Jul 16, 2011

ఎంతకాలం కల్లబొల్లి కబుర్లు చెప్తారు హోం మాష్టారూ?

*మనకు పొరుగున ఉన్న పాక్‌, అఫ్గానిస్థాన్‌లు ఉగ్రవాద కేంద్రాలు. అందువల్ల భారత్‌లోని ప్రతి నగరం ప్రమాదపుటంచున ఉన్నట్లే.

ఎంతకాలం ఇలా కల్లబొల్లి కబుర్లు చెప్తారు హోం మాష్టారూ? ఎవరు పాలిస్తున్నా హోం మాష్టారి మాటా మాత్రం మారటంలేదు.
మన చట్టాలను మన వ్యవస్థనూ గట్టి చేస్కోకుండా పొరుగున ఉన్నవాళ్ళూ అంటే రాగాలు తీస్తే ఎలా మాష్టారూ?
అసలు సదరు తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా చొచ్చుకు వచ్చారో మాకు చెప్పి తీరాలి మాష్టరూ!! ఎలా రాగలిగారు? వాళ్ళు బైటివాళ్ళా లేక ఇక్కడివాళ్ళే అక్కడకెళ్ళి తీవ్రవాద విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పుచ్చుకుని వస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే, ఇక్కడివాళ్ళు అక్కడకి ఎలా వెళ్ళగల్గుతున్నారూ? సినిమాల్లో చూపినట్టుగా, ఇక్కడ ఓ వ్యక్తిని చూపి కట్ చేస్తే ట్రైనింగ్ కాంప్ లో ఉన్నట్టుగా ఊహించుకోమంటారా మాష్టారూ?
స్వతంత్ర భారత అరవై ఏళ్ళ చరిత్రలో కాంగ్రేసువారి పాలనే ముప్పావువొంతు ఉన్నది మాష్టారూ?
ఎవరు దొంగలు? ఎవరి ఆలోచనా ఈ నరబలి? ఇక్కడి వ్యక్తులు అక్కడికి ఎలా వెళ్ళగల్గుతున్నారు? ఏమార్గం? ఎన్ని సార్లు? ఎంత మంది? బాంబులు పేలటం నిన్నా మొన్నటి కథ కాదుగా చిదంబరం మాష్టారూ? గత పాతికేళ్ళుగా నడుస్తున్న తంతే. ఈ పాతికేళ్ళలో ఒక్క అలాంటి మార్గాన్ని కనుక్కోలేక పోయిందా మీ ప్రభుత్వం మాష్టారూ?
మరెన్ని ప్రాణాలను బలిపెడదామని మీ ఆలోచనా?
మరెన్ని సంవత్సరాలు ఇలా నరమేథం చేస్తూ పాలించాలని మీ తపన?
మరెన్ని ఏళ్ళు ఇలా రాజకీయ లబ్ది కోసం జనాలను బలిపెట్టాలని మీ కోఱిక?
మరెన్ని ఏళ్ళు సమస్యలను పక్కదారి పట్టించేందుకు మారణహోమం చేయ్యాలని మీ కుతంత్రం?

చెప్పండి హోం మాష్టారూ?

8 comments:

  1. ముంబయి పేలుళ్ల కేసు కొలిక్కి వస్తుందా?
    ఆ ఐదు కేసుల బాటేనా?
    న్యూఢిల్లీ: ముంబయిలో బుధవారం నాటి పేలుళ్ల కేసు ఓ కొలిక్కివస్తుందా? నేరగాళ్లను పట్టుకుంటారా? వారికి శిక్షపడుతుందా? లేదా మునపటి అపరిష్కృత కేసుల జాబితాలోనూ ఇది చేరిపోతుందా? ముంబయిలో 26/11 దాడుల తర్వాత దేశంలో జరిగిన ఐదు దాడుల కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉండడం ఈ అనుమానానికి తావిస్తోంది. ఇందులో మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను.. కేంద్ర హోంశాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీసుకుంది. పుణెలోని జర్మన్‌ బేకరీలో పేలుడు, చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వద్ద పేలుడు, జామామసీదు వద్ద కాల్పులు, ఢిల్లీ హైకోర్టు, వారణాసిలో పేలుళ్ల కేసులు ఇంకా కొలిక్కి రాలేదు. ఇందులో జామామసీదు, వారణాసి, చిన్నస్వామి స్టేడియం కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. జర్మన్‌ బేకరీ సంఘటనలో ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ మహారాష్ట్ర పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇందులో ఒకరిని అరెస్టు చేసినా అతని ప్రమేయంపై ఆధారాలు సేకరించలేకపోయారు.

    ReplyDelete
  2. తేజ!!
    ఏవయ్యా? ఏవైపొయ్యావ్? అసలు కనిపించటమే మానేసావ్?

    ReplyDelete
  3. "చెప్పండి హోమ్ మాస్టారూ?"
    ఎవర్నడుగుతున్నారు మీరు? ఆ గుడ్డి కళ్ళజోడు తంబినా? ఆయన సమాధానం నేను చెప్తాగా. ఇదిగో
    "అమ్మగారు నాతో ఈ విషయం చెప్పనేలేదండీ"

    ReplyDelete
  4. mee blog chadavatam regular kani comments vishayamlo irregular.

    ReplyDelete
  5. తేజ
    ధన్యవాదాలోయీ!!
    నాకో మారు మెయిల్ ఇవ్వగలవా?
    admi.websphere@gmail.com

    శంకర్ గారూ!!
    వెధవలు. దరిద్రులు. మన దౌర్భాగ్యం ఇలాంటి నేతల పాలనలో ప్రాణాలు కోల్పోతున్నాం. దినదినగండం అయ్యింది బ్రతుకు

    ReplyDelete
  6. హైదరాబాద్‌ నగరంలో ఐ.ఎస్‌.ఐ. మూలాలను వెతుకుతున్నామని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ఏకేఖాన్‌ తెలిపారు. లష్కరే తోయిబా, హుజీ, ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థలకు చెందిన తీవ్రవాదులు, వారి అనుచరుల కదలికలపై నిఘా ఉంచామన్నారు.

    అయ్యా ఖాన్ గారూ!!
    వాళ్ళ కదలికలపై నిఘా ఉంచారా? అబ్బోరి! ఇక జనాలు గుండెలపై సేతులేస్కుని బబ్బోచ్చన్నమాట. ఔనూ!! కదలికలపై నిఘా వేసారంటే, ఆళ్ళు తమకు తెలుసన్నమాట????????

    ReplyDelete
  7. హోం మాష్టారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఒక స్త్రీని నగ్నంగా రోడ్డు మీద నడిపిస్తూ కళ్లప్పగించి చూసేవాళ్లను కామాంధులు, మానవమృగాలు అని తిట్టినట్టు ఉంటుంది. మన నగరాల్లోకి రావడానికి తీవ్రవాదులకి దారులు బార్లా తెరిచిపెట్టి కూర్చుని మళ్లీ అన్నిటికీ పాకిస్థానే కారణం అంటారు.

    ReplyDelete