస్కుని వెళ్లిపోతుంటె, కొడుకులు క్షమించమని అడుగుతారు, నేను క్షమించను అనేసి ముందుకి వెళ్లగానే, వాళ్లు తల్లిని వేడుకుంటారు. ఆ తల్లి, "ఒక తల్లిగా మిమ్మల్ని క్షమించినా, ఒక భార్యగా నేను క్షమించలేను" అంటుంది.

ఈ కధ మనలో చాలా మందికి దెగ్గరగా ఉంటుంది. కావాలని తల్లితండ్రుల్ని మనం విసిగించక పోయినా, కొన్ని కొన్ని సార్లు మనం వాళ్లకి ఇవ్వాల్సిన విలువని ఇవ్వము. అది క్షమించ రాని నేరం. కాబట్టి మనల్ని కని పెంచి, విద్యా బుధుల్ని నేర్పి, విజ్ఞానాన్ని ఇచ్చి, మనం ఈ రోజున ఇలా నిలబడేలా కష్టపడిన మన తోటమాలుల్ని మనం మన పూల పరిమళాలతో, కమ్మని ప్రేమా వాత్స్ల్యపు వాసనల్తో వాళ్లుపడిన కష్టాలనుండి సేదదీరుద్దాం.

ఓ చిన్న విన్నపం: పై అమితాభ్ ప్రసంగాన్ని ఎవ్వరైనా తెలుగులోకి అనువదించగలరా?
నోట్: ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన.
దీంట్లో నాకు నచ్చిన పాట : నేను ఇక్కడ నువ్వు అక్కడ జీవితం ఎక్కడ - main yahan tu wahan jindaji hai kahaan:
పాదింది : అమితాభ్ మరియూ అల్కా యాగ్నిక్
సంగీతం : ఆదేష్ శ్రీవాత్సవ్
రచన : షహీద్ ఫియాజ్


Read somwhere that: "The movie is a remake of 2 different movies - the Marathi movie 'Tu Thitha Me', meaning Where You Are There I Am, and a National award winning Kannada movie 'Post Master'."

Dec 8, 2008

మనల్నీ ఇలా అనుకుంటారు అటైపునుంచి

మనకి భారత్ లో ఎక్కడ బాంబు పడిన, వెంటనే ఐ.యస్.ఐ అనే వినిపిస్తుంది/అనిపిస్తుంది. ఇక్కడనుండి మతం పేరుతో పాకిస్థాన్ వైపుకి వెళ్లి అక్కడి యే ల.ఏ.తో లోనో జేరి, మళ్లి వెనక్కొచ్చి అఱాచకాలు సృష్టింస్తుంటారు అనేది మన నమ్మకం, మనకి తెల్సిన నిజం.
ఐతే, FlipSide చూస్తే?
దేనికోసమో గూగుల్లో గెలుకుతుంటె ఈ లింకు తగిలింది. చదివి బిత్తరబొయ్య, ఆశ్చర్య పోయా. నాయ్యాళ్లలారా, ఎంతకి తెగించారు అనుకున్నా. వీడి సారాంశం ఏంటంటే, పాకిస్థాన్లో జరిగే బాంబు పేలుళ్లకి కారణం మన రా (ఆర్.యే.డబ్ల్యూ - రీసెర్చ్ మరియూ ఎనాలిసిస్ వింగ్) మరియూ ఆఫ్ఘన్ ఏజెన్సీల ప్రోద్బలమే అని.
వీడంటాడూ, పాకిస్థాని ఇన్వెస్టిగేటర్లు మొత్తానికి ఛేదించారు అని, అది ఇది. ఏదేదో రాశాడు.
బాగుంది కధ, ఇటైపు మనం వాళ్లని అటైపు ఆళ్లు మనల్ని, కానీ నిజం ఏంటో ఎవ్వనికీ తెలియదు.

Dec 6, 2008

పాడ్ క్యాస్ట్

ఈ రోజు పొద్దున్నుంచి నేనూ పాడ్ క్యాస్టింగు మొదలుపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ, నా పక్కన కూర్చునే టోనీ గానిదెగ్గరకి వెళ్లి ఊర్కనే గెలికా. దేనికంటే మనోదెగ్గర సానా కళలు ఉన్నాయ్. వీడు ఫార్ములా ఐదు రేసరు. డి.బి.యే. మ్యాక్ డెవలపర్, అది ఇదీ. మనోడి దోస్తులుకూడా మంచి నిఖార్సైన బ్యాచి. అట్టాంటోళ్లలో స్కాట్ అనేవోడొకడు, వాని ద్వారంవెలుపలి (OUTDOOR) ఫోటోగ్రఫి ఇక్కడ చూసి దసుకోమాకండి. సరే అలాఎళ్లి గెలకంగనే, మనకి తెల్సిన ఇషయల్నే ఇంగిల్పీసులో సెప్పాడు. అయ్యాక, ఇందాక మళ్లీ కేకేసాడు, బాస్కార్ ఉన్నావా అని, వస్చన్నా అని ఎళ్లా. మా సొలారిస్ పెద్దాయన ఉన్నాడు అక్కడ. అతని పేరు, బాబ్. ఏంటి సంగతి బాస్కర్ అన్నాడు బాబ్. ఇదీ అన్నా, నీకు మ్యాక్ ఉందా అన్నాడు, లేదు అన్నా, ఐతే సారీ బాస్కార్, మ్యాక్తో ఇట్స్ వీజీ అన్నాడు, సర్లే మావా, ఇప్పుడు దీంకోసం మ్యాక్ యాడకొనంమంటా అని సెప్పేసి యనక్కి తిరగబోతుంటె, ఇదిగో నా పాడ్ క్యాస్ట్ యూఆర్యల్ అని ఇచ్చాడు.
చాలా ఫన్నీగా ఉన్నాయ్ బాబ్ పాడ్ క్యాస్ట్. ఆటికోసం ఇక్కడో లుక్కు వెయ్యండి

నేనూ ఒక పాడ్ క్యాస్ట్, అంటె పెద్దేమి లేదు ఒక యం.పి.త్రీ ఫైలు, పెట్టా. నా పీజ్జా పురాణంలో ఇందాక జతచేసా. ఇది కేవలం పరీక్షకి మాత్రమే, నా గొంతు చాలా తక్కువ గొంతుకతో ఉంది, దేనిఅంటే కార్యాలమ్లో ఉండి మాట్టాడా కాబట్టి.ఇక్కడ వినండి.

ఆనందం పొందు (Have Fun)

Dec 5, 2008

ఉబుసుపోక కబుర్లు - ఎలక్ట్రానిక్ గేమింగ్

పోయిన వారం నేను కళ్లు చూపించుకోటానికి డాట్టరు దెగ్గరకెళ్లా, ఈ సారి కళ్లద్దాల బదులు కళ్లకతుక్కునే కటకాలు - కాంటాక్ట్ లెన్స్ తీస్కోవాలని ఆలోచించా. "ఈ సారి" ఎందుకంటే, మా బుడ్డోడితో నా కళ్లజోడుకి మంచి అనుభవం. ఇప్పటికీ లాగి అవతలేస్తాడు, లేక వెనకనుంచి వచ్చి ఘట్టిగా కళ్లజోడుని గుంజుతాడు. మరి ఇప్పుడింక ఈ పిల్ల చేతులు పైకి లేపుతున్నది, క్రికెట్టులో అంపైర్లా.
డాట్టరుకాడికి ఎళ్లా. కూర్చో బాసు పిలుస్తా అన్నాడు, సరే కూసున్నా, పక్క కుర్సికేసి ఓ లుక్కేసా, ఓ పత్రిక ఉంది అక్కడ. వెంటనే నా బుర్ర దాని వివరాలు బ్లా బ్లా నోట్సేసేస్కుంది.
అదేం పత్రికరాబాబు అంటే - Electronic Gaming Monthly. నాకు తెలవదు ఇట్టాంటిదోటుంటదని. దీంట్లో మొట్టమొదటగా నన్ను ఆకర్షించింది గేముల రేటింగులు, అంటే యే యే గేములు యే యే వయసోళ్లకి అని. ESRB అంటే Entertainment Software Rating Board అని. ఇవీ రేటింగులు - E, EC, E 10+, T, M, AO.
E - Everyone
EC - Early Childhood
E 10+ - Everyone 10 and above
T - Teen
M - Matured (17+)
AO - Adult Only.
మరి RP అని ఉంటేనో అని అడగొచ్చు, RP అంటే - Rating Pending అని.
కాబట్టి మీరుకూడా గేములు కొనేప్పుడు తప్పక వీటికోసం చూసి నిర్ణయించుకుని కొనుక్కోండి.

ఈ పత్రిక Electronic Gaming Monthly సంగతి ఏంటో చూద్దాం:

ఈమాసపత్రిక ఈరోజు రేపటి వీడియోగేమింగ్ కాన్సోళ్ల గురించి, గేముల గురించి, వాటి తయ్యరీదారులతో ముఖాముఖిలు ఇత్యాది వార్తల్ని అందిస్తుంది. మరియూ, గేముల సమీక్షలుని కూడా కూలంకుషంగా అందిస్తుంది.
ఆ రోజు పత్రికలో వీటిమీద రివ్యూ చూసా - ఆసాంతం చదవకపోయినా ఓ లుక్కేసా. అవి -
Madden NFL 09
NCAA Football 09
Beijing 2008
Alone in the Dark
Izuna 2
Guitar Hero Decades

కొన్ని గేముల ప్రకటనలు కూడా చూసా అవి:
Legendary
Rise of the Argonauts
Mushroom Men

నేను పెద్ద గేమర్ని కాదు. నాదెగ్గర Ages of the Empire, Warcraft, Tzar అనే గేంస్ ఉండేవి. మొన్నీమధ్య brother bear అని ఒకటి కొన్నా మాబుడ్డోడికి. I think he is not yet ready for it.
సరే! గేమింగు కాన్సోల్ అంటే గేము ఆడే పరికరం.
అసలు ఎన్ని గేమింగ్ కాన్సోల్స్ ఉన్నయో తెలుసా మీకు?
గేమింగ్ కాన్సోల్స్ లో ప్రస్తుతానికి ఏడోతరం వి నడుస్తున్నాయ్. 7th Generation Gaming Consoles. అవి -
#1. మైక్రోసాఫ్ట్ వారి ఎక్స్బాక్స్ మూడొందల అరవై - Microsoft's XBOX 360
#2. సోని వారి ప్లే స్టేషన్ మూడు - Sony's Playstation 3
#3. నింటిండో వారి వీ - Nintendo's Wii

ఇవి కాక పిల్లల్ని చెడగొట్టటానికి ఈ నింటిండో వాడి డీయస్ అని ఒకటి ఉంది. దీనికి అలవాటైతే ఇక అదేలోకం అవుతుంది. అదీ కధ. Happy Gaming.